shasidhar
-
అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌గా మధు శశిధర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్, సీఈవోగా మధు శశిధర్ నియమితులయ్యారు. అపోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా 2023 అక్టోబర్‌లో ఆయన చేరారు. యూఎస్‌లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ట్రెడిషన్ హాస్పిటల్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. -
విజిల్స్ వేసే సన్నివేశాలుంటాయి
‘‘ఫ్యామిలీ అండ్ యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ‘మిస్టర్ కింగ్’. సెకండ్ హాఫ్‌లో యూత్ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టే సన్నివేశాలుంటాయి. క్లైమాక్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది’’ అని డైరెక్టర్ శశిధర్ చావలి అన్నారు. శరణ్ కుమార్, యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. బీఎన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శశిధర్ చావలి మాట్లాడుతూ– ‘‘నా ఇష్టం’ చిత్రంతో సహాయ దర్శకుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను. ‘బాహుబలి 1’కి ఎడిటింగ్ డిపా ర్ట్‌మెంట్‌లో చేశాను. ఆ తర్వాత విరించితో కలసి ‘మజ్ను’ సినిమాకి పని చేశాను. అనంతరం ‘మిస్టర్ కింగ్’ చాన్స్ వచ్చింది. మంచి క్యారెక్టర్ ఉన్న ఓ కుర్రాడి ప్రయాణమే ఈ చిత్రం. ప్రేమకు సంబంధించిన కథ. సామాన్య ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునేలా హీరోపాత్ర ఉంటుంది. మిస్టర్ కింగ్ పాత్రకి శరణ్ చక్కగా సరిపోయాడు. బీఎన్ రావుగారు ఎక్కడా రాజీపడలేదు. మణిశర్మ గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. -
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మెదక్‌జోన్ : టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు, చర్చి కాంపౌండ్లోగల ఓల్డేజి హోంలో వృద్ధలకు పండ్లు పంపిపెట్టారు. అలాగే స్థానిక రాజీవ్‌భవన్, ఏరియా ఆస్పత్రిలో కేక్‌కట్ చేసి శశిధర్‌రెడ్డి లాంగ్‌లీవ్ అంటూ నినాదాలుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మేడి మధుసూదన్‌రావు, గూడూరి ఆంజనేయులు రవి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొండ శ్రీనివాస్, జట్కా సందీప్ తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్) : మండల కేంద్రంలోని హవేళిఘణాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శశిధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మామిండ్ల ఆంజనేయులు, నాయకులు ఏసురెడ్డి, సాప రవి, బచ్చు జగదీశ్వర్, నరేందర్ రెడ్డి, శ్రావణ్, కుమార్ తదితరులున్నారు. రామయంపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మేల్యే శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం రామయంపేట నాయకులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అహ్మద్, రొయ్యల పాచయ్య, కర్రె రమేష్, దోమకొండ వెంకటి, గౌస్ తదితరులు ఉన్నారు. చిన్నశంకరంపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను చిన్నశంకరంపేట లో శుక్రవారం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భర్త్‌డే కేక్ కట్‌చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రమేష్ పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి జన్మదిన వేడుకలను మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంతప్ప ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, డీసీసీ డైరెక్టర్ మల్లన్న, ఉప సర్పంచ్ కలీం, ఏడుపాయల మాజీ డైరెక్టర్ కిషన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఖాజా, నరేందర్‌గౌడ్, నసీరొద్దీన్, నిజాం, జకీర్, అన్నారం ఇమానియల్ పాల్గొన్నారు. ఇక ఏడుపాయల దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు శశిధర్‌రెడ్డి పేరిట పూజలు చేయించారు. -
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు
కడపసిటీ, న్యూస్‌లైన్ : మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. జిల్లా పరిషత్ సీఈఓ మాల్యాద్రి ఆధ్వర్యంలో రూపొందించిన జాబితాను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ శనివారం రాత్రి విడుదల చేశారు. జిల్లాలో 50 మండల ప్రజా పరిషత్‌లున్నాయి. షెడ్యూలు తెగలు 1, షెడ్యూలు కులాలకు 7, వెనుకబడిన తరగతులకు 13, ఇతరులకు 29 ఎంపీపీ స్థానాలు ఖరారు చేశారు. షెడ్యూలు తెగలు జనరల్ పులివెందుల షెడ్యూలు కులాలు మహిళలు కమలాపురం, చెన్నూరు, చిట్వేలి షెడ్యూలు కులాలు జనరల్ మైదుకూరు, రాజంపేట, శ్రీ అవధూతేంద్ర కాశినాయన, వీరబల్లి బీసీ మహిళలు సంబేపల్లి, పెద్దముడియం, ఖాజీపేట, ముద్దనూరు, చాపాడు, కోడూరు. బీసీ జనరల్ రాయచోటి, రామాపురం, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, పెనగలూరు, అట్లూరు,లక్కిరెడ్డిపల్లె, జనరల్ మహిళలు మైలవరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,దువ్వూరు, టి.సుండుపల్లి, కొండాపురం, నందలూరు, ఎర్రగుంట్ల, కలసపాడు, పెండ్లిమర్రి, చక్రాయపేట, వేముల, సింహాద్రిపురం, రాజుపాలెం. జనరల్ (అన్రిజర్వ్డ్) గాలివీడు, చిన్నమండెం, ిసీకేదిన్నె, వేంపల్లి, పోరుమామిళ్ల, సిద్ధవటం, వీఎన్‌పల్లి, తొండూరు, బి.కోడూరు, వల్లూరు, లింగాల, బద్వేలు, గోపవరం, పుల్లంపేట, ఓబులవారిపల్లె. -
ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించి ఓటు హక్కు కల్పించాలని ఓటరు నమోదు పరిశీలకుడు శశిధర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని పేర్కొన్నారు. మండలాల వారీగా నమోదు చేయాల్సిన ఓటర్లు ఎంత మంది, ఇప్పటి వరకు ఎంత మందిని నమోదు చేశారనేది తహశీల్దార్లు, ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో ఎక్కువగా మరాఠి ప్రజలు ఉన్నారని, ప్రతి ఫారం అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ.. 1.73 లక్షల ఓటర్లు నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 70 వేల మందిని నమోదు చేశామన్నారు. ఓటర్ల నమోదుకు ప్రతి మండల కేంద్రం ఓ కంప్యూటర్ సిస్టం, ఆపరేటర్‌ను ఇవ్వాలని కోరారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, చక్రధర్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, తహశీల్దార్లు రమేష్, రాజేశ్వర్‌రెడ్డి, మోతీరాం, నాయకుడు బండి దత్తాత్రి పాల్గొన్నారు.