మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2లక్షల ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కేంద్రం రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు లక్ష రూపాయలు ఇస్తున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. అయితే కేంద్రం రెండు లక్షల రూపాయలు మాత్రమే నష్టపరిహారం ప్రకటించడం దారుణం అని టిఆర్ఎస్ సభ్యులు లోక్సభలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రకటించినట్లు చెప్పారు. రైల్వే మంత్రి సదానంద గౌడ సమాదానం చెబుతూ ఇది ఎక్స్గ్రేషియా మాత్రమేనని, కాంపన్సేషన్ కాదని చెప్పారు.
గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తిగా చికిత్స చేయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పిన విషయం తెలిసిందే.