రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు
Published Wed, Aug 3 2016 7:26 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులు కేటాయింపులు జరిపిందని, జాతీయస్థాయి విద్య, వైద్య సంస్థలను మంజూరు చేసిందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ చెప్పారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటే వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు మంజూరు చేశామని కేంద్ర మంత్రులు, తాము రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నామని టీడీపీ, బీజేపీ ఎంపీల ప్రకటనల్లో నిజం లేదని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దశాబ్దాల క్రితమే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్‌ను నెలకొల్పగా.. విభజన జరిగిన తరువాత కొత్తగా ఏపీకి ఆయా సంస్థలను మంజూరు చేశారని తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు అన్ని రాష్ట్రాలతోపాటే మంజూరు చేస్తారన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
Advertisement
Advertisement