టీఆర్‌ఎస్‌ది బోగస్‌ సర్వే | congress former mla criticised over trs survey | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ది బోగస్‌ సర్వే

Published Sat, Apr 22 2017 10:54 PM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

congress former mla criticised over trs survey

భీమదేవరపల్లి: కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అధికారాన్ని కైవసం చేసుకునేలా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముల్కనూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ సమావేశం జిమ్మల భీంరెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హాజరై ప్రసంగించారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు.

రాబోయె ఎన్నికల్లో 90స్థానాలు కైవసం చేసుకొని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్‌ బోగస్‌ సర్వేతో ప్రజలను తికమక చేసే ప్రయత్నం చేస్తున్నాడని కేసీఆర్‌ మాటలకు కాలం చెల్లిందన్నారు. సీఎం మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించడం లేదన్నారు. 2019లో కాంగ్రెస్‌ ప్రభుత్వ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యకర్తలకు అండగా తాము ఉన్నామని కార్యక్తలు నిరుత్సాహానికి గురికాకుండా కంకణబద్దులై పనిచేయాలన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడాలని సూచించారు.

మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టెందుకు ప్రజలు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ సెల్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా చైర్మన్‌ పింగిలి వెంకట్రాంనర్సింహరెడ్డి నాయకులు కేతిరి లక్ష్మారెడ్డి, పత్తిపాక కొంరెల్లి, కొలుగూరి రాజు, మంగ రాంచంద్రం, కొమురవెల్లి చంద్రశేఖర్‌గుప్తా,మాజీ ఎంపీపీలు కోడూరి సరోజన, బొజ్జపురి అశోక్‌ముఖర్జీ, మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు చిదురాల స్వరూప, అప్పని పద్మ, చిట్టంపల్లి అయిలయ్య, చొల్లెటి ప్రకాశం, చవ్వాల బుచ్చయ్య, పిడిశెట్టి కనకయ్య, కంకల సమ్యయ్య, చిటుకూరి రాంచంద్రం, సిక బాబు, మ్యాక స్వామి, ప్రెస్‌ కొంరయ్య, డబ్బ శంకర్, సంజీవ్, రాజుకుమార్, అనిల్‌తోపాటు తదితరులున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement