
కుటుంబ సభ్యులతో జాన్వీ
తల్లి శ్రీదేవి హఠాన్మరణం ఇచ్చిన షాక్ నుంచి జాన్వీ కపూర్ తేరుకుంటున్నట్లున్నారు. బుధవారం తన 21వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ముంబైలోని ఒక ఓల్డేజ్ హోమ్‌కి వెళ్లి అక్కడ కేక్ కట్ చేశారామె. అక్కడి వాళ్లంతా ప్రేమతో జాన్వీకి బర్త్‌డే సాంగ్ పాడారట. కుటుంబసభ్యుల మధ్య కూడా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు జాన్వీ. ఈ వేడుకల్లో బోనీకపూర్, ఖుషీ కపూర్, సోనమ్ కపూర్, రేఖా కపూర్, అన్షులా కపూర్, శాన్య కపూర్, జాహన్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.