Mili Trailer Launch: Boney Kapoor Says Dont Compare Janhvi With Sridevi, Deets Inside - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఆమెతో నా కుమార్తెను పోల్చవద్దు.. బోనీ కపూర్ విజ్ఞప్తి

Oct 16 2022 4:04 PM | Updated on Oct 16 2022 6:19 PM

Dont compare My Daughter Janhvi with Sridevi Boney Kapoor At Mili trailer launch  - Sakshi

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిలి'.  ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్ ఈ మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మలయాళ సినిమా హెలెన్‌కు హిందీ రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె తండ్రి బోనీ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా వ్యక్తి జాన్వీ కపూర్‌ను శ్రీదేవితో పోల్చడాన్ని బోనీ కపూర్ అడ్డుకున్నారు. నా బిడ్డను శ్రీదేవితో పోల్చవద్దంటూ సూచించారు. 

(చదవండి: ఉత్కంఠ రేపుతున్న జాన్వీకపూర్‌ ‘మిలి’ ట్రైలర్‌..)
 
బోనీ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రతిఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకోవడానికి విభిన్నమైన శైలిని కలిగి ఉంటారు. అందులో శ్రీదేవి ఒకరు. జాన్వీ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటుంది. శ్రీదేవిని దాదాపు 150-200 సినిమాల్లో ప్రేక్షకులు చూశారు. కానీ నా కుమార్తె ఇప్పుడే తన ప్రయాణం ప్రారంభించింది. దయచేసి అమ్మతో ఆమెను పోల్చవద్దు.' అని అన్నారు.


 జాన్వీ కపూర్ మిలి ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, ఆమె సహచరులు ప్రశంసలతో ముంచెత్తారు. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మిలి ట్రైలర్‌ను ప్రస్తావిస్తూ జాన్వీ కపూర్ టీమ్‌కి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ఆమె నటనను ప్రశంసించారు. నా చెల్లెలు చాలా గొప్ప పనులు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.' అన్నారు. జాన్వీ కపూర్ మిలితో పాటు స్టార్ కిడ్ రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె క్రికెట్‌తో ముడిపడి ఉన్న ఓ సినిమా కోసం ప్రిపరేషన్‌లో బిజీగా ఉంది.  వరుణ్ ధావన్‌తో కలిసి బావాల్ మూవీలో కూడా కనిపించునుంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement