bony kapoor
-
ఆసుపత్రి నుంచి జాన్వీ కపూర్ డిశ్చార్జ్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పూర్తి ఆరోగ్యంతో ఆమె తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఆహారం కల్తీ కావడం వల్ల జాన్వీ అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు.24 గంటల పాటు చికిత్స పొందిన జాన్వీ కపూర్ పూర్తి ఆరోగ్యంతో తన ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ వార్తలను ధృవీకరించారు. ఆమె ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. కాస్త నీరసంగా ఉన్నప్పటికీ మరొక రోజులో ఆమె పూర్తిగా కోలుకుంటారని తెలుస్తోంది.చెన్నై నుంచి ముంబైకి వస్తున్న క్రమంలోనే జాన్వీ అనారోగ్యానికి గురైంది. తన ఆరోగ్యం రిత్యా బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. కానీ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహ వేడుకకు తప్పక వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడం ఆపై పెళ్లికి హాజరకావడంతో ఇబ్బందులకు గురైంది. వరుస సినిమాలతో జాన్వీ కపూర్ బిజీబిజీగా ఉన్నారు. జాన్వీ, గుల్షన్ దేవయ్య, రోషన్ మ్యాథ్యూ నటించిన ప్రధాన ‘ఉలాజ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె బిజీగా ఉంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’లో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ జాన్వీనే హీరోయిన్ కావడం విశేషం. -
హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త
ఇప్పటి జనరేషన్‌కి ఆమె గురించి పెద్దగా తెలియదు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా ఏ పాయింట్ తీసుకున్నా సరే అతిలోక సుందరి శ్రీదేవి ఫెర్ఫెక్ట్గా ఉండేది. తెలుగులో రెండు మూడు జనరేషన్ స్టార్ హీరోలతో నటించిన ఆమె.. 2018లో అనుకోని విధంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. అప్పటికే ఆమెకు ఓ కోరిక ఉండేది. ఇన్నాళ్లకు ఆ డ్రీమ్ ని ఆమె భర్త బోనీ కపూర్ తీర్చారు. ఏంటా కోరిక? 80ల్లో హీరోయిన్గా మంచి ఊపు మీదున్నప్పుడు శ్రీదేవి.. చెన్నైకి దగ్గర్లోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని బీచ్ దగ్గర ఐదు ఎకరాల ప్లేస్ కొనుగోలు చేసింది. అక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంది. చాలా ఆశపడింది. కానీ 2018లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు చనిపోయింది. దీంతో ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!) ఇన్నాళ్లకు అలా శ్రీదేవి చివరి కోరికను భర్త బోనీ కపూర్.. ఆమె చనిపోయిన ఐదేళ్లకు నెరవేర్చాడు. తాజ్ గ్రూప్ పార్ట్నర్షిప్తో అందమైన భవనం కట్టించారు. 'ఇది శ్రీదేవి కల. అది నెరవేర్చినందుకు రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేశాం. ఫైనల్‌గా బీచ్ హౌస్‌ని పూర్తి చేశాం. చాలా ఆనందంగా ఉంది' అని బోనీ కపూర్ చెప్పారు. తల్లిలా కూతురు అయితే అమ్మ శ్రీదేవి అడుగుజాడల్లోనే కూతురు జాన్వీ కపూర్ వెళ్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'లో జాన్వీనే హీరోయిన్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం జాన్వీకి తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. In the late 80's during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai. Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 Boney Kapoor is happy to fulfilling Sri Devi's dream. He says, "Fulfilling Sri’s dream, it’s been almost 2yrs since I started developing her beach house."@BoneyKapoor pic.twitter.com/0d6ellj6wf — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్!
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఎన్నికల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను కూడా ముమ్మరం చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు అధికారులు జరుపుతున్న తనిఖీల్లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావంగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఓ బీఎండబ్ల్యూ కారులో లక్షలు విలువైన వెండి వస్తువులను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు బాక్సల్లో వెండి వస్తువులను ఉంచి ఐదు చెన్నై నుంచి ముంబయి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కారులోని వ్యక్తులు సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 66 కేజీల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉండచ్చని అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో, కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. హరి సింగ్‌ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు సమాచారం. ఆ వస్తువులకు సరైన పత్రాలు చూపించని కారణంగానే వాటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనా? కాదా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నా బిడ్డను ఆమెతో పోలుస్తారా.. అడ్డుకున్న బోనీ కపూర్
దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిలి'. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్ ఈ మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మలయాళ సినిమా హెలెన్‌కు హిందీ రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె తండ్రి బోనీ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా వ్యక్తి జాన్వీ కపూర్‌ను శ్రీదేవితో పోల్చడాన్ని బోనీ కపూర్ అడ్డుకున్నారు. నా బిడ్డను శ్రీదేవితో పోల్చవద్దంటూ సూచించారు. (చదవండి: ఉత్కంఠ రేపుతున్న జాన్వీకపూర్ ‘మిలి’ ట్రైలర్..) బోనీ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రతిఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకోవడానికి విభిన్నమైన శైలిని కలిగి ఉంటారు. అందులో శ్రీదేవి ఒకరు. జాన్వీ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటుంది. శ్రీదేవిని దాదాపు 150-200 సినిమాల్లో ప్రేక్షకులు చూశారు. కానీ నా కుమార్తె ఇప్పుడే తన ప్రయాణం ప్రారంభించింది. దయచేసి అమ్మతో ఆమెను పోల్చవద్దు.' అని అన్నారు. జాన్వీ కపూర్ మిలి ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, ఆమె సహచరులు ప్రశంసలతో ముంచెత్తారు. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మిలి ట్రైలర్‌ను ప్రస్తావిస్తూ జాన్వీ కపూర్ టీమ్‌కి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఆమె సోదరుడు అర్జున్ కపూర్ ఆమె నటనను ప్రశంసించారు. నా చెల్లెలు చాలా గొప్ప పనులు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.' అన్నారు. జాన్వీ కపూర్ మిలితో పాటు స్టార్ కిడ్ రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె క్రికెట్‌తో ముడిపడి ఉన్న ఓ సినిమా కోసం ప్రిపరేషన్లో బిజీగా ఉంది. వరుణ్ ధావన్‌తో కలిసి బావాల్ మూవీలో కూడా కనిపించునుంది. -
మైనస్ డిగ్రీల చలిలో జాన్వీ కపూర్.. ఆకట్టుకుంటున్న టీజర్
దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మిలి'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో జాన్వీ నర్సు పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని జాన్వీ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ చిత్రానికి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాన్వీ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించనుంది. (చదవండి: హీరోయిన్ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్) టీజర్‌ను చూస్తే... ' మైనస్ 16 డిగ్రీల చలి ఉష్ణోగ్రతతో ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయిన జాన్వీ కపూర్ తన నోటిని ఉపయోగించి టేపులను చింపివేస్తున్నట్లు సీన్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆమె ఫ్రీజర్ నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించడం.. స్టిల్స్‌లో ఆమె ప్లాస్టిక్‌తో చుట్టేసినట్లు కనిపించడం ఆసక్తిని రెేకెత్తిస్తోంది. టీజర్లో డైలాగ్‌లు లేకపోయినా.. జాన్వీ కపూర్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) జాన్వీ కపూర్‌లో లుక్‌తో ఉన్న మరో పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో ఆమె ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయి.. ఆమె ముఖంపై ఎర్రటి గుర్తులతో ఉన్నట్లు కనిపించింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌తో పాటు మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహితో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కూడా కనిపించనుంది. -
కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్న అజిత్!
అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న 61వ చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇంతకు ముందు ఈయన కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన బోనీ కపూర్, జి.స్టూడియోస్ సంస్థ మళ్లీ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. గత చిత్రాల దర్శకుడు హెచ్.వినోద్‌నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అజిత్ ఇందులో కాలేజీ ప్రొఫసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇందులో ఆయనకు జంటగా నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలిసింది. బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రీ ఎంట్రీ కానుందన్న మాట. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ భామ టబును ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈమె అజిత్ సరసన చాలా కాలం క్రితం కండుకొండేన్ చిత్రంలో నటించారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఇప్పటికే ఈ చిత్రం కోసం రెండు పాటలను రికార్డ్ చేశారట. ఈ చిత్ర ప్రారంభోత్సవ దృశ్యాలను నిర్మాత బోనీకపూర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. -
లతా మంగేష్కర్‌కు ప్రముఖుల నివాళులు
ఎవరి పేరు చెప్తే కోకిల సైతం గర్వంగా తలెత్తి చూస్తుందో ఆమె గొంతు మూగబోయింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు అన్ని రంగాల సెలబ్రిటీలు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొంటున్నారు. 'మాటల్లో చెప్పలేనంత వేదనలో ఉన్నాను. లతా దీదీ మనందరినీ వదిలి వెళ్లిపోయారు. రాబోయే తరాలు ఆమెను గుర్తుపెట్టుకుంటాయి. లతాజీ మరణం ఎంతగానో బాధించింది, ఆమె లేని లోటు పూడ్చలేదనిది. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంతమగ్ధులను చేసింది. ఆమె ఎనలేని అసమాన సామర్థ్యం కలిగి ఉంది. సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎల్లప్పుడూ మక్కువ చూపేది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంది. లతా దీదీ నుండి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరిచయం మరువలేనిది' అని ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్లో నివాళులు అర్పించారు. I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO — Narendra Modi (@narendramodi) February 6, 2022 Lata Didi’s songs brought out a variety of emotions. She closely witnessed the transitions of the Indian film world for decades. Beyond films, she was always passionate about India’s growth. She always wanted to see a strong and developed India. pic.twitter.com/N0chZbBcX6 — Narendra Modi (@narendramodi) February 6, 2022 'దేశం గర్వించదగ్గ, సంగీత ప్రపంచంలో స్వర కోకిల, భారత రత్న గ్రహీత లతా మంగేష్కర్‌గారి మృతి బాధాకరం. ఆమె మృతి దేశానికి తీరని లోటు. ఆమె పవిత్ర ఆత్మకు హృదయపూర్వక నివాళులు అరిస్తున్నాను. ఆమె 30 వేలకు పైగా పాటలు పాడింది. సంగీత ప్రియులందరికీ ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దేశప్రజలందరితో పాటు నాకూ లతాజీ పాటలంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆమె పాటలు వింటూ ఉంటాను' అని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. लता दीदी प्रखर देशभक्त थी। स्वातंत्र्यवीर सावरकर जी की विचारधारा पर उनकी हमेशा ही दृढ़ श्रद्धा रही है। उनका जीवन अनेक उपलब्धियों से भरा रहा है। लता जी हमेशा ही अच्छे कामों के लिए हम सभी को प्रेरणा देती रही हैं। भारतीय संगीत में उनका योगदान अतुलनीय है। — Nitin Gadkari (@nitin_gadkari) February 6, 2022 'లతా మంగేష్కర్ మరణవార్త ఎంతగానో బాధిస్తోంది. ఆమె రాబోయే తరాలకు విలువైన పాటల వారసత్వాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి' అని బోనీ కపూర్ సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. Deeply saddened by the news of @mangeshkarlata Ji’s passing away. She leaves behind a huge legacy of songs which will be treasured for generations to come.May her soul rest in peace. Condolences to the family. #NightingaleofIndia #LataMangeshkar pic.twitter.com/svW9iZsQb4 — Boney Kapoor (@BoneyKapoor) February 6, 2022 There will be always only one Nightingale of India #LataMangeshkar ! Rest in Peace Lata Ji. pic.twitter.com/TDPescIdNw — Yo Yo Honey Singh (@asliyoyo) February 6, 2022 I am extremely saddened by the demise of Lata Mangeshkar Ji, the Nightingale of Indian Cinema and legendary singer. India has lost its voice in the death of Lata ji, who has enthralled music lovers in India & across the globe with her mellifluous & sublime voice for many decades. pic.twitter.com/C9m3PfexyP — Vice President of India (@VPSecretariat) February 6, 2022 जगभरातील कोट्यवधी संगीतप्रेमींच्या कानांना तृप्त करणारे अलौकिक स्वर आज हरपले. लतादीदींच्या आवाजाच्या परीसस्पर्शाने अजरामर झालेल्या गीतांच्या माध्यमातून हा स्वर आता अनंतकाळ आपल्या मनांमध्ये गुंजन करत राहील. गानसम्राज्ञी लता मंगेशकर यांना भावपूर्ण श्रद्धांजली! pic.twitter.com/U9Nhn1KrpE — Sharad Pawar (@PawarSpeaks) February 6, 2022 Short of words and will always be while saying anything about this LEGEND 💔 Learning to sing early on in my childhood, I was always told to follow your path by my father. I am blessed and honoured to have shared my birthday with you 🙏🏻❤️ OM SHANTI 🙏🏻 #LataMangeshkar pic.twitter.com/PbtKmSE2dN — Munmun Dutta (@moonstar4u) February 6, 2022 युग संपले... pic.twitter.com/prMUOK74oW — Sanjay Raut (@rautsanjay61) February 6, 2022 A very sad day and a huge loss for all of us, her fans. Your contribution will live on forever ma’am. My condolences to the family and all her fans across the world. Om Shanti 🙏 #LataMangeshkar pic.twitter.com/lEp50LL8CH — bhumi pednekar (@bhumipednekar) February 6, 2022 A huge loss to the nation... Our nightingale is no more! My heartfelt condolences to Lata Ji's family and near ones. #RestInPeace #LataMangeshkar 💔 pic.twitter.com/52Kc005emu — adaa khan (@adaa1nonly) February 6, 2022 The end of an era as the nightingale falls silent. Rest In Peace. 💐#LataMangeshkar pic.twitter.com/F8LtGm93Z7 — Nivin Pauly (@NivinOfficial) February 6, 2022 Deeply saddened to know about the passing away of legendary singer Bharat Ratna #LataMangeshkar ji. She was the melodious voice of India, who dedicated her life to enriching Indian music in her more than 7 decades long rich contribution. pic.twitter.com/oIXyl55Xl5 — Ashok Gehlot (@ashokgehlot51) February 6, 2022 Death of Lata Mangeshkar is end of a #goldenera of Indian music, which ruled the world. She was very good human being and world-class singer. She will always live with us through her music. My homage. Om Shanthi. #LataMangeshkar pic.twitter.com/zCtss5EP0m — Prakash Javadekar (@PrakashJavdekar) February 6, 2022 So sad to hear that Lataji is no more, going to miss her so much.End of an Era!Lataji,Nightingale of India,whose voice hs made generations sing,dance & cry wil forever feed our emotion.Heartfelt condolences to Ashaji,family & friends.Nation wil miss her. Om Shanti#LataMangeshkar pic.twitter.com/eIOUxydQYm — Sunny Deol (@iamsunnydeol) February 6, 2022 Legends remain immortal.. #RIP #LataMangeshkar thank you for the songs🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/RWyZqT5vM1 — TheFarahKhan (@TheFarahKhan) February 6, 2022 -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్‌లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్‌లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
ఉదయ్‌తో ఆర్టికల్ 15
అజిత్‌తో హిందీ ‘పింక్’ని తమిళంలో రీమేక్ చేశారు బోనీ కపూర్. ఇప్పుడు మరో రీమేక్‌ను ప్రకటించారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించి, మెప్పించిన ‘ఆర్టికల్ 15’ని తమిళంలో రీమేక్ చేయనున్నారు బోనీ. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కులవివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి చట్టం, న్యాయం అందరికీ సమానమే అని చాటిచెప్పిన చిత్రమిది. హిందీలో ఆయుష్మాన్ పోషించిన పాత్రను తమిళంలో ఉదయ్‌నిధి స్టాలిన్ చేయనున్నారు. అరుణ్రాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జీ స్టూడియోస్, రోమియో పిక్చర్స్‌తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రొడక్షన్ హౌస్‌పై తమిళ రీమేక్‌ను నిర్మించనున్నట్లు బోనీ కపూర్ తెలిపారు. ‘పింక్’ తర్వాత అజిత్‌తో తమిళంలో ‘వలిౖమై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు బోనీ. ‘ఆర్టికల్ 15’ రీమేక్ షూటింగ్‌ని ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తారట. -
నటుడు అజిత్ అలా అన్నారా?
చెన్నై: నటుడు అజిత్ జీవన విధానం ఇతర నటులకు భిన్నంగా అని చెప్పవచ్చు. తనకు సంబంధంలేని ఏ విషయం గురించి అజిత్ స్పందించరు. తనేంటో తన పనేంటో అన్న ఈ విధంగా అతని ప్రవర్తన ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే అజిత్ నిర్ణయాలు చాలా నిర్ధిష్టంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన వలిమై చిత్రంలో నటిస్తున్నారు. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. (చదవండి: కాబోయే భర్త ఎలా ఉండాలంటే?) అయితే ఈ చిత్రంపై ఇప్పటికే కోలీవుడ్‌లో రకరకాల వదంతులు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతకు అజిత్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని దీంతో చిత్రం డ్రాప్ అయిందనే ప్రచారం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని చిత్ర నిర్మాత బోనికపూర్ కొట్టిపారేశారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత వలిమై చిత్ర షూటింగ్ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ మళ్లీ కోలుకోవాలంటే నిర్మాణ ఖర్చులను తగ్గించుకోవాలని, అదేవిధంగా నటీనటులు పారితోషికాన్ని సగానికి తగ్గించుకోవాలి అన్న డిమాండ్ నిర్మాతల నుంచి పెరుగుతోంది. దీంతో కొందరు నటీనటులు, దర్శకులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ నటుడు అజిత్ కూడా తన పారితోషకం తగ్గించే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం. ఆయన ఈ విషయమై చిత్ర నిర్మాత బోనీకపూర్ ఒక మెయిల్‌ను పంపినట్లు తెలిసింది. అందులో చిత్ర విడుదల ఎప్పుడన్నది నిర్ణయించిన తరువాత అప్పటి పరిస్థితులను బట్టి పారితోషికం తగ్గించే విషయమై చర్చిద్దామని చెప్పినట్టు సమాచారం. కాగా నటుడు అజిత్ ప్రస్తుతం ఉన్న స్థాయిలో తన పారితోషికాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఆయన వరుస భారీ అవకాశాలతో బిజీగా ఉన్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకునే విషయమై నిర్మాతకు భరోసా ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్తున్నాయి. కాగా అజిత్ పారితోషికం విషయంలో తీసుకున్న నిర్ణయం ఇతర ప్రముఖ నటుల్లో పెద్ద చర్చకే దారితీసిందని సినీ వర్గాలు తెలిపాయి. (శిరస్సు వంచి నమస్కరించిన అమితాబ్) -
అందరికీ నెగటివ్... ఆల్ హ్యాపీ
కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని తెలిపారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్. ఇటీవల బోనీకపూర్ ఇంటి సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో బోనీ అండ్ ఫ్యామిలీ 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఈ క్వారంటైన్ పీరియడ్ ముగిసిందని తెలిపారు బోనీకపూర్. ‘‘మా 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తయింది. కరోనా బారిన పడి, ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఇంటి సిబ్బందిలో ఉన్న ముగ్గురికి కూడా ఇప్పుడు కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. అలాగే నేను, నా కుమార్తెలు (జాన్వీకపూర్, ఖుషీకపూర్) పరీక్ష చేయించుకుంటే నెగటివ్ వచ్చింది. ఇతర సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికీ నెగటివ్ వచ్చింది. ఆల్ హ్యాపీ. ఇక మా డైలీ లైఫ్‌ను ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అలాగే కరోనా సోకి క్వారంటైన్లో ఉన్నవారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ సూచనలను అందరూ పాటించాలి. కరోనా కట్టడి కోసం పోరాడుతున్న డాక్టర్స్, ఇతర హెల్త్‌కేర్ వర్కర్స్, ముంబై పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు బోనీకపూర్. -
అందమైనపు బొమ్మ
శ్రీదేవి గొప్ప అందగత్తె. అంతకు మించిన గొప్ప నటి. సౌతిండియా నుంచి నార్తిండియా వరకూ తన ప్రతిభతో లేడీ సూపర్‌స్టార్ అయ్యారు. ఓ బ్రాండ్లా ఎదిగారు. అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి మరణించారు. అందరి మనసుల్లో చెరిగిపోని బొమ్మగా నిలిచిపోయారు. ఇప్పుడు సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అందమైన మైనపు బొమ్మగా మారారు శ్రీదేవి. ఈ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘శ్రీదేవి మరణించిన తర్వాత కూడా ఆమె మీద కురిపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది. నా భార్యగా తనని ఎంతగా ప్రేమించానో, తన ఆర్ట్‌ని, తనకు సినిమా మీద ఉన్న ప్రేమను అంతే గౌరవించాను. ఈ విగ్రహం తన ఆనవాళ్లకు ఓ చిహ్నంలా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు బోనీ కపూర్. ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి..’ పాటలో శ్రీదేవి లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మ తయారు చేశారు. తల్లి బొమ్మను తదేకంగా చూస్తున్న జాన్వీ శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి -
ఇషాన్‌తో జాన్వీకపూర్ డేటింగ్..!
బోనీకపూర్ గారాలపట్టి జాన్వీ కపూర్, హీరో ఇషాన్ ఖట్టర్ డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరు ‘ధడక్’ చిత్రంలో వెండితెరపై రొమాన్స్ చేయడంతో.. నిజ జీవితంలోనూ వీరి మధ్య బంధం ఏర్పడిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై జాన్వీ తండ్రి బోనికపూర్ స్పందించి.. ‘జాన్వీ, ఇషాన్‌లపై వస్తున్నవార్తలు అవాస్తవం. వారు మంచి స్నేహితులు.. అదేవిధంగా నా కూతురు ఇషాన్‌తో చేసే స్నేహాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఇషాన్ తరుచు జాన్వీ ఇంటికి వెళ్లుతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కాగా ధడక్ మూవీ రిలీజ్ అయ్యాక ఇషాన్.. ఒక్కసారి కూడా తమ ఇంటికి రాలేదు. దీంతోపాటు వారి ఇరువురి మధ్య స్నేహానికి మించి ఎలాంటి రిలేషన్ లేద’న్నారు. తెలుగులో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ రీమేక్‌లో జాన్వీ , ఇషాన్ జంటగా నటిస్తారని బీ టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాత కరణ్ జోహార్ స్పందించాడు. ఇంకా నటీనటులు ఎవరనేది డిసైడ్ చేయాలేదని, డియర్ కామ్రేడ్ మూవీ పెద్ద విజయం సాధించాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
త్రీ డీల్ లేదు
హీరో– ప్రొడ్యూసర్ కాంబినేషన్ వరుసగా రిపీట్ కావాలంటే వరుస హిట్స్ అందించాలి. లేదంటే రెండు, మూడు సినిమాల డీల్ సైన్ చేయాలి. తమిళ స్టార్ హీరో అజిత్, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ 3 సినిమాల డీల్ కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని బోనీ కన్ఫర్మ్ చేశారు. ‘‘బయట ప్రచారం అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’ సినిమా నిర్మిస్తున్నాను. ఆ తర్వాత ఓ యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నాం. అజిత్‌తో ఓ హిందీ సినిమా చేయించాలనే ఆలోచన నాకుంది. కానీ అజిత్ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు’’ అన్నారు. హిందీ చిత్రం ‘పింక్’కి రీమేక్‌గా రూపొందిన ‘నేర్కొండ పార్వై’ ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. -
అక్క చెప్పింది... చెల్లి వస్తోంది!
అతిలోకసుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల పెద్దకుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఓ చాట్ షోలో భాగంగా కన్ఫార్మ్ చేశారు. ‘‘ఖుషీ యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది. ఏదో అలా వచ్చాంలే అనుకోకుండా ముందు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకోనుంది. ఈ విషయంపై నాన్న బోనీ కపూర్ కూడా కాస్త ఎగై్జటింగ్‌గానే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీకపూర్. ఇక.. జాన్వీని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన కరణ్ జోహారే తనను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనను వ్యక్తపరిచారట ఖుషీకపూర్. ఆలియా భట్, సిద్దార్ధ్‌మల్హోత్రా, వరుణ్‌ధావన్ ఇలా చాలామంది స్టార్స్ కొడుకులు, కూతుర్లను కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందరూ కూడా కెరీర్లో దూసుకెళుతున్నారు. -
ఫన్ చేస్తారా?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. హిందీ చిత్రంలో వెంకటేశ్, అర్జున్ కపూర్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. తెలుగు చిత్రాలు ‘పెళ్లాం ఊరెళితే, రెడీ’లను నో ఎంట్రీ, రెడీగా హిందీలో రీమేక్ చేసిన అనీస్ బాజ్మీ హిందీ ‘ఎఫ్ 2’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక బోనీకపూర్ తనయుడే అర్జున్ కపూర్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి.. వెంకీ, అర్జున్ కాంబినేషన్ నిజమేనా? వేచి చూద్దాం. -
కోర్టుకు టైమ్ అయ్యింది!
అమ్మాయిలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి లాయర్‌గా మారనున్నారు అజిత్. ‘ఖాకి’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. బాలీవుడ్ హిట్ ‘పింక్’ చిత్రానికిది రీమేక్. ఇందులో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో నటించడానికి అజిత్ రెడీ అవుతున్నారు. అంటే.. లాయర్‌గా కోర్టులోకి దిగటానికి టైమ్ అయ్యిందన్నమాట. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. అంతేకాదు అజిత్ నెక్ట్స్ చిత్రానికి కూడా బోనీ కపూర్‌నే నిర్మాత. ‘‘పింక్’ రీమేక్ కాకుండా అజిత్ నెక్ట్స్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాను. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలైలో ప్రారంభిస్తాం. ‘పింక్’ని వచ్చే ఏడాది మే 1న, అజిత్‌తో నిర్మించాలనుకుంటున్న మరో చిత్రాన్ని 2020 ఏప్రిల్ 10న రిలీజ్ ప్లాన్ చేశాం’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్. ఇక అజిత్ నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’ జనవరి 10న విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
అతిథులుగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్‌లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్‌కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది. అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట. -
శ్రీదేవీ కోరిక నెరవేర్చిన కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ : కోట్లాది అభిమానులను కన్నీటిలో ముంచి, ఈ లోకం విడిచి వెళ్లిన శ్రీదేవీ అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని హరిద్వార్‌లో కూడా నిర్వహించారు. గత వారం రామేశ్వరంలో ఆమె అస్థికలు కలిపిన తర్వాత, నిన్న(గురువారం) హరిద్వార్ వద్ద కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. హరిద్వార్ షూటింగ్ సమయంలో 1993లో ఆమె మళ్లీ అక్కడికి వస్తానని మొక్కుకున్నారని, ఈ క్రమంలో శ్రీదేవీ కోరిక నెరవేర్చడానికి రెండోసారి కూడా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. హరిద్వార్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు, ఆయన సోదరుడు అనిల్ కపూర్, శ్రీదేవీ క్లోజ్ ఫ్రెండ్, డిజైనర్ మనీష్ మల్హోత్రాలు పాల్గొన్నారు. కపూర్ కుటుంబానికి చెందిన పూజారులు శివ్ కుమార్ పాలివాల్, మనీష్ జైస్వాల్‌లు హరిద్వార్‌లోని వీవీఐపీ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి కంఖల్‌లో ఉన్న హరిహర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఉత్తరఖాండ్ వ్యవసాయ మంత్రి సుబోద్ యూనియల్, హరిద్వార్ మేయర్ మనోజ్ గార్గ్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్‌లు కూడా ఈ పూజ కార్యక్రమానికి విచ్చేశారు. రామేశ్వరంలో జరిగిన కార్యక్రమానికి బోని కపూర్, తన కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి వెళ్లారు. మరణించిన వారి అస్థికలు నదుల్లో కలపడం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే. నదీతీర్థాల్లో కర్మకాండలు ఆచరించిన అనంతరం పవిత్ర నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవీ, దుబాయ్ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవీ మరణం కోట్లాది మంది అభిమానులను తీవ్ర దుఃఖసాగరంలో ముంచివేసింది. -
టీనా గిఫ్ట్ : తీవ్ర ఉద్వేగానికి లోనైనా బోనీ
ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవీ, టీనా అంబానీ మంచి స్నేహితులు. తరుచుగా వీళ్లిద్దరూ కలుస్తూనే ఉండేవారు. శ్రీదేవీ మరణించడానికి కొన్ని రోజులు ముందు అంటే ఫిబ్రవరి 11న టీనా బర్త్‌డే వేడుకల్లో వీరివురి కుటుంబాలు కలిసి సందడి చేశాయి. శ్రీదేవీ అకస్మాత్తుగా మరణించడంతో, బోని కపూర్‌ను టీనా పరామర్శించారు. ఈ సందర్భంగా తన 61వ పుట్టినరోజున శ్రీదేవీతో దిగిన ఓ ఫోటోను వెండి ఫ్రేమ్‌తో డిజైన్ చేయించి బోనీకి కానుకగా ఇచ్చారు. ఆ ఫోటోను చూసి బోనీ కపూర్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారని తెలిసింది. ఇదే శ్రీదేవితో కలిసి దిగిన ఆఖరి ఫొటో అవుతుందని అనుకోలేదని టీనా కూడా చాలా బాధపడ్డారట. తీవ్ర ఉద్వేగంలోనే శ్రీదేవీ స్వీట్ మెమరీని తనకు కానుకగా ఇచ్చినందుకు బోనీ కృతజ్ఞతలు తెలిపారు. టీనా తన 61వ పుట్టినరోజు వేడుకను ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు శ్రీదేవి, బోనీ కపూర్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. భార్య శ్రీదేవి ఆకస్మిక మరణాన్ని బోనీ కపూర్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని.. ఆయన్ని పరామర్శించడానికి వెళ్లిన వారంతా బోనీ బాగా కుమిలిపోతున్నారని చెబుతున్నారు. దుబాయ్‌లో మృతి చెందిన శ్రీదేవీ, మృతదేహాన్ని అంబానీకి చెందిన ప్రైవేట్ జెటే భారత్‌కు తీసుకొచ్చింది. -
బోనీ కుటుంబానికి కోహ్లీ దంపతుల పరామర్శ
సాక్షి, ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు బోనీ కపూర్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించిన విషయం తెలిసిందే. భార్య మరణంతో దుఃఖంలో ఉన్న బోనీ కపూర్‌ను విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆదివారం కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫిబ్రవరి 28న అనుష్క మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా శ్రీదేవీ మరణించిన సమయంలో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. ఆదివారం భోపాల్ నుంచి ముంబయి చేరుకున్న అనుష్క శర్మ తన భర్త విరాట్‌తో కలిసి లోఖండ్‌వాలాలోని శ్రీదేవీ నివాసానికి వెళ్లారు. శ్రీదేవీ మరణవార్త వినగానే అనుష్క ట్విటర్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ముంబయిలో విరుష్క ఇచ్చిన వివాహ రిసెష్షన్‌కు శ్రీదేవీ, బోనీ కపూర్ దంపతులిద్దరూ హాజరై వధూవరుల్ని ఆశీర్వదించిన విషయం తెలిసిందే. -
శ్రీదేవి: ఆ రోజు ఏం జరిగిందంటే..
ముంబై: ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంపై వారం రోజులుగా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె భర్త, ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ తొలిసారి స్పందించారు. తన స్నేహితుని వద్ద శ్రీదేవి మరణించిన రోజు ఏం జరిగిందనే విషయంపై పెదవి విప్పారు. తాను సడెన్‌గా దుబాయ్ వెళ్లడం.. అక్కడ శ్రీదేవిని సర్ప్రైజ్ చేయడం.. ఇద్దరం కలసి గడపడం.. చివరిగా బాత్రూమ్లో శ్రీదేవిని విగతజీవిగా చూడటం.. ఇలా ఫిబ్రవరి 24న సాయంత్రం జరిగిన ప్రతి విషయాన్ని బోనీ తన స్నేహితుడు, ట్రేడ్ ఎనలిస్ట్ కోమల్ నాహ్తాకు పూసగుచ్చినట్టు వివరించారు. బుధవారం శ్రీదేవి అంత్యక్రియలకు కొద్దిసేపటి ముందు వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణలను యథాతథంగా కోమల్ తన బ్లాగ్‌లో రాసి ఆ తర్వాత దానిని అధికారిక ట్వీటర్ పేజీలో షేర్ చేశారు. ఒంటరితనమంటే ఆమెకు భయం.. కోమల్ బ్లాగ్‌లో షేర్ చేసిన ప్రకారం(బోనీ కోణం నుంచి).. ఫిబ్రవరి 24 ఉదయం నేను శ్రీదేవితో మాట్లాడాను. ఆ రోజు సాయంత్రం నేను దుబాయ్ వస్తున్నట్టు ఆమెకు చెప్పలేదు. దుబాయ్ వెళ్లాలనే ఆలోచనకు జాన్వీ కూడా ఓకే చెప్పింది. ఎందుకంటే.. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌పోర్ట్, ఇతర కీలకమైన పత్రాలను ఎక్కడో పెట్టి మరిచిపోతుందనేది ఆమె భయం. గత 24 ఏళ్లలో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు వెళ్లకపోవడం రెండుసార్లే జరిగింది. సినిమా ప్రదర్శనల కోసం న్యూజెర్సీ, వాంకోవర్‌లకు శ్రీదేవి వెళ్లింది. అప్పుడు నేను ఆమెతో లేను. అయితే నా స్నేహితుని భార్యను శ్రీదేవికి తోడుగా పంపాను. రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా ఓ విదేశీ గడ్డపై ఉండటం మాత్రం దుబాయ్‌లోనే జరిగింది. ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, ఖుషీ ఓ వివాహం నిమిత్తం దుబాయ్ వెళ్లాం. ఫిబ్రవరి 22న లక్నోలో ఓ కీలకమైన సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను ఇండియా వచ్చాను. ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని రూమ్ నంబర్ 2201లో శ్రీదేవి రిలాక్స్ అవుతూ.. జాన్వీ కోసం షాపింగ్ చేసింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3.30 గంటలకు నేను విమాన టికెట్ బుక్ చేసుకున్నాను. దుబాయ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి ఉంటున్న హోటల్‌కు చేరుకున్నాను. హోటల్ వద్ద శ్రీదేవిని సర్ప్రైజ్ చేశాను. ఇద్దరం 15 నిమిషాలు గడిపాం. అనంతరం నేను ఫ్రెషప్ అయి.. రొమాంటిక్ డిన్నర్‌కు వెళదామని ప్రతిపాదించాను. దీనికి ఓకే అన్న శ్రీదేవి.. స్నానానికి వెళ్లింది.శ్రీదేవి మాస్టర్ బాత్రూమ్కు వెళ్లింది. లివింగ్ రూమ్‌కు వచ్చిన నేను టీవీ చూస్తూ కొద్దిసేపు గడిపాను. 15–20 నిమిషాల తర్వాత సమయం 8 గంటలకు సమీపిస్తుండటం.. శనివారం కావడంతో హోటల్లో రష్ పెరిగిపోతు0దనే ఉద్దేశంతో లివింగ్ రూమ్ నుంచే రెండుసార్లు బిగ్గరగా శ్రీదేవిని పిలిచినా పలక లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్లీ పిలిచినా స్పందన లేదు. దీంతో బెడ్రూమ్లోకి వెళ్లి డోర్ కొట్టి.. మళ్లీ శ్రీదేవిని పిలిచాను. ఎంతసేపటికీ డోర్ తీయకపో వడం.. లోపలి నుంచి ట్యాప్ అన్ చేసి ఉన్న శబ్దం రావడంతో ఆందోళన చెంది డోర్ తెరిచే ప్రయత్నం చేశాను. లోపల బోల్ట్ పెట్టకపోవడంతో డోర్ వెంటనే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్ట బ్లోని నీటిలో పూర్తిగా మునిగిన శ్రీదేవి కనిపించింది. షాక్‌కు గురై ఎటువంటి చలనం లేకుండా శ్రీదేవిని చూస్తూ ఉండిపోయాను. శ్రీదేవి మునిగిపోయింది.. బోనీ ప్రపంచం బద్దలైపో యింది. శ్రీదేవిని బోనీ సర్ప్రైజ్ చేసిన రెండు గంటల్లోనే అంతా జరిగిపోయిందని కోమల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తొలుత నీట మునిగి ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండొచ్చని లేదా మొదట నిద్రలోకి జారుకుని లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి నీట మునిగిపోయి ఉండొచ్చని కోమల్ అంచనా వేశారు. ఆమె ఒక్క నిమిషం కూడా వేదన అనుభవించిన దాఖలాలు లేవని, ఎందుకంటే బాత్‌టబ్ పూర్తిగా నిండినా చుక్క నీరు కింద పడకపోవడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం సాక్షి, చెన్నై: ప్రముఖ నటి శ్రీదేవి అస్థికలను ఆమె కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం రామేశ్వరం వద్ద సముద్రంలో కలిపారు. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోయి శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయానికి ముంబైలో ఫిబ్రవరి 28న అంత్యక్రియలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం శ్రీదేవి మృతదేహాన్ని దహనం చేశారు. ప్రత్యేక విమానంలో శ్రీదేవి భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషి, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నై చేరుకున్నారు. అనంతరం ఈసీఆర్‌లోని శ్రీదేవి ఫామ్ హౌస్‌లో బసచేశారు. శనివారం ఉదయాన్నే పూజలు నిర్వహించిన తర్వాత రామేశ్వరానికి వెళ్లి అక్కడి సముద్రతీరంలోని అగ్నితీర్థంలో శ్రీదేవి అస్థికలను బోనీకపూర్ కలిపారు. -
శ్రీదేవి లేని లోటు మాటల్లో వర్ణించలేను
-
అచ్చు శ్రీదేవి లాగే..ప్రియా రాజ్వంశ్!
ప్యారలల్ లైఫ్... ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే రకమైన సంఘటనలు జరగటం. ఇది సినిమా కోసం అల్లిన కల్పనగా అనిపించినా.. కొన్ని సంఘటనలు ప్యారలల్ లైఫ్ నిజమేమో అన్న భావన కలిగిస్తాయి. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న శ్రీదేవి మరణం విషయంలోనూ ఇలాంటి సంఘటనలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి జీవితానికి, మరో బాలీవుడ్ సీనియర్ నటి ప్రియా రాజ్వంశ్ జీవితానికి ఎన్నో సారూప్యతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు తారలు బాత్రూమ్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మరణాలు ముందుగా కార్డియాక్ అరెస్ట్ కారణంగానే సంభవించినట్టుగా భావించారు. అయితే తరువాత ప్రియా మరణం.. హత్య అని తేలింది. శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తు సంభవించినట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఈ ఇద్దరు చనిపోయిన సమయంలో మధ్యం సేవించి ఉన్నట్టుగా ప్రకటించారు. వ్యక్తిగత జీవితంలోనూ శ్రీదేవి, ప్రియా రాజ్వంశ్ల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. ఈ ఇద్దరు తారలు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ కుటుంబాల పెద్ద కుమారులను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్ ( అనిల్ కపూర్, సంజయ్ కపూర్ల అన్న)ను వివాహం చేసుకోగా.. ప్రియా, చేతన్ ఆనంద్ (దేవానంద్, విజయ్ ఆనంద్‌ల అన్న)ను వివాహం చేసుకున్నారు. అంతేకాదు శ్రీదేవి, బోని కపూర్ రెండో భార్య కాగా ప్రియా కూడా చేతన్ ఆనంద్‌కు రెండో భార్యే. ప్రస్తుతం ఈ ఇద్దరు తారల జీవితాలలోని పోలికలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. -
ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు
ముంబై: శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేలా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పవన్ హన్స్ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 నుంచి అభిమానుల సందర్శనార్థం సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో ఆమె మృతదేహన్ని ఉంచారు. మధ్యాహ్నం వరకు అభిమానులను అనుమతించారు. అనంతంరం కుటుంబ సభ్యుల ప్రత్యేక కార్యక్రమాల తర్వాత ఆమె అంతిమయాత్ర ప్రారంభమైంది. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే ముంబై చేరుకుని నివాళులు అర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)