బోనీ కుటుంబానికి కోహ్లీ దంపతుల పరామర్శ | kohli, anushka sharma visit boney kapoor family | Sakshi
Sakshi News home page

బోనీ కపూర్ కుటుంబాన్ని పరామర్శించిన కోహ్లీ దంపతులు

Published Mon, Mar 5 2018 11:11 AM | Last Updated on Mon, Mar 5 2018 12:18 PM

kohli, anushka sharma visit boney kapoor family - Sakshi

అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీ

సాక్షి, ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు బోనీ కపూర్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌ లో పడి మరణించిన విషయం తెలిసిందే. భార్య మరణంతో దుఃఖంలో ఉన్న బోనీ కపూర్‌ను విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఆదివారం కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫిబ్రవరి 28న అనుష్క మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా శ్రీదేవీ మరణించిన సమయంలో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు.

ఆదివారం భోపాల్ నుంచి ముంబయి చేరుకున్న అనుష్క శర్మ తన భర్త విరాట్‌తో కలిసి లోఖండ్‌వాలాలోని శ్రీదేవీ నివాసానికి వెళ్లారు. శ్రీదేవీ మరణవార్త వినగానే అనుష్క ట్విటర్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ముంబయిలో విరుష్క ఇచ్చిన వివాహ రిసెష్షన్‌కు శ్రీదేవీ, బోనీ కపూర్ దంపతులిద్దరూ హాజరై వధూవరుల్ని ఆశీర్వదించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement