ముంబై: శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేలా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పవన్ హన్స్ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు శ్రీదేవి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 నుంచి అభిమానుల సందర్శనార్థం సెలబ్రేషన్ స్పోర్ట్స్ క‍్లబ్‌లో ఆమె మృతదేహన్ని ఉంచారు.
మధ్యాహ‍్నం వరకు అభిమానులను అనుమతించారు. అనంతంరం కుటుంబ సభ్యుల ప్రత్యేక కార్యక్రమాల తర్వాత ఆమె అంతిమయాత్ర ప్రారంభమైంది. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే ముంబై చేరుకుని నివాళులు అర్పించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment