Janhvi Kapoor Upcoming Mili Movie First Look Poster And Teaser Out - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor Mili Teaser: జాన్వీ కపూర్ 'మిలి' టీజర్ అవుట్.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్ పోస్టర్

Published Wed, Oct 12 2022 4:09 PM | Last Updated on Wed, Oct 12 2022 4:49 PM

Janhvi Kapoor Latest Movie Mili First Look Teaser Out - Sakshi

దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మిలి'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో జాన్వీ నర్సు పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని జాన్వీ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ చిత్రానికి బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాన్వీ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించనుంది.  

(చదవండి: హీరోయిన్‌ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్‌)

టీజర్‌ను చూస్తే... ' మైనస్ 16 డిగ్రీల చలి ఉష్ణోగ్రతతో ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయిన జాన్వీ కపూర్ తన నోటిని ఉపయోగించి టేపులను చింపివేస్తున్నట్లు సీన్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆమె ఫ్రీజర్ నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించడం.. స్టిల్స్‌లో ఆమె ప్లాస్టిక్‌తో చుట్టేసినట్లు కనిపించడం ఆసక్తిని రెేకెత్తిస్తోంది. టీజర్‌లో డైలాగ్‌లు లేకపోయినా.. జాన్వీ కపూర్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

జాన్వీ కపూర్‌లో  లుక్‌తో ఉన్న మరో పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో ఆమె ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయి.. ఆమె ముఖంపై ఎర్రటి గుర్తులతో ఉన్నట్లు కనిపించింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌తో పాటు మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాన్వీ కపూర్‌ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహితో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కూడా కనిపించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement