Actress Sridevi Last Wish Of Beach House Fulfilled By Boney Kapoor After 5 Years Of Her Death, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Sridevi: అతిలోక సుందరి డ్రీమ్.. ఇన్నాళ్లకు తీరింది

Published Sun, Aug 20 2023 6:16 PM | Last Updated on Mon, Aug 21 2023 10:29 AM

Actress Sridevi Last Wish Fulfilled By Boney Kapoor - Sakshi

ఇప్పటి జనరేషన్‌కి ఆమె గురించి పెద్దగా తెలియదు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా ఏ పాయింట్ తీసుకున్నా సరే అతిలోక సుందరి శ్రీదేవి ఫెర్ఫెక్ట్‌గా ఉండేది. తెలుగులో రెండు మూడు జనరేషన్ స్టార్ హీరోలతో నటించిన ఆమె.. 2018లో అనుకోని విధంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. అప్పటికే ఆమెకు ఓ కోరిక ఉండేది. ఇన్నాళ్లకు ఆ డ్రీమ్ ని ఆమె భర్త బోనీ కపూర్ తీర్చారు. 

ఏంటా కోరిక?
80ల్లో హీరోయిన్‌గా మంచి ఊపు మీదున్నప్పుడు శ్రీదేవి.. చెన్నైకి దగ్గర్లోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని బీచ్ దగ్గర ఐదు ఎకరాల ప్లేస్ కొనుగోలు చేసింది. అక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంది. చాలా ఆశపడింది. కానీ 2018లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు చనిపోయింది. దీంతో ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది.

(ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!)

ఇన్నాళ్లకు అలా
శ్రీదేవి చివరి కోరికను భర్త బోనీ కపూర్.. ఆమె చనిపోయిన ఐదేళ్లకు నెరవేర్చాడు. తాజ్ గ్రూప్ పార్ట్‌నర్‌షిప్‌తో అందమైన భవనం కట్టించారు. 'ఇది శ్రీదేవి కల. అది నెరవేర్చినందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్ పనులు చేశాం. ఫైనల్‌గా బీచ్ హౌస్‌ని పూర్తి చేశాం. చాలా ఆనందంగా ఉంది' అని బోనీ కపూర్ చెప్పారు.

తల్లిలా కూతురు
అయితే అమ్మ శ్రీదేవి అడుగుజాడల్లోనే కూతురు జాన్వీ కపూర్ వెళ్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'లో జాన్వీనే హీరోయిన్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం జాన్వీకి తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement