
ఒక సినిమా కోసం రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని అందరికీ తెలుసు. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు మూవీ కోసం ఆయన అందుకున్నారు. అప్పటికే అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌లో స్టార్ హీరో అయినప్పటికీ ఆ సమయంలో ఆయన రెమ్యునరేషన్ రూ.70 లక్షల లోపే ఉండేది. అయితే, చిరు తర్వాత ఈ మార్క్‌ను అందుకున్న భారతీయ తొలి హీరోయిన్ ఎవరు..? టాలీవుడ్‌లో కోటి రూపాయలు అందుకున్న తొలి నటి ఎవరో తెలుసుకుందాం.

తెలుగులో కోటీ అందుకున్న ఫస్ట్ హీరోయిన్
తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ముంబై బ్యూటీ ఇలియానా.. దేవదాసు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పోకిరితో స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు నిర్మాతల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో ముంబై హీరోయన్ అంటూ టాలీవుడ్‌లో డిమాండ్ గట్టిగానే ఉండటంతో ఇలియానా కోసం పోటీ మొదలైంది. పోకిరి తరువాత ఇలియానా చేసిన సినిమా ఖతర్నాక్ (2006). రవితేజతో ఆమె జోడీగా ఆమె చేసిన గ్లామర్‌కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా కోసం ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ రోజుల్లో ఒక హీరోయిన్‌కి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం అదే మొదటిసారి కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.

ఇండియాలో రూ. కోటి మ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కోటిరూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోనయిన్ శ్రీదేవి. 1993లో విడుదలైన 'రూప్ కి రాణి చోరోన్ కా రాజా' అనే హిందీ సినిమాకు ఆమె రూ. కోటి తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అప్పట్లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన హిందీ సినిమా ఇదే కావడం విశేషం. శ్రీదేవి, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, జానీ లివర్, జాకీ ష్రాఫ్ నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు.
ఈ సినిమాతో తొలి పాన్ ఇండియా స్టార్‌గా శ్రీదేవికి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ సినిమా ఇండస్ట్రీలను దశాబ్దం కాలం పాటు శ్రీదేవి ఏలారు. కానీ, అనూహ్యంగా తన 33 ఏళ్ల వయసులోనే (1997) సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయానికి ఆమె బోనీ కపూర్‌తో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత 2015లో పులి, 2017లో మామ్ చిత్రాలతో మళ్లీ తెరపై ఆమె కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment