Iliyana
-
తన బాయ్‌ఫ్రెండ్ ఫోటో రివీల్ చేసిన ఇలియానా
తన వయ్యారంతో అందరినీ ఆకట్టుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్లో 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన తొలి సినిమాతోనే గుర్తింపు పొంది.. యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్ తోనూ జతకట్టింది ఈ భామ. తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. కానీ అక్కడ అనుకున్నంతగా రానించలేకపోయింది. (ఇదీ చదవండి: నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?) ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. ఈ విషయంలో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో భారీ ట్రోలింగ్‌కు గురైంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఇలియానా తొలిసారిగా తన బాయ్‌ఫ్రెండ్ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటో అంత క్లారిటీగా లేదు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) తన వాల్లో ఇలా రాసుకొచ్చింది. 'ప్రెగ్నెన్సీ అనేది అతిపెద్ద వరం. నేను ఇప్పుడు మరింత అందంగా ఉన్నాను. నా బేబీ బంప్ చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. నా బేబీని త్వరలో కలుస్తాను. ఈ ప్రయాణంలో నా ప్రియమైన వ్యక్తి ఎంతో సహకరించాడు. నాకు సమస్యలు ఎదురైన ప్రతిసారి నా కన్నీళ్లు తుడిచాడు. రాయిలా నాకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించడం లేదు' అని ఇన్‌స్టాలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా ఎఫైర్లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. -
హీరోయిన్ తెల్లబుగ్గలే ఎందుకు అందంగా కనిపిస్తాయ్!
సాక్షి,ముంబై: కరోనా సంక్షోభం, లాక్ డౌన్ అనంతరం సినీ పరిశ్రమ క్రమంగా షూటింగ్ కార్యక్రమాలలో బిజీ అవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ విలక్షణ హీరో రణదీప్ హుడా, అందాల హీరోయిన్ ఇలియానా తొలిసారిగా జంటగా నటిస్తున్న 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' సినిమా త్వరలోనే పట్టాలెక్కేందుకు రడీ అవుతోంది. బల్విందర్ సింగ్ జంజువా దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. సందర్భంగా హీరో హీరోయిన్లు, ఇలియానా, రణదీప్ సోషల్ మీడియాలో లవ్లీ సంకేతాలందించారు. అందంగా ఉన్నవారంతా తెల్లగా ఉండరు.. తెల్లగా ఉన్నవారంతా అందంగా ఉండరు. అర్థంకాలేదా.. తన రాబోయే చిత్రంలో అర్థం అవుతుందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు చిత్ర హీరో రణదీప్. హీరోయిన్ తెల్లబుగ్గలే హీరోకు ఎందుకు అందంగా కనిపిస్తాయో ఎపుడైనా ఆలోచించారా? వెల్..అదంతా పాతమాట..ఇపుడు 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' అంటూ ఇల్లీ బేబి కమెంట్ చేశారు. చిత్రం బృందంతో రీయూనిట్ కావడం సంతోషంగా ఉందంటూ ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. వీరితోపాటు దర్శకుడు బల్విందర్ సింగ్ జంజువా కూడా సోషల్ మీడియాలో తమ మూవీ అప్ డేట్ ఇచ్చారు. ప్రేమించే వ్యక్తి కోసం ఎదురుచూస్తోంటే.. ప్రేమను మాత్రమే చూడండి.. ఫెయిర్‌నెస్ కోసం చూడటం పిచ్చితనమవుతుందని పోస్ట్ పెట్టారు. 2021లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీ హర్యానా నేపథ్యంలో తెరకెక్కనుందట. ప్రధానంగా సమాజంలో పాతుకుపోయిన వర్ణ వివక్షపై పోరాడే యువతిగా విభిన్నమైన పాత్రలో ఇలియానా కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీతో బిల్వేందర్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. శకుంతలా దేవీ బయోపిక్ తరువాత సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం. View this post on Instagram Har koi fair, lovely nahi hota, aur har koi lovely, fair nahi hota. Nahi samjhe? 😄 Sab samajh jaoge in my next #UnfairNLovely Really excited to be shooting this one with the beautiful @ileana_official and my superb director @balwindersinghjanjua @sonypicsprodns @sonypicturesin @movietunnelproductions @vivekkrishnani A post shared by Randeep Hooda (@randeephooda) on Oct 14, 2020 at 11:35pm PDT View this post on Instagram Kabhi socha hai ki hero ko hamesha heroine ke gore gore gaal hi kyun beautiful lagte hain? Well, yeh soch hui purani, it’s time to be #UnfairNLovely 😉 Super thrilled to reunite with @balwindersinghjanjua after #Mubarakan and work with the awesome @RandeepHooda @sonypicsprodns @sonypicturesin @movietunnelproductions @vivekkrishnani A post shared by Ileana D'Cruz (@ileana_official) on Oct 14, 2020 at 11:30pm PDT New Announcement Alert! We are extremely excited to present our humorous take on unfairness! 😉 Presenting @Ileana_Official & @RandeepHooda in the rib-tickling family entertainer that deals with India’s obsession with fair skin #UnfairNLovely@sonypicsindia @TunnelMovie pic.twitter.com/TGQb0PIKfN — SPN Productions (@sonypicsprodns) October 15, 2020 -
స్క్రీన్ ప్లే 22nd May 2108
-
ఓపెనింగ్ వసూళ్లలో చరిత్ర సృష్టించిన రెయిడ్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ తాజా సినిమా ‘రెయిడ్’ చరిత్ర సృష్టించింది. మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తూ.. మొదటి మూడు రోజుల్లోనే రూ.41 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 2018లో పద్మావత్ సినిమా తర్వాత అతి పెద్ద వీకెండ్ కలెక్షన్ల సినిమాగా చరిత్రకెక్కింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘రెయిడ్’... ఈ ఏడాది వీకెండ్ కలెక్షన్ల పరంగా రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచిందని ఫిలీం ట్రెడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది విడుదలయిన సినిమాల్లో రూ.114 కోట్ల వీకెండ్ కలెక్షన్లతో పద్మావత్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 41.01 కోట్లతో రెయిడ్ రెండో స్థానంలో ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. మొదటిరోజు కాస్త తడబడి రూ. 10.04 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిన ఈ సినిమా రెండోరోజు శనివారం రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. ఆదివారం ఒక్క రోజే రూ.17.11 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మూడు రోజుల్లో కలిపి రూ. 41.01కోట్లను రాబట్టింది. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌కు జోడీగా ఇలియానా నటించారు.1980ల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద ఆదాయ పన్ను దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి!
‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారు ఇలియానా. ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ ఉంటుంది. కానీ, సినిమా తారలకు వంట్లో ఓపిక, ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నంత కాలం సినిమాలు చేయొచ్చు. ఒకవేళ క్రేజ్ తగ్గి, బలవంతంగా రిటైర్ కావాల్సి వస్తే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్న ‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారుముందుంచితే - ‘‘సినిమాల్లోకి వచ్చేటప్పుడు మా అమ్మ ‘వృత్తిపై ఎక్కువగా మమకారం పెంచుకోవద్దు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం శ్రేయస్కరం’ అని చెప్పింది. ఆ మాటలు బాగా జీర్ణించుకున్నాను. ప్రతి సినిమాని ప్రేమించి చేస్తాను. కానీ, ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీని వదిలేయాల్సి వస్తే, హ్యాపీగా గుడ్‌బై చెప్పేస్తా. ఎందుకంటే, ‘మేం చూడలేకపోతున్నాం బాబూ’ అని ప్రేక్షకులు నెత్తీ నోరూ బాదుకునే లోపే సర్దుకుంటే మంచిది కదా. ఇక్కడ ఇంకో విషయం కూడ చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ఓ టైముంటుంది. ఆ టైమ్‌లో ఎవరు వద్దన్నా, కాదన్నా వెలుగులు విరజిమ్ముతారు. ఆ టైమ్ అయిన తర్వాత ఆ స్థానంలో ఇంకొకరు వస్తారు. ఈ మార్పుని ఆహ్వానించగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం’’ అని చెప్పారు. -
అది బాలీవుడ్!
హీరోయిన్స్‌కు టాలీవుడ్లో సాగినట్లు బాలీవుడ్లో సాగుతుందా? అంటే సాగదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ పరిస్థితులు వేరు. ఆ మార్కెట్ వేరు. ఈ మార్కెట్ వేరు. అలాగే అక్కడ మనుషులకు ఇక్కడ మనుషులకు కూడా తేడా ఉంటుంది. పరిస్థితులను బట్టే మనుషుల ప్రవర్తన కూడా ఉంటుంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడ బాగా సాగించుకున్న ఓ నాజూకు నడుం అమ్మడు బాలీవుడ్లో మాత్రం వారు చెప్పినట్లు వింటోంది. ఇలియానా దక్షిణ భారత సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగింది. ఇక్కడ నటించిన సినిమా ద్వారానే ఈ బ్యూటీకి బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. అంతే అక్కడకు చెక్కేసింది. ఇటువైపు చూడటమే మానివేసింది. ఇక్కడ కుదిరినట్లు అక్కడ కుదరదుకదా! అక్కడ కష్టాలు మొదలయ్యాయి. ఈ ముద్దుగుమ్మ ఇక్కడ చాలా ఫోజులు కొట్టింది. బాలీవుడ్లో మాత్రం మాట్లాడకుండా పని చేసుకుపోతోంది. ఇలియానా దక్షిణాది సినిమా రంగాన్ని పూర్తిగా వదిలివేసింది. ఇప్పుడు బాలీవుడ్‌పైనే దృష్టంతాపెట్టింది. ఇక్కడ నటించినప్పుడు సినిమా ప్రమోషన్ రావాలంటే సినిమా టీమ్‌ని ముప్పతిప్పలు పెట్టేది. నోరుపారేసుకుంటుందని చెబుతుంటారు. ఈ విషయాలలో ఈవిడగానికి ఇక్కడ పెద్దపేరే ఉంది. అంతేకాకుండా ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిందంటే ఇక అంతే. ఆ మూవీని పట్టించుకునేదిద కాదట ఈ ఇల్లీబేబి. ఆమె చేష్టలు, ప్రవర్తనతో విసిగిపోయిన మన నిర్మాతలు, హీరోలు సినిమా ఆఫర్లు ఇవ్వడం మానివేసినట్లు సమాచారం. బాలీవుడ్లో మాత్రం ఇలియానా ఆటలు సాగటంలేదు. ప్రస్తుతం మై తేరా హీరో అనే సినిమా ప్రమోషన్ కోసం ఈ రివట సుందరి దేశమంతా తిరుగుతోంది. హీరో వరుణ్ థావన్తో కలిసి ఇంటర్వూలు కూడా ఇస్తోంది. ఈ బొమ్మ ఏ వేషాలు వేసినా ఇక్కడైతే నడిచింది కానీ, బాలీవుడ్లో ప్రమోషన్స్‌కు డుమ్మా కొడితే అవకాశాలే గల్లంతవుతాయి. ఆ విషయం అమ్మడుకి తెలుసు. అందుకే ఈ ఇల్లీబేబీకి తిప్పలు తప్పటంలేదు. వదిలేయటానికి అది టాలీవుడ్ కాదు, బాలీవుడ్! వాళ్లు చెప్పినట్లు వినక తప్పదు.