Ileana Shares First Romantic Pic With Her Boyfriend, Calls Him My Rock Goes Viral - Sakshi
Sakshi News home page

Ileana With Her Boyfriend: ఇలియానాపై ట్రోల్స్‌.. అతని ఫోటో రివీల్‌

Published Sat, Jun 10 2023 3:11 PM | Last Updated on Sat, Jun 10 2023 4:02 PM

Ileana Shares First Romantic Pic With Boyfriend - Sakshi

తన వయ్యారంతో అందరినీ ఆకట్టుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్‌లో 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన తొలి సినిమాతోనే గుర్తింపు పొంది.. యూత్‌ క్రష్‌గా మారింది. కెరీర్‌ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. స్టార్‌ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌ తోనూ జతకట్టింది ఈ భామ.  తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. కానీ అక్కడ అనుకున్నంతగా రానించలేకపోయింది. 

(ఇదీ చదవండి: నిన్న తిరుమల, నేడు గురుద్వార్‌.. మీరు మారరా?)

ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. ఈ విషయంలో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు.  ఇప్పటి వరకు ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గురించి ఎలాంటి వివ‌రాలు వెల్లడించలేదు. దీంతో భారీ ట్రోలింగ్‌కు గురైంది.  పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఇలియానా తొలిసారిగా త‌న బాయ్‌ఫ్రెండ్‌ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. కానీ ఆ ఫోటో అంత క్లారిటీగా లేదు.  

(ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్‌ హీరోయిన్‌)

తన వాల్‌లో ఇలా రాసుకొచ్చింది.  'ప్రెగ్నెన్సీ అనేది  అతిపెద్ద వరం. నేను ఇప్పుడు మరింత అందంగా ఉన్నాను. నా బేబీ బంప్‌ చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. నా బేబీని త్వరలో కలుస్తాను. ఈ ప్రయాణంలో నా ప్రియమైన వ్యక్తి ఎంతో సహకరించాడు. నాకు సమస్యలు ఎదురైన ప్రతిసారి నా కన్నీళ్లు తుడిచాడు. రాయిలా నాకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించడం లేదు' అని ఇన్‌స్టాలో తెలిపింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా ఎఫైర్‌లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement