Reavealed
-
ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో ఉంటున్న తమన్నా.. తాజాగా వాటికి ఫుల్స్టాప్ పెట్టింది. ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ నిజమేనని ఒప్పుకుంది. వారిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో ప్రేమ కథ ప్రారంభమైందని ఆమె వెల్లడించింది. తమన్నా, విజయ్ కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. (ఇదీ చదవండి: ధనుష్‌కు షాక్ ఇచ్చిన కంగనా రనౌత్?) ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా అన్నారు. ' సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడుతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్ బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం' అని చెప్పింది. దీంతో అన్నీ అనుకూలిస్తే త్వరలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) (ఇదీ చదవండి: బాలీవుడ్లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్) -
సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్
టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ బాబు '1: నేనొక్కడినే' సినిమాతో వెండితెరమీదకొచ్చి బాలీవుడ్లో దూసుకుపోతోంది కృతి సనన్. రామాయణం నేపథ్యంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’లో సీతగా రానుంది. రాముడిగా ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు మేకర్స్. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా సీతగా తననే ఎందుకు ఎంపిక చేశారో కృతి సనన్ తెలిపింది. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) ''ఆదిపురుష్’లో ఛాన్స్ రావడం నా అదృం.. నా హైట్ ఎక్కువగా ఉండటం వల్ల గతంలో చాలా అఫర్లు వచ్చినట్లే వచ్చి, పోయాయి. కానీ ఆదిపురుష్ విషయంలో హైటే నాకు ప్లస్ అయింది. ప్రభాస్ మంచి ఎత్తు ఉన్న హీరో.. కాబట్టి నేను అయితేనే ఆయన పక్కన సెట్ అవుతానని మేకర్స్ సంప్రదించారు. సీతగా నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది'. అని తెలిపింది. మొత్తానికి హైట్ కారణంగానే సీత పాత్ర కోసం తనను ఎంచుకున్నారని కృతి సనన్ వెల్లడించింది. దీంతో నెట్టింట్ట ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కృతి సనన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ సినిమాతో తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'తమన్‌పై ట్రోల్స్.. భార్యగా బాధగానే ఉంటుంది') -
తన బాయ్‌ఫ్రెండ్ ఫోటో రివీల్ చేసిన ఇలియానా
తన వయ్యారంతో అందరినీ ఆకట్టుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్లో 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన తొలి సినిమాతోనే గుర్తింపు పొంది.. యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్ తోనూ జతకట్టింది ఈ భామ. తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. కానీ అక్కడ అనుకున్నంతగా రానించలేకపోయింది. (ఇదీ చదవండి: నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?) ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. ఈ విషయంలో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో భారీ ట్రోలింగ్‌కు గురైంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఇలియానా తొలిసారిగా తన బాయ్‌ఫ్రెండ్ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటో అంత క్లారిటీగా లేదు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) తన వాల్లో ఇలా రాసుకొచ్చింది. 'ప్రెగ్నెన్సీ అనేది అతిపెద్ద వరం. నేను ఇప్పుడు మరింత అందంగా ఉన్నాను. నా బేబీ బంప్ చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. నా బేబీని త్వరలో కలుస్తాను. ఈ ప్రయాణంలో నా ప్రియమైన వ్యక్తి ఎంతో సహకరించాడు. నాకు సమస్యలు ఎదురైన ప్రతిసారి నా కన్నీళ్లు తుడిచాడు. రాయిలా నాకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించడం లేదు' అని ఇన్‌స్టాలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా ఎఫైర్లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. -
పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను గతేడాది జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వారి పిల్లల ఫోటోలను కూడా ఆయన మొదటిసారి షేర్ చేశాడు. ఆ ఫోటోలలో, నయనతార తన బిడ్డలను పట్టుకుని ప్రకాశవంతమైన చిరునవ్వులతో కనిపిస్తుంది. ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అప్పుడు మా కాలికి నమస్కరించేవాళ్లు, ఇప్పుడేమో హగ్గులు, ముద్దులు: నటి) నయనతార గురించి విఘ్నేశ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు. 'నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం. నా పనిలో భాగంగా ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత నిన్నూ (నయన్), పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. కుటుంబం ఇచ్చే బలం ఎవరూ ఇవ్వలేరు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తాను' అని భావోద్వేగానికి లోనయ్యాడు. గత అక్టోబరులో అద్దె గర్భం ద్వారా ఈ జంట ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!) -
చివరి రోజుల్లో లాడెన్ పట్టుబడతానని భయపడ్డాడా?
వాషింగ్టన్: ఉగ్రవాదానికి చిరునామాగా నిలిచి... ప్రపంచదేశాల్లో అనేక దాడులు చేసిన మహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ తాను స్థాపించి, నడిపిన సంస్థ ఆల్-ఖైదాను ముందుకు తీసుకువెళ్లడానికి , పరిపాలించడానికి చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ? తన భార్య వద్దే ట్రాకింగ్ కు సంబంధించిన వస్తువు ఉందని భయపడ్డాడా ? అవుననే సమాధానం. 2011లో పాకిస్తాన్ లో దాక్కున్న లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను అమెరికన్ నేవీ స్వాధీనం చేసుకుంది. వాటిలో లాడెన్ ఉత్తరప్రత్యురాలు జరిపిన కొన్ని పత్రాలను నేవీ మంగళవారం విడుదల చేసింది. లేఖల్లోని అంశాలు : సూడన్ దేశంలో తనకు దాదాపు 29 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయని ఒక వేళ తాను మరణిస్తే ఆ డబ్బును జీహాద్ కోసం వినియోగించాలని లాడెన్ లేఖలో పేర్కొన్నాడు. తన చివరిరోజుల్లో అమెరికా డ్రోన్ ఆల్-ఖైదా స్థావరాలపై దాడి చేసిన తర్వాత నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాడని ఒక ఉత్తరంలో ఉంది. తన నివాసాన్ని ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కడ భద్రతా దళాలు పసిగడతాయోనని , తన భార్య పంటికి శస్త్రచికిత్స చేసిన ఇరానీయన్ డాక్టర్ పంటిలో ఏదైనా ట్రాకింగ్ పరికరం అమర్చారేమోనని వెతికినట్టు మరో ఉత్తరంలో ఉంది. ఎక్కవ కాలం ట్రాకింగ్ గురించి భయపడినట్లు తెలిపే మరో సంఘటన జిహాద్ అవసరాల కోసం తరలిస్తున్న డబ్బు సూట్ కేసుల్లో ట్రాకింగ్ పరికరాలు ఉండే అవకాశం ఉందని లాడెన్ అనుమానించే వాడు. జీపీఎస్ పరికరంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ను తీసుకుని వస్తానని చెప్పిన ఖతార్ కు చెందిన వ్యక్తి తనకు షుగర్ ఉందని డాక్టరు వద్దకు వెళ్లాలని చెప్పి రాకుండా వెళ్లిపోవడం లాడెన్ కు తీవ్రఅనుమానంగా తోచింది.