వాషింగ్టన్: ఉగ్రవాదానికి చిరునామాగా నిలిచి... ప్రపంచదేశాల్లో అనేక దాడులు చేసిన మహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ తాను స్థాపించి, నడిపిన సంస్థ ఆల్-ఖైదాను ముందుకు తీసుకువెళ్లడానికి , పరిపాలించడానికి చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ? తన భార్య వద్దే ట్రాకింగ్ కు సంబంధించిన వస్తువు ఉందని భయపడ్డాడా ? అవుననే సమాధానం.
2011లో పాకిస్తాన్ లో దాక్కున్న లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను అమెరికన్ నేవీ స్వాధీనం చేసుకుంది. వాటిలో లాడెన్ ఉత్తరప్రత్యురాలు జరిపిన కొన్ని పత్రాలను నేవీ మంగళవారం విడుదల చేసింది.
లేఖల్లోని అంశాలు :
సూడన్ దేశంలో తనకు దాదాపు 29 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయని ఒక వేళ తాను మరణిస్తే ఆ డబ్బును జీహాద్ కోసం వినియోగించాలని లాడెన్ లేఖలో పేర్కొన్నాడు.
తన చివరిరోజుల్లో అమెరికా డ్రోన్ ఆల్-ఖైదా స్థావరాలపై దాడి చేసిన తర్వాత నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాడని ఒక ఉత్తరంలో ఉంది.
తన నివాసాన్ని ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కడ భద్రతా దళాలు పసిగడతాయోనని , తన భార్య పంటికి శస్త్రచికిత్స చేసిన ఇరానీయన్ డాక్టర్ పంటిలో ఏదైనా ట్రాకింగ్ పరికరం అమర్చారేమోనని వెతికినట్టు మరో ఉత్తరంలో ఉంది.
ఎక్కవ కాలం ట్రాకింగ్ గురించి భయపడినట్లు తెలిపే మరో సంఘటన జిహాద్ అవసరాల కోసం తరలిస్తున్న డబ్బు సూట్ కేసుల్లో ట్రాకింగ్ పరికరాలు ఉండే అవకాశం ఉందని లాడెన్ అనుమానించే వాడు.
జీపీఎస్ పరికరంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ను తీసుకుని వస్తానని చెప్పిన ఖతార్ కు చెందిన వ్యక్తి తనకు షుగర్ ఉందని డాక్టరు వద్దకు వెళ్లాలని చెప్పి రాకుండా వెళ్లిపోవడం లాడెన్ కు తీవ్రఅనుమానంగా తోచింది.