Osama Bin Laden
-
పాక్‌లో లాడెన్ సన్నిహితుడి అరెస్ట్
లాహోర్: అల్ ఖైదా సీనియర్ నేత, ఒసా మా బిన్ లాడెన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న అమీనుల్ హక్‌ను పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అరెస్ట్ చేసింది. దేశంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగామని ఉగ్రవాద వ్యతిరేక విభాగం డీఐజీ ఉస్మాన్ అక్రమ్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాత్ జిల్లా సరాయ్ ఆలంగిర్ పట్టణంలో దాగున్న అతడిని పట్టుకున్నట్లు అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. -
21 ఏళ్ల తర్వాత.. లాడెన్ లేఖ వైరల్
లండన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తీవ్రరూపం దాలి్చన వేళ.. ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మరోసారి జనం స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. 2001లో అమెరికాపై అనూహ్య రీతిలో ఉగ్రదాడులు జరిపి ప్రపంచ దేశాలకు షాకిచి్చన బిన్ లాడెన్.. ఆ తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి రాసిన రెండు పేజీల లేఖ టిక్–టాక్‌లో వైరల్‌గా మారడం గమనార్హం. ఒసామా లేఖకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. పాలస్తీనాను ఆక్రమించి అణచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కూడా 9/11 దాడులకు ఓ కారణమని అందులో లాడెన్ సమరి్థంచుకున్నాడు. ‘‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. అమెరికా అధ్యక్షులెవరూ పట్టించుకోలేదు. పాలస్తీనా ఎప్పటికీ ఆక్రమణలోనే ఉండిపోదు. సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయతి్నస్తాం. అమెరికా అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదు’అని లాడెన్ హెచ్చరించాడు. -
ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..
ఉత్తర ప్రదేశ్‌లోని ఒక వ్యక్తి తన కార్యాలయంలో ఉగ్రవాది ఒసామా డిన్ లాడెన్ పోస్టర్లు ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(యూపీపీసీఎల్) రవీంద్ర ప్రకాష్ గౌతమ్ అనే సబ్ డివిజనల్ అధికారి తన కార్యాలయంలో ఒసామాబిన్ లాడెన్ పోస్టర్లను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యూపీపీసీఎల్ చైర్మన్ ఎం దేవరాజ్ సీరియస్ అవ్వడమే గాక సదరు అధికారి గౌతమ్‌ని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన 2022 జూన్‌లో ఫరుఖాబాద్ జిల్లాలోని కయామ్ గంజ్ సబ్‌డివిజన్ 2కి పోస్టింగ్ పై వచ్చాడు. అప్పుడే ఈ పోస్టర్లు ఉంచినట్లు సమాచారం. ఐతే విచారణలో.. గౌతమ్ లాడెన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినందువల్లే అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతనిపై అభిమానంతో లాడెన్ ఫోటోలు కార్యాలయంలో ఉంచేవాడని చెప్పారు. దీంతో అతన్ని సర్వస్ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..) -
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్‌ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్‌లాడెన్‌ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్‌ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్‌గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్ అల్ అడెల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్‌లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్‌మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
ప్రభుత్వ ఆఫీసులో బిన్ లాడెన్ ఫొటో కలకలం.. ఎక్కడో తెలుసా..?
ఒసామా బిన్ లాడెన్.. ఈ ఉగ్రవాది పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద దాడికి పాల్పడిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అధినేత లాడెన్. ఈ దాడి తర్వాత అతడిని హతమార్చడానికి అమెరికాకు పదేళ్లు పట్టింది. ఎంతో కష్టపడి అమెరికా దళాలు లాడెన్‌ను మట్టుబెట్టాయి. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయలంలో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టడం అంతేకాకుండా లాడెన్‌ను ప్రపంచ అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్‌గా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూపీలోని దక్షిణాంచల్ విద్యుత్ విత్రాన్ నిగమ్ లిమిటెడ్ (DVVNL)లో సబ్-డివిజినల్ ఆఫీసర్ (SDO)గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్.. ఒసామా బిన్ లాడెన్ ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీర్ అంటూ ప్రశంసించాడు. ఆ ఫొటోలో ‘గౌరవనీయులైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజినీర్’ అంఊ రాసుకొచ్చాడు. ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి యూపీలోని ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు అధికారి రవీంద్రను సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేశారు. కానీ, రవీంద్ర ప్రకాశ్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. బిన్ లాడెన్ కాపీలు తన వద్ద ఇంకా చాలానే ఉన్నాయని తెలిపారు. Picture of Osama Bin Laden in the office of power department SDO in UP's Farrukhabad district. "World's best junior engineer" is the title bestowed to him. Sources claim the photo has now been removed after the matter surfaced in media. pic.twitter.com/atae0kQbGF — Piyush Rai (@Benarasiyaa) June 1, 2022 -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
నోరు జారిన ఇమ్రాన్ ఖాన్, వెనకేసుకొచ్చిన..
ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రతీ అంశానికి భారత్‌ను ముడిపెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అయితే కిందటి ఏడాది పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ) సాక్షిగా ఇమ్రాన్ చేసిన సీరియస్ కామెంట్లు.. ఇప్పుడు తెరపైకి వచ్చి దుమారం రేపుతున్నాయి. ఉగ్రసంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరున్న ఒసామా బిన్ లాడెన్‌ను ‘అమరవీరుడి’గా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇమ్రాన్‌ను వెనకేసుకొస్తున్నారు అక్కడి మంత్రులు. ఇస్లామాబాద్: ‘‘పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా దళాలు ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టాయి. అబ్బొట్టాబాద్ లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి. దీంతో లాడెన్ అమరుడయ్యాడు. ఆ సందర్భంలో మన దేశం చాలా ఇబ్బంది పడింద’’ని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసగించాడు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇమ్రాన్‌ఖాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇమ్రాన్ కామెంట్లపై పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వివరణిచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున నోరుజారి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని ఫవాద్ స్పష్టం చేశాడు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను వంకర కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. పాక్ మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డాడు. ఇంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఖురేషీ కూడా.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భోచితమైనవని చెప్పాడు. అమెరికా భద్రతా దళాలకు భయపడి బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్‌ను మట్టుపెట్టాయి. బాలీవుడ్‌ను కాపీ కొట్టకండి ఇదిలా ఉంటే బాలీవుడ్‌ను కాపీ కొట్టొద్దంటూ పాక్ ఫిల్మ్మేకర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సినిమా.. బాలీవుడ్ వల్ల బాగా ప్రభావితం అయ్యిందని వ్యాఖ్యానించాడు. పాక్ సినిమా అక్కడి(భారత్) కల్చర్‌ను చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్‌ను ప్రోత్సహించడమే అవుతుంది. ఇక్కడి నేటివిటీని చూపించే ప్రయత్నం చేయండి. సినిమాలు పోతాయని భయపడకండి. ఓటమికి భయపడితే గెలవలేం. నా స్వానుభవంతో చెప్తున్నా’ ఫిల్మ్ మేకర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. చదవండి: హిందీ హీరోయిన్‌తో ఇమ్రాన్ ఖాన్ చెట్టాపట్టాల్ -
వయసు 75 ఏళ్లు.. 80 మంది ప్రాణాలు తీసింది
కంపాలా(ఉగాండా): ఒకప్పుడు అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే పాశ్చాత్య దేశాలు, అమెరికాకు వెన్నులో వణుకు పుట్టేది. అయితే ఉగాండాలోని విక్టోరియా సరస్సులో ఉండే ఒసామా బిన్ లాడెన్ అనే ఓ మొసలి(75) అక్కడి పిల్లలకు, పెద్దలకు దశాబ్దాలపాటు వెన్నులో వణుకు పుట్టించింది. ఒసామా 1991 నుంచి 2005 మధ్య కాలంలో దాదాపు 16 భారీ సరిసృపాలను తినేసింది. అంతేకాకుండా లుగాంగా అనే గ్రామంలోని జనాభాలో పదోవంతు మంది కనిపించకుండా పోయారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఒసామా ఇప్పటివరకు గ్రామంలోని 80 మందికి పైగా స్థానికులను పొట్టన బెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫిషింగ్ బోట్ల క్రింద దాక్కుని సరస్సులో నీటి కోసం వచ్చే పిల్లలను పట్టుకునేదని స్థానికుల కథనం. ఇక మత్స్యకారులు వేటకు బయలు దేరినప్పుడు వారిపై దాడి చేసి చంపేసేది. భయానక ఘటన: పాల్ కైవాల్యాంగా మాట్లాడుతూ.. “మేము చేపలు పడుతున్నాం. అయితే ఓ రోజు ఒసామా నీటిలో నుంచి పడవలో దూకింది. దాంతో నేను కూర్చున్న పడవ వెనుక భాగం మునిగిపోయింది. ఆ భయంకరమైన మొసలి నా తమ్ముడు పీటర్ కాళ్లను పట్టుకుని నీటిలోకి ఈడ్చుకుపోయింది. పీటర్ అరుస్తూ ఐదు నిమిషాల పాటు దానితో పోరాడాడు. అతన్ని కాపాడటానికి నేను ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత అతని తల, చెయ్యి నీటిలో తేలుతూ కనిపించాయి.’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా గ్రామస్తులు 2005లో అధికారులను సహాయం కోరారు. 50 మంది స్థానిక పురుషులు, వన్యప్రాణి అధికారుల సహాయంతో ఆ భారీ మొసలిని పట్టుకున్నారు. ఇంకా ఉంది: అయితే ఒసామా కథ అక్కడితో ముగిసిపోలేదు. గ్రామస్తులు ఆ మొసలిని వెంటనే చంపాలని అనుకున్నారు. కానీ ఉగాండాలో దీనికి అనుమతి లేదు. ఒసామాకు కూడా జీవించే హక్కు ఉందని, శిక్షగా చంపలేమని అధికారులు తెలిపారు. చంపకుండా ఈ మొసలిని ఉగాండాలోని మొసళ్ల పెంపకం కేంద్రానికి ఇచ్చారు. ఈ మొసలి ద్వారా కలిగే సంతానం తోలుతో హ్యాండ్‌బ్యాగులు తయారు చేసి ఇటలీ, దక్షిణ కొరియాకు ఎగుమతి చేయవచ్చని భావించారు. కాగా ఒసామా వచ్చినప్పటి నుంచి ఈ సంతానోత్పత్తి కేంద్రం పర్యాటకులతో రద్దీగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం 5000 మొసళ్ల దాకా ఉన్నాయి. చదవండి: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది -
నవాజ్ షరీఫ్‌కు బిన్ లాడెన్ ఆర్థిక సాయం
ఇస్లామాబాద్: అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆర్థిక సాయం అందిస్తుండేవాడని అమెరికాలో పాక్ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్ తాజాగా బయటపెట్టారు. ఆమె గతంలో నవాజ్ షరీఫ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ‘‘అవును, లాడెన్ ఒక విషయంలో నవాజ్ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్ షరీఫ్‌కు లాడెన్ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడు’’ అని సయీద్ అబిదా హుస్సేన్ ప్రైవేట్ న్యూస్ చానెల్ జీయో టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ బృందం 2011 మేలో పాకిస్తాన్ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. -
విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..
వాషింగ్టన్ : అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై (2001 సెప్టెంబరు 11) బీన్ లాడెన్ టీమ్ జరిపిన ఉగ్ర దాడులు చరిత్ర మరవలేదు. ఉగ్రవాదలు సృష్టించిన రక్తపాతానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఆల్‌ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. 9/11 దాడులు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. వేలమంది అమాయక పౌరులను పొట్టనపెట్టకుంది. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు తర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు ముగిసింది. ఈ సందర్భంగా అమెరికాలో 9/11 మృతులకు నివాళి అర్పించారు. ఏం జరిగింది.. ఆ రోజు ఉదయం 10 మంది ఆల్‌ఖైదా తీవ్రవాదులు.. వాణిజ్య సేవలందించే నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించారు. హైజాకర్లు రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)కు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. ఈ ఘటనతో వేలమంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి ఘటనలో ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు. రెండు సౌధాలు(భవనాలు) అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు ధ్వంసం అవడం, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన దాడుల్లో దుర్మరణం పాలైన 2,752 మంది బాధితుల్లో 343 మంది అగ్నిమాపకదళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం మరియు పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు.. ఇక మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు మరియు విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. విమానాల్లో ప్రయాణించిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు నివేదించాయి. తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించడం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రతిస్పందించింది. అల్‌ఖైదా తీవ్రవాదులకు సాయం చేసే తాలిబన్లను తుదముట్టించే విధంగా ఆఫ్గనిస్తాన్‌పై దండెత్తింది. అంతేకాక ఉగ్రవాదాన్ని ఏరివేతకు కఠిన చట్టాన్ని అమలుచేసింది. పలు ఇతర దేశాలు కూడా వాటి తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని బలోపేతం చేసుకోవడం మరియు చట్టం యొక్క అమలు అధికారాలను విస్తరించుకున్నాయి. కొన్ని అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు దాడుల నేపథ్యంలో వారంలోని మిగిలిన రోజుల్లో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయి. ఫలితంగా తిరిగి ప్రారంభించే సమయానికి తీవ్ర నష్టాలను చవిచూశాయి. బిలియన్ల డాలర్లు విలువ చేసే కార్యాలయ ప్రాంతం ధ్వంసమవడం ద్వారా లోయర్ మన్‌హట్టన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. చదవండి: 9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు తెర వెనుక ఇంత జరిగిందా.. సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్ మరియు అల్‌ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు బిన్ లాడెన్ 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది. డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా యూఎస్ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా రక్షణ శాఖ ఎంతో శక్తివంతమైనది, సీఐఏ ఎంతో ముందుచూపు కలిగి ఉన్నదైనప్పటికీ ఆల్‌ఖైదా టీమ్ పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన దాడులు జరపగలిగింది. ప్రపంచ దేశాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
ట్రంప్ ఓడిపోతే, 9/11 తరహా దాడి!
వాషింగ్టన్ : నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున రెండోసారి అధ్యక్ష పదవికి నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై 9/11 దాడుల తరహా సూత్రధారి, దివంగత ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ మేనకోడలు నూర్ బిన్‌లాడెన్ మద్దతుగా నిలిచారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దేశాన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుండి రక్షించగలరని, ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలవాలని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నూర్ బిన్ లాడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ప్రమాదమని, ట్రంప్ గెలిస్తేనే మరోసారి భయంకరమైన 9/11 తరహా దాడులు జరగకుండా అడ్డుకోగలరన్నారు. అమెరికా మాజీ అధ్యక్షడు ఒబామా, వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బాగా విస్తరించిందని ఆరోపించిన ఆమె బైడెన్ అధ్యక్షుడైతే అమెరికాకు ప్రమాదమని హెచ్చరించారు. అంతేకాదు బైడెన్ గెలిస్తే 9/11 తరహా దాడి మరొకటి అమెరికాపై జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షవాదులు ఎప్పుడూ రాడికలిజంతో పొత్తు పెట్టుకున్నారని నూర్ ఆరోపించారు. ట్రంప్ తన హయాంలో ఉగ్రవాదులను నిర్మూలించడంద్వారా అమెరికాను భయంకరమైన ఉగ్రదాడుల నుంచి కాపాడారని నూర్ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తల్లితో కలసి మూడేళ్ల వయస్సు నుంచి అనేకమార్లు అమెరికాకు వెళ్లానన్నారు. 2015లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీకి నిలిచినప్పటినుంచి ఆయనకు తాను ఫ్యాన్ అయిపోయానని, ఇపుడు కూడా ట్రంప్‌ను కచ్చితంగా ఎన్నుకోవాలన్నారు. తద్వారా అమెరికాకు మాత్రమే కాదు, మొత్తం పాశ్చాత్య నాగరికత భవిష్యత్తుకు చాలాముఖ్యమైనదన్నారు. సెప్టెంబర్ 11 దాడుల 19వ వార్షికోత్సవానికి ముందు ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా పెన్సిల్వేనియాలో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీపడుతున్న జో బైడెన్ పాల్గొననున్నారు. -
‘పోలో’కు ఢిల్లీ మెట్రోలో తొలి పోస్టింగ్..
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేవారు స్థానిక స్టేషన్లలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం ‘పోలో’ను కలవవచ్చు. ప్రత్యేక శిక్షణ నైపుణ్యాలు కలిగిన చురుకైన పోలోకు ఢిల్లీ మెట్రో స్టేషన్లలో తొలి పోస్టింగ్ లభించింది. ఇది స్థానిక స్టేషన్లలో భదత్రా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి విధులు నిర్వహించనున్నది. (7 న మెట్రో పునఃప్రారంభం, చర్యలివే!) కాగా అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టడంలో ఈ జాతికి చెందిన శునకం ‘కైరో’ ప్రముఖ పాత్ర పోషించింది. అప్పటి నుంచి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇది ఏకధాటిగా 40 కిలోమీటర్లు పరిగెత్తగలదని శిక్షకులు తెలిపారు. వాసన పసిగట్టడం, దాడి చేయడం, కాపలాకాయడం వంటి మూడు విధులు నిర్వహించడం దీని ప్రత్యేకత. మిగతా జాతి కుక్కలైన జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ వంటివి ఏకధాటిగా 4 నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయని, అవి ఒక టాస్క్‌ను మాత్రమే చేస్తాయని చెప్పారు. చురుకైన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్కను దేశ రాజధానిలో విధుల్లో నియమించడం ఇదే తొలిసారి. ఇక నుంచి ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలలో ఇది కనిపించనున్నది. -
లాడనే మా హీరో: పాక్ మాజీ అధ్యక్షుడు
ఇస్లామాబాద్ : కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తమ హీరో అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ముషార్రఫ్ బహిర్గతం చేశారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్ హీరోలంటూ కొనియాడారు. ఈ మేరకు ముషారప్ వ్యాఖ్యానించినట్లుగా పాక్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. పాకిస్తాన్‌కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ముషారఫ్ అన్నారు. Gen Musharraf blurts that militants were nurtured and touted as 'heroes' to fight in Kashmir. If it resulted in destruction of two generations of Pashtuns it didn't matter. Is it wrong to demand Truth Commission to find who devised self serving policies that destroyed Pashtuns? https://t.co/5Q2LOvl3yb — Farhatullah Babar (@FarhatullahB) November 13, 2019 ‘ప్రపంచంలోని ముజాహిద్దీన్ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్‌కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్‌లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్ వ్యాఖ్యానించారు. -
ఎట్టకేలకు ఇండియా 'బిన్ లాడెన్' పట్టివేత
గౌహతి: వేలాది మంది ప్రాణాలు తీసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అసోంలోని ‘ఒసామా బిన్ లాడెన్’ను కూడా ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. అసోంలో లాడెన్ ఏంటి అనుకుంటున్నారా?.. గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు తీసుకున్న ఓ ఏనుగుకు అక్కడి ప్రజలు 'ఒసామా బిన్ లాడెన్' అని పేరు పెట్టారు. గత అక్టోబర్‌లో అసోంలోని గోల్పారా జిల్లాలో ఈ ఏనుగు ఐదుగురు గ్రామస్తులను చంపింది. ఈ ‘లాడెన్’ను పట్టుకునేందుకు అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఎట్టకేలకు ఈ ఏనుగు పట్టుబడిందని అసోం జిల్లా ఉన్నతాధికారులు తాజాగా తెలిపారు. దీనిని పట్టుకోవడానికి డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి చాలా రోజుల పాటు అడవిలో అటవీశాఖ అధికారులు ట్రాక్ చేశారు. నిపుణులైన షూటర్లు, బాణాలతో మత్తు మందిచ్చి పట్టుకున్నామని అటవీశాఖ అధికారి తెలిపారు. ఇప్పుడు ‘లాడెన్’ ఏనుగును సమీపంలో మానవ నివాసాలు లేని అడవికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో 24గంటల వ్యవధిలో లాడెన్ ఏనుగు గోల్పారా జిల్లాలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని చంపింది. అటవీ శాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2,300 మంది ప్రాణాలు కోల్పోగా.. 2011 నుంచి ఇప్పటివరకు 700 ఏనుగులు చంపివేయబడ్డాయి. -
అవును.. ఆయన చనిపోయింది నిజమే : ట్రంప్
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా బిన్ లాడెన్ (30) మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు నోరు విప్పారు. హమ్జా హతమైందని నిజమేనని చెప్పారు. ఉగ్ర నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అమెరికా సేనలు జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గానిస్తాన్/పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో హమ్జా మృతి చెందినట్టు వైట్‌హౌజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. హమ్జా మృతి చెందినట్టు గత నెలలోనే వార్తలు వెలువడ్డాయి. దీని వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే, ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు అధ్యక్షుడు ట్రంప్ అప్పట్లో నిరాకరించారు. (చదవండి : మమ్మల్ని చాలా సార్లు బెదిరించాడు: ట్రంప్) ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7కోట్లు) ఇస్తామని అమెరికా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి : బిన్ లాడెన్ కుమారుడు హతం!) (చదవండి : విషాద జ్ఞాపకానికి 18 ఏళ్లు..) -
‘అతడు చాలా నీచంగా మాట్లాడేవాడు’
వాషింగ్టన్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా లాడెన్ హతమైనట్లు అమెరికా మీడియా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శ్వేతసౌధ వర్గాలు ఈ విషయంపై నోరు మెదపలేదు. దీంతో హంజా హతం వెనుక అమెరికా హస్తం ఉందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ...హంజా ఎన్నోసార్లు తమ దేశం గురించి చాలా నీచంగా మాట్లాడేవాడని అన్నారు. అదే విధంగా అగ్రరాజ్యం అంతుచూస్తానంటూ బెదిరించేవాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతానికి హంజా మృతి విషయమై మాత్రం తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. కాగా హంజా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్బీసీ న్యూస్ చానల్, న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాలు వెలువరించాయి. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్ అధికారులు తెలిపినట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హంజా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బిన్ లాడెన్ కుమారుడు హతం!
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. దీని వెనుక అమెరికా హస్తం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హమ్జా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పింది. ఎన్బీసీ కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంగీకరించలేదు.. కనీసం ఖండిం చనూ లేదు. అల్‌కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్బీసీ, న్యూయార్క్ టైమ్స్ కథనాలను బట్టి తెలుస్తోంది. లాడెన్ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్ మూడో భార్య కొడుకు. కాగా, హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు. జిహాద్‌కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. తన తండ్రి లాడెన్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేవాడు. హమ్జా ఎక్కడున్నాడనే విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్లో గృహనిర్బంధంలో ఉన్నాడని, అఫ్గానిస్తాన్‌లో ఉన్నాడని, పాకిస్తాన్, సిరియాలో తలదాచుకునే వాడని భావిస్తూ ఉండేవారు. లాడెన్‌ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్‌కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. -
బిన్ లాడెన్ కుమారుడు హిమ్జా బిల్ లాడెన్ మృతి
-
బిన్ లాడెన్ కొడుకు హంజా మృతి!
వాషింగ్టన్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్బీసీ న్యూస్ సంచలన వార్త వెలువరించింది. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్ అధికారులు తెలిపినట్లు సదరు ఛానల్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గానీ, శ్వేతసౌధ వర్గాలు గానీ హంజా మరణాన్ని ధ్రువీకరించలేదు. కాగా పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన తర్వాతే హంజా మరణవార్త నిజమా కాదా అన్న అనుమానాలు తేటతెల్లమవనున్నాయి. -
‘మేమిచ్చిన సమాచారంతోనే లాడెన్ హతం’
వాషింగ్టన్: కరుడుకట్టిన ఉగ్రవాది, ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిల్ లాడెన్‌ను అంతమొందించడంలో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీకి (సీఐఏ) పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సాయం చేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెల్లడించారు. లాడెన్‌ను పట్టుకోవడంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. లాడెన్ ఎక్కడున్నాడనే సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించిందన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ వాషింగ్టన్‌లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాడెన్‌ను చంపేంత వరకు ఆయన తమ దేశంలో ఉన్నాడనే విషయం తెలియదని ఇప్పటిదాకా పాక్ వాదించిన నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాను తామెప్పుడూ మిత్ర దేశంగానే భావించామని.. అందుకే లాడెన్‌కు సంబంధించిన సమాచారం అందించామని చెప్పారు. అమెరికా మాత్రం తమ దేశంపై నమ్మకం ఉంచలేకపోయిందని వ్యాఖ్యానించారు. -
లాడెన్ హత్యా..గుడ్‌న్యూస్!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు అంతమొందించాయనే వార్త వినగానే అప్పటి పాక్ అధ్యక్షుడు జర్దారీ సంతోషం వ్యక్తం చేశారట! అది ‘గుడ్ న్యూస్’అన్నారట! అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు సహాయకుడిగా పనిచేసిన బెన్ రోడ్స్ ఈ విషయం వెల్లడించారు. ‘ది వరల్డ్ యాజ్ ఇటీజ్: ఎ మెమోయిర్ ఆఫ్ ఒబామా వైట్ హౌస్’అనే తన పుస్తకంలో ఇలాంటి పలు సంచలన విషయాలు వెల్లడించారు. అబోతాబాద్లో రహస్య జీవితం గడుపుతున్న లాడెన్ స్థావరంపై 2011 మే 2వ తేదీ రాత్రి అమెరికా ప్రత్యేక బలగాలు దాడిచేసి, హతమార్చాయి. ఈ విషయా న్ని వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా జర్దారీకి ఫోన్ చేసి చెప్పారు. అది వినగానే ‘పర్యవసానాలు ఎలా ఉన్నా, ఇది చాలా మంచి వార్త. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. మీకు, అమెరికా ప్రజలకు దేవుడు తోడుగా ఉంటాడు’అని జర్దారీ అన్నట్లు రోడ్స్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగేలా అమెరికా వ్యవహరించటంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ జర్దారీ ఆందోళన చెందలేదని రోడ్స్ తెలిపారు. జర్దారీకి తెలిపిన తర్వాతే ఒబామా లాడెన్ పతనాన్ని అమెరికా ప్రజలకు వెల్లడించారు. -
మీ లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదు!
జెనీవా : తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటున్న దాయాది పాకిస్థాన్ తీరుపై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఒకవైపు ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూనే.. మరోవైపు పాక్ బాధితురాలంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డింది. విఫలరాజ్యంగా పేరొందిన పాక్ నుంచి మానవ హక్కులపై లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదని ఘాటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 37వ సదస్సులో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ పాక్ చేసిన ఆరోపణలను మన దేశ ప్రతినిధి (ఇండియా సెంకండ్ సెక్రటరీ) మినిదేవీ కుమామ్ తిప్పికొట్టారు. ‘ఒసామా బిన్ లాడెన్‌ను రక్షించి.. ముల్లా ఒమర్‌కు ఆశ్రయమిచ్చిన దేశం తనను తాను బాధితగా చెప్పుకోవడం అసాధారణం’ అని ఆమె అన్నారు. ‘ఐరాస భద్రతా మండలి తీర్మానం 1267ను ఉల్లంఘిస్తూ.. ఐరాస నిషేధిత ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్ లాంటివారు పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఐరాస నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లో రాజకీయ ప్రధాన స్రవంతిలో కొనసాగుతున్నాయి’ అని ఆమె మండిపడ్డారు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తోందని ఆమె అన్నారు. ఎలాంటి భయంలేకుండా ఉగ్రవాదులు పాక్ నడివీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నారని, ఒక విఫలరాజ్యంగా మారిన దేశం నుంచి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసం వినాల్సిన అగత్యం ప్రపంచానికి లేదని ఘాటుగా పేర్కొన్నారు. -
బెనజీర్ హత్య.. విస్మయపరిచే వాస్తవం!
కరాచి : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో సంచలన విషయాన్ని పాక్ వెల్లడించింది. ఆమె హత్య కుట్ర వెనక ఉంది ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్ అని పేర్కొంది. ఆమె మరణించి పదేళ్లు పూర్తి కావస్తున్నందున(డిసెంబర్ 27, 2017) పాక్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ రూపొందించిన ఓ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది. అల్ ఖైదా, బిన్ లాడెన్ ఆధ్వర్యంలోనే ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. అంతేకాదు ఆ సమయంలో బెనజీర్తోపాటు ముషార్రఫ్, జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లుర్ రెహమాన్‌ను కూడా లేపేయాలని లాడెన్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆర్మీ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ‘లాడెన్ తన కొరియర్ ముసా తరీఖ్ను ముల్తాన్‌కు పంపించాడు. వజిరిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున్న పేలుడు పదార్థాలను ముసా తీసుకెళ్లాడు. వచ్చే ఆదివారం (డిసెంబర్ 22న) భారీ నర మేధానికి అల్‌ఖైదా శ్రీకారం చుట్టింది’ అంటూ ఓ లేఖ ఆర్మీకి అందింది. మరుసటి రోజు అంటే సరిగ్గా ఆమె హత్యకు ఆరు రోజుల ముందు మరో హెచ్చరిక కూడా జారీ అయ్యింది. కానీ, ఆమె మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు. ఇక ఆ ఫ్లాన్ మొత్తం అఫ్ఘనిస్థాన్ నుంచి లాడెన్ స్వయంగా పర్యవేక్షించాడంట. ఈమేరకు డిసెంబర్ 27, 2007న రావల్పిండి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెను బాంబు దాడిలో హత్య చేశారు. ఆమె హత్యానంతరం తమ ఫ్లాన్ సక్సెస్ అయినట్లు ఓ లేఖ కూడా లాడెన్‌కు అందినట్లు ఐఎస్ఐ పేర్కొంది. పరిస్థితులు చల్లబడ్డాకే లాడెన్ తిరిగి పాక్‌కి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ చేసింది లాడెనే అయినా ఆమె మరణం ద్వారా ఎక్కువ లబ్ధి(రాజకీయ) పొందాలనుకున్న వారే ఈ కుట్ర వెనుక ఉన్నారన్నది ఆమె అనుచరుల వాదన. అయితే అది ఎవరన్న ప్రశ్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా, తమ భూభాగంలో లాడెన్ తలదాచుకోలేదని పాక్ వాదించినప్పటికీ.. అమెరికా భద్రతా దళాలు మాత్రం అబ్బోట్టాబాద్లో లాడెన్ ను(2011 మే నెలలో) మట్టుపెట్టిన విషయం తెలిసిందే. -
లా‘డెన్’లో దాగిన రహస్యం
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కరడుగట్టిన ఉగ్రవాది, అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్‌లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. పాకిస్తాన్లో అబోటాబాద్‌లోని రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి ఈ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్ అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న ఒక కంప్యూటర్లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు, లాడెన్ అరబిక్‌లో రాసుకున్న ఓ డైరీ ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వెల్లడించారు. కశ్మీర్ పరిణామాలపై ఆసక్తి... అబోటాబాద్‌లోని నివాసంలో లాడెన్ ఫోన్, ఇంటర్నెట్లను వాడలేదు. అయినా అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ పరిణామాలను లాడెన్ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడుల కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ విచారణకు సంబంధించిన వార్తలను లాడెన్ క్రమం తప్పకుండా చదివేవాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, అల్‌కాయిదా, తాలిబన్ల వార్తలను సేకరించేవాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్‌పై ప్రచురించిన వార్తల క్లిప్పింగులనూ భద్రపరిచాడు. ఇరాన్‌ను చిక్కుల్లో పెట్టేందుకేనా? లాడెన్ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభ్యమయ్యాయి. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను లాడెన్ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా అందులో ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్ ఇండియా’, కుంగ్ ఫూ కిల్లర్స్, వరల్డ్స్ వరస్ట్ వెనమ్... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలు, కార్టూన్ షోలతో పాటు టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, అల్కాయిదాలు అవగాహనకు వచ్చినట్లు ఓ ఫైల్లో ఉంది. ఇరాన్ ఉగ్రవాదులకు సాయం చేస్తోందని చూపేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాసమాచారాన్ని విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు. – -
బిన్ లాడెన్ డైరీలో ఏముందంటే..!
కశ్మీర్ నుంచి కామిక్స్ దాకా... ఉగ్రభూతం విరుచుకుపడితే ఎలా ఉంటుందో ఎవరికీ ఊహకందని రీతిలో ప్రపంచానికి చూపించిన కరడుగట్టిన తీవ్రవాది, ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్‌లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. లాడెన్‌కు సంబంధించిన 4.7 లక్షల పత్రాలు, ఫోటోలు, వీడియోలను సీఐఏ బహిర్గతం చేసింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లోని లాడెన్ రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి... ఈ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ దాడి సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్ లాడెన్ నివాసం నుంచి ఒక కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ కంప్యూటర్లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్లైన్లో జనానికి అందుబాటులోకి తెచ్చింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వెల్లడించారు. లాడెన్ అరబిక్‌లో రాసుకున్న 228 పేజీల డైరీ కూడా ఇందులో ఉంది. 2015 తర్వాత లాడెన్‌కు సంబంధించిన రహస్యంగా ఉంచిన సమాచారాన్ని అమెరికా బహిర్గతం చేయడం ఇది నాలుగోసారి. కశ్మీర్ పరిణామాలను నిశితంగా... ఫోన్, ఇంటర్నెట్ వాడితే దొరికిపోయే అవకాశాలుంటాయి కాబట్టి అబోటాబాద్‌లోని నివాసంలో లాడెన్ వీటిని వాడలేదు. అయినప్పటికీ అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్‌కు చేరవేసేవారు. కశ్మీర్ పరిణామాలను లాడెన్ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడులకు కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ విచారణను సంబంధించిన వార్తలను కూడా లాడెన్ క్రమం తప్పకుండా చదివాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, ఆల్‌ఖైదా, తాలిబన్ల వార్తలను చదివాడు. హుజీతో డేవిడ్ హెడ్లీ కోడ్ భాషలో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త తాలూకు క్లిప్పింగ్ కూడా లాడెన్ కంప్యూటర్లో ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్‌పై ఇచ్చిన వార్తల క్లిప్పింగులూ ఉన్నాయి. కుమారుడి పెళ్లి వీడియో... లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ పెళ్లి వీడియో కూడా సీఐఏ విడుదల చేసింది. ఇందులో లాడెన్ కనిపించలేదు కాని పలువురు ఆల్‌ఖైదా నాయకులు నిఖాలో పాల్గొన్నట్లు ఉంది. అతిథుల కోసం సిద్ధం చేసిన పళ్లు, స్వీట్లు, కోకకోలా, టీ... తదితరాలు వీడియోలో కనిపించాయి. చిన్న పిల్లలు ఫుట్‌బాల్ ఆడుకుంటున్న ఫుటేజీ కూడా ఉంది. నీలిచిత్రాలు... డాక్యుమెంటరీలు లాడెన్ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభించాయి. అమెరికా భద్రతకు సంబంధించిన కీలకమనుకున్న పత్రాలు, వీడియోలను విడుదల చేయలేదని పాంపియో తెలిపారు. అలాగే నీలి చిత్రాలు, కాపీరైట్ ఉన్న డాక్యుమెంటరీలను విడుదల చేయలేదు. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను కూడా లాడెన్ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్ ఇండియా’ కూడా లాడెన్ సేకరించాడు. కుంగ్ ఫూ కిల్లర్స్, వరల్డ్స్ వరస్ట్ వెనమ్... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలు, కార్టూన్ షోలు కూడా లాడెన్ కంప్యూటర్లో ఉన్నాయి. యాంట్జ్, కార్స్, చికెన్ లిటిల్, త్రీ మస్కెటీర్స్ లాంటి వాటితో పాటు హాలీవుడ్ చిత్రాలు కూడా లభించాయి. టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. తీవ్రవాద గ్రూపుల మధ్య సైద్దాంతిక విబేధాలు, ట్విన్ టవర్స్‌పై దాడి జరిగి పదేళ్లు అయిన సందర్భాన్ని ఎలా నిర్వహించాలనే చర్చల వివరాలు కూడా దొరికాయి. అలాగే అప్పుడే పుంజుకుంటున్న ఐసిస్‌తో ఆల్‌ఖైదా విబేధాల వివరాలు ఉన్నాయి. వివిధ తీవ్రవాద గ్రూపుల మధ్య సయోధ్యకు లాడెన్ యత్నించాడనే వివరాలు, అరబ్ దేశాల్లో ప్రజా తిరుగుబాట్లపై ఆల్‌ఖైదా ఎలా స్పందించింది, వాటిని ఏ దృష్టితో చూసిందనే వివరాలున్నాయి. మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని అధిగమించి ముస్లింలలో తమ ప్రతిష్టను పెంచుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఆల్‌ఖైదా నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయమూ బయటపడింది. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బకొట్టడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, ఆల్‌ఖైదాలు అవగాహనకు వచ్చి పనిచేశాయని ఇంతవరకు వెలుగుచూడని ఓ 19 పేజీల ఫైల్లో ఉంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద శిబిరాల్లో ఖైదా మిలిటెంట్లకు శిక్షణ ఇప్పించడమే కాకుండా ఆయుధాలు, డబ్బును ఇరాన్ సమకూర్చినట్లు ఇందులో వివరాలున్నాయి. ఇరాన్‌తో కుదిరిన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రవాదులకు ఇరాన్ సహాయం చేస్తోందనేది చూపించడానికి తాజా ఫైల్స్‌ను విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘ఉగ్ర’ వారసుడి అసలు రూపం..
-
‘ఉగ్ర’ వారసుడి అసలు రూపం..
వాషింగ్టన్ : ఒసామా బిన్ లాడెన్ ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను గడగడలాడించిన అల్‌ఖైదా నాయకుడు. ఓ ఉగ్రవాద సంస్థ నాయకుడి నివాసం ఎలా ఉంటుంది?. సాధారణ జీవితాన్ని వారు గడపగలుగుతారా? అనే సందేహాలు అందరికీ వస్తుంటాయి. 2011లో అమెరికా భద్రతా దళాలు అబోటాబాద్‌లో లాడెన్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన సీఐఏ(సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) లాడెన్ ఇంటిలో దొరికిన కంప్యూటర్ నుంచి లభ్యమైన వివరాలను తాజాగా వెల్లడించింది. లాడెన్ కుటుంబం(భార్య, పిల్లలు, మనవళ్లు)కు చెందిన వీడియోలు ఇందులో ఉన్నాయి. లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు సారథ్యం వహిస్తున్న హంజా లాడెన్ చిన్ననాటి ఫొటో మాత్రమే ఇప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలుసు. హంజా యుక్త వయసులో ఉన్న ఫొటోను కూడా సీఐఏ బయటపెట్టింది. సీఐఏ విడుదల చేసిన వీడియోల్లో బిన్ లాడెన్.. సాధారణ జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. ఆరుబయట లాడెన్ పిల్లలు, మనవళ్ల ఆటపాటలు, ఇంటి నిండా కోళ్లు, ఆవులు, కుందేళ్లు, పిల్లులు.. ఇలా పల్లెటూరి వాతావరణంతో బిన్ లాడెన్ ఆనందంగా గడిపినట్లు అర్థం అవుతోంది. ఓ ఫొటోలో తుపాకీతో లాడెన్ మనవళ్లు వాటర్ బెలూన్లను కాల్చుతున్నారు. ‘వేర్ ఇన్ ది వరల్డ్ ఇజ్ ఒసామా’ అనే పేరుతో వచ్చిన సినిమా కూడా లాడెన్ కంప్యూటర్లో ఉనట్లు సీఐఏ తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా కంప్యూటర్లో దొరికిన అన్ని ఫైళ్లను విడుదల చేయడం లేదని సీఐఏ తన ప్రకటనలో పేర్కొంది. -
బిగ్ స్క్రీన్ పై బిన్ లాడెన్‌ను చూస్తారా?
సాక్షి, సినిమా : విలియమ్స్ షేక్స్పియర్ నవలను కాస్త మార్చి చిత్రాలుగా తెరకెక్కించటంలో సీనియర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దిట్ట. మాక్బెత్ నుంచి మఖ్బుల్, ఒతెల్లో నుంచి ఓంకారా, హంలెట్ నుంచి హైదర్ సినిమాలను రూపొందించాడు. ఇప్పుడు ఆ ధ్యాస నుంచి బయటపడినట్లు ఉన్నాడు. అందుకే మరో క్రేజీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చాడు. అల్ ఖయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్‌పై సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. కేథరిన్ స్కాట్-క్లార్క్, అడ్రియాన్ లెవీ రచించిన ‘ది ఎక్సైల్ : ది స్టన్నింగ్ ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఒసామా బిన్‌లాడెన్ అండ్ అల్ ఖయిదా ఇన్ ఫ్లైట్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. అబ్బొట్టాబాద్ అనే టైటిల్ ఫిక్స్ చేసేశాడు కూడా. 9/11 దాడుల నుంచి ఇప్పటివరకు ఉన్న ఉగ్రవాద నేపథ్యాన్ని, అందులోని చీకటి కోణాన్ని తెరపై చూపించబోతున్నాడంట. అయితే ఇందులో ఎవరు నటించబోతున్నారు.. తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. గతంలో బిన్ తెరె లాడెన్ పేరుతో ఓ కామెడీ మూవీ బాలీవుడ్లో వచ్చింది. -
నోరు విప్పిన లాడెన్ భార్య.. ఆ రాత్రి ఏమైంది?
-
నోరు విప్పిన లాడెన్ భార్య.. ఆ రాత్రి ఏమైంది?
న్యూయార్క్: మే 1, 2011 అమెరికాకు శుభదినం.. ఆ దేశ చరిత్రలో వారు సువర్ణక్షరాలుగా కూడా రాసుకొని ఉండి ఉంటారు. ఎందుకంటే తమ దేశ గౌరవాన్ని దెబ్బకొట్టి, వేల మంది తమ పౌరులను బలి తీసుకున్న అల్ కాయిదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిందే ఆరోజే. ట్విన్ టవర్స్‌ను ఏకంగా విమానంతో ఢీకొట్టించి అమెరికన్ల గుండెల్లో రైల్లు పరుగెత్తించిన ఆ ఉగ్రవాదిని ఎంతో పకడ్బందీగా ప్రణాళిక రచించి గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి అతడిని అంతమొందించింది ఆ రోజే. అయితే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై అన్ని చెప్పుడు కథనాలే తప్ప ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పలేదు. అయినప్పటికీ ఈ సంఘటన గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం మిగిలే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని కథనాలు వచ్చినా తాజాగా మాత్రం ఏకంగా లాడెన్ నాలుగో భార్య అమల్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని కాతీ స్కాట్-క్లార్క్, అడ్రియాన్ లెవీ ఇద్దరికి వెల్లడించింది. వీరు లాడెన్ చనిపోవడానికి ముందు ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై వీరు ది ఎక్సైల్: ది ఫైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ అనే పేరిట ఓ పుస్తకం రాస్తున్నారు. దీనికి సంబంధించి లాడెన్ భార్యను నేరుగా వారు సంప్రదించగా కొన్ని విషయాలు చెప్పింది. అందులో కొన్ని బ్రిటన్‌లోని సండే టైమ్స్‌లో, ఓ టీవీ చానెల్లో ప్రచారం అయ్యాయి. అలా ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే.. ‘ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లో అబోటాబాద్‌లోని మా ఇంటి కాంపౌండ్‌లోకి దిగింది. అప్పటికే మేం ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం. హెలికాప్టర్ శబ్దం విని మేల్కొన్న నా భర్త(లాడెన్) ముఖంలో చాలా భయం చూశాను. అమెరికన్ సీల్స్ ఇంటిలోపలికి ప్రవేశిస్తుండగా మా సోదరీలు(లాడెన్ ముగ్గురు భార్యలు) (అమల్ లాడెన్ నాలుగో భార్య) వారి పిల్లలను తీసుకొని ఆయన ఉన్న అప్స్టెయిర్స్కు వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయితే, వారిని అక్కడ ఉండొద్దని, అందరినీ కిందికి వెళ్లిపోవాలని లాడెన్ చెప్పారు. వారికి కావాల్సింది నేను.. మీరు కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోండని అన్నారు. అయితే, మిగితా వారు వెళ్లిపోగా నేను మాత్రం ఆయన పక్కన నా కొడుకు హుస్సేన్‌తో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నాను. అమెరికా సైనికులు లోపలిక వస్తూ లాడెన్ కుమారుల్లో ఒకరైన ఖలీద్‌ను చంపేస్తూ పిల్లలతో గొడవపడుతూ పైకి వస్తున్నారు. సరిగ్గా మేం ఉన్న గదికి రాగానే నేను వారిని తోసివేసేందుకు ప్రయత్నించాను. కానీ, వారు ఫైరింగ్ స్టార్ట్ చేయగా నా కాలికి తగిలి పక్క గదిలో పడిపోయాను. ఆ తర్వత ఓపిక చేసుకొని తిరిగొచ్చి చూసేసరికి అప్పటికే లాడెన్ చనిపోయి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని నేను నా కొడుకు హుస్సేన్ చూశాడు. అది చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను’ అని వారికి చెప్పిందట. దాంతోపాటు తమకు తెలిసిన వారే ఈ విషయాన్ని వారికి చేరవేసి ఉంటారని, ఆ ఇళ్లే తమకు మృత్యుకుహరం అవుతుందని ఊహించలేకపోయామని కూడా ఆమె చెప్పినట్లు బ్రిటన్ పత్రికలో వెల్లడించారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. -
బిన్ లాడెన్ కోసం సద్దాం హుస్సేన్ దుస్సాహసం
మండల్: ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇస్లామిక్ ప్రపంచంలో విపరీత మార్పులకు కారకులు ఒసామా బిన్ లాడెన్, సద్దాం హుస్సేన్‌లు. ఒకే తరానికి చెందిన ఈ నాయకులవి పక్కపక్క దేశాలే అయినా.. ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు.(అమెరికా నిఘా సంస్థలు మాత్రం సద్దాం-లాడెన్లు రహస్యంగా కలుసుకునేవారని ఆరోపిస్తాయి) ఇప్పటి విషయానికి వస్తే.. మన దేశంలో చోటుచేసుకున్న ఓ ఘటన..‘లాడెన్ కోసం సద్దాం సాహసం’ అనే శీర్షికను బలపరుస్తుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని మండల్ పట్టణానికి చెందిన సద్దాం హుస్సేన్ మన్సూరీ(25) అనే యువకుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉంటూ, కొన్నేళ్లుగా ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్‌ను నడుపుకొంటున్న సద్దాం.. ఇటీవలే ఓ పనికిమాలిన పనికి పూనుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్ ఫొటోతో, అదే పేరు మీద ఆధార్ కార్డు సృష్టించాడు. అఫ్ఘాన్ తపాగా, గుబురుగడ్డంతో ఉన్న లాడెన్ ఫొటోను యూఐడీఏఐ ఉన్నతాధికులు గుర్తించడంతో సద్దాం నేరం బయటపడింది. ఐటీ చట్టాన్ని అనుసరించి సద్దాం హుస్సేన్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు.. అసలు ఎందుకీ పని చేశాడు? అనే విషయాన్ని శోధిస్తున్నారు. ఐటీ శాఖ ఫిర్యాదు మేరకు సద్దాంను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడతాయని మండల్ సీఐ చంచల్ మిశ్రా మీడియాతో అన్నారు. (పోలీసుల అదుపులో సద్దాం హుస్సేన్ మన్సూరీ) -
ప్రతీకారంతో రగులుతున్న లాడెన్ కొడుకు!
వాషింగ్టన్: తన తండ్రి, అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యపై అతడి కుమారుడు హంజా బిన్ లాడెన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలో 9/11 దాడుల విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వెల్లడించారు. 2011 మే2 న లాడెన్‌ను మట్టుబెట్టిన సమయంలో కొన్ని లేఖలను తన బృందం స్వాధీనం చేసుకున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. వాటి ప్రకారం.. తండ్రి తర్వాత అల్ ఖైదాకు తాను నాయకత్వం వహిస్తానని, జిహాద్ మార్గాన్ని తాను ఎంచుకుంటానని అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడతానని తండ్రి బిన్ లాడెన్‌కు హంజా మాటిచ్చాడు. ఇటీవల హంజా రెండు నిమిషాల ఆడియో టేపులు కలకలం రేపిన విషయం తెలిసిందే. 'నేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నాను. అమెరికన్లు జాగ్రత్త.. అల్ ఖైదా మీ పై ప్రతీకారం కోసం ఎప్పుడూ రగిలిపోతుంటుంది. మేం వేసే ప్రతి అడుగు మీ నాశనానికి దారి తీస్తుంది. ఇరాక్.. అఘ్గనిస్తాన్‌లకు మీరు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ మరిచిపోము. ఇదంతా మీపై ప్రతీకారానికి సంకేతాలు' అని హంజా ఆడియో సందేశాలలో ఉన్న విషయాన్ని అధికారి ప్రస్తావించారు. బిన్ లాడెన్ తరహాలో హంజా మాట్లాడుతున్నాడని, ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేయడం.. అమెరికాను నాశనం చేశడమే తన ముందున్న లక్ష్యమంటూ హెచ్చరిస్తున్నాడని ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వివరించారు. జిహాదీలు అందరినీ ఏకం చేసి అమెరికాపై దాడి చేసేందుకు అల్ ఖైదా నేత హంజా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. -
లాడెన్ నుంచి షరీఫ్‌కు నిధులు!
ఇస్లామాబాద్: కశ్మీర్లో జిహాద్ ప్రచారం కోసం ఆల్‌ఖైదా నాటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి నిధులు సేకరించారన్న ఆరోపణలకు సంబంధించి ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కోర్టులో దావా దాఖలు చేస్తామని పాకిస్తాన్లో ప్రతిపక్షం పాకిస్తాన్ తెహ్రీక్–ఈ–ఇన్సాఫ్(పీటీఐ) తెలిపింది. షరీఫ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌధరి సోమవారం వెల్లడించినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్( పేర్కొంది. తమ వాదనకు బలం చేకూర్చేలా పీటీఐ వద్ద తగిన ఆధారాలు లేవు. ఐఎస్ఐ మాజీ గూఢచారి ఖలీద్ ఖవాజా భార్య షమామా ఖలీద్ పుస్తకం, ఆమె పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలపై ఆ పార్టీ ఆధారపడనున్నట్లు తెలిసింది. ఖవాజా 2010లో పాకిస్తాన్ తాలిబన్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కశ్మీర్, అఫ్గానిస్తాన్‌లలో జిహాద్ వ్యాప్తికి షరీఫ్, లాడెన్ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని షమామా తన పుస్తకంలో వెల్లడించారు. అందులో నుంచి రూ. 27 కోట్లను, 1989లో అప్పటి ప్రధాని బెనజీర్ భుట్టో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వినియోగించారని తెలిపారు. -
లాడెన్ తల ఛిద్రమయ్యేలా కాల్చాను!
న్యూయార్క్: అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తల తాను కాల్చిన తుపాకీ గుళ్లకు ఛిద్రమైపోయిందని, మృతదేహాన్ని గుర్తించేందుకు ఆ ముక్కలను ఓ దగ్గరకు చేర్చాల్సి వచ్చిందని అమెరికన్ మాజీ నేవీ సీల్ షూటర్ రాబర్ట్ ఓనీల్ పేర్కొన్నాడు. లాడెన్ తలలోకి తాను మొత్తం మూడు బుల్లెట్లు దించినట్లు వివరించాడు. పాకిస్తాన్ అబోటాబాద్‌లోని లాడెన్ స్థావరంపై జరిపిన దాడిని వివరిస్తూ ‘ద ఆపరేటర్’ పేరుతో రాసిన పుస్తకంలో రాబర్ట్ ఓనీల్ ఈమేరకు వెల్లడించాడు. -
షాకింగ్ విషయాలు చెప్పిన పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకింగ్ విషయాలు చెప్పారు. మొన్న జరిగిన జల్లికట్టు ఉద్యమంలో కొందరు తమిళులు ప్రత్యేక తమిళదేశం కావాలని డిమాండ్ చేశారని, నిరసనకారులు ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు కూడా చూపించారని వివరించారు. శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సెల్వం మాట్లాడుతూ మెరినా బీచ్ తో జల్లికట్టుకోసం జరిగిన ఆందోళనలో కొంతమంది అల్ కాయిదా ఉగ్రవాది లాడెన్ ఫొటో చూపించారని తెలిపారు. అలాగే, గణతంత్ర దినోత్సవాన్ని కూడా బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. జల్లికట్టు ఉద్యమం ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసు బలగాలను ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ సమాధానం చెప్పారు. కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు జల్లికట్టు ఉద్యమంలో చేరాయి. పరిష్కారం చూపిన తర్వాత కూడా రిపబ్లిక్ డే వరకు ఉద్యమం చేద్దాం అని కొందరు రెచ్చగొడుతుంటే అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను. కొన్ని గ్రూపులు కావాలనే నల్లజెండాలు పనిగట్టుకొని ప్రదర్శించాయని, వారిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు చెప్పారు. అయితే, ఆరోజు జరిగిన హింసపై జ్యుడిషియల్ దర్యాప్తు చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేయగా ప్రభుత్వం నిరాకరించడంతో వారు వాకౌట్ చేశారు. -
మనకిప్పుడు.. లాడెన్‌కు అప్పట్లోనే భయం
న్యూయార్క్: సాధారణంగా ఒసామా బిన్ లాడెన్ పేరు వింటేనే మిగితా దేశాలవారేమోగానీ అమెరికన్లు మాత్రం ఉలిక్కిపడతారు. అలా అమెరికన్లనే వణికించిన లాడెన్‌ను కూడా వణికించినవారు ఉన్నారు. అదే ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్). అయితే, ఈ సంస్థ అంతకుముందే అల్ ఖాయిదా మాజీ చీఫ్, అమెరికా బలగాల దాడుల్లో చనిపోయిన కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను కూడా వణికించిందంట. ఈ వివరాలకు సంబంధించిన పత్రాలు ఇటీవలె అమెరికా సంస్థ సీఐఏ వెలుగులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ప్రపంచ నలుమూలల్లో ఉన్న సామాజిక వ్యతిరేక శక్తులన్నింటిని కూడగట్టి వాటన్నింటిని కూడా పోగేసి ఒక్క అమెరికాను తొలుత ధ్వంసం చేసి అనంతరం ప్రపంచ దండయాత్ర సాగించాలని లాడెన్ భావించాడని ఆ పత్రాల ఆధారంగా తెలుస్తోంది. అల్ ఖాయిదా నేతృత్వంలో ఉగ్రదాడులు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న ఇస్లామిక్ స్టేట్ అప్పుడు కూడా చాలా తీవ్రమైన ఆవేశపూరితమైన ఆలోచనలతో ఉండేదంట. ఏ మాత్రం సహనం సంయమనంతో అది వ్యవహరించదని, హింసను సృష్టించేందుకు రచించే వ్యూహాల ముందు అల్ ఖాయిదా మసకబారి పోయే పరిస్థితి వస్తుందని లాడెన్ భయపడుతూ ప్రతిక్షణ మదనపడిపోయేవాడని వాటి ద్వారా వెల్లడైంది. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికాకు చెందిన నేవీ సీల్స్ లాడెన్‌ను కూల్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాలతోపాటు మరో ఆసక్తికరమైన విషయం కూడా సీఐఏ పత్రాల్లో తెలిసింది. తన కుమారులను లాడెన్ ఎప్పుడూ హెచ్చరిస్తుండేవాడని, వారిని ట్రాక్ చేసి పట్టుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఇంజెక్ట్ చేసే అవకాశం ఉందని, కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు చెప్తుండే వాడని సమాచారం. అంతేకాదు.. ఒక్కోసారి ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు ఆవేశపడి ఎత్తుకొచ్చిన విదేశీ ప్రముఖుల విషయంలో కూడా స్వయంగా జోక్యం చేసుకొని సర్దుబాట్లు చేసేందుకు ప్రయత్నించవాడని తెలిసింది. -
లాడెన్ కొడుకు ఎలా ఎంజాయ్ చేసేవాడంటే..?
న్యూయార్క్: ఆల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అమెరికా అంటేనే హంజా పళ్లు పటపట కొరుకుతాడని, అసలు ఆ దేశం పేరు చెబితేనే కళ్లెర్ర జేస్తాడని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అలాంటి అతడు అమెరికా వస్తువులను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అమెరికాకు చెందిన కోకాకోలాను ఉపయోగించడంతోపాటు ఇతర అమెరికా వస్తువులను కూడా వాడుతూ ఎంజాయ్ చేసేవాడట. హంజా చిన్నవయసులో ఉండగా అఫ్గనిస్థాన్‌లో అతడు ఉంటున్న ఇంటి కాంపౌండ్‌లో చాలా వస్తువులు అమెరికావే కనిపించేవని సమాచారం. ‘ఒసామాకు ముద్దుల కొడుకు అయిన హంజా అమెరికాను అసహ్యించుకుంటాడేమోకానీ, అమెరికా వస్తువులను కాదు. ఎందుకంటే అతడి ఇంటి కాంపౌండ్‌లో ఎప్పుడూ కోకాకోలావంటి వస్తువులు కనిపిస్తుండేవి’ అని హంజా చిన్ననాటి స్నేహితుడు అబ్దురహమాన్ ఖాదర్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అతడు మూడేళ్లు హంజాతో కలసి ఉన్నాడు. సాధారణంగా ఇంట్లోకి అలాంటి వస్తువులను అనుమతించేవారు కాదని, కానీ హంజా మాత్రం ప్రతి రోజు వాటిని దొంగచాటుగా తెప్పించుకునే వాడని అతడు తెలిపాడు. అమెరికాకు చెందిన పొగాకు ఉత్పత్తులను కూడా అతడు తొమ్మిదేళ్ల ప్రాయంలో తీసుకొచ్చేవాడని చెప్పారు. ఇటీవల లాడెన్ కొడుకు హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇతనిపై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించాడు. ఆ తర్వాత హంజాపై నిఘా పెట్టిన అమెరికా ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. -
అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటా
బీరుట్ : తన తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ను దారుణంగా చంపిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని అతని కొడుకు హంజా బిన్ లాడెన్ హెచ్చరించాడు. ఈ మేరకు అతను మాట్లాడిన ఒక ఆడియోను అల్‌కాయిదాకు చెందిన మీడియా విభాగం అస్-సాహబ్ శనివారం విడుదల చేసింది. ఇందులో హంజా బిన్ లాడెన్ మాట్లాడుతూ.. అమెరికా నేతల నిర్ణయాలకు అమెరికన్లు జవాబుదారులన్నాడు. ముస్లింలను అణచివేస్తున్నందుకు ప్రతిగా అమెరికాపై జిహాద్ లేదా పవిత్ర యుద్ధాన్ని అల్‌కాయిదా కొనసాగిస్తుందని స్పష్టం చేశాడు. అబొట్టాబాద్‌లో మీరు చేసిన పాపకార్యానికి ఏ శిక్ష పడకుండానే తప్పించుకున్నామని భావిస్తే.. అది పొరపాటేనని వ్యాఖ్యానించాడు. అయితే లాడెన్ కుమారుని జాడ ఇప్పటివరకు తెలియరాలేదు. ప్రస్తుతం అతను అల్‌కాయిదా నాయకత్వ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమెరికాకు లాడెన్ కొడుకు హెచ్చరిక
అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను చంపినందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని అతని కొడుకు హంజా బిన్ లాడెన్ హెచ్చరించాడు. హంజా బిన్ మాట్లాడిన 21 నిమిషాల నిడివిగల ఆడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అమెరికా, దాని మద్దతు దేశాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గ్రూప్ పోరాటాన్ని కొనసాగిస్తామని హంజా బిన్ చెప్పాడు. మేమందంరం ఒసామాలమేనని అన్నాడు. ఈ ఆడియోలోని వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా గడ్డపైనా, విదేశాల్లోనూ మిమ్మల్ని టార్గెట్ చేస్తామని, దాడులు కొనసాగిస్తామని హంజా హెచ్చరించాడు. పాలస్తీనా, అఫ్ఘానిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సొమాలియా ఇతర ముస్లిం దేశాల్లో అమాయక పౌరులను హింసిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లిస్తారని అమెరికాను ఉద్దేశిస్తూ పేర్కొన్నాడు. 2011లో పాకిస్థాన్‌లో రహస్యంగా దాక్కున్న ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హతమార్చాయి. ఒసామాను హతమార్చడంతో అల్ ఖైదా గ్రూపునకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాగా ఒసామా అనుచరులు ఆయన కొడుకు హంజాతో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని గతేడాది అమెరికా వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఒసామాపై అమెరికా బలగాలు దాడి చేసే ముందుకు హంజా తండ్రితో కలసి ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హంజా వయసు పాతికేళ్లు ఉండొచ్చు. మిలిటెంట్లకు ప్రేరణ ఇచ్చేందుకు హంజా యువగొంతుకగా వస్తున్నాడని గతేడాది అల్ ఖైదా నేత అయిమన్ అల్ జవహరి ఓ ఆడియో ప్రసంగంలో వెల్లడించాడు. -
ఒసామా బిన్ లాడెన్ కొడుకొచ్చాడు!
సిరియా: ప్రపంచంలో పాశ్చాత్య దేశాలను గడగడలాడించిన అంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్‌కు వారసుడొచ్చాడు. ఆయన 23 ఏళ్ల కుమారుడు హమ్జా బిన్ లాడెన్ తండ్రి బాటలో అల్ కాయిదా నాయకత్వం స్వీకరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా పాశ్చాత్య దేశాలను మట్టి కరిపించేందుకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా సిరియాలోని ముజాహిద్దీన్లంతా ఏకం కావాలంటూ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియా టేప్‌లో పిలుపునిచ్చాడు. ‘ఇస్లామిక్ ఉమ్మా (జాతి) అల్ శ్యామ్ (సిరియా)లోని జిహాదీపై దష్టిని కేంద్రీకరించాలి. ముజాహిద్దీన్లందరిని ఏకం చేయాలి. నేడు ముస్లిం ప్రపంచానికి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచం ఏకమైంది. ఈ తరుణంలో విభేదాలకు, వివాదాలకు ఆస్కారం ఇవ్వరాదు. కలిసికట్టుగా పోరాడాలి’ అని హమ్జా పిలుపునిచ్చారు. ఆయన తన తండ్రికి ఇష్టమైన కవితతో తన సందేశాన్ని ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని అబ్బోటాబాద్‌లో అమెరికా కమాండో ఆపరేషన్‌లో తన తండ్రి ఒసామా బిన్ లాడెన్ హతమైన ఐదేళ్ల తర్వాత హమ్జా తొలిసారి లేదా రెండోసారి జిహాదీలను ఉద్దేశించి సందేశమిచ్చారు. గతేడాది ఆగస్టు నెలలో హమ్జా పేరిట ఓ ఆడియో సందేశం విడుదలైంది. అది అతని సందేశం కాకపోవచ్చనే వార్తలు వెలువడ్డాయి. అప్పటి ఆ సందేశం పెద్దగా ప్రభావం చూపించలేదు. సిరియాలోని జిహాదీలంతా ఏకం కావాలంటూ ఒసామా బిన్ లాడెన్‌కు కుడిభుజంగా వ్యవహరించిన అల్ జవాహిరి శనివారం సందేశం ఇచ్చిన అనంతరం హమ్జా సందేశం కూడా విడుదల కావడం వల్ల నాయకత్వంవైపు హమ్జా అగుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అబ్బోటాబాద్ ఆపరేషన్‌లో తండ్రి ఒసామాతోపాటు హమ్జా బిన్ లాడెన్ కూడా మరణించారని తొలుత అమెరికా భావించింది. అయితే హమ్జాకు బదులుగా ఖలీద్ అనే మరో కొడుకు మరణించినట్లు తెల్సింది. ఆ ఆపరేషన్ సందర్భంగా హమ్జా అప్పుడు ఆ ఇంట్లో ఉండి, తప్పించుకొని పారిపోయాడా? లేక ఆ సమయంలో అక్కడ లేకుండా మరెక్కడైనా ఉన్నాడా? అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. ఒసామా బిన్ లాడెన్ తన తదనంతరం హమ్జానే వార సుడు కావాలని కోరుకున్నాడని, అందులో భాగంగా హమ్జాకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ కూడా ఇచ్చారని పాశ్చాత్య ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు అంతర్గత గొడవలు, పాశ్చాత్య సంకీర్ణ దళాల దాడుల్లో ఇటీవల తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇస్లామిక్ స్టేట్ జిహాదీల తరఫున అల్ కాయిదా టెర్రరిస్టులు కూడా పోరాడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో హమ్జా అల్ కాయిదా నాయకుడిగా తెరమీదకు వస్తే జిహాదీలకు కొత్త ఊపు వస్తుందని, అది అమెరికాకు పెను ముప్పుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
లాడెన్‌ను కనిపెట్టాడనే కోపంతో..!?
వాషింగ్టన్: అడ్డు తగిలేవారిని, అవసరం తీరిందనుకున్నవాళ్లని సైలెంట్ గా ఫినిష్ చేస్తాయి గూఢచార సంస్థలు! అలాంటి కుట్రల్లో ఆరితేరిన పాక్ ఐఎస్ఐ.. ఓ సీఐఏ అధికారిపైనా విషప్రయోగం జరిపినట్లు తెలిసింది. బిన్ లాడెన్‌ను తమ దేశంలోనే దాచిపెట్టి, పైకి అతణ్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు నటించిన పాకిస్థాన్.. లాడెన్ జాడ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన సీఐఏ అధికారిపై విష ప్రయోగం జరిపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఐఏ చీఫ్‌గా పాకిస్థాన్‌లో పనిచేసిన మార్క్ కెల్టన్ పై ఐఎస్ఐ విషప్రయోగం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. 2011 మే 4న అమెరికా సీల్ దళాలు అబోతాబాద్ లోని ఇంటిపై దాడిచేసి అల్ కాయిదా చీఫ్ బిన్ లాడెన్ ను అంతం చేసిన రెండు నెలల తర్వాత సీఐఏ చీఫ్ మార్క్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పాకిస్థాన్ నుంచి వెనక్కి పిలిపించారు. అమెరికా వెళ్లిన తర్వాత మార్క్ అనారోగ్యం తీవ్రం కావడంతో దాదాపు మరణం అంచుల దాకా వెళ్లొచ్చారు. ఆయన బాధకు కారణం ఏమిటనేది డాక్టర్లు వెంటనే కనిపెట్టలేకపోయారు. చివరికి పొత్తికడుపు ప్రాంతంలో ఆపరేషన్ చేసి మార్క్ ను బతికించిన డాక్టర్లు.. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని నిర్ధారించారు. ఇదే విషయాన్ని మార్క్ కూడా అంగీకరిస్తూ.. గూఢచార సంస్థల్లో పనిచేసే వాళ్లపై ఇలాంటి భయంకరమైన ప్రయోగాలు కొత్తేమీ కాదని, ప్రపంచానికి శత్రువు లాంటి లాడెన్ ను చంపడంలో కీలక వ్యక్తినయినందుకు గర్వంగా ఉందని అన్నారు. అయితే విషప్రయోగంపై తగిన ఆధారాలు లభించే అవకాశం లేనందున మార్క్ విషయంలో పాకిస్థాన్ ను బహిరంగంగా నిందించలేమని సీఐఏ అధికార ప్రతినిధి డీన్ బోయ్డ్ అన్నారు. ఐఎస్ఐ గతంలోనూ ఎంతో మంది జర్నలిస్టులు, దౌత్యవేత్తలపై విషప్రయోగాలు జరిపిందని, తనకు ఇష్టం లేని విధంగా కెల్టన్.. లాడెన్ గుట్టురట్టు చేసినందుకు ఐఎస్ఐ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని ఇంకొందరు సీఐఏ అధికారులు పేర్కొన్నారు. -
'అఫ్రిది తలరాతను ట్రంప్ నిర్ణయించలేడు'
ఇస్లామాబాద్: అమెరికా నిఘా సంస్థ సీఐఏ గుర్తించిన అబోటాబాద్ లోని ఆ ఇంట్లోనే అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు, ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో ఉన్న డాక్టర్ షకీల్ అఫ్రిదిని రెండు నిమిషాల్లో బయటికి తెప్పిస్తానన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ పై పాక్ నిప్పులు చెరిగింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా యూఎస్ తో స్నేహమే కోరుకునే పాకిస్థాన్ గురించి ట్రంప్ కు ఏమాత్రం అవగాహనలేదని దుయ్యబట్టింది. 'పాకిస్థాన్ కు మనం(అమెరికా) భారీగా నిధులు ఇస్తున్నాం. అందుకని వాళ్లు మన మాట వింటారనే అనుకుంటున్నా. నేను అధ్యక్షుడిగా గెలిస్తే రెండంటే రెండే నిమిషాల్లో పాకిస్థాన్ తో మాట్లాడి డాక్టర్ అఫ్రిదిని విడిపిస్తా' అని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి పోటీపడుతోన్న ట్రంప్ సోమవారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరీ నిసార్ అలీ ఖాన్ ట్రంప్ కామెంట్లపై స్పందించారు. 'చిల్లర విదిల్చినంత మాత్రాన పాకిస్థాన్ అమెరికాకు భయపడుతుందని అనుకోవడం ట్రంప్ పొరపాటు. ఆయనది అలాంటి విదేశాంగ విధానమే అయితే అది శుద్ధతప్పు. ట్రంప్ ఇతర దేశాలను గౌరవించడం నేర్చుకోవాలి' అని హితవు పలికిన నిసార్.. డాక్టర్ అఫ్రిది పాకిస్థాన్ పౌరుడని, అతని తలరాతను నిర్ణయించేది ఇస్లామాబాదే తప్ప డోనాల్డ్ ట్రంప్ కాదని తేల్చిచెప్పారు. ఒకవేళ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటికీ ఈ విషయంలో ఏమీ చెయ్యలేడని పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో బిన్ లాడెన్ తలదాచుకున్నాడని తెలుసుకున్న అమెరికా నిఘా సంస్థ సీఐఏ.. ఆ విషయాన్ని రూఢీ చేసుకునేందుకు పాకిస్థాన్ జాతీయుడే అయిన డాక్టర్ షకీల్ అఫ్రిది సాయం తీసుకుంది. వ్యాక్సిన్ నెపంతో అఫ్రిదిని లాడెన్ ఉంటోన్న ఇంటిలోపలికి పంపిన సీఐఏ.. అక్కడి పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చింది. తర్వాత కొద్ది రోజులకే ఆ ఇంటిపై దాడిచేసి లాడెన్ ను మట్టుపెట్టింది. ఆపరేషన్ క్రమంలో 'సీఐఏ డాక్టర్' గా పేరుపొందిన అఫ్రిదిని పాక్ ప్రభుత్వం దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. విచారణ పేరుతో ఐదేళ్లుగా జైలులో మగ్గిపోతోన్న షకీల్ అఫ్రిదీని బయటికి తీసుకొస్తానని ట్రంప్ వ్యాఖ్యనించడంతో మరోసారి అతను వార్తల్లోకెక్కాడు. -
అమెరికా కసితీర పగతీర్చుకుంది నేడే
న్యూయార్క్: సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలో చీకటి రోజు. వారి ప్రతిష్ట అబాసుపాలైన దినం. ప్రపంచ దేశాలన్నింటికి పెద్దన్నగా భావించే ఆ దేశ ముఖ చిత్రంలో చెరిగిపోని ఓ శాశ్వత ముద్ర వేసిన రోజు. చరిత్రలో మాయమవని అక్షరాలు లిఖించబడిన రోజు.. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిని శాసించగల సత్తా ఉండి కూడా ఒక కరడుగట్టిన ఉగ్రవాది ప్రకోపానికి గురైన రోజు అది.. ఆ ఉగ్రవాది మరెవరో కాదు.. ఒసామా బిన్ లాడెన్. నేడు ఆ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిన రోజు. దాదాపు పదేళ్లపాటు అలుపెరగకుండా అదే కసితో అణువణువుగాలించి చివరకు పాకిస్థాన్‌లోని అబోటా బాద్‌లో గుర్తించి తన కసి తీరా లాడెన్‌ను చంపేసిన రోజు. నేటికి లాడెన్ ను నేల కూల్చి సరిగ్గా ఐదేళ్లు. అమెరికా టవర్స్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఈ దాడికి ప్రధాన వ్యూహకర్త అయిన లాడెన్ దాదాపు పదేళ్లపాటు దొరకకుండా అమెరికాను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు పాకిస్థాన్‌లో అతడి స్థావరాన్ని గుర్తించిన అమెరికా సేనలు ఎంతో జాగ్రత్తగా వ్యూహం పన్నాయి. పకడ్బందీగా నెప్ట్యూన్ స్పేర్ పేరిట పదేళ్ల అలుపును 40 నిమిషాల వేటతో ముగించారు. లాడెన్ తో సహా అతడి కుమారుడు మరో ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడి ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన నేవీ సీల్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అబోటా బాద్‌లోని లాడెన్ నివాసంపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసి.. లాడెన్‌ను నేల కూల్చారు. ఈ ఆపరేషన్ మొత్తం లైవ్‌ను స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీక్షించారు. లాడెన్ చనిపోయిన వెంటనే.. 24గంటలు కూడా గడవకముందే అరేబియా సముద్రంలో ముస్లిం మతాచారాల ప్రకారమే ఓ గుర్తు తెలియని చోట పడేశారు. -
చివరి రోజుల్లో లాడెన్ పట్టుబడతానని భయపడ్డాడా?
వాషింగ్టన్: ఉగ్రవాదానికి చిరునామాగా నిలిచి... ప్రపంచదేశాల్లో అనేక దాడులు చేసిన మహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ తాను స్థాపించి, నడిపిన సంస్థ ఆల్-ఖైదాను ముందుకు తీసుకువెళ్లడానికి , పరిపాలించడానికి చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ? తన భార్య వద్దే ట్రాకింగ్ కు సంబంధించిన వస్తువు ఉందని భయపడ్డాడా ? అవుననే సమాధానం. 2011లో పాకిస్తాన్ లో దాక్కున్న లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను అమెరికన్ నేవీ స్వాధీనం చేసుకుంది. వాటిలో లాడెన్ ఉత్తరప్రత్యురాలు జరిపిన కొన్ని పత్రాలను నేవీ మంగళవారం విడుదల చేసింది. లేఖల్లోని అంశాలు : సూడన్ దేశంలో తనకు దాదాపు 29 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయని ఒక వేళ తాను మరణిస్తే ఆ డబ్బును జీహాద్ కోసం వినియోగించాలని లాడెన్ లేఖలో పేర్కొన్నాడు. తన చివరిరోజుల్లో అమెరికా డ్రోన్ ఆల్-ఖైదా స్థావరాలపై దాడి చేసిన తర్వాత నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాడని ఒక ఉత్తరంలో ఉంది. తన నివాసాన్ని ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కడ భద్రతా దళాలు పసిగడతాయోనని , తన భార్య పంటికి శస్త్రచికిత్స చేసిన ఇరానీయన్ డాక్టర్ పంటిలో ఏదైనా ట్రాకింగ్ పరికరం అమర్చారేమోనని వెతికినట్టు మరో ఉత్తరంలో ఉంది. ఎక్కవ కాలం ట్రాకింగ్ గురించి భయపడినట్లు తెలిపే మరో సంఘటన జిహాద్ అవసరాల కోసం తరలిస్తున్న డబ్బు సూట్ కేసుల్లో ట్రాకింగ్ పరికరాలు ఉండే అవకాశం ఉందని లాడెన్ అనుమానించే వాడు. జీపీఎస్ పరికరంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ను తీసుకుని వస్తానని చెప్పిన ఖతార్ కు చెందిన వ్యక్తి తనకు షుగర్ ఉందని డాక్టరు వద్దకు వెళ్లాలని చెప్పి రాకుండా వెళ్లిపోవడం లాడెన్ కు తీవ్రఅనుమానంగా తోచింది. -
బిన్ లాడెన్ వందల కోట్ల వీలునామా
వాషింగ్టన్: సూడాన్ బ్యాంకుల్లో తన పేరిట ఉన్న 197.20 కోట్ల రూపాయలను, తన ఇంజనీరు సోదరుడు ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తన వాటా కింద అందిన దాదాపు 82 కోట్ల రూపాయలు, మొత్తం 279 కోట్ల రూపాయల్లో సగ భాగాన్ని ప్రపంచ జిహాది కోసమే ఖర్చు పెట్టాలని ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ కాయిదా మాజీ చీప్ ఒసామా బిన్ లాడెన్ వీలునామా రాశారు. సూడాన్ బ్యాంకుల్లో మొత్తంలో సగ భాగాన్ని తన తల్లి ఖదీజా ఉమ్‌కు, తన కుమారుడు సాద్ బిన్ ఉసామాకు చెరి సమానం పంచాలని అందులో సూచించారు. అలాగే తన కూతురితోపాటు తన ముగ్గురు చెల్లెళ్లు, తన పిన తల్లులు, వారి పిల్లలకు, తన మామ, వారి పిల్లలకు ఎవరికెంత వాటా ఇవ్వాలో కూడా ఆ వీలునామాలో పేర్కొన్నారు. సూడాన్ బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేయడంలో సహకరించిన అల్ కాయిదా మిలిటెంట్ మెహ్ఫౌజ్ అల్ వాలిద్‌కు మొత్తం సొమ్ములో ఒక శాతం ఇవ్వాలని, అందులో ఇప్పటికే అతనికి దాదాపు ఏడు కోట్ల రూపాయలు బహుమానంగా ఇచ్చానని చెప్పారు. మిగతా రావాల్సిన సొమ్మును లెక్కగట్టి ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. తాను ఇంజనీరింగ్ కంపెనీ పెట్టడానికి తోడ్పడిన ఇంజనీరుకు ఒక వాటా ఇవ్వాలని సూచించారు. కోట్లాది రూపాయల బంగారాన్ని కూడా భార్య, పిల్లలు, చెల్లెళ్లు, చిన్నమ్మలు, మామ, వారి పిల్లలకు వాటాలు వేశారు. ఈ వీలునామాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని ఆశిస్తున్నానని తండ్రి, కుటుంబ సభ్యులనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాను సూచించినట్లు వాటాల పంపకం జరగకపోతే తన ఆత్మ సమాధిలోనే బంధీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిన్ లాడేన్ 1996కు ముందు ఐదేళ్లపాటు సూడాన్‌లో ఉన్నారు. అక్కడి ప్రభుత్వం దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో అఫ్ఘాన్‌కు వెళ్లాడు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో 2011, మే 2వ తేదీన అమెరికా ప్రత్యేక సైనిక దళం బిన్ లాడెన్‌ను హతమార్చినప్పుడు ఆయన రాసిన ఈ వీలునామాతోపాటు మొత్తం 113 డాక్యుమెంట్లను అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిని అమెరికా ప్రభుత్వం ఇంతకాలం గోప్యంగా ఉంచింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లను డీ-క్లాసిఫై చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా వీటిని అమెరికా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో తన తండ్రికి, మిత్రులకు, మిలిటెంట్ కమాండర్లకు రాసిన పలు లేఖలు ఉన్నాయి. తనను, తనతోటి పిల్లలను పెంచి, పెద్దచేసినందుకు, తనలో జిహాది విప్లవాన్ని రగిలించినందుకు సర్వదా కృతజ్ఞుడి గా ఉంటానని కూడా ఓ లేఖలో బిన్ లాడెన్ పేర్కొన్నారు. ఒకవేళ తండ్రికన్నా తాను ముందుగానే చనిపోతే, తన భార్యా పిల్లల బాధ్యతను కూడా తండ్రే చూసుకోవాలని కోరారు. తండ్రి చూపిన బాటలో నడవనందుకు తనను క్షమించాల్సిందిగా కోరారు. 2001, సెప్టెంబర్ 11వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడుల పదవ వార్శికం సందర్భంగా 2011, సెప్టెంబర్ 11 వ తేదీన న్యూయార్క్, వాషింఘ్టన్లలో భీకరమైన టైస్టు దాడులు జరిపేందుకు బిన్ లాడెన్ కుట్ర పన్నినట్లు ఆ డాక్యుమెంట్లలో బయటపడింది. బిన్ లాడెన్ తాను చనిపోయే వరకు కూడా అమెరికా, దాని మిత్రపక్షాల నిఘా నేత్రం తనపైన కొనసాగుతుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిఘా నుంచి ఎలా తప్పించుకోవాలో తనను కలవడానికి వచ్చిన జీహాదీలకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండేవాడు. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు మాత్రమే తనను కలసుకోవాల్సిందిగా సూచించేవాడు. చివరకు ఇరాన్లో పంటి వైద్యం చేయించుకున్న తన భార్య పంటిలో కూడా నిఘా చిప్‌ను ఏర్పాటు చేసి ఉంటారని అనుమానించాడు. -
పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి
ఇస్లామాబాద్: పాకిస్ధాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి భార్య బాంబు పేల్చారు. నవాజ్ షరీఫ్ అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించారు. ఐఎస్ఐ మాజీ అధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ 'ఖలీద్ ఖవాజా: షహీద్-ఐ-అమాన్' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆమె ఈ సంచలన వివరాలు తెలిపారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాడెన్ నుంచి ఈ డబ్బు తీసుకున్నాడని చెప్పారు. 'బెనజిర్ భుట్టో పరిపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దీంతో అల్ కాయిదా అతడికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. దీంతో ఆయన అధికారంలోకి వచ్చాడు' అని ఆమె తెలిపారు. -
ఆ సీన్ చూసే లాడెన్ 9/11 దాడులు
ప్రపంచాన్నే భయాందోళనలకు గురి చేసిన అమెరికా ట్విన్ టవర్స్ దాడికి స్పూర్తినిచ్చేలా చేసిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేయడం ఒసామా బిన్ లాడెన్ సొంత ఆలోచన కాదని, ట్విన్ టవర్ల కూల్చివేతకు రెండు సంవత్సరాల ముందే మరో సంఘటన నుంచి అతడు స్పూర్తి పొందాడని ఉగ్రవాద సంస్థకు చెందిన 'ఆల్మస్రా' పత్రిక వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి 'అన్‌టోల్డ్ స్టోరీ' పేరిట ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అల్ మస్రా కథనం ప్రకారం.. 217 మంది మృతికి కారణమైన ఈజిప్టు ఎయిర్‌లైన్స్ ప్రమాదం నుంచి లాడెన్ స్పూర్తి పొంది అదే తరహాలో దాడులు నిర్వహించాలని భావించాడు. 9/11 దాడులకు రెండేళ్ల ముందు ఈజిప్టు ఎయిర్ ఫ్లైట్ 990 విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ విమానం లాస్ఏంజల్స్ నుంచి కైరోకు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 217 మంది జల సమాధి అయ్యారు. వీరిలో దాదాపు సగం మంది అమెరికాకు చెందినవారే. అయితే ఈ ప్రమాదం ఇంజన్ ఫెయిల్ కావటం వల్ల జరగిందని ఈజిప్టు విచారణాధికారులు తేల్చారు. కానీ, యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు మాత్రం ఎయిర్ ఫ్లైట్ 990 కో పైలెట్ 'జమీల్ ఆల్ బటౌటి' ఉద్దేశ పూర్వకంగానే విమానాన్ని నీటిలోకి దించాడని నిర్ధారించింది. ఈజిప్టు ఎయిర్‌లైన్స్ తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యలకు ప్రతీకారంగానే జమీల్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని కొందరు అంటూంటే, ఆత్మహత్మ అయ్యి ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అయితే జమీల్‌కు ఎలాంటి తీవ్రవాద లక్షణాలు లేవని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. కానీ, ఈ సంఘటన నుంచి ఆల్‌ఖైదా అధ్యక్షుడు లాడెన్ స్పూర్తి పొంది, దీని నుంచే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చివేయాలనే గట్టిగా భావించారు. అయితే ఈజిప్ట్ విమానం వార్త 'ఆల్ మస్రా'లో వచ్చినప్పుడు దాన్ని చదువుతూ ఆవేశంతో పైలెట్ ఎందుకు భవనాన్ని ఢీకొట్టలేదని లాడెన్ అన్నాడని కథనంలో పేర్కొన్నారు. ఆనాటి ట్విన్ టవర్స్ దాడులకు ప్రధాన పాత్ర పోషించింది ఖలీద్ షేక్ మహ్మద్ అని కమిషన్ రిపోర్టు తేల్చింది. మెదటగా మొత్తం 12 విమానాలతో దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. విమానాలతో దాడులు చేయించాలనే ఆలోచన లాడెన్దే అయినా అమెరికా విమానాలతోనే దాడులు చేయాలనే ఆలోచన ఖలీద్దే. వారి ముఖ్య లక్ష్యం వైట్‌హౌస్ లేదా క్యాపిటల్ బిల్డింగ్‌గా నిర్ణయించుకున్నారు. అయితే చివరకు నాలుగు విమానాలతోనే దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 3000 మంది అమాయక పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. -
'లాడెన్, తాలిబన్లు.. మాకు హీరోలు'
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్, తాలిబన్లు వంటి ఉగ్రవాదులను పాకిస్థాన్ హీరోలుగా భావించేదని ముష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ మద్దతు ఇచ్చినట్టు అంగీకరించారు. '1990లో కశ్మీర్లో వేర్పాటువాద కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆ సమయంలో లష్కరే తోయిబా వంటి 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వారికి మద్దతు ఇచ్చి, కశ్మీర్లో పోరాడేందుకు శిక్షణ కూడా ఇచ్చాం. హఫీజ్ సయీద్, లక్వీ వంటి ఉగ్రవాదులు హీరోలుగా చెలామణి అయ్యారు. అనంతరం పాకిస్థాన్‌లో మతతత్వ పోరాటం ఉగ్రవాదంగా మారింది. ఇప్పుడు సొంతవారినే చంపుతున్నారు. దీన్ని నియంత్రించాలి. తాలిబన్లకు శిక్షణ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పంపించాం. తాలిబన్లు, లాడెన్, జవహరి వంటి ఉగ్రవాదులు అప్పట్లో హీరోలు. ఆ తర్వాత విలన్లుగా మారారు' అని ముష్రాఫ్ చెప్పారు. -
పాక్‌పై బాంబు పేల్చిన ఆ దేశ మాజీ రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: పాకిస్ధాన్ మరోఇరకాటంలో పడింది. ఆ దేశానికి చెందిన మాజీ రక్షణ శాఖమంత్రి ఓ భారతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్‌కు ముందే తెలుసని, తమ దేశమే అతడికి ఆశ్రయం కూడా ఇచ్చిందని పాకిస్థాన్ మాజీ రక్షణ శాఖమంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్ చెప్పారు. అహ్మద్ వ్యాఖ్యలు తెలుసుకున్న పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ డైరెక్టర్ జనరల్ పర్వేశ్ ముషార్రప్, రషీద్ ఖురేషి తీవ్రంగా ఖండించారు. అహ్మద్ ఒక అబద్ధాలకోరు అని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అసలు తమ దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు తమకు తెలియనే తెలియదని, తమకు తెలియకుండానే అమెరికా అబోటాబాద్‌లోని లాడెన్ నివాసంపై దాడులు చేసి హతమార్చిందని పాకిస్థాన్ ప్రపంచాన్ని నమ్ముతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ రక్షణశాఖ మంత్రి స్వయంగా పాకిస్థాన్‌కు అంతా తెలుసని వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 'అహ్మద్ ముక్తార్ ఇలాంటి మాటలను అన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక వేళ ఆయన నిజంగా ఈ మాటలు అంటే ముక్తార్‌కు ఏదో అయి ఉంటుంది. ముక్తార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొత్తం పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసింది. అయితే, పాక్ అధ్యక్షుడికి నాటి లాడెన్ గురించి ముందే తెలుసు అని అన్నట్లు నేను మాత్రం విన లేదు' అని రషీద్ ఖురేషి అన్నారు. 2008 నుంచి 2012 మధ్య కాలంలో అహ్మద్ ముక్తార్ పాక్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. నాటి ప్రధాని యూసఫ్ రజా గిలానీ కేబినెట్లో ఉన్న ఐదుగురు మంత్రుల్లో ముక్తార్ కూడా ఒకరు. లాడెన్ చనిపోయిన దాదాపు నాలుగన్నరేళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్ ఇప్పటి వరకు అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మించిందని ముక్తార్ వ్యాఖ్యలతో అర్థమైందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. -
9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్ఐఎస్
సిరియా: అమెరికాను వణికించిన 9/11 దాడులను పునరావృతం చేస్తామని, అందుకోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో హెచ్చరించారు. 2001, సెప్టెంబర్ 9న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వీడియోను రూపొందించారు. వెనకాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోతున్న దృశ్యాల ముందు కూర్చొని ఒసామా బిన్ లాడెన్ అమెరికాను ఉద్దేశించి చేసిన హెచ్చరికలను కూడా వీడియోలో పొందుపర్చారు. అమెరికన్లను, యూదులు, క్రైస్తవులను ప్రతి ముస్లిం ద్వేషించే రోజులు వస్తాయని, ఈలోగా ప్రపంచంలోని జిహాదీలంతా ఏకం కావాలని ఐఎస్ఐఎస్ టైస్టులు వీడియోలో పిలుపునిచ్చారు. ‘అల్లా సైనికులం సిద్దంగా ఉన్నాం’ అనే మార్చింగ్ సాంగ్‌తో జీపుల్లో టెర్రరిస్టులు వెళుతున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. సెప్టెంబర్ దాడులను పునరావృతం చేస్తామంటూ రెండు ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా టెర్రరిస్టులు హెచ్చరించారు. -
లాడెన్ నోట గాంధీ మాట
మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ తన శ్రేణులకు పిలుపు అమెరికా వస్తువులను బహిష్కరించాలని సూచన వెలుగులోకి వచ్చిన 1993 నాటి లాడెన్ ఉపన్యాసాలు లండన్: 'భారత జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని అమెరికా వస్తువులను బహిష్కరిద్దాం' ఇలా పిలుపునిచ్చింది ఎవరో శాంతి కాముకుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదాకు ఒకప్పటి అధినేత ఒసామా బిన్ లాడెన్ స్వయంగా తన మద్దతుదారులతో పలికిన మాటలు ఇవి. 1993 లో ఒక ఉపన్యాసంలో తన శ్రేణులను ఉద్దేశించి లాడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన ఆడియో టేపులు ఇటీవల బయటపడ్డాయి. 1997 నుంచి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ స్థావరంగా లాడెన్ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమెరికా సైన్యం 2001లో అఫ్గాన్‌పై దాడి చేయడంతో లాడెన్‌తో పాటు అతడి మద్దతుదారులు చాలామంది అక్కడి నుంచి పారిపోయారు. ఈ సందర్భంలో లాడెన్‌కు సంబంధించిన వేలాది ఆడియో టేపులను అక్కడే వదిలేశారు. ఈ టేపులు చాలా మంది చేతులు మారి చివరకు అఫ్గాన్ మీడియా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ప్లాగ్ మిల్లర్‌కు చిక్కాయి. అరబిక్ సాహిత్యంలో నిపుణుడైన ప్లాగ్ ఈ టేపులపై పరిశోధన చేసి 'ది ఆడాసియస్ అసెంటిక్' పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. 1960 నుంచి 2001 వరకు లాడెన్‌తో పాటు 20 మంది ప్రముఖుల ఆడియో టేపుల సమాచారం ఈ పుస్తకంలో ఉంది. 1993 సెప్టెంబర్ నాటి ఒక టేపులో తన శ్రేణులనుద్దేశించి ప్రసంగించిన లాడెన్.. మహాత్ముడి గురించి ప్రస్తావించారు. గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా లాడెన్ మొదటిసారి మాట్లాడింది కూడా ఈ టేపులోనే కావడంవిశేషం. -
మిస్టరీగా మారిన లాడెన్ కుటుంబసభ్యుల మృతి
లండన్: ఆల్కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల మృతి మిస్టరీగా మారింది. లండన్ సమీపంలోని హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషే ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో లాడెన్ సవతి తల్లి, ఆమె భర్త, కూతురుతోపాటు పైలట్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటలీ నుంచి బ్రిటన్ వైపు వారు ప్రయాణిస్తున్న వేళ విమానం కండిషన్లోనే ఉందని విమానయాన నిపుణుడు జులియన్ బ్రే అభిప్రాయపడినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ల్యాండ్ కావడానికి సరిపడినంతా రన్‌వే ఉన్నా పైలట్ విమానాన్ని పక్కనే ఉన్న కార్ల షెడ్ ఫెన్సింగ్‌పైకి తీసుకెళ్లడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగి పేలుడు సంభవించడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఎంత ఎక్కువ ఎత్తులో ఉన్నా, తక్కువ ఎత్తులో ఉన్నా అర మైలు దూరంలో ఉన్న ప్రాంతాన్ని కూడా గమనించేందుకు వీలుగా నాలుగు ఇండికేటర్లు ఉన్నాయని, అయినా పైలట్ అలా ఎందుకు చేశాడో అర్థం కావడంలేదని పైలట్ ఇన్స్ట్రక్టర్ సైమన్ మూర్స్ అనుమానం వ్యక్తం చేశారు. -
విమాన ప్రమాదంలో లాడెన్ కుటుంబ సభ్యుల మృతి
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్‌కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషె ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్‌వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్‌ను తాకి సమీపంలో ఉన్న కార్ల వేలంపాట సంస్థ ప్రదేశంలో బోల్తాపడి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా నలుగురు మృతిచెందారు. మృతుల్లో లాడెన్ సవతి తల్లి, సోదరి, ఆమె భర్త ఉన్నట్లు అరబ్ మీడియా పేర్కొంది. ఇటలీలోని మిలాన్-మాల్పెన్సా ఎయిర్‌పోర్టు నుంచి ఈ విమానం బయలుదేరింది. బిన్ లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ లాడెన్ సైతం 1967లో సౌదీ అరేబియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందారు. -
‘26/11 వీరోచిత చర్య’
వాషింగ్టన్: భారత్ లోని ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి (26/11) ఒక వీరోచితమైన చర్యగా అల్‌కాయిదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ అభివర్ణించాడు. పాకిస్తాన్ నేతృత్వంలో లష్కర్ ఏ తోయిబా నిర్వహించిన ఆపరేషన్ ఒక అద్భుతమని పేర్కొన్నాడు. పాక్‌లో 2011 మే 2 న లాడెన్‌ను హతమార్చినప్పుడు అక్కడ దొరికిన వేలాది డాక్యుమెంట్లను అమెరికా డీకోడ్ చేసింది. వీటిలోని కొన్ని పత్రాలను బుధవారం విడుదల చేసింది. ‘మన లక్ష్యం అమెరికా కావాలి.. అంతే కానీ, ముస్లిం సమాజం మధ్య అంతర్గత యుద్ధాన్ని సృష్టించవద్దు’ అని లాడెన్ తన అనుచరులను హెచ్చరించినట్లు ఓ పత్రంలో ఉంది. -
బిన్ లాడెన్‌ను అమెరికాకు 'అమ్మేశారా'?
అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని సైతం గజగజ వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఎలా చనిపోయాడు? అమెరికన్ నిఘా వర్గాలు అతడి ఆచూకీని అత్యంత రహస్యంగా కనుగొని.. నేవీ సీల్స్ బృందాలను హఠాత్తుగా పంపి.. అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌లో చంపేశారని ఇన్నాళ్లూ అనుకుంటున్నాం కదు. కానీ కాదట.. కొంతమంది పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు కలిసి ఒసామా బిన్ లాడెన్‌ను దాదాపు ఐదేళ్ల పాటు అబోతాబాద్లో దాచిపెట్టిన తర్వాత.. దాదాపు 160 కోట్ల రూపాయలకు లాడెన్‌ను అమెరికాకు అమ్మేశారట!! ఈ సంచలనాత్మకమైన విషయాన్ని హెర్ష్ అనే అమెరికన్ పాత్రికేయుడు బయటపెట్టాడు. గతంలో వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా చేసిన అతి చేష్టలను బయటపెట్టిన చరిత్ర ఈ పాత్రికేయుడికి ఉంది. 2010 సంవత్సరంలో పాక్ నిఘా విభాఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి తమ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయానికి స్వయంగా వెళ్లి.. అక్కడ సీఐఏ స్టేషన్ చీఫ్ జొనాథన్ బ్యాంక్‌ను కలిశారని, తనకు భారీ మొత్తం ఇస్తే.. లాడెన్ ఆచూకీ చెబుతానని ఆఫర్ పెట్టారని హెర్ష్ తన కథనంలో రాశారు. అయితే ఆ మాటలను వెంటనే నమ్మని సీఐఏ వర్గాలు ఆ ఉన్నతాధికారికి పాలిగ్రఫీ టెస్టులు చేయించగా.. అతడు చెప్పిన విషయం నిజమేనని తేలింది. దాంతో అబోతాబాద్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, లాడెన్ ఉన్న భవనం మొత్తాన్ని శాటిలైట్ నిఘాలో ఉంచారు. 2010 అక్టోబర్ నాటికి లాడెన్‌ను ఎలా హతమార్చాలన్న ప్రణాళికలపై చర్చించే దశకు చేరుకున్నారు. తర్వాత 2011 సంవత్సరంలో ఆనాటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ అష్ఫఖ్ కయానీ, ఐఎస్ఐ అధినేత అహ్మద్ షుజా పాషా ఇద్దరూ అమెరికా నేవీ సీల్స్ బృందానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి లాడెన్‌ను హతమార్చేందుకు తోడ్పడ్డారని కూడా హెర్ష్ తన కథనంలో పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి రావాలనుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాయే ఇందుకు ముందునుంచి ప్రణాళికలు వేశారని ఆరోపించారు. ఈ మొత్తం విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ఉప్పందించారట. అయితే... యథాప్రకారం అమెరికా ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించింది. హెర్ష్ రాసినవన్నీ నిరాధార విషయాలని తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ కథనాలను తప్పని చెప్పింది. తమ అధికారులెవ్వరూ డబ్బులు తీసుకుని లాడెన్ ఆచూకీని అమెరికాకు అందించలేదని స్పష్టం చేసింది. -
లాడెన్‌ను చంపింది నేనే..సీల్ కమెండో వెల్లడి
-
ఒబామాకు లాడెన్ దయ్యం పడితే ఎలా..
మాఫియా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుత ధ్యాస దెయ్యాల చుట్టే తిరుగుతోంది. దయ్యాల కథలతో ప్రేక్షకులను భయపెట్టించేలేకపోయిన వర్మ తన ప్రయత్నానికి ఇంకా పుల్ స్టాప్ పెట్టే దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా ఐస్ క్రీమ్ చిత్రంతో మరోసారి తన హారర్ చిత్రాన్ని ప్రేక్షకుల మీదకు వదలుతున్న వర్మకు మరో దయ్యాల కథ బుర్రలో పుట్టింది. తాజాగా తన దయ్యాల కథను సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ దయ్యంగా మారి ఒబామాను పట్టేసి.. చనిపోయిన అల్ ఖైదా తీవ్రవాదులు వైట్ హౌజ్ ను ముట్టడించే కథ ఎలా ఉంటుందని వర్మ ట్వీట్ చేశారు. A great idea for hollywwood horror film ..Osama Bin Laden's ghost posesses Obama and all dead Alqaeda terrorists haunt the White House— Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2014 -
ముషారఫ్ బండారం బయటపెట్టిన బ్రిటీష్ జర్నలిస్ట్
వాషింగ్టన్/ఇస్లామాబాద్(పిటిఐ): బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్ట్ కార్లోట్టా గాల్ తన తాజా పుస్తకంలో పాకిస్తాన్ మాజీ సైనిక నియంత, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు చెందిన అనేక వాస్తవాలను బయటపెట్టారు. హత్యకు గురైన అల్‌ఖైదా నాయకుడు ఒసామాబిన్ లాడెన్ అజ్ఞాతంలో ఎక్క్డడ ఉండేవాడో ముషారఫ్‌కు తెలుసునని గాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కోసం ఆమె ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్లలో చాలా సంవత్సరాలు జర్నలిస్ట్‌గా పని చేశారు. తను కొత్తగా విడుదల చేసిన 'రాంగ్ ఎనిమీ' అనే పుస్తకంలో ముషారఫ్‌కు చెందిన అనేక విషయాలను వెల్లడించారు. 300 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఏప్రిల్ 8 నుంచి మార్కెట్లో అమ్మకానికి పెడతారు. కాశ్మీర్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నానని చెప్పే ముషారఫ్, ఆల్‌ఖైదాకు మద్దతు ఇవ్వడంలేదని వాదించేవారని ఆ పుస్తకంలో వివరించారు.కోర్టుగనక అనుమతించి ఉంటే ముషారఫ్ పాలనా కాలంలోని అనేక రహస్యాలు వెలుగు చూసి ఉండేవని గాల్ పేర్కొన్నారు. లాడెన్ పాకిస్తాన్‌లోని అబ్బోట్టాబాద్ పట్టణంలో ఒక రహస్య స్థావరంలో ఉండగా 2011 మే నెలలో అమెరికా కమాండోలు దాడి చేసి అతనిని హత్య చేశారు. ఇదిలా ఉండగా, పలు ఇతర కేసులతోపాటు ముషారఫ్ పాకిస్తాన్ కోర్టులో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇస్లామాబాద్‌లోని స్పెషల్ కోర్టులో ముషారఫ్‌పై దేశద్రోహ ఆరోపణలు నమోదయ్యాయి. -
'బిన్ లాడెన్' అంటే భయపడుతున్న లాలూ, పాశ్వాన్!
పాట్నా: ఓట్లను రాబట్టుకునేందుకు ఏది అనుకూలంగా కనిపిస్తే దాన్ని వాడేసుకోవడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉన్న వ్యక్తిని వాడుకున్న బీహార్ నేతలు లాలు ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ లు ప్రస్తుతం ఆయన ముఖం చూస్తేనే దడుసుకుంటున్నారట. గతంలో ఓట్లు రాబట్టేందుకు తనను ఎన్నికల ప్రచారంలో వాడుకున్న నేతలు ఇప్పుడు తానంటనే ముఖం చాటేస్తున్నారని లాడెన్ పోలికతో ఉన్న మెరాజ్ ఖాలిద్ నూర్ అన్నారు. పాట్నాకు చెందిన నూర్ ను 2004లో లోక్ జనశక్తి పార్టీ నేత పాశ్వాన్, 2005 ఎన్నికల్లో ఆర్జేడి అధినేత లాలూ పోటిపడి ప్రచారానికి వాడేసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా మారిన సమయంలో తనను వాడున్నారన్నారని, లాలూ, పాశ్వాన్ తో వేదికలపై ప్రత్యేక ఆకర్షణగా మారానని ఆయన తెలిపారు. 2005 ఎన్నికల్లో బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కూడా తనను అభినందించారని నూర్ గుర్తు చేసుకున్నారు. బీహార్ లోని 83 మిలియన్ల జనాభాలో ముస్లింలు 16 శాతం ఉన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో తాను కలిస్తే పట్టించుకోవడం లేదని, ఓ అంటరానివాడిని చూసినట్టు చూస్తున్నారని నూర్ అన్నారు. -
బిన్ లాడెన్ పై సమంత ప్రేమగీతం!
ఓ షేక్ ఒసామా నీవు నాకు ఓ తండ్రి.. ఓ అన్న లాంటి వాడివి.. నిన్ను ఎవరూ ప్రేమించనంతగా నేను ప్రేమించాను.. భౌతికంగా నీవు లేకపోయినా.. నీవు అందించిన స్పూర్తితో ముస్లింలందరూ ఏకం కావాలి అంటూ అంతర్జాతీయ నేరస్థుడు, కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పై ఉన్న ఇష్టాన్ని 'వైట్ విడో' పేరున్న మరో ఉగ్రవాది సమంత లేత్వయిటే వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా బిన్ లాడెన్ ప్రేమించే వాళ్లుంటారా? ఉన్నా సరే.. బహిరంగంగా లేఖ ద్వారా ప్రేమను వ్యక్త పరుస్తారా? బిన్ లాడెన్‌ను ప్రేమించే వ్యక్తి మరో ఉగ్రవాది అన్నా అయుండాలి లేదా ఇస్లామిక్ మత తీవ్రవాది గా ముద్ర పడాలి.. ఇంకా అమెరికాపై పీకల్లోతు ద్వేషంతో రగిలిపోతుండాలి. ఇవన్నీకాకపోయినా కూడా ఇష్టం ఉంటుందా అంటే అవుననే చెప్పక తప్పట్లేదు. 'వైట్ విడో' పేరుతో ప్రసిద్దురాలైన, వివాదస్పద రీతిలో ఇస్లాం మతాన్ని పుచ్చుకున్న సమంత లేత్వయిటే అనే ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అందుకు సాక్ష్యంగా నిలిచింది. 2013 సెప్టెంబర్‌లో నైరోబిలోని మాల్ పై జరిగిన ఉగ్రదాడి వెనుక సమంత లేత్వయిటేదే హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒసామా బిన్ లాడెన్ పై తనకు ప్రేమ ఉన్నట్టు ఆమె రాసిన లేఖలు బహిర్గతమవ్యడం చర్చనీయాంశమైంది. బిన్ లాడెన్ పై ఉన్న అభిమానాన్ని, ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తం చేస్తూ సమంత రాసిన లేఖ బ్రిటన్‌లోని అంతర్జాతీయ పత్రికల్లో ప్రధాన శీర్షికగా నిలిచింది. ఒసామాను తాను ఎంతగా ఇష్టపడిందో ఓ భావగీతాన్ని సమంత రచించిందని ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. సమంత రాసిన లేఖ అంతా తప్పుల తడకగా ఉన్నా.. అల్ ఖైదా వ్యవస్థాపకుడిపై తనకున్న ప్రేమను వ్యక్తం పరచడంలో సఫలమైందంటూ కథనాన్ని వెల్లడించింది. ఒసామా మరణంతో కుంగిపోయిన సమంత.. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం కూడా చేసిందట. ఆమె నేర చరిత్ర కూడా ఘనంగానే ఉంది. ఇటీవల పోలీసులు జరిపిన సోదాలో సమంతకు చెందిన కంప్యూటర్, ఓ పెన్ డ్రైవ్ తోపాటు.. బాంబుల తయారీపై పరిశోధనకు ఆధారాలు లభించడంతో ఇంటర్ పోల్ అధికారులకు ముచ్చెమటలు పట్టాయట. కొద్దికాలం క్రితం నైరోబిలో సోమాలి ఇస్లామిక్ గ్రూప్ అల్ షాబాద్ దాడులు జరిపిన సమయంలో అక్కడే సమంత లేత్వయిటే ఉన్నట్టు తెలిసింది. 2005 జూలై 7 తేదిన కింగ్స్ క్రాస్, రస్సెల్ స్క్వేర్ ట్యూబ్ స్టేషన్ లో మానవ బాంబుగా మారిన జర్మైన్ లిండ్సే భార్య.. ఆ బాంబు పేలుళ్లు జరిగిన ఆరు రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు గృహనిర్భంధం విధించి విచారించారు. లండన్ పేలుళ్లతో లేత్వయిటేకు ఉగ్రవాదులతో సంబంధమున్నట్టు సాక్ష్యాలు లభించాయి. ఆ సంఘటన తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మారింది. సమంతాను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ అన్వేషణ కొనసాగిస్తునే రెడ్ నోటిస్ ను జారీ చేసింది. గత కొద్దికాలంగా ఆమె సోమాలి రాడికల్ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అల్ షాబాబ్ సభ్యురాలిగా కొనసాగుతోంది. ముస్లిమేతర ఆలయాల్లో గ్రెనేడ్ దాడులకు పాల్పడినట్టు అనేక కేసులు నమోదయ్యాయి. 2012లో మాంబాసాలోని ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన దాడిలో సమంత కీలక సూత్రధారి. ఇలాంటి నేర చరిత్ర కలిగి అంతర్జాతీయ పోలీసులకు సవాల్ గా నిలిచిన సమంతా లేత్వయిటే ను మట్టుబెట్టకపోతే.. మరింత ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.