9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్‌ఐఎస్ | ISIS video on 9/11 anniversary sees extremists threaten new attacks on US | Sakshi
Sakshi News home page

9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్‌ఐఎస్

Published Tue, Sep 15 2015 3:02 PM | Last Updated on Sat, Sep 1 2018 5:08 PM

9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్‌ఐఎస్ - Sakshi

9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్‌ఐఎస్

సిరియా: అమెరికాను వణికించిన 9/11 దాడులను పునరావృతం చేస్తామని, అందుకోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో హెచ్చరించారు. 2001, సెప్టెంబర్ 9న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వీడియోను రూపొందించారు. వెనకాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోతున్న దృశ్యాల ముందు కూర్చొని ఒసామా బిన్ లాడెన్ అమెరికాను ఉద్దేశించి చేసిన హెచ్చరికలను కూడా వీడియోలో పొందుపర్చారు.

అమెరికన్లను, యూదులు, క్రైస్తవులను ప్రతి ముస్లిం ద్వేషించే రోజులు వస్తాయని, ఈలోగా ప్రపంచంలోని జిహాదీలంతా ఏకం కావాలని ఐఎస్‌ఐఎస్ టైస్టులు వీడియోలో పిలుపునిచ్చారు. ‘అల్లా సైనికులం సిద్దంగా ఉన్నాం’ అనే మార్చింగ్ సాంగ్‌తో జీపుల్లో టెర్రరిస్టులు వెళుతున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. సెప్టెంబర్ దాడులను పునరావృతం చేస్తామంటూ రెండు ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా టెర్రరిస్టులు హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement