ISIS video
-
ఐసిస్ మరో ఘాతుకం
డయాస్కస్/అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. టర్కీ సైనికులను సజీవ దహనం చేసినట్లున్న ఓ వీడియోను ఉగ్రవాదులు విడుదలచేశారు. గత నెల రోజులుగా ఇద్దరు టర్కీ సైనికులను బంధించి బోనులో పెట్టి, ఆపై చిత్ర హింసలకు గురిచేసి సజీవదహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాది గ్రూప్ వెబ్ సైట్లలో గురువారం పోస్ట్ చేసిన ఆ వీడియో కలకలం రేపింది. ఇటీవల 16 మంది సైనికులను ఇస్లామిక్ స్టేట్ హత్యచేసింది. ఇదే క్రమంలో టర్కీ సైనికులపై తమ దాడులను టర్కీ సైనికుల సజీవదహనం ఘటన 2014 డిసెంబర్ లో ఉగ్రవాదులు జోర్డాన్ ఫైటర్ జెట్ ఫ్లైట్ పైలట్ మాజ్ అల్ కసాస్బ్ ను బోనులో బంధించి, ఆపై చిత్రహింసలకు గురిచేసి బోనులోనే సజీవ దహనం చేసిన ఘటనను తలపిస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సజీవదహనానికి గురైన సైనికులను జిహాదిస్టులు బంధించినట్లు ఐఎస్ఐఎస్ అనుబంధ న్యూస్ ఏజెన్సీ అమఖ్ గత నెలలోనే కథనాలు అందించింది. ముఖ్యంగా గత మూడు రోజులుగా సిరియాలోని పలు ప్రాంతాలలో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని అధికారులు ఆరోపిస్తున్నారు. -
ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాం!
'మేం తిరిగి వస్తున్నాం. బాబ్రి మసీదు విషయంలో, కశ్మీర్, గుజరాత్, ముజఫర్‌నగర్‌లలో ముస్లిలంను చంపిన విషయంలో చేతుల్లో కత్తులు పట్టుకొని ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్నాం'.. అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజాగా ఓ వీడియోను ఆన్లైన్లో పోస్టుచేసింది. 22 నిమిషాల నిడివితో అరబిక్ భాషలో ఉన్న ఈ డాంక్యుమెంటరీలో భారత్‌కు చెందిన వ్యక్తులుగా భావిస్తున్న ఉగ్రవాదులు తమ సంస్థలో ఏయే హోదాలో ఉన్నారో వెల్లడించింది. 2014 నుంచి ఇరాక్, సిరియాలో ఫైటర్లుగా కొనసాగుతున్న ఐదుగురు జిహాదిస్టుల ఇంటర్వ్యూలను ఇందులో పొందుపర్చింది. శుక్రవారం ఉదయం ఆన్లైన్లో ఈ వీడియో దర్శనమిచ్చింది. భారత్, దక్షిణాసియాపై ప్రధాన దృష్టితో ఐఎస్ఐఎస్ విడుదల చేసిన తొలి వీడియో ఇది కావడం గమనార్హం. ఇందులోని పేర్కొన్న భారతీయ వ్యక్తుల్లో ఒక్కడిని మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. 2014లో సిరియా చేరుకున్న థానెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫహద్ తన్వీర్ షైక్ ఇంటర్వ్యూలో ఈ వీడియోలో ఉండటం గమనార్హం. అతడు మరో ఇద్దరితో కలిసి ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిరియా వెళ్లాడు. షైక్ అబూ అమర్ ఆల్ హిందీ మారుపేరుతో ఈ వీడియోలో మాట్లాడాడు. బాబీ మసీదు విధ్వంసం, కశ్మీర్, గుజరాత్, ముజఫర్ నగర్లో ముస్లింల హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ వస్తున్నామని అతడు హెచ్చరించాడు. అతనితోపాటు సిరియా వెళ్లి గత ఏడాది రఖ్ఖాలో జరిగిన బాంబు దాడిలో చనిపోయినట్టుగా భావిస్తున్న తన స్నేహితుడు, థానెకు చెందిన షమిమ్ టాంకికి షైక్ నివాళులర్పించాడు. సిరియాకు వెళ్లిన అతని మరో స్నేహితుడు అరీబ్ మజిద్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధీనంలో ఉన్నాడు. -
మా తల్వార్లకు వారే లక్ష్యం!!
-
మా తల్వార్లకు వారే లక్ష్యం!!
బీరట్, లెబానాన్: పారిస్‌లో 130 మందిని పొట్టనబెట్టుకున్న నరమేధానికి పాల్పడిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు వీరేనంటూ ఐఎస్ఐఎస్ గ్రూపు ఓ వీడియో విడుదల చేసింది. నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రాన్స్ పౌరులు, ఇద్దరు ఇరాకీలు పారిస్ దాడిలో పాల్గొన్నారని తమ వెబ్సైట్లలో పోస్టుచేసిన ఈ వీడియోలో పేర్కొంది. 'వాళ్లు ఎక్కడ కనిపిస్తే.. అక్కడ చంపండి' పేరిట విడుదల చేసిన ఈ వీడియోలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దేశాలకు ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న బ్రిటనే తమ తదుపరి లక్ష్యమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. 2014 సెప్టెంబర్ నుంచి సిరియా, ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ ఫైటర్లపై దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి దేశాలన్నింటికీ ఈ సందేశం వర్తిస్తుందని ఫ్రెంచ్, అరబ్ భాషలో ఉగ్రవాదులు ఈ వీడియోలో హెచ్చరించారు. ఈ వీడియోలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ఫొటోను చూపించి.. దానితోపాటు 'అవిశ్వాసులతో జతకలిసే ప్రతి ఒక్కరూ మ తల్వార్లకు లక్ష్యం కావాల్సిందే' అని ఇంగ్లిష్‌లో పేర్కొన్నారు. పారిస్ దాడితో ఫ్రాన్స్‌ను గడగడలాడించిన తొమ్మిది మంది ఉగ్రవాదులు 'సింహాల్లాంటి' వారని ఈ వీడియోలో పేర్కొన్నారు. పారిస్ దాడికి ముందు ఈ ఉగ్రవాదులు తమకు చిక్కిన నిస్సహాయుల్ని తలనరికి చంపుతున్న దృశ్యాలను ఇందులో చూపించారు. ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం అయిన 'అల్ హయత్' ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో పారిస్ దాడి ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా చూపించారు. -
9/11 దాడులను పునరావృతం చేస్తాం: ఐఎస్ఐఎస్
సిరియా: అమెరికాను వణికించిన 9/11 దాడులను పునరావృతం చేస్తామని, అందుకోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో హెచ్చరించారు. 2001, సెప్టెంబర్ 9న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వీడియోను రూపొందించారు. వెనకాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోతున్న దృశ్యాల ముందు కూర్చొని ఒసామా బిన్ లాడెన్ అమెరికాను ఉద్దేశించి చేసిన హెచ్చరికలను కూడా వీడియోలో పొందుపర్చారు. అమెరికన్లను, యూదులు, క్రైస్తవులను ప్రతి ముస్లిం ద్వేషించే రోజులు వస్తాయని, ఈలోగా ప్రపంచంలోని జిహాదీలంతా ఏకం కావాలని ఐఎస్ఐఎస్ టైస్టులు వీడియోలో పిలుపునిచ్చారు. ‘అల్లా సైనికులం సిద్దంగా ఉన్నాం’ అనే మార్చింగ్ సాంగ్‌తో జీపుల్లో టెర్రరిస్టులు వెళుతున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. సెప్టెంబర్ దాడులను పునరావృతం చేస్తామంటూ రెండు ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా టెర్రరిస్టులు హెచ్చరించారు.