అమెరికాకు లాడెన్ కొడుకు హెచ్చరిక | osama Bin Laden's son threatens revenge for father's assassination - monitor | Sakshi
Sakshi News home page

అమెరికాకు లాడెన్ కొడుకు హెచ్చరిక

Published Sun, Jul 10 2016 4:42 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాకు లాడెన్ కొడుకు హెచ్చరిక - Sakshi

అమెరికాకు లాడెన్ కొడుకు హెచ్చరిక

అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను చంపినందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని అతని కొడుకు హంజా బిన్ లాడెన్  హెచ్చరించాడు. హంజా బిన్ మాట్లాడిన 21 నిమిషాల నిడివిగల ఆడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు.

అమెరికా, దాని మద్దతు దేశాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గ్రూప్ పోరాటాన్ని కొనసాగిస్తామని హంజా బిన్ చెప్పాడు. మేమందంరం ఒసామాలమేనని అన్నాడు. ఈ ఆడియోలోని వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా గడ్డపైనా, విదేశాల్లోనూ మిమ్మల్ని టార్గెట్ చేస్తామని, దాడులు కొనసాగిస్తామని హంజా హెచ్చరించాడు. పాలస్తీనా, అఫ్ఘానిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సొమాలియా ఇతర ముస్లిం దేశాల్లో అమాయక పౌరులను హింసిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లిస్తారని అమెరికాను ఉద్దేశిస్తూ పేర్కొన్నాడు.

2011లో పాకిస్థాన్లో రహస్యంగా దాక్కున్న ఒసామా బిన్ లాడెన్ను అమెరికా కమెండోలు హతమార్చాయి. ఒసామాను హతమార్చడంతో అల్ ఖైదా గ్రూపునకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాగా ఒసామా అనుచరులు ఆయన కొడుకు హంజాతో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని గతేడాది అమెరికా వెల్లడించింది. పాకిస్థాన్లో ఒసామాపై అమెరికా బలగాలు దాడి చేసే ముందుకు హంజా తండ్రితో కలసి ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హంజా వయసు పాతికేళ్లు ఉండొచ్చు. మిలిటెంట్లకు ప్రేరణ ఇచ్చేందుకు హంజా యువగొంతుకగా వస్తున్నాడని గతేడాది అల్ ఖైదా నేత అయిమన్ అల్ జవహరి ఓ ఆడియో ప్రసంగంలో వెల్లడించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement