hamza bin laden
-
అవును.. ఆయన చనిపోయింది నిజమే : ట్రంప్
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా బిన్ లాడెన్ (30) మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు నోరు విప్పారు. హమ్జా హతమైందని నిజమేనని చెప్పారు. ఉగ్ర నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అమెరికా సేనలు జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గానిస్తాన్/పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో హమ్జా మృతి చెందినట్టు వైట్‌హౌజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. హమ్జా మృతి చెందినట్టు గత నెలలోనే వార్తలు వెలువడ్డాయి. దీని వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే, ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు అధ్యక్షుడు ట్రంప్ అప్పట్లో నిరాకరించారు. (చదవండి : మమ్మల్ని చాలా సార్లు బెదిరించాడు: ట్రంప్) ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7కోట్లు) ఇస్తామని అమెరికా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి : బిన్ లాడెన్ కుమారుడు హతం!) (చదవండి : విషాద జ్ఞాపకానికి 18 ఏళ్లు..) -
‘అతడు చాలా నీచంగా మాట్లాడేవాడు’
వాషింగ్టన్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా లాడెన్ హతమైనట్లు అమెరికా మీడియా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శ్వేతసౌధ వర్గాలు ఈ విషయంపై నోరు మెదపలేదు. దీంతో హంజా హతం వెనుక అమెరికా హస్తం ఉందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ...హంజా ఎన్నోసార్లు తమ దేశం గురించి చాలా నీచంగా మాట్లాడేవాడని అన్నారు. అదే విధంగా అగ్రరాజ్యం అంతుచూస్తానంటూ బెదిరించేవాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతానికి హంజా మృతి విషయమై మాత్రం తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. కాగా హంజా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్బీసీ న్యూస్ చానల్, న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాలు వెలువరించాయి. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్ అధికారులు తెలిపినట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హంజా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బిన్ లాడెన్ కుమారుడు హతం!
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. దీని వెనుక అమెరికా హస్తం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హమ్జా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పింది. ఎన్బీసీ కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంగీకరించలేదు.. కనీసం ఖండిం చనూ లేదు. అల్‌కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్బీసీ, న్యూయార్క్ టైమ్స్ కథనాలను బట్టి తెలుస్తోంది. లాడెన్ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్ మూడో భార్య కొడుకు. కాగా, హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు. జిహాద్‌కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. తన తండ్రి లాడెన్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేవాడు. హమ్జా ఎక్కడున్నాడనే విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్లో గృహనిర్బంధంలో ఉన్నాడని, అఫ్గానిస్తాన్‌లో ఉన్నాడని, పాకిస్తాన్, సిరియాలో తలదాచుకునే వాడని భావిస్తూ ఉండేవారు. లాడెన్‌ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్‌కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. -
బిన్ లాడెన్ కుమారుడు హిమ్జా బిల్ లాడెన్ మృతి
-
బిన్ లాడెన్ కొడుకు హంజా మృతి!
వాషింగ్టన్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్బీసీ న్యూస్ సంచలన వార్త వెలువరించింది. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్ అధికారులు తెలిపినట్లు సదరు ఛానల్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గానీ, శ్వేతసౌధ వర్గాలు గానీ హంజా మరణాన్ని ధ్రువీకరించలేదు. కాగా పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన తర్వాతే హంజా మరణవార్త నిజమా కాదా అన్న అనుమానాలు తేటతెల్లమవనున్నాయి. -
లాడెన్ కొడుకుపై ఐరాస ఆంక్షలు
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి భద్రతా మండ లి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ (29)ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. అతని ఆచూకీ లేదా సమాచారం ఇచ్చిన వారికి అమెరి కా రూ.7 కోట్లు రివార్డు ప్రకటించి రోజే భద్రతా మం డలి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హమ్జాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించడంతో ఇకపై అతడు స్వేచ్ఛగా తిరగలేడు. అతని ఆర్థిక వనరులను స్తంభింపజేయనున్నారు. అంతేకాకుండా ఆయు ధాలు కొనడం, అమ్మడంపై కూడా నిషేధం విధించనున్నారు. అలాగే సౌదీ అరేబియా కూడా హమ్జా పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవా రం ప్రకటించింది. పాక్–అఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో హమ్జా ఉన్నట్లు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అల్ ఖైదా నాయకుడిగా ఉ న్న అమన్ అల్–జవహిరికి వారసుడిగా హమ్జా అవుతాడని భావిస్తోంది. 2015 ఆగస్టులో హమ్జా బిన్ లాడెన్ ఒక ఆడియో, వీడియో సందేశాలను విడుదల చేశాడు. అందులో అమెరికా దాని మిత్రదేశాలపై దాడులు చేయాలని అతని అనుచరులకు పిలుపునిచ్చాడు. -
హంజాపై అమెరికా భారీ రివార్డు..!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను పట్టించినవారికి అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7కోట్లు) ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ఇంత భారీ మొత్తంలో ఆఫర్ చేసింది. తమ దేశంపై దాడి చేస్తామని హంజా హెచ్చరించినట్టు కూడా వెల్లడించింది. పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్ 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. (హైజాకర్ కుమార్తెతో లాడెన్ కొడుకు పెళ్లి) హంజా జాడలేదు.. జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 30 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతను పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని వార్తలు వచ్చేవి. హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందని వార్తలు వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పెద్దన్న అమెరికాకు భయం పట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని అమెరికా గట్టి చర్యలను పూనుకుంది. -
పెళ్లి చేసుకున్న బిన్ లాడెన్ తనయుడు
-
హైజాకర్ కుమార్తెతో లాడెన్ కొడుకు పెళ్లి
ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసమా బిన్ లాడెన్ తనయుడు హంజా బిన్ లాడెన్ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబం ప్రకటించింది. ‘ది గార్డియన్’ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హంజా గురించి సంచలన విషయాలను లాడెన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 9/11 దాడులకు నేతృత్వం(లీడ్ హైజాకర్) వహించిన మహ్మద్ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు వివరించారు. అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు. హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఏవీ లేవని తెలిపిన వారు, అల్‌ఖైదా ద్వారా ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగొద్దని హంజాను కోరారు. ప్రభాల్యాన్ని కోల్పోయిన అల్‌ఖైదాకు జీవాన్నిపోసేందుకు హంజా యత్నిస్తున్నాడని పాశ్చాత్య ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఆయా నిఘా సంస్థలు రెండేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. హంజా అఫ్గానిస్తాన్‌లో ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందని లాడెన్ కుటుంబసభ్యులు తెలిపారు. బిన్ లాడెన్‌కు సైతం తమతో సంబంధాలు ఉండేవి కాదని, 1999 నుంచి 2011(చనిపోయే వరకూ) మధ్య ఒక్కసారి కూడా లాడెన్ తమను కలవలేదని చెప్పారు. కాగా, గతేడాది జనవరిలో అమెరికా హంజా బిన్ లాడెన్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించిన సంగతి తెలిసిందే. -
‘ఉగ్ర’ వారసుడి అసలు రూపం..
-
‘ఉగ్ర’ వారసుడి అసలు రూపం..
వాషింగ్టన్ : ఒసామా బిన్ లాడెన్ ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను గడగడలాడించిన అల్‌ఖైదా నాయకుడు. ఓ ఉగ్రవాద సంస్థ నాయకుడి నివాసం ఎలా ఉంటుంది?. సాధారణ జీవితాన్ని వారు గడపగలుగుతారా? అనే సందేహాలు అందరికీ వస్తుంటాయి. 2011లో అమెరికా భద్రతా దళాలు అబోటాబాద్‌లో లాడెన్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన సీఐఏ(సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) లాడెన్ ఇంటిలో దొరికిన కంప్యూటర్ నుంచి లభ్యమైన వివరాలను తాజాగా వెల్లడించింది. లాడెన్ కుటుంబం(భార్య, పిల్లలు, మనవళ్లు)కు చెందిన వీడియోలు ఇందులో ఉన్నాయి. లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు సారథ్యం వహిస్తున్న హంజా లాడెన్ చిన్ననాటి ఫొటో మాత్రమే ఇప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలుసు. హంజా యుక్త వయసులో ఉన్న ఫొటోను కూడా సీఐఏ బయటపెట్టింది. సీఐఏ విడుదల చేసిన వీడియోల్లో బిన్ లాడెన్.. సాధారణ జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. ఆరుబయట లాడెన్ పిల్లలు, మనవళ్ల ఆటపాటలు, ఇంటి నిండా కోళ్లు, ఆవులు, కుందేళ్లు, పిల్లులు.. ఇలా పల్లెటూరి వాతావరణంతో బిన్ లాడెన్ ఆనందంగా గడిపినట్లు అర్థం అవుతోంది. ఓ ఫొటోలో తుపాకీతో లాడెన్ మనవళ్లు వాటర్ బెలూన్లను కాల్చుతున్నారు. ‘వేర్ ఇన్ ది వరల్డ్ ఇజ్ ఒసామా’ అనే పేరుతో వచ్చిన సినిమా కూడా లాడెన్ కంప్యూటర్లో ఉనట్లు సీఐఏ తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా కంప్యూటర్లో దొరికిన అన్ని ఫైళ్లను విడుదల చేయడం లేదని సీఐఏ తన ప్రకటనలో పేర్కొంది. -
వారసుడొచ్చాడు.. ప్రపంచదేశాల గుండెల్లో రైళ్లు!
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలను గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్ర సంస్ధకు వారసుడొచ్చాడా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వివిధ ఉగ్రసంస్ధల సహచర్యంతో తిరుగులేని శక్తిగా ఎదగడానికి అల్‌ఖైదా యత్నిస్తున్నట్లు కూడా సమాచారం. అల్‌ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు 28 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ సంస్ధ పగ్గాలు చేపట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ పీడను వదిలించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్న ప్రపంచరాజ్యాలు.. కొత్తగా ఊపిరులూదుకుని ఓ శక్తిగా వస్తున్న అల్‌ఖైదాను ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచిస్తున్నాయి. ఇందుకోసం హమ్జా కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఒసామా బిన్ లాడెన్ మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తి. దీంతో ఒసామా కొడుకు హమ్జా పిలుపునిస్తే వేలాదిగా ముస్లిం యువత సంస్ధలో చేరి ప్రాణత్యాగానికి సిద్ధపడతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచదేశాల్లో మరింత భయం పెరుగుతోంది. గడిచిన రెండు సంవత్సరాల్లో యూరప్ ఖండంలో అత్యధిక సార్లు ఉగ్రదాడులు జరిగాయి. అల్‌ఖైదా పునరుజ్జీవనం పోసుకుంటుందనే వార్త ఆ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అల్‌ఖైదాకు చెందిన పలువురు అగ్ర నాయకులు కూడా గతంలో హమ్జానే వారసుడని తీర్మానించారు. రెండేళ్ల క్రితమే అతన్ని ‘గుహ నుంచి వచ్చిన సింహం’ అని అల్‌ఖైదా కీలక నేత అల్ జవహరి అభివర్ణించాడు. ఒసామాకు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం. సౌదీ అరేబియాకు చెందిన ఆమె మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో హమ్జా తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. మొదట సౌదీ అరేబియా, సుడాన్, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్లలో కూడా నివసించాడు. హమ్జాకు కూడా వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే, హమ్జా ఎదిగిన తర్వాతి ఫోటో ఇంతవరకూ బయటకు రాలేదు. కేవలం అతని చిన్ననాటి ఫోటోనే నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. హమ్జాను అల్‌ఖైదా కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు భావించేవారు. అయితే తాను దూరంగా ఎందుకుండాలంటూ హమ్జా వారితో వాదించేవాడట. అమెరికాలో దాడులు అనంతరం ఒసామా బిన్ లాడెన్, ఇతర అనుచరులు తూర్పు అఫ్ఘానిస్థాన్లోని తోరాబోరా కొండల్లో దాక్కున్నారు. అప్పుడే ఒసామా తన భార్యాపిల్లలను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు పంపించి వేశాడు. అనంతరం హమ్జా తండ్రిని పెద్దగా కలిసింది లేదు. ఇరాన్లో దాదాపుగా గృహ నిర్బంధంలో ఉన్నట్టుగా ఉండేవాడు. దీనిపై అసంతృప్తి చెందుతూ పవిత్ర సైనికుని(మొజాహిదీన్)గా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 2009లో తండ్రికి పెద్ద ఉత్తరం రాశాడు హమ్జా. ఉగ్ర పోరాటాలతో సాధ్యమైనన్ని మార్గాల్లో ఆయా దేశాలకు నష్టం కలిగించాలని అనుచరులకు హమ్జా చెబుతున్నట్టు తెలిసింది. -
ప్రతీకారంతో రగులుతున్న లాడెన్ కొడుకు!
వాషింగ్టన్: తన తండ్రి, అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యపై అతడి కుమారుడు హంజా బిన్ లాడెన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలో 9/11 దాడుల విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వెల్లడించారు. 2011 మే2 న లాడెన్‌ను మట్టుబెట్టిన సమయంలో కొన్ని లేఖలను తన బృందం స్వాధీనం చేసుకున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. వాటి ప్రకారం.. తండ్రి తర్వాత అల్ ఖైదాకు తాను నాయకత్వం వహిస్తానని, జిహాద్ మార్గాన్ని తాను ఎంచుకుంటానని అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడతానని తండ్రి బిన్ లాడెన్‌కు హంజా మాటిచ్చాడు. ఇటీవల హంజా రెండు నిమిషాల ఆడియో టేపులు కలకలం రేపిన విషయం తెలిసిందే. 'నేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నాను. అమెరికన్లు జాగ్రత్త.. అల్ ఖైదా మీ పై ప్రతీకారం కోసం ఎప్పుడూ రగిలిపోతుంటుంది. మేం వేసే ప్రతి అడుగు మీ నాశనానికి దారి తీస్తుంది. ఇరాక్.. అఘ్గనిస్తాన్‌లకు మీరు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ మరిచిపోము. ఇదంతా మీపై ప్రతీకారానికి సంకేతాలు' అని హంజా ఆడియో సందేశాలలో ఉన్న విషయాన్ని అధికారి ప్రస్తావించారు. బిన్ లాడెన్ తరహాలో హంజా మాట్లాడుతున్నాడని, ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేయడం.. అమెరికాను నాశనం చేశడమే తన ముందున్న లక్ష్యమంటూ హెచ్చరిస్తున్నాడని ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వివరించారు. జిహాదీలు అందరినీ ఏకం చేసి అమెరికాపై దాడి చేసేందుకు అల్ ఖైదా నేత హంజా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. -
లాడెన్ కొడుకు ఎలా ఎంజాయ్ చేసేవాడంటే..?
న్యూయార్క్: ఆల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అమెరికా అంటేనే హంజా పళ్లు పటపట కొరుకుతాడని, అసలు ఆ దేశం పేరు చెబితేనే కళ్లెర్ర జేస్తాడని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అలాంటి అతడు అమెరికా వస్తువులను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అమెరికాకు చెందిన కోకాకోలాను ఉపయోగించడంతోపాటు ఇతర అమెరికా వస్తువులను కూడా వాడుతూ ఎంజాయ్ చేసేవాడట. హంజా చిన్నవయసులో ఉండగా అఫ్గనిస్థాన్‌లో అతడు ఉంటున్న ఇంటి కాంపౌండ్‌లో చాలా వస్తువులు అమెరికావే కనిపించేవని సమాచారం. ‘ఒసామాకు ముద్దుల కొడుకు అయిన హంజా అమెరికాను అసహ్యించుకుంటాడేమోకానీ, అమెరికా వస్తువులను కాదు. ఎందుకంటే అతడి ఇంటి కాంపౌండ్‌లో ఎప్పుడూ కోకాకోలావంటి వస్తువులు కనిపిస్తుండేవి’ అని హంజా చిన్ననాటి స్నేహితుడు అబ్దురహమాన్ ఖాదర్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అతడు మూడేళ్లు హంజాతో కలసి ఉన్నాడు. సాధారణంగా ఇంట్లోకి అలాంటి వస్తువులను అనుమతించేవారు కాదని, కానీ హంజా మాత్రం ప్రతి రోజు వాటిని దొంగచాటుగా తెప్పించుకునే వాడని అతడు తెలిపాడు. అమెరికాకు చెందిన పొగాకు ఉత్పత్తులను కూడా అతడు తొమ్మిదేళ్ల ప్రాయంలో తీసుకొచ్చేవాడని చెప్పారు. ఇటీవల లాడెన్ కొడుకు హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇతనిపై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించాడు. ఆ తర్వాత హంజాపై నిఘా పెట్టిన అమెరికా ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. -
అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటా
బీరుట్ : తన తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ను దారుణంగా చంపిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని అతని కొడుకు హంజా బిన్ లాడెన్ హెచ్చరించాడు. ఈ మేరకు అతను మాట్లాడిన ఒక ఆడియోను అల్‌కాయిదాకు చెందిన మీడియా విభాగం అస్-సాహబ్ శనివారం విడుదల చేసింది. ఇందులో హంజా బిన్ లాడెన్ మాట్లాడుతూ.. అమెరికా నేతల నిర్ణయాలకు అమెరికన్లు జవాబుదారులన్నాడు. ముస్లింలను అణచివేస్తున్నందుకు ప్రతిగా అమెరికాపై జిహాద్ లేదా పవిత్ర యుద్ధాన్ని అల్‌కాయిదా కొనసాగిస్తుందని స్పష్టం చేశాడు. అబొట్టాబాద్‌లో మీరు చేసిన పాపకార్యానికి ఏ శిక్ష పడకుండానే తప్పించుకున్నామని భావిస్తే.. అది పొరపాటేనని వ్యాఖ్యానించాడు. అయితే లాడెన్ కుమారుని జాడ ఇప్పటివరకు తెలియరాలేదు. ప్రస్తుతం అతను అల్‌కాయిదా నాయకత్వ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమెరికాకు లాడెన్ కొడుకు హెచ్చరిక
అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను చంపినందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటానని అతని కొడుకు హంజా బిన్ లాడెన్ హెచ్చరించాడు. హంజా బిన్ మాట్లాడిన 21 నిమిషాల నిడివిగల ఆడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అమెరికా, దాని మద్దతు దేశాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గ్రూప్ పోరాటాన్ని కొనసాగిస్తామని హంజా బిన్ చెప్పాడు. మేమందంరం ఒసామాలమేనని అన్నాడు. ఈ ఆడియోలోని వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా గడ్డపైనా, విదేశాల్లోనూ మిమ్మల్ని టార్గెట్ చేస్తామని, దాడులు కొనసాగిస్తామని హంజా హెచ్చరించాడు. పాలస్తీనా, అఫ్ఘానిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సొమాలియా ఇతర ముస్లిం దేశాల్లో అమాయక పౌరులను హింసిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లిస్తారని అమెరికాను ఉద్దేశిస్తూ పేర్కొన్నాడు. 2011లో పాకిస్థాన్‌లో రహస్యంగా దాక్కున్న ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హతమార్చాయి. ఒసామాను హతమార్చడంతో అల్ ఖైదా గ్రూపునకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాగా ఒసామా అనుచరులు ఆయన కొడుకు హంజాతో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని గతేడాది అమెరికా వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఒసామాపై అమెరికా బలగాలు దాడి చేసే ముందుకు హంజా తండ్రితో కలసి ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హంజా వయసు పాతికేళ్లు ఉండొచ్చు. మిలిటెంట్లకు ప్రేరణ ఇచ్చేందుకు హంజా యువగొంతుకగా వస్తున్నాడని గతేడాది అల్ ఖైదా నేత అయిమన్ అల్ జవహరి ఓ ఆడియో ప్రసంగంలో వెల్లడించాడు. -
ఒసామా బిన్ లాడెన్ కొడుకొచ్చాడు!
సిరియా: ప్రపంచంలో పాశ్చాత్య దేశాలను గడగడలాడించిన అంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్‌కు వారసుడొచ్చాడు. ఆయన 23 ఏళ్ల కుమారుడు హమ్జా బిన్ లాడెన్ తండ్రి బాటలో అల్ కాయిదా నాయకత్వం స్వీకరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా పాశ్చాత్య దేశాలను మట్టి కరిపించేందుకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా సిరియాలోని ముజాహిద్దీన్లంతా ఏకం కావాలంటూ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియా టేప్‌లో పిలుపునిచ్చాడు. ‘ఇస్లామిక్ ఉమ్మా (జాతి) అల్ శ్యామ్ (సిరియా)లోని జిహాదీపై దష్టిని కేంద్రీకరించాలి. ముజాహిద్దీన్లందరిని ఏకం చేయాలి. నేడు ముస్లిం ప్రపంచానికి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచం ఏకమైంది. ఈ తరుణంలో విభేదాలకు, వివాదాలకు ఆస్కారం ఇవ్వరాదు. కలిసికట్టుగా పోరాడాలి’ అని హమ్జా పిలుపునిచ్చారు. ఆయన తన తండ్రికి ఇష్టమైన కవితతో తన సందేశాన్ని ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని అబ్బోటాబాద్‌లో అమెరికా కమాండో ఆపరేషన్‌లో తన తండ్రి ఒసామా బిన్ లాడెన్ హతమైన ఐదేళ్ల తర్వాత హమ్జా తొలిసారి లేదా రెండోసారి జిహాదీలను ఉద్దేశించి సందేశమిచ్చారు. గతేడాది ఆగస్టు నెలలో హమ్జా పేరిట ఓ ఆడియో సందేశం విడుదలైంది. అది అతని సందేశం కాకపోవచ్చనే వార్తలు వెలువడ్డాయి. అప్పటి ఆ సందేశం పెద్దగా ప్రభావం చూపించలేదు. సిరియాలోని జిహాదీలంతా ఏకం కావాలంటూ ఒసామా బిన్ లాడెన్‌కు కుడిభుజంగా వ్యవహరించిన అల్ జవాహిరి శనివారం సందేశం ఇచ్చిన అనంతరం హమ్జా సందేశం కూడా విడుదల కావడం వల్ల నాయకత్వంవైపు హమ్జా అగుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అబ్బోటాబాద్ ఆపరేషన్‌లో తండ్రి ఒసామాతోపాటు హమ్జా బిన్ లాడెన్ కూడా మరణించారని తొలుత అమెరికా భావించింది. అయితే హమ్జాకు బదులుగా ఖలీద్ అనే మరో కొడుకు మరణించినట్లు తెల్సింది. ఆ ఆపరేషన్ సందర్భంగా హమ్జా అప్పుడు ఆ ఇంట్లో ఉండి, తప్పించుకొని పారిపోయాడా? లేక ఆ సమయంలో అక్కడ లేకుండా మరెక్కడైనా ఉన్నాడా? అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. ఒసామా బిన్ లాడెన్ తన తదనంతరం హమ్జానే వార సుడు కావాలని కోరుకున్నాడని, అందులో భాగంగా హమ్జాకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ కూడా ఇచ్చారని పాశ్చాత్య ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు అంతర్గత గొడవలు, పాశ్చాత్య సంకీర్ణ దళాల దాడుల్లో ఇటీవల తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇస్లామిక్ స్టేట్ జిహాదీల తరఫున అల్ కాయిదా టెర్రరిస్టులు కూడా పోరాడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో హమ్జా అల్ కాయిదా నాయకుడిగా తెరమీదకు వస్తే జిహాదీలకు కొత్త ఊపు వస్తుందని, అది అమెరికాకు పెను ముప్పుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.