వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా బిన్ లాడెన్ (30) మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు నోరు విప్పారు. హమ్జా హతమైందని నిజమేనని చెప్పారు. ఉగ్ర నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అమెరికా సేనలు జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గానిస్తాన్/పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో హమ్జా మృతి చెందినట్టు వైట్‌హౌజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. హమ్జా మృతి చెందినట్టు గత నెలలోనే వార్తలు వెలువడ్డాయి. దీని వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే, ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు అధ్యక్షుడు ట్రంప్ అప్పట్లో నిరాకరించారు.
(చదవండి : మమ్మల్ని చాలా సార్లు బెదిరించాడు: ట్రంప్)
ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7కోట్లు) ఇస్తామని అమెరికా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
(చదవండి : బిన్ లాడెన్ కుమారుడు హతం!)
Comments
Please login to add a commentAdd a comment