వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను పట్టించినవారికి అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7కోట్లు) ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ఇంత భారీ మొత్తంలో ఆఫర్ చేసింది. తమ దేశంపై దాడి చేస్తామని హంజా హెచ్చరించినట్టు కూడా వెల్లడించింది. పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో తలదాచుకున్న బిన్ లాడెన్ 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. (హైజాకర్ కుమార్తెతో లాడెన్ కొడుకు పెళ్లి)
హంజా జాడలేదు..
జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 30 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతను పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని వార్తలు వచ్చేవి. హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందని వార్తలు వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పెద్దన్న అమెరికాకు భయం పట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని అమెరికా గట్టి చర్యలను పూనుకుంది.
Comments
Please login to add a commentAdd a comment