ఒసామా బిన్ లాడెన్ ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను గడగడలాడించిన అల్‌ఖైదా నాయకుడు. ఓ ఉగ్రవాద సంస్థ నాయకుడి నివాసం ఎలా ఉంటుంది?. సాధారణ జీవితాన్ని వారు గడపగలుగుతారా? అనే సందేహాలు అందరికీ వస్తుంటాయి. 2011లో అమెరికా భద్రతా దళాలు అబోటాబాద్‌లో లాడెన్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన సీఐఏ(సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) లాడెన్ ఇంటిలో దొరికిన కంప్యూటర్ నుంచి లభ్యమైన వివరాలను తాజాగా వెల్లడించింది. లాడెన్ కుటుంబం(భార్య, పిల్లలు, మనవళ్లు)కు చెందిన వీడియోలు ఇందులో ఉన్నాయి. లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు సారథ్యం వహిస్తున్న హంజా లాడెన్ చిన్ననాటి ఫొటో మాత్రమే ఇప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలుసు. హంజా యుక్త వయసులో ఉన్న ఫొటోను కూడా సీఐఏ బయటపెట్టింది.
‘ఉగ్ర’ వారసుడి అసలు రూపం..
Published Thu, Nov 2 2017 8:30 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM
Advertisement
Advertisement
Advertisement