
లాడెన్ తల ఛిద్రమయ్యేలా కాల్చాను!
న్యూయార్క్: అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తల తాను కాల్చిన తుపాకీ గుళ్లకు ఛిద్రమైపోయిందని, మృతదేహాన్ని గుర్తించేందుకు ఆ ముక్కలను ఓ దగ్గరకు చేర్చాల్సి వచ్చిందని అమెరికన్ మాజీ నేవీ సీల్ షూటర్ రాబర్ట్ ఓనీల్ పేర్కొన్నాడు.
లాడెన్ తలలోకి తాను మొత్తం మూడు బుల్లెట్లు దించినట్లు వివరించాడు. పాకిస్తాన్ అబోటాబాద్‌లోని లాడెన్ స్థావరంపై జరిపిన దాడిని వివరిస్తూ ‘ద ఆపరేటర్’ పేరుతో రాసిన పుస్తకంలో రాబర్ట్ ఓనీల్ ఈమేరకు వెల్లడించాడు.