
వాషింగ్టన్: కరుడుకట్టిన ఉగ్రవాది, ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిల్ లాడెన్‌ను అంతమొందించడంలో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీకి (సీఐఏ) పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) సాయం చేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెల్లడించారు. లాడెన్‌ను పట్టుకోవడంలో ఐఎస్‌ఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. లాడెన్ ఎక్కడున్నాడనే సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించిందన్నారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ వాషింగ్టన్‌లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాడెన్‌ను చంపేంత వరకు ఆయన తమ దేశంలో ఉన్నాడనే విషయం తెలియదని ఇప్పటిదాకా పాక్ వాదించిన నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాను తామెప్పుడూ మిత్ర దేశంగానే భావించామని.. అందుకే లాడెన్‌కు సంబంధించిన సమాచారం అందించామని చెప్పారు. అమెరికా మాత్రం తమ దేశంపై నమ్మకం ఉంచలేకపోయిందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment