Picture Of Best Engineer Osama Bin Laden In Office, UP Officer Suspended - Sakshi
Sakshi News home page

Bin Laden Photo In UP Office: ప్రభుత్వ ఆఫీసులో బిన్‌ లాడెన్‌ ఫొటో కలకలం.. ఎక్కడో తెలుసా..?

Published Thu, Jun 2 2022 10:48 AM | Last Updated on Thu, Jun 2 2022 11:06 AM

Picture Of Osama Bin Laden In UP Office - Sakshi

ఒసామా బిన్ లాడెన్.. ఈ ఉగ్రవాది పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్‌. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద దాడికి పాల్పడిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అధినేత లాడెన్. ఈ దాడి తర్వాత అతడిని హతమార్చడానికి అమెరికాకు పదేళ్లు పట్టింది. ఎంతో కష్టపడి అమెరికా దళాలు లాడెన్‌ను మట్టుబెట్టాయి. 

కాగా, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయలంలో ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ ఫొటో పెట్టడం అంతేకాకుండా లాడెన్‌ను ప్రపంచ అత్యుత్తమ జూనియర్‌ ఇంజనీర్‌గా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూపీలోని దక్షిణాంచల్‌ విద్యుత్‌ విత్రాన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (DVVNL)లో సబ్‌-డివిజినల్‌ ఆఫీసర్‌ (SDO)గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర ప్రకాశ్‌ గౌతమ్‌.. ఒసామా బిన్‌ లాడెన్‌ ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీర్ అంటూ ప్రశంసించాడు. ఆ ఫొటోలో  ‘గౌరవనీయులైన ఒసామా బిన్‌ లాడెన్‌, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్‌ ఇంజినీర్‌’ అంఊ రాసుకొచ్చాడు. 

ఇక, ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి యూపీలోని ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు అధికారి రవీంద్రను సస్పెండ్‌ చేసినట్టు స్పష్టం చేశారు. కానీ, రవీంద్ర ప‍్రకాశ్‌ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. బిన్‌ లాడెన్‌ కాపీలు తన వద్ద ఇంకా చాలానే ఉన్నాయని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement