
‘26/11 వీరోచిత చర్య’
వాషింగ్టన్: భారత్ లోని ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి (26/11) ఒక వీరోచితమైన చర్యగా అల్‌కాయిదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ అభివర్ణించాడు. పాకిస్తాన్ నేతృత్వంలో లష్కర్ ఏ తోయిబా నిర్వహించిన ఆపరేషన్ ఒక అద్భుతమని పేర్కొన్నాడు. పాక్‌లో 2011 మే 2 న లాడెన్‌ను హతమార్చినప్పుడు అక్కడ దొరికిన వేలాది డాక్యుమెంట్లను అమెరికా డీకోడ్ చేసింది.
వీటిలోని కొన్ని పత్రాలను బుధవారం విడుదల చేసింది. ‘మన లక్ష్యం అమెరికా కావాలి.. అంతే కానీ, ముస్లిం సమాజం మధ్య అంతర్గత యుద్ధాన్ని సృష్టించవద్దు’ అని లాడెన్ తన అనుచరులను హెచ్చరించినట్లు ఓ పత్రంలో ఉంది.