Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Virat Kohli Hits Century, India beat Pakistan by 6 wickets1
కోహ్లి సెంచరీ.. పాక్‌పై భారత్ ఘన విజయం

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదిక‌గా దాయాది పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజ‌యభేరి మోగించింది. ఈ గెలుపుతో భార‌త్ త‌మ సెమీస్ బెర్త్‌ను ఖారారు దాదాపు ఖారారు చేసుకున్నట్లే. పాకిస్తాన్ నిర్ధేశించిన 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది.విరాట్ సూపర్ సెంచరీ..భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ ఔటయ్యక క్రీజులోకి విరాట్‌.. అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత శుబ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి విలువైన పార్టనర్‌షిప్‌ నెల‌కొల్పిన కోహ్లి.. ఆ త‌ర్వాత శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేశాడు.ఈ క్ర‌మంలో 111 బంతుల్లో త‌న 51వ వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను కింగ్ కోహ్లి అందుకున్నాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 82వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక కోహ్లితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్‌ గిల్‌(46) పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్‌ ఆహ్మద్‌, కుష్దిల్‌ షా తలా రెండు వికెట్లు వికెట్‌ సాధించారు.చెలరేగిన భారత బౌలర్లు.. అంతకముందు బ్యాటింగ్‌​ చేసిన పాకిస్తాన్‌ పాకిస్తాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బ్యాటర్లలో సౌద్‌ షకీల్‌(62) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ రిజ్వాన్‌(46), ఖుష్దిల్‌ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు, హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.చదవండి: IND vs PAK: అఫ్రిది క‌ళ్లు చెదిరే యార్క‌ర్‌.. రోహిత్ శ‌ర్మ షాక్‌! వీడియో వైర‌ల్‌

YS Jagan Says Group-2 candidates were also completely cheated by Chandrababu Govt2
గ్రూప్‌-2 అభ్యర్థులను కూడా చంద్రబాబు మోసం చేశారు: వైఎస్‌ జగన్‌

అమరావతి: గ్రూప్‌-2 మెయిన్స్‌ అభ్యర్థులను కూడా చంద్రబాబు నిలువునా మోసం చేశారంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. ఈ మేర​​కు ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 1. @ncbn గారూ… నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్‌-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు.2. మూడు వారాలుగా గ్రూప్‌-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 23, 2025

 Srisailam SLBC Tunnel Roof Collapsed Rescue Operation Updates3
ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లోకి నేవీ సిబ్బంది

SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. 36 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువగా వెళ్లగలిగిన ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌50 మీటర్లకు మించి ెవెళ్లలేకపోతున్న ఆర్మీ, ఎన్డీఆర్‌ఎప్‌, ైహైడ్రా సిబ్బందిాభారీగా మట్టి, బురద ేపేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకంప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లోకి నేవీ సిబ్బందిరాత్రికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు చేరుకోనున్న నేవీ సిబ్బందిసహాయక చర్యలు కొనసాగించాలని సీఎం రేవంత్‌ ఆదేశం ఎస్ఎల్బీసీ సొరంగంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాల‌తో క‌లిసి లోకో ట్రైన్ లో ట‌న్నెల్ లోకి వెళ్లిన మంత్రిమ‌ధ్యాహ్నం 1 గంట నుంచి ఆరు గంట‌లుగా సొరంగంలోనే జూప‌ల్లిప్ర‌మాద స్థ‌లం ద‌గ్గ‌ర నుంచి ఇంజ‌నీరింగ్ అధికారులు, ఎజెన్నీ ప్ర‌తినిధుల‌తో ఇంట‌ర్ కాం ఫోన్ లో మాట్లాడిన మంత్రి జూప‌ల్లిస్వ‌యంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకున్న‌ మంత్రిసోరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోప‌ల జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న మంత్రిప్ర‌మాదం జ‌రిగిన తీరును క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన మంత్రిఇంజ‌నీరింగ్, స‌హాయ‌క బృందాల‌కు మంత్రి దిశానిర్ధేశంబ‌య‌ట నుంచి ప్ర‌మాద‌స్థ‌లికి సొరంగంలో మధ్య‌ దూరం 13.5 కి.మీరెస్క్యూ బృందంలో ఎన్డీఆర్‌ఎప్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సింగరేణి బృందాలుటన్నెల్‌ సైట్‌ దగ్గర 23 మంది ఆర్మీ నిపుణులుఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఆర్మీ బృందాలుప్రమాద స్థలిలో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉంది: కలెక్టర్‌ సంతోష్‌రెస్క్యూ టీమ్‌ లోపలికి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడిందిభారీ మోటార్ల ద్వారా నీటిని బయటకి పంపుతున్నాంప్రమాదంలో చిక్కుకున్న వారి కనెక్టివిటీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ావాడుతున్నాం రేవంత్‌కు రాహుల్‌ ఫోన్‌..SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీసొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరాదాదాపు 20 నిమిషాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివెంటనే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సీఎంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంఘటన స్థలానికి చేరుకొని తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్‌లను మోహరించామన్న రేవంత్‌గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎంప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్‌ కామెంట్స్‌.. టన్నెల్‌ చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళగలిగాం. టెన్నెల్‌ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. టన్నెల్‌ నీటిమయం..ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, సీనియర్ ఐఏఎస్ శ్రీధర్.మరోసారి తన లోపలికి వెళ్లిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం.12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం.నీటితో కూడుకున్న టన్నెల్.నీటిని బయటికి తీసేందుకే సమాలోచనలు.నీరంతా బయటకి తోడిన తర్వాతే భవిష్యత్తు సహాయక చర్యలు చేపట్టే అవకాశం.వారంతా ప్రాణాలతో ఉన్నారా? లేదా?లోపలికి ఆక్సిజన్‌ అందుతోందా?.అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. రాత్రి పరిస్థితి ఇది..👉ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 👉ఇక, ఈ సొరంగానికి ఇన్‌లెట్‌ తప్ప ఎక్కడా ఆడిట్‌ టన్నెళ్లు, ఎస్కేప్‌ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. చిక్కుకున్నది వీరే.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్‌ (పీఈ), శ్రీనివాస్‌ (ఎస్‌ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్‌ (37), సంతోష్‌సాహు (37), అనూజ్‌ సాహు (25) ఉన్నారు. రాబిన్‌సన్‌ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్‌ (35), గురుదీప్‌ సింగ్‌ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.మంత్రుల పర్యవేక్షణ..👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్‌ఎల్‌బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్‌ ఇన్‌లెట్‌) నుంచి టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్‌ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్‌ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్‌ ఇన్‌లెట్‌ నుంచి 14 కిలోమీటర్‌ పాయింట్‌ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్‌ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్‌ సెగ్మెంట్‌ ఊడిపోయి.. 👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్‌లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్‌ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్‌లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్‌ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది.

Seven planets to align in rare cosmic event4
మహాకుంభమేళా ముగింపు.. ఆవిష్కృతం కానున్న మరో అద్భుత ఘట్టం

లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela 2025)లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో ఏడు గ్రహాలు బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని, యూరేనస్, నెప్ట్యూన్‌లు ఒకే సరళరేఖపై రానున్నట్లు తెలుస్తోంది.ఈ గ్రహాల సమన్వయం నెగటివ్ గ్రహ ప్రభావాలను తగ్గించి, ప్రపంచంలో శాంతి, సమర్థత, సంపద తీసుకురానుందని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అసాధారణ ఖగోళ సంఘటన కుంభమేళా తుది పవిత్ర స్నానానికి మరింత ప్రత్యేకతను ఇవ్వనుంది.మహాశివరాత్రిపై గ్రహ ప్రభావంజ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ శుక్లా గ్రహాల కదలికల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉండగా, శని కుంభ రాశిలో ఉండగా, బృహస్పతి వృషభ రాశిలో ఉండటం మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26న గ్రహాల శక్తివంతమైన సమన్వయంతో జరగనుంది. ఆరోజు చంద్రుడు, బుధుడు, సూర్యుడు శని కుంభ రాశిలో ఉండగా, శుక్రుడు, రాహు మీన రాశిలో ఉండగానే బృహస్పతి వృషభ రాశిలో ఉండనుంది. ఈ గ్రహాల మార్పుతో ఫిబ్రవరి 28న గ్రహాలు ఒకే సరళరేఖ వైపు పయనిస్తాయని అన్నారు. ఫలితంగా ప్రతికూలతలు తొలిగి శుభపరిణామాలు జరుగుతాయని శుక్లా తెలిపారు. గ్లోబల్ మార్పుఫిబ్రవరి 26, 2025న గ్రహాల సమన్వయంతో ప్రపంచంలో ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ మాట్లాడుతూ.. 2019 నుండి ప్రపంచాన్ని అనేక ప్రతికూల పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. కోవిడ్‌-19 ,ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం దేశాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే, గ్రహాల మార్పులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు. శాంతి, స్థిరత్వం కొనసాగే అవకాశం ఉందని అన్నారు.

Sakshi Guest Column On Legal system on Ranveer Allahabadia case5
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక

రణవీర్‌ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్‌ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్‌ లేటెంట్‌’ అనే వెబ్‌ టాలెంట్‌ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్‌ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్‌ చంద్రచూడ్‌ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్‌’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్‌ లాయర్‌ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్‌ చంద్రచూడ్‌ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్‌ సిరీస్‌ (కాలేజ్‌ రొమాన్స్‌) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్‌ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్‌ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌’ రణవీర్‌ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్‌ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్‌ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్‌ సూర్య కాంత్‌ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్‌ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్‌ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్‌ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్‌ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్‌ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్‌ లేటెంట్‌’ వెబ్‌ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్‌ వ్యాఖ్యల క్లిప్‌ అసందర్భంగా లీక్‌ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్‌ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్‌ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్‌ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్‌ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Rana Daggubati, Miheeka Bajaj Food Stories Shop Specialty6
పావుకిలో టమాట రూ.850, పుట్టగొడుగు రూ.5 లక్షలు.. రానా షాప్‌లో రేట్లు ఎక్కువే!

చాలామంది ఇప్పుడు ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్‌ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా (Rana Daggubati) దంపతులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫుడ్‌ స్టోర్స్‌ అనే షాప్‌ను జనవరిలో ప్రారంభించారు. ఇక్కడ కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్‌, హెల్త్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ ఇలా అన్నీ దొరుకుతాయి. అయితే అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి. బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటంస్‌ ఈ చోట లభించడం విశేషం.ఖరీదైన కూరగాయలుఈ ఫుడ్‌ స్టోరీస్‌లో స్మూతీస్‌, జ్యూస్‌, కాఫీ, చాక్లెట్స్‌, నూడుల్స్‌.. ఇలా ఎన్నో ఉన్నాయి. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్‌ బాటిల్స్‌ కూడా ఉన్నాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్‌లు, డ్రై ఫ్రూట్స్‌ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఆరు కిలోల మష్రూమ్‌ ఈ ఫుడ్‌ స్టోరీస్‌లో ఉంది. దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు. మామూలు పుట్టగొడుగులు 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంది. కొబ్బరి బోండా వెయ్యి రూపాయలుకూరగాయల్ని సైతం విదేశాలనుంచి తీసుకొస్తారు. మెక్సికో, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌.. ఇలా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేస్తారు. ఉదాహరణకు నెదర్లాండ్స్‌ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములకుగానూ రూ.850గా నిర్ణయించారు. ఒక గ్లాస్‌ చెరకు రసం రూ.275గా ఉంది. థాయ్‌లాండ్‌కు చెందిన కొబ్బరి బోండాం ఒక్కోటి వెయ్యి రూపాయలని తెలుస్తోంది. ఈ ధరలు చూసిన నెటిజన్లు.. రానా- మిహికా పెట్టిన షాప్‌ కేవలం ధనవంతులకేనని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా!

Minister Jupally Krishna Rao In The Slbc Tunnel7
టన్నెల్‌ ప్రమాదం.. వారి పరిస్థితి ఆశాజనకంగా లేదు: మంత్రి జూప‌ల్లి

సాక్షి, నాగర్‌ కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలోకి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాల‌తో క‌లిసి లోకో ట్రైన్‌లో ట‌న్నెల్ లోకి వెళ్లిన మంత్రి.. దాదాపు ఐదు గంట‌ల పాటు సొరంగంలోనే గడిపారు. స్వయంగా సహాయక చర్యల్లో పాలు పంచుకుని తిరిగి బయటికి వచ్చారు. ప్ర‌మాద స్థ‌లం ద‌గ్గ‌ర నుంచి ఇంజ‌నీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్ర‌తినిధుల‌తో ఇంట‌ర్ కాం ఫోన్‌లో మంత్రి జూప‌ల్లి మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోప‌ల జ‌రుగుతున్న ప‌నుల‌ను ఆయన ప‌ర్య‌వేక్షించారు.ప్ర‌మాదం జ‌రిగిన తీరును క్షేత్ర‌స్థాయిలో జూపల్లి కృష్ణారావు ప‌రిశీలించారు. ఇంజ‌నీరింగ్, స‌హాయ‌క బృందాల‌కు మంత్రి దిశానిర్దేశం చేశారు. బ‌య‌ట నుంచి ప్ర‌మాద‌స్థ‌లికి సొరంగంలో మధ్య‌ దూరం 13.5 కి.మీ. సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు మూడు గంటల సమయం పడుతుందన్నారు.. ‘‘100 మిటర్లలోనే సమస్య ఉంది. నీరు, బురద ఎక్కువగా ఉంది. రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని మంత్రి పేర్కొన్నారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్లగలిగాయి. 50 మీటర్లకు మించి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా సిబ్బంది వెళ్లలేకపోతున్నాయి. భారీగా మట్టి, బురద పేరుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో నేవీ సిబ్బంది కూడా పాల్గొనున్నారు. రాత్రికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు నేవీ బృందం చేరుకోనున్నారు.శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.

CT 2025 Ind vs Pak: Virat Kohli Creates History Becomes India Leading8
కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్‌ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు(Most Catches) పట్టిన ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు. దాయాది పాకిస్తాన్‌(India vs Pakistan)తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును ఈ మాజీ సారథి బద్దలు కొట్టాడు.241 పరుగులకు పాక్‌ ఆలౌట్‌చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా గ్రూప్‌-‘ఎ’లో ఉన్న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. దుబాయ్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో బంగ్లాను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టిన భారత్‌ 241 పరుగులకు దాయాదిని ఆలౌట్‌ చేసింది.బాబర్‌ ఆజం(23), సౌద్‌ షకీల్‌(62) రూపంలో రెండు కీలక వికెట్లను హార్దిక్‌ పాండ్యా దక్కించుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌ సల్మాన్‌ ఆఘా(19), షాహిన్‌ ఆఫ్రిది(0), నసీం షా(14)లను అవుట్‌ చేశాడు. ఇక అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా ఒక్కో వికెట్‌ తీయగా.. అక్షర్‌ పటేల్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌(10), హ్యారిస్‌ రవూఫ్‌(8) రనౌట్లలో భాగమయ్యాడు.Jaha matter bade hote hai, waha @hardikpandya7 khade hote hai! 😎Two big wickets in two overs & #TeamIndia are in the driver's seat! 🇮🇳💪#ChampionsTrophyOnJioStar 👉 #INDvPAK | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports 18-1!📺📱 Start Watching… pic.twitter.com/Neap2t4fWC— Star Sports (@StarSportsIndia) February 23, 2025 కోహ్లి సరికొత్త చరిత్రఅయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు సూపర్‌ క్యాచ్‌లు అందుకుని తన పేరును చరిత్రలో పదిలం చేసుకున్నాడు. తొలుత కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో నసీం షా ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. అనంతరం హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్‌ షా(38) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకు ముందు మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు కోహ్లి దానిని బద్దలు కొట్టాడు. ఇక జాబితాలో ఓవరాల్‌గా శ్రీలంక స్టార్‌ మహేళ జయవర్దనే(218), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌(160) ఈ జాబితాలో టాప్‌-2లో కొనసాగుతున్నారు.వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు1. విరాట్‌ కోహ్లి- 1582. మహ్మద్‌ అజారుద్దీన్‌- 1563. సచిన్‌ టెండుల్కర్‌- 1404. రాహుల్‌ ద్రవిడ్‌- 1245. సురేశ్‌ రైనా- 102.చాంపియన్స్‌ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ తుదిజట్లుటీమిండియారోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌.పాకిస్తాన్‌సౌద్‌ షకీల్‌, బాబర్‌ ఆజం, ఇమామ్‌-ఉల్‌ -హక్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖుష్దిల్‌ షా, షాహిన్‌ అఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్‌ చర్యకు హర్షిత్‌ రాణా రియాక్షన్‌ వైరల్‌.. గంభీర్‌ కూడా!

OpenAI Bans Some Chinese Users from Using ChatGPT for Social Media Monitoring9
చాట్‌జీపీటీని అందుకు వాడతారా?.. ఓపెన్‌ఏఐ సీరియస్‌

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ దిగ్గజం, చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త ఓపెన్‌ ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ చాట్‌జీపీటీ సేవల్ని దుర్వినియోగం చేస్తున్న చైనాకు చెందిన పలు ఖాతాలను నిషేధించింది. తమ ఏఐ నమూనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, అనధికార నిఘా, పర్యవేక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న తమ విధానాలను అవరోధం కలగకుండా కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓపెన్ఎఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిషేధానికి కారణాలివే..ఓపెన్ఏఐ విడుదల చేసిన థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. నిషేధిత ఖాతాలను సోషల్ మీడియా వినికిడి సాధనం కోసం వివరణలను రూపొందించడం కోసం వినియోగించారు. పాశ్చాత్య దేశాల్లో చైనా వ్యతిరేక నిరసనలపై రియల్ టైమ్ రిపోర్టులను చైనా భద్రతా సంస్థలకు అందించడానికి ఈ టూల్ ను రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలలో నిరసనలను పర్యవేక్షిస్తున్న చైనా రాయబార కార్యాలయాలు, ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు తమ సంగ్రహణలను పంపినట్లు ఆధారాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి ఈ ఖాతాల నిర్వాహకులు ఓపెన్ఎఐ నమూనాలను ఉపయోగించారు.విధానాల ఉల్లంఘనవ్యక్తుల కమ్యూనికేషన్ నిఘా లేదా అనధికారిక పర్యవేక్షణ కోసం తమ ఏఐ సాధనాన్ని ఉపయోగించడాన్ని ఓపెన్‌ఏఐ విధానాలు కఠినంగా నిషేధిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను అణచివేయడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు, నియంతృత్వ పాలనల తరపున నిర్వహించే కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. నిఘా సాధనం కోసం కోడ్‌ను డీబగ్ చేయడానికి వినియోగదారులు ఓపెన్ఎఐ నమూనాలను కూడా ఉపయోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ సాధనం స్వయంగా నాన్-ఓపెన్ఎఐ మోడల్‌పై నడిచింది.ఇదీ చదవండి: ‘మస్క్‌, ట్రంప్‌ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?మరో ఘటనలో..చైనా అసమ్మతివాది కై జియాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడానికి చాట్ జీపీటీని ఉపయోగించిన ఖాతాను కూడా ఓపెన్ ఏఐ నిషేధించింది. అదే సంస్థ స్పానిష్ లో యుఎస్ వ్యతిరేక వార్తా కథనాలను సృష్టించడానికి ఏఐని ఉపయోగించుకుంది. ఇవి తరువాత లాటిన్ అమెరికన్ అవుట్ లెట్ లలో ప్రచురితమయ్యాయి. అమెరికా వ్యతిరేక కథనాలతో లాటిన్ అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన స్రవంతి మీడియాలో ఒక చైనీస్ యాక్టర్‌ దీర్ఘకాలిక కథనాలను నాటడాన్ని ఓపెన్ఏఐ గమనించడం ఇదే మొదటిసారి.

Punjabi Actor Sonia Mann Joins AAP In Presence Of Arvind Kejriwal10
ఆప్‌లో చేరిన పంజాబీ నటి సోనియా మాన్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే?

చండీగఢ్: పంజాబ్ నటి సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సమక్షంలో‎ పార్టీలో చేరారు. సోనియా రాకను ఆప్‌ పంజాబ్‌ స్వాగతించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు ఎస్ బల్దేవ్ సింగ్ కుమార్తె, పంజాబీ నటి సోనియా మాన్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమెకు ఆమ్ ఆద్మీ కుటుంబంలోకి స్వాగతం’’ అంటూ ట్వీట్ చేసింది.మరో వైపు, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలో సోనియా జాయిన్ కావడంపై చర్చ నడుస్తోంది. 1986లో ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన రైతు కిసాన్ నాయకుడు బల్దేవ్ సింగ్ కూతురే సోనియా మాన్. ఆమె 1986, సెప్టెంబరు 10న ఉత్తర ప్రదేశ్‌లోని హల్ద్వానీలో జన్మించింది. సోనియా అమృత్‌సర్‌ పట్టణంలో పెరిగింది. హోలీ హార్ట్ ప్రెసిడెన్సీ స్కూల్ నుండి స్కూల్ విద్యను, అమృత్‌సర్‌లోని బీబీకె డీఏవీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో తన కళాశాల విద్యను పూర్తి చేసింది.పంజాబీతో పాటు ఇతర భాషాల్లో కూడా నటించి సోనియా మాన్ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీతో సహా వివిధ భాషలలో బహుళ చిత్రాలలో నటించింది. సోనియా మాన్ తొలి చిత్రం 'హైడ్ ఎన్' సీక్'. 2014లో హిందీలో తొలిసారిగా కహిన్ హై మేరా ప్యార్‌లో కూడా యాక్ట్ చేసింది. 2020లో వచ్చిన హ్యాపీ హార్డీ, హీర్ చిత్రాల్లోనూ నటించి ప్రశంసలు అందుకుంది. సినిమాలతో పాటు 2018లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాతో సహా ప్రసిద్ధ సింగర్లతో కలిసి పని చేసిన ఆమె.. నటిగా రాణిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.కాగా, 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం భగంత్ మాన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైంది. మరో రెండేళ్లలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేజ్రీవాల్ పంజాబ్‌పై దృష్టి పెట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2027లో జరగనున్న పంజాబ్‌లోనైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నాల్లో కేజ్రీవాల్‌ ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈసారి ఎంతమందంటే?

అమెరికాలో అక్రమ వలసదారుల డిపోర్టేషన్‌ కొనసాగుతుంది.

title
మహాకుంభమేళా ముగింపు.. ఆవిష్కృతం కానున్న మరో అద్భుత ఘట్టం

లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (K

title
ఆప్‌లో చేరిన పంజాబీ నటి సోనియా మాన్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే?

చండీగఢ్: పంజాబ్ నటి సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.

title
ఏయ్‌.. నా బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?.. మంత్రి గారి మేనల్లుడు వీరంగం!

లక్నో : ఏయ్‌.. నాకే ఎదురు చెబుతావా? నేను ఎవరినో తెలుసా?

title
బానిస మసస్తత్వంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు: ప్రధాని

భోపాల్: కొన్ని శక్తులు దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న

NRI View all
title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

title
మాట నూతన కార్యవర్గం ఏర్పాటు

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌-మాట బోర్డు మీటింగ్‌ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

title
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్

ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు  న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

title
సులభతర వీసా విధానం అవసరం

న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్‌

title
గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్

Advertisement

వీడియోలు

Advertisement