
మిస్టరీగా మారిన లాడెన్ కుటుంబసభ్యుల మృతి
లండన్: ఆల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల మృతి మిస్టరీగా మారింది. లండన్ సమీపంలోని హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషే ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో లాడెన్ సవతి తల్లి, ఆమె భర్త, కూతురుతోపాటు పైలట్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటలీ నుంచి బ్రిటన్ వైపు వారు ప్రయాణిస్తున్న వేళ విమానం కండిషన్‌లోనే ఉందని విమానయాన నిపుణుడు జులియన్ బ్రే అభిప్రాయపడినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ల్యాండ్ కావడానికి సరిపడినంతా రన్‌వే ఉన్నా పైలట్ విమానాన్ని పక్కనే ఉన్న కార్ల షెడ్ ఫెన్సింగ్‌పైకి తీసుకెళ్లడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగి పేలుడు సంభవించడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఎంత ఎక్కువ ఎత్తులో ఉన్నా, తక్కువ ఎత్తులో ఉన్నా అర మైలు దూరంలో ఉన్న ప్రాంతాన్ని కూడా గమనించేందుకు వీలుగా నాలుగు ఇండికేటర్లు ఉన్నాయని, అయినా పైలట్ అలా ఎందుకు చేశాడో అర్థం కావడంలేదని పైలట్ ఇన్‌స్ట్రక్టర్ సైమన్ మూర్స్ అనుమానం వ్యక్తం చేశారు.