
పాక్ ప్రధానిపై బాంబు పేల్చిన రచయిత్రి
పాకిస్ధాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) మాజీ ఉద్యోగి భార్య బాంబు పేల్చారు. నవాజ్ షరీఫ్ అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించారు.
అందులో ఆమె ఈ సంచలన వివరాలు తెలిపారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాడెన్ నుంచి ఈ డబ్బు తీసుకున్నాడని చెప్పారు. 'బెనజిర్ భుట్టో పరిపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఒసామా బిన్ లాడెన్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దీంతో అల్ కాయిదా అతడికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. దీంతో ఆయన అధికారంలోకి వచ్చాడు' అని ఆమె తెలిపారు.