పాకిస్తాన్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇస్లామాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్ మోనాల్‌ను మూసివేయడంతో దానిలో పని చేస్తున్న 700 మంది రోడ్డున పడ్డారు.
డాన్ నివేదిక ప్రకారం ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని మోనాల్‌ను మాత్రమే కాకుండా ఇక్కడున్న అన్ని రెస్టారెంట్‌లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణను ఉద్దేశించి 2024, జూన్ 11న సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ పార్క్ చుట్టూ ఉన్న రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు 2024 సెప్టెంబర్ 11 నుంచి రెస్టారెంట్ మూసివేయనున్నామని మోనాల్ యాజమాన్యం తెలిపింది.
ఈ హోటల్ గత రెండు దశాబ్దాలుగా ఆహర ప్రియులకు ఇష్టమైనదిగా పేరొందింది. 2006లో ప్రారంభించినప్పటి నుండి మోనాల్ నిరంతరం ఆహార ప్రియులకు సేవలు అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌లో 700 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇస్లామాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఈ రెస్టారెంట్‌లో ఆహారం తినేందుకు వస్తుంటారు.
మోనాల్ మూసివేత ప్రకటనతో దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. తమ రెస్టారెంట్‌కు స్టార్ రేటింగ్ ఉందని మోనాల్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment