ఢిల్లీ: ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్లనున్నారు. ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు అక్టోబర్ 15-16 తేదీలో జరగనున్నాయి.
ఈ సమావేశాలకి సంబంధించి.. పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందినట్లు భారత్ ఆగస్టు 30న ధృవీకరించింది. ఎస్‌సీఓ సమావేశంలో మంత్రి జైశంకర్ భేటీ అవుతారనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ప్రకటించారు. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌ను సందర్శించారామె.
ఈసారి పాకిస్తాన్ అధ్యక్షతన ఎస్‌సీఓ ప్రభుత్వాధినేతల సమావేశాలు ఇస్లామాబాద్‌లో రెండురోజుల పాటు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.
MEA Spokesperson Randhir Jaiswal confirms: "EAM Jaishankar will lead a delegation to Pakistan for the SCO summit in Islamabad on 15th and 16th October."#SJaishankar #Pakistan #Islamabad #India #SCOSummit #IndiaPakRelations pic.twitter.com/Aq5UHYYjzy
— Neha Bisht (@neha_bisht12) October 4, 2024
ఇక.. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు కలిసి.. 2001లో షాంఘైలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 2017లో భారత్, పాకిస్తాన్‌లు ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం పొందాయి.
గత ఏడాది జూలైలో భారతదేశం నిర్వహించిన వర్చువల్ సమ్మిట్ ఆఫ్ గ్రూపింగ్‌లో ఇరాన్ కూడా ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆర్థిక, భద్రతా కూటమిగా, అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఎస్‌సీఓ ప్రారంభమైంది. గత ఏడాది ఎస్‌సీఓ సమ్మిట్‌ను భారత్ వర్చువల్‌గా నిర్వహించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
చదవండి: ‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment