Shanghai Co-operation Organization Meeting
-
నాడు సుష్మా స్వరాజ్.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌కు జైశంకర్
ఢిల్లీ: ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్లనున్నారు. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు అక్టోబర్ 15-16 తేదీలో జరగనున్నాయి. ఈ సమావేశాలకి సంబంధించి.. పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందినట్లు భారత్ ఆగస్టు 30న ధృవీకరించింది. ఎస్సీఓ సమావేశంలో మంత్రి జైశంకర్ భేటీ అవుతారనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ప్రకటించారు. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌ను సందర్శించారామె.ఈసారి పాకిస్తాన్ అధ్యక్షతన ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమావేశాలు ఇస్లామాబాద్‌లో రెండురోజుల పాటు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.MEA Spokesperson Randhir Jaiswal confirms: "EAM Jaishankar will lead a delegation to Pakistan for the SCO summit in Islamabad on 15th and 16th October."#SJaishankar #Pakistan #Islamabad #India #SCOSummit #IndiaPakRelations pic.twitter.com/Aq5UHYYjzy— Neha Bisht (@neha_bisht12) October 4, 2024ఇక.. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు కలిసి.. 2001లో షాంఘైలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 2017లో భారత్, పాకిస్తాన్‌లు ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందాయి. గత ఏడాది జూలైలో భారతదేశం నిర్వహించిన వర్చువల్ సమ్మిట్ ఆఫ్ గ్రూపింగ్‌లో ఇరాన్ కూడా ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆర్థిక, భద్రతా కూటమిగా, అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఎస్సీఓ ప్రారంభమైంది. గత ఏడాది ఎస్సీఓ సమ్మిట్‌ను భారత్ వర్చువల్‌గా నిర్వహించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.చదవండి: ‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్ -
Video: పాక్ మంత్రికి నమస్కారంతో స్వాగతం పలికిన జైశంకర్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గోవాలో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ సదస్సుకు వచ్చిన పలు దేశాల మంత్రులను భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మర్యాదపూరక్వంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో దాయాది పాక్ మంత్రి భుట్టోను కూడా నమస్కారంతో స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. ఆ తర్వాత వేదిక వద్దకు వెళ్లండంటూ భుట్టోను జైశంకర్ పంపతున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 🇷🇺 🇮🇳 WATCH: India's External Affairs Minister S. Jaishankar welcomes Russian Foreign Minister Sergey Lavrov to the #SCO2023 Council of Foreign Ministers' meeting in #Goa.#India #Russia pic.twitter.com/9Z7mw9bCu9 — Sputnik India (@Sputnik_India) May 5, 2023 అనంతరం షాంఘై సదస్సులో పాక్ మంత్రి సమక్షంలోనే విదేశాంగమంత్రి జై శంకర్ ఉగ్రవాద ముప్పు, సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద ముప్పు నిరాటంకంగా కొనసాగుతోందని దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించకూడదని అన్నారు. సరిహద్దు తీవ్రవాదంతో సహా దాని అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని పాతరేయాలని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎస్సీఓ ఆదేశాలలో ముఖ్యమైనదని, దీనిపై కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి One of the best Foreign Ministers of India🇮🇳 Mr. S Jaishankar 🔥🔥 pic.twitter.com/HjdEe0nDfR — kanishka 🇮🇳 (@KanishkaDadhich) May 5, 2023 కాగా గత 12 ఏళ్లలో తర్వాత భారత్ గడ్డపై పాక్ మంత్రి అడుగుపెట్టిన వ్యక్తి బుట్టోనే కావడం విశేషం. షాంఘై రెండురోజుల పర్యటన నిమిత్తం పాక్ మంత్రి బుట్టో గురువారమే గోవా చేరుకున్నారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్ గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు. .బెనాలిమ్‌లోని సముద్ర తీరంలో ఉన్న తాజ్ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్‌కు వివిదే విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాక్ మంత్రి బిలావల్ భుట్టోకూడా ఈ విందుకు వచ్చారు. Swag mera desi hai 🔥😎😉 (SCO Summit, Goa)#SJaishankar ji pic.twitter.com/MhL1vLdQxp — Stranger (@amarDgreat) May 5, 2023 అయితే, విందులో బిలావల్, జైశంకర్ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ.. వీరిద్దరూ షేక్‌హ్యండ్ ఇచ్చుకొని పలకరించుకున్నారని విశ్వసనీయ వర్గాల త్వారా తెలిసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. మరోవైపుతే భారత్- పాక్ విదేశాంగ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చ ఉంటుందా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. చదవండి: మణిపూర్: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. హెల్త్ కండిషన్ సీరియస్ -
కశ్మీర్‌పై ఐసీజే పాత్ర ఉండదు
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో త్వరలో జరగనున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య భేటీ జరగబోదని విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదం, చర్చలు ఒకదానితో ఒకటి కలిసి కొనసాగలేవన్నారు. ఎన్డీయే ప్రభుత్వ మూడేళ్ల సంబరాల సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఫిర్యాదుచేస్తామన్న పాకిస్తాన్ వ్యాఖ్యలను సుష్మ ఖండించారు. ‘కశ్మీర్ సమస్యను పాకిస్తాన్ ఐసీజేలో ఫిర్యాదు చేయలేదు. మూడో దేశం మధ్యవర్తిత్వం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని షిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ స్పష్టం చేస్తున్నాయి’ అని సుష్మ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందం విషయంలోపై భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సుష్మ తీవ్రంగా ఖండించారు. ‘డబ్బుల కోసమో.. మరెవరి ఒత్తిడి వల్లో భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. పర్యావరణ పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. పర్యావరణంపై 5వేల ఏళ్ల నిబద్ధత మాది’ అని ఆమె స్పష్టం చేశారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై తాజాగా మరోసారి అభ్యంతరం చేసిన చైనాతో చర్చలు జరుపుతామన్నారు.