Nayanthara Vignesh Shivan With Twins Uyir Ulag Reveals Faces On Her First Anniversary, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

నయనతార గురించి ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన విఘ్నేశ్‌ శివన్‌, పిల్లల్ని చూశారా?

Published Fri, Jun 9 2023 12:29 PM | Last Updated on Fri, Jun 9 2023 1:51 PM

Nayanthara Vignesh Shivan With Twins Uyir Ulag Reveals Faces First Anniversary - Sakshi

టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ను గతేడాది జూన్‌లో  ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వారి పిల్లల ఫోటోలను కూడా ఆయన మొదటిసారి షేర్‌ చేశాడు. ఆ ఫోటోలలో, నయనతార తన బిడ్డలను పట్టుకుని ప్రకాశవంతమైన చిరునవ్వులతో కనిపిస్తుంది. ఫోటోలు  నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి:  అప్పుడు మా కాలికి నమస్కరించేవాళ్లు, ఇప్పుడేమో హగ్గులు, ముద్దులు: నటి)

నయనతార గురించి విఘ్నేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు. 'నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం. నా పనిలో భాగంగా ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత నిన్నూ (నయన్‌), పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. కుటుంబం ఇచ్చే బలం ఎవరూ ఇవ్వలేరు. మన పిల్లలు ఉయిర్‌, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తాను' అని భావోద్వేగానికి లోనయ్యాడు. గత అక్టోబరులో అద్దె గర్భం ద్వారా ఈ జంట ఇద్దరు అబ్బాయిలకు  జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement