సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. తాజాగా ఆస్తుల విషయంలో నయనతార జంటపై విఘ్నేశ్ శివన్ బాబాయ్ కేసు పెట్టడం. ఇలా గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. 2003లో కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బహూభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పటి వరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 75 చిత్రాలకు పైగానే చేసింది. ఇప్పటికి కూడా ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తొలిసారిగా షారూఖ్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో నయన్ అడుగుపెట్టబోతోంది. దీంతో ఆమె మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.
(ఇదీ చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్)
ఈ సినిమా కోసం భారీగానే నయన్‌కు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్.. దీంతో ఒక్కసారిగా ఆమె ఆస్తుల వివరాలపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె కూడబెట్టిన ఆస్తి విలువ సుమారు రూ.200 కోట్లు. ఇది నయనతార ఆదాయశాఖకు దాఖలు చేసిన లెక్కల వివరాల ప్రకారం జరుగుతున్న ప్రచారం. హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన ఖరీదైన ఇల్లు ఉంది. కేరళలో తన తల్లిదండ్రుల కోసం అని మరో ఇల్లు ఉంది. ఇలా దేశవ్యాప్తంగా పలు సొంత నివాసాలను ఏర్పరచుకుంది.
(ఇదీ చదవండి: Vignesh And Nayanthara: నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ బాబాయ్)
హైదరాబాదులోని ఒక్కో ప్లాట్ సుమారు రూ.20 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. అక్కడ అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో నయనతార ప్లాట్లు కొనుగోలు చేసింది. అదే విధంగా ఇటీవల ఈమె ఒక జెట్ విమానాన్ని కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ.. పలు యాడ్స్ రూపంలో కూడా నయనతార కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. మొదట కష్టపడ్డా ఇప్పుడు పిల్లలు, భర్తతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తోంది. తాజాగా చెన్నైలో మూతపడిన 53ఏళ్లనాటి థియేటర్‌ను ఆమె కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతుంది. దాని ప్లేస్‌లో మల్టీఫ్లెక్స్ నిర్మించే ప్లాన్‌లో ఆమె ఉన్నారట.
Comments
Please login to add a commentAdd a comment