
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్ వరకు ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార తొలిసారిగా ఈ విషయం గురించి ఓపెన్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే విషయంపై నేను మాట్లాడను. మన ప్రవర్తనను బట్టి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు. నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాను. కేవలం నా టాలెంట్‌ను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చొంది.
అయితే నయన్ చేసిన ఈ కామెంట్స్‌పై కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడో జరిగితే ఇప్పుడు చెప్పడం ఏంటి? మీటూ మూమెంట్స్ జరిగినప్పుడు కూడా సైలెంట్‌గా ఉంది కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment