టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి షాలిని కొద్దిసేపటి క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సోషల్‌మీడియా ద్వారా నితిన్ ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా నితిన్ పంచుకున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
2020లో నితిన్, షాలిని కందుకూరిల వివాహం జరిగింది. తన చిరకాల స్నేహితురాలు అయిన షాలినితో ప్రేమలో పడిన నితిన్ ఏడడుగుల బంధంతో కలిసి నడిచారు. వీరిద్దరి పెళ్లి అయి సుమారు నాలుగేళ్లు అవుతుంది. అయితే, ఇప్పుడు నితిన్ ఇంటికి వారసుడు రావడంతో అయన అభిమానులు సందడిగా కామెంట్లు పెడుతున్నారు.
గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్' అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నితిన్ బలమైన కథతో ఈసారి ముందుకు రానున్నాడు. సరికొత్త కథతో ‘తమ్ముడు’గా అలరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' కూడా లైన్‌లో ఉంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment