
కథల ఎంపికలో తడబడి ట్రాక్ తప్పాను. కానీ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాను అని గట్టి నమ్మకంతో ఉన్నాడు హీరో నితిన్ (Nithiin). భీష్మ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood Movie). శ్రీలీల కథానాయిక. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషించారు. కేతిక శర్మ ఐటం సాంగ్‌లో మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వార్నర్
ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్‌గా విచ్చేశాడు. అయితే వార్నర్‌ను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి హీరోగా నటించిన రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతి ఇంట్లో ఒక రాబిన్‌హుడ్ ఉండాలనే కథ ఇది.
వార్నర్‌పై సెటైర్లు
సినిమాలో అదిదా సర్‌ప్రైజు అనే పాట ఉన్నట్లే.. మా వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఈ వార్నర్‌ను.. క్రికెట్ ఆడవయ్యా అంటే డ్యాన్సులేశాడు అంటూ మూతి అష్టవంకర్లు తిప్పుతూ అతడిపై సెటైర్లు వేశాడు. చివర్లో వీడు మామూలోడు కాదు.. రేయ్ వార్నరూ.. నువ్వొక దొంగ.... అంటూ ఒక బూతుపదం కూడా వాడాడు.

రాజేంద్రప్రసాద్‌పై అభిమానుల ఆగ్రహం
అది అర్థం కాని వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు రాజేంద్రప్రసాద్‌పై మండిపడుతున్నారు. వార్నర్ సినిమా పాటలకు స్టెప్పులేయడం చూసే కదా సినిమాలోకి తీసుకున్నారు.. అలాంటప్పుడు అతడి డ్యాన్స్ గురించి వంకరగా మాట్లాడటం దేనికని విమర్శిస్తున్నారు. వయసులో పెద్దవాడివైన నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదని నటుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: 'పుష్ప' ఫస్ట్ ఛాయిస్ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment