
∙వెంకీ కుడుముల, కేతికా శర్మ, డేవిడ్ వార్నర్, నితిన్, శ్రీలీల, వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని
‘‘నమస్కారం... ‘రాబిన్ హుడ్’లో నటించే చాన్స్ రావడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. మీ ఫ్యామిలీలోకి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్. ఈ సినిమాలోని నా కోస్టార్స్ చాలా కష్టపడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ‘రాబిన్ హుడ్’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నారు. నితిన్ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రీలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ వేడుకకు అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’ విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఒక సినిమాకు రియల్ హీరోలు నిర్మాతలే. ఇండియాలో మైత్రీ టాప్ ప్రొడక్షన్ హౌస్ అని ‘పుష్ప’ సినిమాతో నిరూపితమైంది. ‘రాబిన్ హుడ్’ని మైత్రీ వాళ్లు కాబట్టే ఇంత భారీగా తీశారు. నాపై ఉన్న ప్రేమను వెంకీ ఈ సినిమా రూపంలో చూపించాడు. డేవిడ్ వార్నర్‌గారి వల్ల ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ప్రపంచ క్రికెట్‌లో ఆయన పెద్ద లెజెండ్ క్రికెటర్. కానీ తెలుగువారికి వార్నర్‌గారు.. డేవిడ్ భాయ్... వార్నర్ మామానే’’ అన్నారు.
‘‘రాబిన్ హుడ్’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అని వెంకీతో చెప్పాను’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘నితిన్ , డేవిడ్ వార్నర్‌గార్లు, చాలా బిజీగా ఉండి కూడా ఈ సినిమా చేసిన శ్రీలీల, ‘అదిదా సర్‌ప్రైజ్’ పాట చేసిన కేతికా, ఇతర టీమ్‌కి థ్యాంక్స్’’ అని తెలిపారు వై. రవిశంకర్. ‘‘భీష్మ’ తర్వాత నితిన్ అన్న, నేను ‘రాబిన్ హుడ్’తో వస్తున్నాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నితిన్ అన్న, బాగా తీయడానికి కారణం నవీన్ , రవిగార్లు. ఈ సినిమాకు బజ్ రావడానికి ఒక కారణం కేతికా ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్.. రెండోది డేవిడ్ వార్నర్‌గారు ఇండియన్ సినిమాకు రావడం’’ అని చెప్పారు వెంకీ కుడుముల.
‘‘రాబిన్ హుడ్’తో హీరోగా కమర్షియల్ స్పేస్‌లో నితిన్ మరో లెవల్‌కి వెళ్తాడు. ఇలాంటి మరిన్ని సినిమాలు చేసి, వెంకీ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ లిస్ట్‌లోని పెద్ద హిట్స్ మూవీలో ‘రాబిన్ హుడ్’ ఉండాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు రాజేంద్రప్రసాద్. ‘‘ఆల్మోస్ట్ ఏడాది తర్వాత నేను హీరోయిన్‌గా వస్తున్న ‘రాబిన్ హుడ్’ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీలీల. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాలోని ఫుట్ స్టెప్, ‘రాబిన్ హుడ్’లోని ‘అదిదా సర్‌ప్రైజ్’ పాట హుక్ స్టెప్స్ ట్రై చేసి, అలరించారు డేవిడ్ వార్నర్.
Comments
Please login to add a commentAdd a comment