Australian cricketer
-
షేన్ వాట్సన్ ఇళయరాజా పాట
ఒక ఇంటర్య్వూలో ‘డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ టాలెంట్స్?’ అనే ప్రశ్నకు సమాధానంగా గిటారు చేతిలోకి తీసుకున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వాట్సన్. ఆంగ్ల పాట ట్యూన్ ఏదో ప్లే చేస్తాడు అని మనం అనుకునేలోపే ఇళయరాజా పాట ‘ఎన్ ఇనియ పొన్నిలావే’ కొంచెం ప్లే చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
డేవిడ్ వార్నర్ కు భారీ అఫర్.?
-
ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..?
Andrew Symonds: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) శనివారం (మే 14) రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. కారు ప్రమాదంలో సైమండ్స్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షి వేలాన్ టౌన్సన్ తెలిపాడు. ప్రమాద సమయంలో ఘటనా స్థలికి అతి సమీపంలో ఉన్న టౌన్సన్.. సైమండ్స్ ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్రయాత్నాలు చేసినట్లు పోలీసులకు వివరించాడు. సైమండ్స్ ప్రమాద ఘటనపై టౌన్సన్ స్పందిస్తూ.. నా కళ్ల ముందే కారు యాక్సిడెంట్‌కి గురైంది. అతివేగంతో ఉన్న సైమండ్స్ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. సైమండ్స్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఇరుక్కుపోయిన సైమండ్స్‌ను కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాను. కానీ అప్పటికే అతని ప్రాణాలు విడిచాడు. ఆ సమయానికి ప్రమాదానికి గురైన వ్యక్తి సైమండ్స్ అని నాకు తెలీదు అని టౌన్సన్ చెప్పుకొచ్చాడు. ప్రమాద సమయంలో సైమండ్స్ కారులో రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, యాక్సిడెంట్లో ఆ రెంటికి ఎలాంటి అపాయం జరగలేదని పేర్కొన్నాడు. అందులో ఓ కుక్క సైమండ్స్ మృతదేహం వద్ద రోదిస్తూ.. అక్కడికి ఎవ్వరినీ రానివ్వలేదని పోలీసులు వివరించాడు. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. -
దిగ్గజ క్రికెటర్ సైమండ్స్ అకాల మృతి (ఫొటోలు)
-
ఐపీఎల్ చరిత్రలోనే ఆసీస్ ఆటగాడి పేరిట అత్యంత చెత్త రికార్డు
ఆస్ట్రేలియా ఆటగాడు.. ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో సూపర్ హిట్ ఆటగాడు. ఎంతలా అంటే ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. బీబీఎల్‌లో 62 మ్యాచ్‌ల్లో 82 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ 622 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 98 నాటౌట్. ఇంతమంచి రికార్డు కలిగిన ఆటగాడు ఐపీఎల్లో మాత్రం విఫలమయ్యాడు. తాజాగా ఐపీఎల్ చరిత్రలోనే డేనియల్ సామ్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం సామ్స్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో అతని బౌలింగ్ యావరేజ్ ఎంతో తెలుసా.. అక్షరాలా 242. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ యావరేజ్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. ఇక డేనియల్ సామ్స్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సామ్స్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ట్రేడింగ్‌లో ఆర్సీబీకి మారాడు. భారత్‌లో జరిగిన ఐపీఎల్ 2021 తొలి అంచె పోటీల్లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కోవిడ్ కారణంగా రద్దు కావడం.. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచె పోటీలకు దూరమయ్యాడు. ఆ సీజన్లో రెండు మ్యాచ్‌లు కలిపి 6.50 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు నిర్వహించిన మెగావేలంలో డేనియల్ సామ్స్‌ను ముంబై ఇండియన్స్ రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది. బీబీఎల్ రాణించడంతో అదే తరహా ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే మరోసారి నిరాశపరిచాడు. సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సామ్స్ 11.13 ఎకానమీ రేటుతో 89 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవరాల్‌గా మూడేళ్ల నుంచి చూసుకుంటే డేనియల్ సామ్స్ ఏడు మ్యాచ్‌ల్లో 26 ఓవర్లు బౌలింగ్ చేసి 242 బౌలింగ్ యావరేజ్‌తో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతని తర్వాతి స్థానంలో బరీందర్ శరణ 8 మ్యాచ్‌ల్లో 26 ఓవర్లు వేసి 70 బౌలింగ్ యావరేజ్‌తో 4 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా గతేడాది జరిగిన బీబీఎల్‌లో 14 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్న డేనియల్ సామ్స్ అదే ప్రదర్శనను ఇక్కడ మాత్రం చూపెట్టలేకపోతున్నాడు. రానున్న మ్యాచ్‌ల్లోనైనా కనీసం వికెట్లు తీసినా బాగుంటుందని అభిమానులు పేర్కొన్నారు. చదవండి: సుందర్- ఎవిన్ లూయిస్ చిత్రమైన యుద్దం.. చివరికి IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్కే పని అంతే! -
దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా!
ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ క్రికెట్లో రారాజు అనడంలో సందేహం లేదు. బంతిని నైపుణ్యంతో తిప్పడంలో అతనికి ఎవరు సాటిరారు. గింగిరాలు తిరిగే బంతి పిచ్‌పై పడి ఎటు వెళుతుందో తెలుసుకునే లోపే ప్రత్యర్థిని పెవిలియన్ చేర్చడం వార్న్ శైలి. క్రికెట్లో రారాజుగా వెలుగొందిన వార్న్‌కు.. ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం మాయని మచ్చలు చాలానే ఉన్నాయి. -సాక్షి, వెబ్‌డెస్క్ ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కాహాల్, మహిళలతో ప్రేమాయణాలు, అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మైదానం వెలుపల ఇన్ని చేసినప్పటికి వార్న్‌కు అభిమానగణం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తమ అభిమాన క్రికెటర్‌కు వీడ్కోలు పలుకుతూ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో వార్న్‌కు ఎవరు పోటీ లేరు అనుకుంటున్న మనకు.. క్రికెట్ వెలుపల మాత్రం ఇద్దరు ఫుట్‌బాల్ స్టార్ ఆటగాళ్లతో షేన్ వార్న్‌కు చాలా పోలికలు ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా అయితే.. రెండో వ్యక్తి నార్తన్ ఐరిష్ స్టార్ ఫుట్‌బాలర్ జార్జ్ బెస్ట్.. మీకు తెలుసో లేదో.. ఈ ముగ్గురి జీవితాలు పరిశీలిస్తే ఒకే రీతిలో ఉంటాయి. వార్న్, మారడోనా, జార్జ్ బెస్ట్ ఆటలో ఎంత పేరు సంపాదించారో.. వ్యక్తిగత జీవితంలో అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురిలో ఉన్న పోలికలు ఒకసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవేంటో ఒకసారి చూడండి. ►వార్న్ క్రికెట్లో రారాజుగా వెలుగొందితే.. మారోడనా, జార్జ్ బెస్ట్‌లు తమ కాలాల్లో ఫుట్‌బాల్‌లో స్టార్ ప్లేయర్లుగా సత్తా చాటారు. ఫుట్‌బాల్ ఆటలో మారడోనా, బెస్ట్‌లు తమ పాదాలతో గోల్ కొట్టడంలో నైపుణ్యం ప్రదర్శిస్తే.. వార్న్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్లో తన మణికట్టు మాయజాలాన్ని ప్రదర్శించి వికెట్లు తీసేవాడు. ►వార్న్ లాగే మారడోనా, జార్జ్ బెస్ట్ మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటు పడినవారే.. అమ్మాయిలతో రాసలీలలు.. అసభ్యకరమైన సందేశాలు పంపించడం చేశారు. ఈ విషయంలో మాత్రం జార్జ్ బెస్ట్‌కు మినహాయింపు జార్జ్ బెస్ట్ నార్తన్ ఐర్లాండ్ స్టార్ ఫుట్‌బాలర్ ► 1974లో జార్జ్ బెస్ట్ మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఒక మ్యాచ్ సందర్భంగా ఫుల్లుగా తాగి వచ్చాడు. విషయం తెలుసుకున్న జట్టు మేనేజర్ బెస్ట్‌ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బెస్ట్ మ్యాచ్‌లు ఆడకుండా మాంచెస్టర్ సిటీ అతడిపై నిషేధం విధించింది. ► మారడోనా కూడా 1994 వరల్డ్‌కప్‌కు ముందు ఈఫిడ్రైన్ అనే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. టెస్టులు చేయగా పాజిటివ్ రావడంతో ఫిఫా అతనిపై నిషేధం విధించింది. దీంతో మారడోనా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. మారడోనా విగ్రహం ►వార్న్ కూడా 2003 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు డోపింగ్ టెస్టులో పట్టుబడడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వార్న్‌పై నిషేధం విధించింది. ►ఇక నిషేధం తర్వాత మారడోనా లాగే వార్న్ కూడా స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి ►మారడోనాకు ఫుట్‌బాల్‌లో ''గోల్ ఆఫ్ ది సెంచరీ'' ఉన్నట్లే.. క్రికెట్లో వార్న్‌కు ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' ఉండడం విశేషం. ►1986 ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా 60 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడం చరిత్రలో నిలిచిపోయింది. 2002లో ఫిఫా డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో మారోడోనా కొట్టిన గోల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మారడోనా గోల్‌ను ఫిఫా.. ''గోల్ ఆఫ్ ది సెంచరీ''గా పేర్కొంది. మారడోనా గోల్ ఆఫ్ ది సెంచరీ; వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ ►ఇక వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ విషయానికి వస్తే.. 1993లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో మాంచెస్టర్ వేదికగా తొలి టెస్టు జరిగింది. ఆట రెండోరోజు వార్న్ మైక్ గాటింగ్‌కు అద్బుత బంతి వేశాడు. లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్ స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టడం క్రీడా పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. అసలు బంతి ఎలా తిరిగిందన్నది ఇప్పటికి మిస్టరీగానే ఉండిపోయింది. బ్యాట్స్‌మన్ మైక్ గాటింగ్తో పాటు అంపైర్ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే వార్న్ బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా చరిత్రలో నిలిచిపోయింది. ►1986 ఫిఫా ప్రపంచకప్ అర్జెంటీనా గెలవడంలో మారడోనా పాత్ర కీలకం.. అటు క్రికెట్లో 1999 వన్డే వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా గెలవడంలో వార్న్ కీలకపాత్ర పోషించాడు. 1986 ఫిఫా వరల్డ్‌కప్‌తో మారడోనా; 1999 వన్డే వరల్డ్‌కప్‌తో షేన్ వార్న్ ►ఇక ఈ ముగ్గురి మరణాలు కూడా దాదాపు ఒకే రీతిలో జరగడం విశేషం. ముగ్గురు తాము చనిపోయేటప్పుడు అచేతనా స్థితిలోనే మరణించారు. చదవండి: Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? Shane Warne: భారత్‌కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం! -
షేన్ వార్న్ హఠాన్మరణం అసలేం జరిగింది ??
-
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
-
ఆసుపత్రిలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్.. పరిస్థితి విషమం
Rod Marsh Heart Attack: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రాడ్ మార్ష్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం బుండాబెర్గ్లోని బుల్స్ మాస్టర్స్ చారిటీ గ్రూఫ్ నిర్వహించనున్న ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి కారులో బయలుదేరారు. కాగా మార్గమధ్యంలో కారులోనే గుండెపోటుకు గురయ్యారు. ఈ సమయంలో అతని పక్కనే ఉన్న బుల్స్ మాస్టర్స్ నిర్వాహకులు జాన్ గ్లాన్విల్లీ, డేవిడ్ హిల్లీర్లు మార్ష్‌ను క్వీన్స్‌ల్యాండ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మార్ష్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మార్ష్ పరిస్థితి ఏంటనేది 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమని తెలిపారు. కాగా రాడ్ మార్ష్ 1970-84 మధ్య కాలంలో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించారు. మంచి వికెట్ కీపర్‌గా పేరు పొందిన మార్ష్ 96 టెస్టుల్లో 3633 పరుగులు, 92 వన్డేల్లో 1225 పరుగులు చేశాడు. కీపర్‌గా 355 స్టంప్స్ చేశాడు. చదవండి: 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు -
మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉండేది
సిడ్నీ: ఆసీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్ వ్యక్తిగత విషయాలను అతని భార్య క్యాండీస్ వార్నర్ మీడియాకు వెల్లడించింది. గత వారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వార్నర్‌కు ఆమెకు మధ్య పరిచయం ఎలా ఏర్పడిందన్న విషయాన్ని మీడియా ముందు బహిర్గతం చేసింది. వివాహానికి రెండేళ్ల ముందు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తాము తొలిసారి కలుసుకున్నామని, ఆ సమయంలో వార్నర్ చాలా మొరటుగా, అహంకారిగా కనిపించాడని పేర్కొంది. వార్నర్ బయటికి కనిపించేంత ఆమాయకుడు కాదని, అప్పటికే ఓ గర్ల్ ఫ్రెండ్‌ను కూడా మెయింటైన్ చేసేవాడని చెప్పుకొచ్చింది. తాము ఒకే ప్రాంతంలో 500 మీటర్ల దూరంలో పెరిగినా ఒకరికొకరు పరిచయం లేదని ఆమె తెలిపింది. వార్నర్‌ను తొలిసారి టీవీలో చూసాక, సోషల్ మీడియా వేదికగా తనే మొదట మేసేజ్ చేశానని వెల్లడించింది. అలా మొదలైన తమ ప్రేమ.. రెండేళ్ల అనంతరం వివాహానికి దారితీసిందని చెప్పింది. కాగా, వార్నర్, క్యాండీస్ల వివాహం 2015లో జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్ధంతరంగా రద్దు కావడంతో ఇటీవలే కుటుంబ సభ్యులను కలుసుకున్న వార్నర్.. కొద్ది రోజులుగా కుటుంబంతో జాలీగా గడుపుతున్నాడు. అయితే, ఈ ఆసీస్ వెటరన్ ప్లేయర్ కొద్ది రోజుల్లో మళ్లీ బిజీ కానున్నాడు. జూలైలో విండీస్‌లో పర్యటన, ఆతర్వాత యూఏఈలో ఐపీఎల్, ఆ వెంటనే భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఇలా వరుస విదేశీ పర్యటనలతో బిజీ అయిపోనున్నాడు. చదవండి: ముంబై టు లండన్.. అలా సాగిపోయింది -
ICC World Cup: గెలిచిన జట్టులో సభ్యుడు.. ఇప్పుడు కార్పెంటర్!
ఆస్ట్రేలియా(కాన్బెర్రా): భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ కారణంగా కొత్తగా ఎంతో మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. వారికి వేలంలో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతిభ నిరూపించుకంటే కోట్లకు కోట్లు ఆర్జించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాళ్లు కూడా కొంతమంది ఈ లీగ్‌లో ఆడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొంతమంది పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ పొట్ట పోషించుకోవడానికి వడ్రంగిగా మారిపోయాడు. జేవియర్ డోహెర్టీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లకు పైగా అవుతోంది. 2015 ప్రపంచ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టులో అతడు భాగస్వామిగా ఉన్నాడు. లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన జేవియర్ డోహెర్టీ 2001-02 సీజన్లో తన ఫస్ట్-క్లాస్ జట్టులో అరంగేట్రం చేశాడు. దాదాపు అతను 17 సంవత్సరాల పాటు క్రికెట్లో కొనసాగారు. 71 ఫస్ట్ క్లాస్, 176 లిస్ట్ ఏ, 74 టీ-20 మ్యాచ్‌లు ఆడిన అతడు మొత్తం 415 వికెట్లు పడగొట్టాడు. ఇక అతడు చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కనిపించాడు. ఈ మాజీ ఆస్ట్రేలియన్ లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇప్పటిరకు ఆస్ట్రేలియా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు ఆడాడు. కాగా 2020, మార్చిలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ కోసం చివరిసారిగా ఆడాడు. Test bowler turned carpenter 👷🔨 Xavier Doherty took some time to find what was right for him following his retirement from cricket, but he's now building his future with an apprenticeship in carpentry.#NationalCareersWeek pic.twitter.com/iYRq2m39jt — Australian Cricketers' Association (@ACA_Players) May 18, 2021 (చదవండి: Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం) -
Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) నిషేధం విధించింది. వారి శిక్ష ముగిసి మళ్లీ మైదానంలోకి దిగడంతో అంతా ముగిసిపోయినట్లు భావించగా... బాన్‌క్రాఫ్ట్ తాజా వ్యాఖ్యలతో ఆ వివాదాన్ని మళ్లీ రేపాడు. ‘బాల్ ట్యాంపరింగ్ గురించి బౌలర్లకు తెలుసా’ అంటూ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ బాన్‌క్రాఫ్ట్...‘దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా’ అన్నాడు. దాంతో ఇందులో ఆసీస్ బౌలర్లకు కూడా భాగం ఉందని కొత్తగా చర్చ మొదలైంది. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలపై సీఏ వెంటనే స్పందించింది. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరి వద్దనైనా ఇంకా అదనపు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని... అవసరమైతే దీనిపై పునర్విచారణ చేస్తామని కూడా ప్రకటించింది. అంతే కాకుండా అవినీతి నిరోధానికి సంబంధించిన సీఏ ప్రత్యేక బృందం (ఇంటిగ్రిటీ యూనిట్) వెంటనే బాన్‌క్రాఫ్ట్‌తో మాట్లాడింది. నాడు ఇచ్చిన వాంగ్మూలంకంటే అదనంగా ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అంటూ ప్రశ్నించింది. ఆశ్చర్యమేమీ లేదు: క్లార్క్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఒక్కసారిగా ఏదో అనూహ్యం జరిగిపోయినట్లు స్పందిస్తున్నారని, అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ‘బంతిని ట్యాంపరింగ్ చేసిన విషయం జట్టులో ముగ్గురు ఆటగాళ్లకే తెలుసంటే ఎలా నమ్ముతాం. బంతిని షైనింగ్ చేసిన తర్వాత ఎవరైనా బౌలర్ వద్దకే విసురుతారు. వారికి ఆ తేడా అర్థం కాదా. అలాంటి ఘటన ఒక్కసారిగా ఏమీ జరిగిపోదు. దానికి ముందు ఎంతో ప్రణాళిక ఉండే ఉంటుంది. అందులో ఎవరెవరు భాగస్వాములో తెలియాలి కదా. అయితే ఆసీస్ బోర్డు ఈ విషయంలో అసలు నిజాలను దాటి పెట్టేందుకే ప్రయత్నించింది’ అని క్లార్క్ ఘాటుగా విమర్శించాడు. -
బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: బాన్‌క్రాఫ్ట్
లండన్: క్రికెట్లో పెను దుమారానికి కారణమైన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆ ఘటన ప్రధాన సూత్రధారి ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు (బాల్ ట్యాంపరింగ్) ప్రయత్నిస్తున్నాననే విషయం అప్పటి సారథి స్మిత్, వార్నర్‌లతోపాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసే పని వల్ల వారికే లాభం ఎక్కువగా ఉంటుంది. జట్టులో గుర్తింపు తెచ్చుకోవడం కోసం నేను ట్యాంపరింగ్‌కు పూనుకున్నాను. ఆ సమయంలో నైతిక విలువలను నేను పూర్తిగా మరిచిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో’ అని ఇంగ్లండ్‌కు చెందిన ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్ షిప్లో డర్హామ్ జట్టుకు ఆడుతున్నాడు. విచారణకు సిద్ధమైన సీఏ బాల్ ట్యాంపరింగ్‌పై బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణ ఉంటుందని సీఏ పేర్కొంది. -
నేను తప్పు చేయలేదు..సిగ్గు చేటు: స్మిత్
బ్రిస్బేన్: మూడో టెస్టులో పంత్ బ్యాటింగ్ గార్డ్ మార్క్‌ను ఉద్దేశపూర్వకంగా చెరిపేశాడంటూ తనపై వస్తున్న విమర్శలపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. అసలు ఇందులో ఎలాంటి వివాదమే లేదని అతను స్పష్టం చేశాడు. ‘తాజా ఆరోపణలతో నేను నిర్ఘాంతపోయా. చాలా నిరాశ చెందాను కూడా. సాధారణంగా పిచ్ వద్దకు వెళ్లి మా బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎలా ఆడుతున్నారు అనేది అక్కడ నిలబడి ఒక దృశ్యాన్ని నా మదిలో ఊహించుకుంటా. అప్రయత్నంగా మిడిల్ స్టంప్‌కు అనుగుణంగా ఒక మార్కింగ్ కూడా చేసుకోవడం నాకు అలవాటు. అంతే గానీ నేనేమీ కావాలని చేయలేదు. భారత జట్టు అద్భుత ప్రదర్శన కాకుండా ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత దక్కడం సిగ్గు పడాల్సిన అంశం’ అని స్మిత్ తనను తాను సమర్థించుకున్నాడు. చదవండి: స్టీవ్ స్మిత్.. మళ్లీ చీటింగ్ చేశాడు..! మరో వైపు సుదీర్ఘ కాలంగా స్మిత్ ఆటను చూసినవారికి ఇది అతను ఎప్పుడూ చేసే పనేనని అర్థమవుతుందన్న ఆసీస్ కెప్టెన్ పైన్... నిజంగా పంత్ మార్కింగ్‌ను చెరిపేస్తే భారత జట్టు అధికారికంగా ఫిర్యాదు చేసే ఉండేదని అభిప్రాయ పడ్డాడు. మైదానంలో అశ్విన్‌తో తాను వ్యవహరించిన తీరు పట్ల పైన్ క్షమాపణ కోరాడు. తాను కెప్టెన్‌గా విఫలమయ్యానని, ఒక ‘ఫూల్’లా వ్యవహరించానని చెప్పిన ఆసీస్ కెప్టెన్... ఆట ముగియగానే అశ్విన్‌తో మాట్లాడి తప్పు సరిదిద్దుకున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఆసీస్ స్టార్ ఆటగాడిపై వేటు! మూడో స్థానానికి కోహ్లి దుబాయ్: సిడ్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగు పర్చుకొని రెండో స్థానానికి (900 పాయింట్లు) చేరుకున్నాడు. అతని తాజా ప్రదర్శనతో విరాట్ కోహ్లి (870) మూడో స్థానానికి పడిపోగా...కేన్ విలియమ్సన్ (911) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడో టెస్టులో రాణించిన పుజారా రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌లో నిలవగా... రహానే ఆరునుంచి ఏడో స్థానానికి పడిపోయాడు. -
‘ప్రొఫెసర్’ కన్నుమూత
ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత డీన్ మెర్విన్ జోన్స్ (59) గురువారం హఠాన్మరణం చెందాడు. ఐపీఎల్ వ్యాఖ్యాతల బృందంలో సభ్యుడిగా ఉన్న జోన్స్ ముంబైలోని ఒక హోటల్లో బస చేస్తున్నాడు. బుధవారం రాత్రి ముంబై, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహిరించిన అతను చనిపోవడానికి ముందు కూడా స్టార్ స్పోర్ట్స్‌వారి ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో పాల్గొన్నాడు. మధ్యాహ్న భోజనానికి ముందు తీవ్ర గుండెపోటు కారణంగా హోటల్ గదిలోనే మరణించినట్లు సమాచారం. లంచ్‌కు వెళ్లటం గురించి జోన్స్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో గదికి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం తెలిసింది. బ్రెట్ లీ కొద్ది సేపు ‘సీపీఆర్’ చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే చనిపోయినట్లు అర్థమైంది. ఆటగాడిగా క్రికెట్ గుడ్‌బై చెప్పిన తర్వాత జోన్స్ కోచ్‌గా, కామెంటేటర్‌గా మళ్లీ తన అనుబంధాన్ని కొనసాగించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 2015నుంచి 2019 వరకు ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు జోన్స్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆటగాడిగా పలు ఘనతలు సాధించడంతో పాటు సునిశీత పరిశీలన, క్రికెట్ పరిజ్ఞానం, వ్యూహాలపై అతని విశ్లేషణలకు క్రికెట్ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే జోన్స్‌ను ‘ప్రొఫెసర్’ అని కూడా అతని సన్నిహితులు పిలుస్తారు. డీన్ జోన్స్ మృతి పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అతని ఘనతలను ప్రశంసిస్తూ నివాళులు అర్పించారు. మద్రాస్ స్పెషల్ డీన్ జోన్స్ పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు ఉన్నాయి. ఆస్ట్రేలియా సాధించిన అనేక విజయాల్లో అతను భాగంగా నిలిచాడు. 1987 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసీస్ జట్టులో కీలక పాత్ర (314 పరుగులు) పోషించిన డీన్ జోన్స్ కెరీర్లో 1989 యాషెస్ సిరీస్ ప్రదర్శన మరో మైలురాయి. ఆసీస్ 4–0తో నెగ్గిన ఈ సిరీస్‌లో జోన్స్ 566 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్ ఊపందుకుంటున్న సమయంలో జోన్స్ అందరికన్నా ప్రత్యేకంగా నిలిచాడు. వేగవంతమైన బ్యాటింగ్ శైలి, మైదానంలో చురుకైన ఫీల్డింగ్ కలగలిపి అసలైన వన్డే క్రికెటర్‌గా ఎదిగాడు. వికెట్ల మధ్య చురుకైన సింగిల్స్, వికెట్లకు అడ్డంగా వెళ్లి లెగ్‌సైడ్ వైపు షాట్లు ఆడటం, పేసర్ల బౌలింగ్‌లో కూడా క్రీజ్ వదలి ముందుకు దూసుకొచ్చి పరుగులు రాబట్టడం...టి20 క్రికెట్లో ఇప్పుడు చూస్తున్న ఇలాంటి శైలి ఆటను జోన్స్ 80వ, 90వ దశకాల్లోనే వన్డేల్లో చూపించాడు. నాటి రోజుల్లోనే అతను సుమారు 45 సగటుతో పరుగులు చేయడం విశేషం. అయితే జోన్స్ కెరీర్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిన ఇన్నింగ్స్ 1986లో మద్రాసులో భారత్‌తో జరిగిన చారిత్రాత్మక ‘టై’ టెస్టులో వచ్చింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోత మధ్య ఏకంగా 502 నిమిషాలు క్రీజ్‌లో నిలిచిన జోన్స్... 330 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లతో 210 పరుగులు చేయడం అతడిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఆట ముగిసిన తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి జోన్స్‌కు సెలైన్లు ఎక్కించాల్సి వచ్చింది. -
'ఆ ఫోటో చూసి షాక్‌కు గురయ్యా'
సిడ్నీ : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేసి ఆస్ట్రేలియా ప్రజలకు ఒక సందేశాన్నిచ్చాడు. కాగా ఈ పోస్టులో ఒక వ్యక్తి తన కుక్కతో పాటు సముద్రం బీచ్ ఒడ్డున కూర్చొని ఎదురుగా మంటల్లో కాలిపోతున్న చెట్లను చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రోజు రోజుకి మంటల తీవ్రత పెరిగిపోతుంది. తాజాగా ఈ మంటలు సిడ్నీ పరిసర ప్రాంతాల అడవులకు కూడా వ్యాపించాయి. కాగా శుక్రవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ సిడ్నీలో జరగనుంది. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్ చేస్తూ తన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'నేను ఇప్పుడే ఒక వ్యక్తి తన కుక్కతో పాటు బీచ్‌లో కూర్చొని చెలరేగుతున్న మంటలను తదేకంగా చూస్తున్న ఫోటో ఒకటి చూశాను. నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆస్ట్రేలియా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు దేశాన్ని విపత్కర పరిస్థితులకు నెట్టేసింది. దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి, వాలంటీర్లను మనం గౌరవించాలి. శుక్రవారం జరగనున్న మ్యాచ్ ప్రారంభానికి ముందు మాతో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసి వచ్చి వారు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తారని ఆశిస్తున్నా. దేశం రక్షణ కోసం పోరాడుతున్న మీకు మేము, మా కుటుంబాలు అండగా ఉంటాయి. దేశాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన మీరే నిజమైన హీరోలంటూ' వార్నర్ భావోద్వేగ పోస్టును పెట్టాడు. వార్నర్ పెట్టిన పోస్టుకు అతని అభిమానుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. View this post on Instagram I just saw this pic and I’m still in shock. When we go out to play tomorrow, not just the Australian team, but New Zealand as well, we never forget how privileged we are to live where we do and to do what we do. My heart, my family's heart, are with you. These fires are beyond words. To every Firefighter, volunteer to every family, we are with you. You are the real heroes. You do us proud. A post shared by David Warner (@davidwarner31) on Jan 1, 2020 at 11:01pm PST ప్రస్తుతం సిడ్నీలో నెలకొన్న పరిస్థితులతో మ్యాచ్‌కు అంతతరాయం కలిగే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆపరేషన్ హెడ్ పీటర్ రోచ్ వెల్లడించారు. అయితే మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు కార్చిచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరేందుకు ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారని తెలిపారు. (చదవండి : ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. ముగ్గురు మృతి) -
తన ఫాలోవర్స్‌కు క్షమాపణ చెప్పిన వాట్సన్
సిడ్నీ : ఆస్ట్రేలియన్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. తనకు తెలియకుండానే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన లోదుస్తులు ధరించిన మహిళకు సంబంధించిన స్క్రీన్ షాట్లను బ్రిటీష్ టాబ్లాయిడ్ 'ది సన్' ప్రచురించడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నాడు. దీనిపై వాట్సన్ స్పందిస్తూ.. 'నా అకౌంట్ తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్ చేశారు. గత శుక్రవారం ఇదే విధంగా ట్విటర్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారు. ఈ సందర్భంగా మీఅందరితో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. ఈ ఫోటోలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరిని క్షమాపణ కోరుతున్నట్లు' ట్వీట్ చేశాడు. షేన్ వాట్సన్‌ను ఇన్స్టాగ్రామ్, ఇతర అకౌంట్లతో కలిపి దాదాపు 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా తరపున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించిన వాట్సన్ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఆస్ట్రేలియా 2007, 2015 ప్రపంచకప్‌లు గెలవడంలో వాట్సన్ పాత్ర మరువలేనిది. ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. Another day..... Another social media account hacked!!!! Thanks to Twitter for getting onto this so quickly for me. Fingers crossed I have sorted this all out and it won’t happen again. 🤞🏻🤞🏻🤞🏻 #mysincereapologies #anotherhacking — Shane Watson (@ShaneRWatson33) October 16, 2019 My apologies to everyone for the illicit photos that have been posted on my Instagram account. First my Twitter account on Friday got hacked and now Instagram today. Instagram needs to help out a lot quicker when things like this happens. This is taking way too long!!! 😡😡😡😡 — Shane Watson (@ShaneRWatson33) October 15, 2019 -
‘సిక్సర’ పిడుగు... ఆసీస్ కుర్రాడు
అడిలైడ్: ఆస్ట్రేలియా టీనేజ్ క్రికెటర్ ఓలీ డేవిస్ తన బ్యాట్‌తో అండర్–19 వన్డే క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించాడు. వరుస 6 బంతుల్లో 6 సిక్సర్లతో పాటు డబుల్ సెంచరీ రికార్డుని సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అండర్–19 వన్డే నేషనల్ చాంపియన్‌షిప్‌కు సిక్సర్ల సునామీతో ఘన ఆరంభాన్నిచ్చాడు. సోమవారమే మొదలైన ఈ టోర్నీలో న్యూసౌత్‌వేల్స్ మెట్రో కెప్టెన్, 18 ఏళ్ల డేవిస్... నార్తర్న్ టెరిటరీ (ఎన్టీ) జట్టుపై చెలరేగాడు. 115 బంతుల్లో 14 ఫోర్లు, 17 సిక్సర్లతో 207 పరుగులు చేసి ఈ వన్డే చాంపియన్‌షిప్‌లో ‘డబుల్’ చరిత్రను తనపేర రాసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన రోహిత్ శర్మ (భారత్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్ (వెస్టిండీస్)లను మించిపోయాడు. 100 పరుగులను 74 బంతుల్లో పూర్తిచేసిన ఈ సిడ్నీ సంచలనం తర్వాతి 100 పరుగులను కేవలం 39 బంతుల్లోనే సాధించడం విశేషం. ఎన్టీ స్పిన్నర్ జాక్ జేమ్స్ వేసిన 40వ ఓవర్లో అతను వరుస ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్ (భారత్), జోర్డాన్ క్లార్క్ (ఇంగ్లండ్) వరుస ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు. గిబ్స్, యువరాజ్ సింగ్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో... సోబర్స్, జోర్డాన్ క్లార్క్ కౌంటీ క్రికెట్లో... రవిశాస్త్రి రంజీ క్రికెట్లో ఈ ఘనత సాధించారు. ఓలీ డేవిస్ ధాటికి ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ మెట్రో 50 ఓవర్లలో 4 వికెట్లకు 406 పరుగుల భారీస్కోరు చేయగా, నార్తర్న్ టెరిటరీ 238 పరుగుల వద్ద ఆలౌటైంది. మెట్రో జట్టు 168 పరుగులతో జయభేరి మోగించింది. -
నన్ను ఒసామా అని పిలిచాడు: క్రికెటర్
మెల్బోర్న్: తనపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఆరోపించాడు. 2015 యాషెస్ సిరీస్ సందర్భంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఆటగాడు తనను ఉద్దేశించి ‘ఒసామా’ అని సంబోధించాడని పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథలో అలీ ఈ విషయాన్ని రాసుకొచ్చాడు. ‘యాషెస్‌లో నాకు అదే తొలి టెస్టు. నా ప్రదర్శన (77 పరుగులు, ఐదు వికెట్లు)ను గొప్పగా భావిస్తున్నా. అదే సమయంలో మైదానంలో ఓ ఘటన కలచి వేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు నావైపు తిరిగి ‘టేక్ దట్, ఒసామా’ అని వ్యాఖ్యానించాడు. ఆ క్షణంలో నిజమేనా? అని ఆశ్చర్యపోయా. తర్వాత అర్థమైంది. నేనైతే గ్రౌండ్లో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు’ అని అలీ అన్నాడు. ‘ఇంగ్లండ్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు విషయం చెప్పా. వారు మా కోచ్ ట్రెవర్ బేలిస్‌కు చేరవేశారు. ఆయన ఆసీస్ కోచ్ డారెన్ లీమన్‌తో మాట్లాడాడు. లీమన్ ఆ ఆటగాడిని పిలిచి ప్రశ్నించగా... అతడు ఖండించాడు. ‘టేక్ దట్ యు పార్ట్ టైమర్’ అని మాత్రమే అన్నట్లు చెప్పాడు. సిరీస్ ముగిశాక కూడా ఆ ఆటగాడు తప్పును ఒప్పుకోలేదు’ అని అలీ వివరించాడు. ఈ వ్యాఖ్యల కారణంగా మిగతా మ్యాచ్ మొత్తం తాను ఆగ్రహంగా ఆడానని పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికార ప్రతినిధి తెలిపారు. ఇలాంటి ప్రవర్తనను సహించమని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుని విచారణ చేపడతామని స్పష్టం చేశారు. -
సంచలనం: 40సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
సాక్షి: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్రేడ్ క్రికెట్ ఆటగాడు మైదానంలో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. సింగిల్ పరుగు తీసినంత సులువుగా సిక్సర్లు కొట్టేశాడు. ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే జోష్ డన్స్టన్ అనే ఆస్ట్రేలియన్ క్లబ్ క్రికెటర్, శనివారం జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. బంతులను అలవోకగా గ్రౌండ్ దాటించాడు. 40 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ(307) పూర్తి చేశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు కలిపితే 47 పరుగులు చేయగా అందులో 18 పరుగులే అత్యధికం. మూడో స్థానంలో వచ్చిన డన్స్టన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. జట్టు మొత్తం పరుగులు 354 కాగా అందులో డన్స్టన్ పరుగులే 307 ఉన్నాయి. అంతేకాదు 203 వద్ద నుంచి 307 పరుగులు చేసే లోపు నాన్‌స్ట్రైకర్ చేసిన పరుగులు 5మాత్రమే. మొత్తం స్కోర్‌లో 86.72 శాతం పరుగులు డన్స్టన్ చేసినవే. ప్రపంచంలో ఇప్పటి వరకూ అన్ని ఫార్మెట్లలో ఈ రికార్డు రిచర్డ్స్ పేరుతో ఉన్న రికార్డును తుడిచేశాడు. వెస్టిండీస్ 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు మొత్తం చేసిన పరుగుల్లో(272) రిచర్డ్స్ 69.48 శాతం పరుగులు(189) చేశాడు. -
'మర ఫిరంగి' మారిపోయాడు..!
మైదానంలో డేవిడ్ వార్నర్ బ్యాట్ మాట్లాడుతుంది...లేదంటే అతని నోరు ఆగకుండా మాట్లాడుతుంది... ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ గురించి అందరూ చెప్పే మాట ఇది. ఆటతో అద్భుతాలు చేసినా, నోటి దురుసుతో వివాదాలను వెంట మోసుకుపోవడంలో కూడా ‘రికార్డులు’ కొల్లగొట్టిన ఘనత వార్నర్‌ది. మూడేళ్ల క్రితం మందు తాగిన మత్తులో తోటి క్రికెటర్‌పై ముష్టిఘాతాలు కురిపించినవాడు ఇప్పుడు మంచి బాలుడిలా మారిపోయాడు! ఈ సారి ఐపీఎల్లో అతని బ్యాట్ మాత్రమే మాట్లాడింది. ఎక్కడా వార్నర్ నోటికి పని చెప్పలేదు. వివాదం అనే మాటను బౌండరీ బయటికి విసిరి కొట్టి కేవలం తన వ్యూహాలతోనే జట్టును చాంపియన్‌ను చేశాడు. ఆస్ట్రేలియా టి20 జట్టుకు అతడిని కెప్టెన్‌ను చేయాలంటూ చాపెల్లాంటివాళ్లే ఇప్పుడు చెప్పడం వార్నర్ తనదైన శైలిలో చేసిన పెద్ద జంపింగ్! ♦ డేవిడ్ వార్నర్ ప్రస్థానం ఆసక్తికరం ♦ కెరీర్లో వివాదాలతో సహవాసం ♦ ఐపీఎల్లో అనూహ్య మార్పు ♦ విజయవంతమైన కెప్టెన్‌గా కొత్త రూపు సాక్షి క్రీడా విభాగం: మర ఫిరంగి... డేవిడ్ వార్నర్ ముద్దుపేరు ఇది. మందుగుండు దట్టించి మండించిన తర్వాత ఫిరంగి ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తోందో డేవిడ్ వార్నర్ కెరీర్ కూడా అంతే స్థాయిలో దూసుకుపోయింది. ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండా ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్నర్ ఆ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. టి20 ప్రదర్శనతో టెస్టుల వరకు ఎదిగిన తొలి ఆసీస్ ఆటగాడు కూడా అయిన వార్నర్... ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలోనే దూకుడుగా ఆడటం అలవాటుగా మార్చుకున్నాడు. వార్నర్ తొలి టెస్టు మ్యాచ్ టెస్టుల చరిత్రలో 2020ది కావడం యాదృచ్ఛికం! రెండు వైపులా పదును పరిమిత ఓవర్ల క్రికెట్లో రివర్స్ స్వీప్, స్విచ్ హిట్లను చాలా కాలం క్రితమే తరచుగా వాడి పాపులర్ చేసిన ఆటగాళ్లలో వార్నర్ కూడా ఒకడు. చిన్నప్పటినుంచి లెఫ్ట్ హ్యాండర్ అయిన వార్నర్ 13 ఏళ్ల వయసులో కోచ్ సూచనపై ఏడాది పాటు రైట్ హ్యాండర్‌గా మారి ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్‌తో అతను పదే పదే బంతిని గాల్లోకి కొడుతుండటంతో ఈ మార్పు జరిగింది. ఏడాది పాటు ఇలాగే ఆడిన అతను మళ్లీ తల్లి సలహాతో తన పాత శైలికి వచ్చి.... అండర్-16 జాతీయ స్థాయిలో అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. నెట్స్‌లో కూడా రెగ్యులర్‌గా ఈ షాట్లను ఆడే వార్నర్ ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్కసారైనా స్విచ్‌తో పరుగులు రాబట్టడాన్ని ఇష్టపడతాడు. 2009లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో వార్నర్ తన బ్యాట్‌తో కొత్త సంచలనానికి తెర తీశాడు. రెండు వైపులనుంచి షాట్లు ఆడగలిగే కొత్త తరహా బ్యాట్‌ను టి20ల కోసం ప్రత్యేకంగా తయారు చేయించి బరిలోకి దిగాడు. ఇది స్విచ్ హిట్లకు అద్భుతంగా పని చేసినా... విమర్శలు రావడంతో తర్వాత దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. మళ్లీ మళ్లీ తప్పులు ‘సీరియస్ క్రికెట్లో ఇలా చిల్లర చేష్టలతో ఏ మాత్రం బుర్ర ఎదగకుండా నేను చూసిన క్రికెటర్ వార్నర్. ఇలాంటి వాళ్ల కోసమే క్రికెట్లో కూడా ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు పెట్టాలేమో’... న్యూజిలాండ్ దిగ్గజం మార్టిన్ క్రో చేసిన వ్యాఖ్య ఇది. ఒకటా, రెండా.... డేవిడ్ పదే పదే చేసిన పనులు అతడిని విలన్‌గా మార్చేశాయి. ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ గ్రీవ్స్‌తో మాటల యుద్ధం మొదలు ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌లను దూషించినందుకు భారీ జరిమానా, మైదానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ సోలెకైల్తో గొడవ, గుర్రాల రేసు చూసేందుకు తన సొంత క్లబ్ మ్యాచ్ ఆడకుండా డుమ్మా, దక్షిణాఫ్రికా ట్యాంపరింగ్ చేసిందంటూ నోరు జారడం, భారత్ సిరీస్‌తో రోహిత్ శర్మ, ఆరోన్లతో నోటి దురుసు... ఈ పేద్ద జాబితాతో ఒక దశలో ఆస్ట్రేలియా బోర్డు ఇలాగైతే నీ పని ఖతం అంటూ బహిరంగంగా హెచ్చరించాల్సి వచ్చింది. వార్నర్ కెరీర్లో ఇలాంటి వివాదానికి పెద్దన్నలాంటి ఘటన 2013 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఓడిన అనంతరం పబ్‌లో జో రూట్ మొహంపై పిడిగుద్దులు విసరడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. దీని తర్వాత అతను ఎంతో కాలం క్రికెట్లో సాగడనిపించింది. కానీ పడిలేచిన కెరటంలా వార్నర్ మళ్లీ నిలబడ్డాడు. ఐపీఎల్లో కొత్త హీరో పొట్టివాడైనా గట్టివాడైన వార్నర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌కు ఐపీఎల్‌ను వేదికగా చేసుకున్నాడు. ఆరు సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున చెప్పుకోదగ్గ పరుగులు సాధించినా అతనికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. 2009లో హైదరాబాద్ వేదికగా న్యూసౌత్‌వేల్స్ చాంపియన్స్ లీగ్ గెలుచుకున్న సమయంలో అతను అనామకుడే. కానీ గత మూడేళ్లలో అతను ఒక్కసారిగా ఈ లీగ్‌లో ప్రధానాకర్షణగా మారాడు. గత ఏడాది అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతను 2014 సీజన్లో కూడా 500కు పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 17 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 848 పరుగులతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ భారం మొత్తం తనే మోశాడు. 9 అర్ధ సెంచరీలు సహా 151.42 స్ట్రైక్‌రేట్‌తో అతను చేసిన పరుగులు జట్టును చాంపియన్‌గా నిలిపాయి. ఐపీఎల్ కెరీర్లో 100వ మ్యాచ్ అయిన ఫైనల్‌ను వార్నర్ విజయంతో చిరస్మరణీయం చేసుకున్నాడు. కెప్టెన్ కూల్... ఫైనల్ గెలిచిన తర్వాత ‘ఇప్పుడు ఒక బీరు తాగాలనిపిస్తోంది’ అంటూ వార్నర్ చెప్పడం తనను ఆడుకోనీయకుండా అడ్డుకున్న తల్లిదండ్రులతో చిన్నపిల్లాడు బతిమాలినట్లు అనిపించింది! తన వ్యవహార శైలితో క్రికెట్ ముగిసి పోతుందని భయపడిన వార్నర్ ఏడాదిగా తాను మారే ప్రయత్నం చేశాడు. మందు మానేసి తనపై తాను స్వీయ నియంత్రణ విధించుకున్నాడు. భార్య, ఇద్దరు అమ్మాయిలు తాను మారడానికి కారణమని చెప్పుకున్నాడు. తాను ఎదిగానని చెప్పేందుకు వచ్చిన ఐపీఎల్ కెప్టెన్సీ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. కొత్త ప్రయోగాలు చేయకుండా ఒకే తరహాలో తన బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలను అమలు చేశాడు. ఒక దశలో అవి రొటీన్‌గా అనిపించినా, ఫలితం ప్రతికూలంగా వచ్చినా దానినుంచి మారలేదు. ముఖ్యంగా ముస్తఫిజుర్‌తో బౌలింగ్ ఆరంభించాలని ఎన్ని సూచనలు వచ్చినా... తాను అనుకున్నట్లుగా తన లెక్కల ప్రకారమే బౌలింగ్ చేయించాడు. మైదానంలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ కాదు కదా... ఒక్కసారి కూడా ప్రత్యర్థికి దగ్గరగా రావడం కూడా జరగలేదు. ‘ఫెయిర్ ప్లే’ ట్రోఫీ అందుకోవడం కెప్టెన్‌గా వార్నర్‌కు లభించిన పెద్ద కితాబు. టి20 కెప్టెన్సీనుంచి స్మిత్‌ను తప్పించి వార్నర్‌కు అవకాశం ఇవ్వాలని చాపెల్, పాంటింగ్ మద్దతు పలకడం చూస్తే వార్నర్ సాధించింది ఎంత పెద్ద ఘనతో అర్థమవుతుంది. -
నేడు క్రికెటర్ హ్యూస్ అంత్యక్రియలు
-
బంతి తగిలితేనే మరణించాడా?
ఫిల్ హ్యూగ్స్ మరణంతో క్రికెట్ అభిమానులే కాదు.. యావత్ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. కానీ, కేవలం చిన్న బంతి తగిలితేనే ప్రాణాలు పోతాయా అని చాలామందికి అనుమానం వచ్చింది. అసలే ఏం జరిగిందోనన్న ఆత్రుత, ఆసక్తి చాలామందిలో కనిపించాయి. మరి హ్యూగ్స్ మరణానికి కారణం ఏంటో ఒక్కసారి చూద్దామా.. నవంబర్ 25వ తేదీన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆడుతుండగా హ్యూగ్స్ తలకు ఓ బౌన్సర్ వచ్చి తగిలింది. వెంటనే రెండు క్షణాల్లోనే పడిపోయిన హ్యూగ్స్ మరి లేవలేదు. అటునుంచి అటే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మెడకు ఒక పక్క ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి వచ్చి బలంగా తగలడం వల్ల అది బాగా నలిగిపోయిందని వైద్యులు తెలిపారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఇది చాలా కీలకం. అయితే అది నలిగిపోవడం వల్ల మెదడులోకి రక్తసరఫరా సరిగా జరగలేదు. ఇది అత్యంత ప్రమాదకరం. దీన్ని వైద్యపరిభాషలో వెర్టెబ్రల్ ఆర్టెరీ డిసెక్షన్ అంటారు. ఈ తరహా ప్రమాదం అత్యంత అరుదైనదని, ఎప్పుడో గానీ జరగదని హ్యూగ్స్కు చికిత్స చేసిన సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మెదడు చుట్టూ ఉండే పుర్రెలో కొంత భాగాన్ని తొలగించి మెదడుకు రక్తసరఫరా పెంచేందుకు ప్రయత్నించారు. తర్వాత మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వడానికి హ్యూగ్స్‌ను బలవంతంగా కోమాలోకి పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో.. హ్యూగ్స్ ప్రాణాలు వదిలాడు. -
ఎలాంటి మార్పూ లేదు
సిడ్నీ: తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఆరోగ్య పరిస్థితిలో బుధవారం ఎలాంటి మెరుగుదల రాలేదు. ఇప్పటికీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ‘ఫిల్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. ఇంకా విషమంగానే ఉంది. స్కానింగ్ నివేదికలు వచ్చిన తర్వాత, ఏదైనా మెరుగుదల ఉంటే తెలియజేస్తాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. మంగళవారం షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతూ అబాట్ బౌలింగ్‌లో బంతి తలకు తగలడంతో హ్యూస్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలోని ప్రస్తుత రౌండ్ అన్ని మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు సీఏ ప్రకటించింది. ‘హ్యూస్ ఆరోగ్యం గురించి ఆటగాళ్లంతా ఆందోళనగా ఉన్నారు. ఇది క్రికెట్ ఆడేందుకు తగిన సమయం కాదు. ఈ విషయాన్ని ఆటగాళ్లతో చర్చించిన అనంతరం మ్యాచ్‌లు రద్దు చేశాం’ అని సీఏ ఈజీఎం హోవార్డ్ చెప్పారు. హ్యూస్ పాత హెల్మెట్ ధరించాడు... మ్యాచ్ ఆడుతున్న సమయంలో హ్యూస్ తమ సంస్థ రూపొందించిన కొత్త తరహా మోడల్ కాకుండా పాత హెల్మెట్‌ను ధరించినట్లు తయారీదారు ‘మసూరి’ సంస్థ ప్రకటించింది. దాంతో కాస్త ఎక్కువ రక్షణ లభించేదన్న సదరు సంస్థ... కొత్త మోడల్ హెల్మెట్, హ్యూస్‌ను కాపాడేదా అనే ప్రశ్నకు మాత్రం తగిన సమాధానమివ్వలేదు. మరోవైపు ఫిల్ త్వరగా కోలుకోవాలంటూ సచిన్ తేందూల్కర్, గిల్‌క్రిస్ట్, లారావంటి ప్రముఖులు ఆకాంక్షించారు. ‘క్రికెట్ ప్రమాదకర క్రీడ. రగ్బీ, రేసింగ్లాగే ఇందులోనూ ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి ఘటన మరోసారి జరగదని అనుకోలేము. హ్యూస్ ఘటన దురదృష్టకరం. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని లారా అభిప్రాయపడ్డారు. -
ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ పరిస్థితి విషమం!
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సిడ్నీలో స్థానిక జట్లతో క్రికెట్ ఆడుతున్న సందర్భంగా అతని తలకు బంతి తాకింది. సియాన్ అబోట్ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఫిలిప్ హ్యూస్ తలకు తీవ్రంగా గాయమైంది. బంతి తలకు తాకగానే అతడు కుప్పకూలిపోయాడు. దాంతో హ్యూస్ ను హుటాహుటీన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. కాగా హ్యూస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆసీస్ కెప్టెన్ క్లార్క్.... హ్యూస్ ఆరోగ్యంపై వాకబు చేశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు హ్యూస్ తల్లి, సోదరి క్రికెట్ గ్రౌండ్‌లోనే ఉన్నారు. కాగా ఫిల్ హ్యూస్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించాడు. గతనెల పాకిస్తాన్‌తో జరిగిన వన్డేల్లో అతను పాల్గొన్నాడు. అలాగే టీమిండియాతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు హ్యూస్ పేరు పరిశీలనలోకి వచ్చింది. -
ఆసీస్ క్రికెటర్ హ్యూగ్స్ పరిస్థితి విషమం
-
ఎవరి సరదా వాళ్లది
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు... అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ జేడ్ హెర్రిక్దో వింత పిచ్చి. పచ్చబొట్లు (టాటూ) అంటే చాలామందికి సరదా, కొందరికి ఇష్టం. కానీ హెర్రిక్కు మాత్రం ప్రాణం. 29 ఏళ్ల ఈ క్రికెటర్ చిన్నప్పటి నుంచి తాను ఇష్టపడ్డ కార్టూన్లు, యానిమేటెడ్ సినిమాలను టాటూల రూపంలో ఒళ్లంతా పొడిపించుకున్నాడు. దీనికోసం ఇప్పటిదాకా రూ.12 లక్షలపైనే ఖర్చు చేశాడు. టాటూల కోసం ఇంత ఖర్చు చేస్తావా అని అడిగితే... ‘నేను ఎక్కువగా మందు తాగను. పార్టీల కోసం డబ్బులు తగలేయను. దుబారా ఖర్చు చేయను. ఇవంటే ఇష్టం కాబట్టి ఖర్చుపెడతా’ అంటున్నాడు. సరే ఆయన శరీరం, ఆయనిష్టం. కానీ ఈ టాటూలను అందరికీ చూపించి ముచ్చట పడిపో తాడు. తన పచ్చబొట్లు అన్నీ అందరికీ చూపించేందుకు గాను నగ్నంగా ఫొటోలు దిగి సంచలనం సృష్టించాడు. దీంతో అసలుకే మోసం వచ్చింది. తను నగ్నంగా ఫొటోలు దిగిన తర్వాత చాలామంది హెర్రిక్తో మాట్లాడటానికి ఇష్ట పడటం లేదట. కానీ తనతో మాట్లాడితే తానెంత మంచివాడినో తెలుస్తుంది అంటున్నాడు... బిగ్‌బాష్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ఆడే హెర్రిక్.