Rod Marsh Heart Attack: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రాడ్ మార్ష్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం బుండాబెర్గ్‌లోని బుల్స్ మాస్టర్స్ చారిటీ గ్రూఫ్ నిర్వహించనున్న ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి కారులో బయలుదేరారు. కాగా మార్గమధ్యంలో కారులోనే గుండెపోటుకు గురయ్యారు. ఈ సమయంలో అతని పక్కనే ఉన్న బుల్స్ మాస్టర్స్ నిర్వాహకులు జాన్ గ్లాన్‌విల్లీ, డేవిడ్ హిల్లీర్‌లు మార్ష్‌ను క్వీన్స్‌ల్యాండ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం మార్ష్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మార్ష్ పరిస్థితి ఏంటనేది 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమని తెలిపారు. కాగా రాడ్ మార్ష్ 1970-84 మధ్య కాలంలో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించారు. మంచి వికెట్ కీపర్‌గా పేరు పొందిన మార్ష్ 96 టెస్టుల్లో 3633 పరుగులు, 92 వన్డేల్లో 1225 పరుగులు చేశాడు. కీపర్‌గా 355 స్టంప్స్ చేశాడు.
చదవండి: 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది?
Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు
Comments
Please login to add a commentAdd a comment