Former Cricketer
-
సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్.. టీమిండియా మాజీ క్రికెటర్ భార్య.. ‘మాయచేసే’ విద్య (ఫొటోలు)
-
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి
బనశంకరి: భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులోని కొత్తనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కనకశ్రీ లేఔట్ ఎస్ఎల్వీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి ఆయన కింద పడటంతో తీవ్ర గాయాలై మరణించారు. గురువారం ఉదయం గం. 11:15 సమయంలో ఈ సంఘటన జరిగింది. హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. 1996లో డేవిడ్ జాన్సన్ భారత జట్టు తరఫున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా 1996 అక్టోబర్‌లో ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన జాన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో జాన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సాధించాడు. -
Lok Sabha elections 2024: గౌతమ్ గంభీర్ అస్త్ర సన్యాసం
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ నియోజకవర్గం ఎంపీ గౌతమ్ గంభీర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సంకేతాలిచ్చారు. క్రికెట్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ కానున్నందున తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలంటూ శనివారం ఆయన బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గంభీర్ శనివారం ‘ఎక్స్’లో.. ‘నాకు రాజకీయ బాధ్యతల నుంచి విరామం ఇవ్వాలంటూ గౌరవ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశాను. దీనివల్ల రానున్న క్రికెట్ సీజన్లో ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జీలకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు. గంభీర్‌ను ఈసారి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి మార్చొచ్చంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. జార్ఖండ్‌లోని హజారీబాగ్ బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా కూడా గౌతమ్ గంభీర్ బాటలోనే నడుస్తున్నారు. తనకు క్రియాశీల రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలంటూ పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. -
త్రిపుర క్రికెట్లో ప్రొటీస్ మాజీ ఆల్‌రౌండర్‌కు కీలక పదవి
దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ త్రిపుర క్రికెట్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ శనివారం(జూన్ 3న) త్రిపుర క్రికెట్ కన్సల్టెంట్ పదవిని స్వీకరించనున్నాడు. ఇప్పటికే అగర్తల చేరుకున్న క్లూసెనర్ రానున్న దేశవాలీ క్రికెట్ సీజన్లో భాగంగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా ఉండనున్నాడు. త్రిపుర జట్టు కన్సల్టెంట్‌గా లాన్స్ క్లూసెనర్ తొలుత 100 రోజుల సీజన్‌కు అందుబాటులో ఉంటాడని.. 20 రోజులు అగర్తల క్యాంప్‌లో ఉండి జట్టును పర్యవేక్షిస్తాడని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తిమిర్ చందా పేర్కొన్నాడు. కాగా కన్సల్టెంట్ పోస్టుకు మా వెబ్సైట్లో ఒక ప్రకటన చేశాం. ఈ పదవి చేపట్టేందుకు డేవ్ వాట్మోర్ సహా లాన్స్ క్లూసెనర్లు ఆసక్తి చూపించారు. అయితే వ్యక్తిగత కారణాల రిత్యా డేవ్ వాట్మోర్ రేసు నుంచి తప్పుకోవడంతో లాన్స్ క్లూసెనర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అంటూ చెప్పకొచ్చాడు. కాగా కొన్నేళ్ల క్రితం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఒక ఫ్రాంచైజీకి క్లూసెనర్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇక అంతర్జాతీయంగా 1996 నుంచి 2004 వరకు దక్షిణాఫ్రికా తరపున ఆడిన క్లూసెనర్ 49 టెస్టుల్లో 1906 పరుగులతో పాటు 80 వికెట్లు, 171 వన్డేల్లో 3576 పరుగులతో పాటు 192 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో ఎక్కువగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన క్లూసెనర్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. దీనికి తోడు తన బౌలింగ్‌తోనూ ప్రొటిస్‌కు చాలా మ్యాచ్‌ల్లో విజయాలు అందించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇక 1999 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా జట్టులో క్లూసెనర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో మ్యాచ్ టై కావడం.. నెట్ రన్‌రేట్ ఆసీస్ కంటే తక్కువగా ఉన్న కారణంగా ప్రొటీస్ పోరాటం సెమీస్‌తోనే ముగిసింది. ఇక 2004లో రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం క్లూసెనర్ అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు! -
ధోని చేతిలో మరో వజ్రాయుధం అతడు మరో బ్రావో...
-
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మంగళవారం కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్ మేటి ఓపెనర్‌గా వెలుగొందారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా, సెలక్టర్‌గా సేవలందించారు. -
ఐఏఎస్ సాధించిన ఏకైక భారత్ క్రికెటర్
-
సివిల్స్ ర్యాంకు కొట్టిన టీం ఇండియా క్రికెటర్ ఎవరో తెలుసా.?
యూపీఎస్సీ(UPSC).. షార్ట్‌కట్‌లో సివిల్స్ ఎగ్జామ్. దేశంలో అత్యంత కఠిన పరీక్షగా సివిల్స్ ఎగ్జామ్‌కు పేరు ఉంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. జీవితంలో ఎంత మంచి స్థాయిలో ఉన్నా సివిల్స్ ఇచ్చే కిక్కు వేరు. దేశానికి సేవ చేసే అవకాశం సివిల్స్ రూపంలో వస్తుండడంతో యువత అడుగులు సివిల్స్ వైపు ఉంటాయి. ప్రతీ ఏటా లక్షల మంది సివిల్స్ రాస్తున్నప్పటికి క్లియర్ చేసే వారి సంఖ్య వందల్లో మాత్రమే ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న యూపీఎస్సీ ఎగ్జామ్‌ను ఒక టీమిండియా క్రికెటర్ క్లియర్ చేశాడన్న సంగతి మీకు తెలుసా. ఆటల్లో ఎక్కువగా ఆసక్తి కనబరిస్తే చదువులో వెనుకబడిపోతారనేది సహజంగా అందరూ అంటుంటారు. క్రికెట్ కంటే ముందే.... ఆటతో సమానంగా చదువులోనూ రాణించగలనని ఒక టీమిండియా క్రికెటర్ నిరూపించాడు. అతనెవరో కాదు.. మాజీ క్రికెటర్ అమే ఖురేషియా. 1972లో మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఖురేషియా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందే సివిల్స్ క్లియర్ చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు అమే ఖురేషియా. 17 ఏళ్ల వయసులోనే.... 17 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అమే ఖురేషియా చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. క్రికెటర్‌గా మారకపోయుంటే కచ్చితంగా ఐఏఎస్ అవ్వడానికి ప్రయత్నించేవాడినని ఖురేషియా పలు సందర్భాల్లో పేర్కొనేవాడు. అయితే చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయని ఖురేషియా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతూనే మధ్యప్రదేశ్ నుంచి సివిల్స్ ఎగ్జామ్‌ను క్లియర్ చేశాడు. అయితే అతను సివిల్స్ క్లియర్ చేసిన కొన్ని రోజులకే జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. డెబ్యూ మ్యాచ్ శ్రీలంకతో... దేశం కోసం ఆడాలన్న కల నిజం కావడంతో ఖురేషియా ఎగిరిగంతేశాడు. అలా 1999లో పెప్సీ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో(45 బంతుల్లో 57 పరుగులు) రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేయడంలో విఫలమైన ఖురేషియా మెల్లగా కనుమరుగయ్యాడు. అయితే అప్పటికే సివిల్స్ క్లియర్ చేయడంతో ఆటకు దూరమైనా తన రెండో కల(సివిల్స్)తో దేశానికి సేవ చేస్తున్నాడు. చివరి మ్యాచ్ శ్రీలంకతోనే... ఓవరాల్‌గా టీమిండియా తరఫున 12 వన్డేలాడిన ఖురేషియా 149 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్‌ను శ్రీలంకపైనే ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున 119 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన ఖురేషియా 7 వేలకు పైగా పరుగులు చేశాడు. 22 ఏప్రిల్ 2007న ఫస్ల్‌క్లాస్ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు
సౌతాఫ్రికా క్రికెట్లో మరొక శకం ముగిసింది. ప్రొటిస్ జట్టు సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లా బుధవారం(జనవరి 18న) అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వివాదాలకు దూరంగా.. ఇస్లాం మతానికి గౌరవం ఇస్తూ కెరీర్‌ను కొనసాగించిన అరుదైన క్రికెటరగా గుర్తింపు పొందాడు. తాను ధరించే జెర్సీపై ఎలాంటి లోగో లేకుండానే బరిలోకి దిగడం ఆమ్లాకు అలవాటు. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎక్కువగా స్పాన్సర్షిప్ ఇచ్చేది బీర్ల కంపెనీలే. ఇస్లాం మతంలో మద్యపానం నిషేధం. దానిని క్రికెట్ ఆడినంత కాలం మనసులో ఉంచుకున్న ఆమ్లా అంతర్జాతీయ మ్యాచ్‌లే కాదు కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా జెర్సీపై దక్షిణాఫ్రికా జాతీయ చిహ్నం మినహా ఎలాంటి లోగో లేకుండా జాగ్రత్తపడేవాడు. కౌంటీ క్రికెట్ సహా ఐపీఎల్ లాంటి ప్రైవేటు లీగ్స్‌లోనూ ఇదే జాగ్రత్తలు తీసుకునేవాడు. -సాక్షి, వెబ్‌డెస్క్ కోహ్లితో పోటీపడి పరుగులు.. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హషీమ్ ఆమ్లా ఒక దశలో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లితో పోటీపడి పరుగులు సాధించేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . ముఖ్యంగా వన్డేల్లో ఆమ్లా, కోహ్లి మధ్య కొంతకాలం పరుగుల పోటీ నడిచిందని చెప్పొచ్చు.కోహ్లి ఒక రికార్డు అందుకోవడమే ఆలస్యం.. వెంటనే ఆమ్లా లైన్లోకి వచ్చి ఆ రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో 55 సెంచరీల సాయంతో 18వేలకు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. మరి ఒకప్పుడు కోహ్లితో పోటీపడి పరుగులు సాధించిన ఆమ్లా ఆ తర్వాత ఎందుకనో వెనుకబడిపోయాడు. బహుశా వయస్సు పెరగడం.. ఫిట్నెస్ సమస్యలు.. జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడం అనుకుంటా. తర్వాత ఆమ్లాకు అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. అలా అంతర్జాతీయ క్రికెట్‌కు మెళ్లగా దూరమైన ఆమ్లా 2019 వన్డే ప్రపంచకప్ ముగియగానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. వివాదాలకు ఆమడ దూరం.. క్రికెట్ ఆడినంత కాలం ఆమ్లా ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోలేదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే ఆమ్లా చాలా నెమ్మదస్తుడు. ఒక్కసారి క్రీజులో అడుగుపెట్టాడంటే అతన్ని ఔట్ చేయడం అంత సులువు కాదు. ఎన్నోసార్లు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. భారత్ మూలాలున్న హషీమ్ ఆమ్లా స్పిన్ బౌలింగ్‌ను అవలీలగా ఆడగల సమర్థుడు. డీన్ జోన్స్ వివాదం ఆమ్లా క్రికెట్ కెరీర్లో ఏదైనా వివాదం ఉందంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. కామెంటేటర్ డీన్ జోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. 2013లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ సందర్భంగా మాటల మధ్యలో డీన్ జోన్స్ ఆమ్లాను ఉగ్రవాది అని సంబోధించాడు. ఆ మ్యాచ్‌లో కుమార సంగక్కర ఇచ్చిన క్యాచ్‌ను ఆమ్లా అందుకున్నాడు. వెంటనే డీన్ జోన్స్.. ఉగ్రవాదికి మరొక వికెట్ లభించింది. ఇది పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత డీన్ జోన్స్ తన వ్యాఖ్యలపై ఆమ్లాకు క్షమాపణ చెప్పినప్పటికి బ్రాడ్‌కాస్టర్స్ అతన్ని జాబ్ నుంచి తొలగించారు. అంతర్జాతీయ క్రికెట్లో 18వేలకు పైగా పరుగులు.. ఆమ్లా తన కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 124 టెస్టులు ఆడి 46.64 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉండగా.. 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక స్కోరు.. 311. ఇక 181 వన్డేలలో 8,113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ఇక 44 టీ20లలో 8 అర్ధశతకాలతో 1277 పరుగులు చేశాడు. ఇక కౌంటీ క్రికెట్ లో ఆమ్లా గణాంకాలు రికార్డులే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పనుకున్నాక ఆమ్లా సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 265 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన ఆమ్లా 19521 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్.. 311 నాటౌట్. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో 247 మ్యాచుల్లో10020 పరుగులు చేశాడు.హైయెస్ట్ స్కోరు 159. ఇక టీ20 క్రికెట్ లో 164 మ్యాచుల్లో 2 సెంచరీల సాయంతో 4563 పరుగులు చేశాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డబుల్ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..? -
'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది'
టి20 సిరీస్‌లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి టి20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. టాస్ వేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేసేందుకే అంపైర్లు మొగ్గుచూపారు. అలా తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడం అభిమానులను బాధించింది. ఆ తర్వాత టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసి ఫుట్‌వాలీ పేరుతో ఏకకాలంలో ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సైమన్ డౌల్ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు. ''ఇప్పుడే కామెంటరీ ఏరియాలో ఉన్న కుర్చీలకు పట్టిన దుమ్మును మొత్తం క్లీన్ చేశా. స్కై స్టేడియం సిబ్బంది ఎంత మంచి పనిమంతులనేది ఈ ఒక్క విషయంతో అర్థమయింది. అయినా ఇప్పుడు ఆ కుర్చీలన్నీ గుడ్డతో క్లీన్ చేశాను. ఇక ప్యానెల్‌కు వచ్చే విదేశీ గెస్టులు దర్జాగా వచ్చి ఆ కుర్చీల్లో కూర్చోవచ్చు. నిజంగా ఇది సిగ్గుచేటు.. కనీసం కుర్చీలను కూడా క్లీన్ చేయలేదు.. ఇది భరించకుండా ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దు అవుతుందని ముందే ఊహించి కనీస ఏర్పాట్లు కూడా సరిగా చేయలేకపోయారు'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సైమన్ డౌల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వర్షంతో తొలి టి20 రద్దు కాగా.. ఇరుజట్ల ఆటగాళ్లు మౌంట్ మాంగనూయ్‌కు బయలుదేరారు. ఆదివారం(నవంబర్ 20న) కివీస్, టీమిండియాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరగనుంది. @Sportsfreakconz @martindevlinnz Another great reason to play here at @skystadium . I have just cleaned all the seats in our commentary area so our overseas guests can sit down. What a shambles of a place. Embarrassing. #welcometoNZ pic.twitter.com/Xnpz5BihcI — Simon Doull (@Sdoull) November 18, 2022 చదవండి: FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు' వర్షంతో మ్యాచ్ రద్దు.. వింత గేమ్ ఆడిన భారత్, కివీస్ ఆటగాళ్లు -
PCA కు హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
క్యాచ్ పట్టగానే చిన్న పిల్లాడిలా మారిపోయిన మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ స్టార్ స్పిన్నర్ గ్రేమీ స్వాన్ టి10 యూరోపియన్ లీగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఆటగాడిగా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే స్వాన్ ఆ క్యాచ్ అందుకుంది ఒక ప్రేక్షకుడిగా. విషయంలోకి వెళితే.. టి10 యూరోపియన్ క్రికెట్లో భాగంగా ఇటలీ, స్విట్జర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇటలీ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్స్‌లో ఉన్న గ్రేమీ స్వాన్ డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తాను పట్టుకున్న బంతితో స్టాండ్స్ మొత్తం కలియ తిరుగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గ్రేమీ స్వాన్ ఇంగ్లండ్ తరపున మంచి స్పిన్నర్‌గా పేరు పొందాడు. ఇంగ్లీష్ జట్టు తరపున స్వాన్ 60 టెస్టుల్లో 255 వికెట్లు, 70 వన్డేల్లో 104 వికెట్లు, 39 టి20ల్లో 51 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇటలీ చేతిలో స్విట్జర్లాండ్ జట్టు 66 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు భారీ స్కోరు చేసింది. అమిర్ షరీఫ్ 24 బంతుల్లో 64 నాటౌట్, రాజ్మణి సింగ్ 18 బంతుల్లో 51, బల్జీత్ సింగ్ 17 బంతుల్లో 50 పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 102 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది. And @Swannyg66 grabs another one! Absolute scenes in Cartama😄 #EuropeanCricketChampionship #ECC22 #CricketinSpain pic.twitter.com/edTwcCrKPQ — European Cricket (@EuropeanCricket) October 6, 2022 చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్.. '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' -
వీవీఎస్ లక్ష్మణ్ కు బంపర్ ఆఫర్
-
భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
టీమిండియా మాజీ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ (సీనియర్) కుమారుడు హ్యారీ సింగ్ ఇంగ్లండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక అండర్-19 సిరీస్‌కు హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. కొన్నాళ్ల నుంచి హ్యారీ సింగ్తన బ్యాటింగ్‌తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అండర్-19లో రాణిస్తే.. సీనియర్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండడంతో హారి సింగ్‌కు ఇది కీలకం కానుంది. కాగా హ్యారీ సింగ్ లంకాషైర్ జూనియర్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అండర్-19కు ఎంపికైన తన కుమారుడిపై సీనియర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెక్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' కొద్ది రోజుల క్రితం, ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు హ్యారీని ఎంపిక చేసినట్లు ఈసీబీ నుంచి కాల్ వచ్చింది. శ్రీలంక అండర్-19 జట్టుతో స్వదేశంలోనే ఈ సిరీస్ ఆడనుంది. అయితే హారీ ఎంపిక అంత సులభంగా కాలేదు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంచెం అదృష్టంతో పాటు పరుగులు చేయడం కూడా అవసరం. 90వ దశకంలో మన భారత్‌లో దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్న చాలా మంది క్రికెటర్లను చూశాను. కానీ వారు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారు. హ్యారీ ఎదుగుతున్న కొద్దీ.. ప్రతి క్రికెటర్ చేసే టెక్నికల్ సర్దుబాట్లను చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.'' అని పేర్కొన్నాడు. కూతురు, కుమారుడితో మాజీ క్రికెటర్ రుద్రప్రతాప్ సింగ్ సీనియర్ ఇక లక్నోకు చెందిన సీనియర్ రుద్రప్రతాప్ సింగ్(ఆర్పీ సింగ్) 1986లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాతో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కేవలం రెండు వన్డే మ్యాచ్‌ల్లో మాత్రమే అతను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కపిల్‌దేవ్ కెప్టెన్సీలోనే ఆర్పీ సింగ్ ఈ రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్‌కు ఆడిన ఆర్పీ సింగ్ 59 ఫస్ట్‌క్లాస్, 21 లిస్ట్ -ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఆర్పీ సింగ్ బ్రిటన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి లండన్‌లోనే సెటిలయ్యాడు. కాగా ఆర్పీ సింగ్ కూతురు కూడా మెడిసిన్ చదవడానికి ముందు లంకాషైర్ తరపున అండర్-19 క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించింది. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. సీనియర్ ఆర్పీ సింగ్ అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు.. అంటే 2005లో టీమిండియా తరపున మరో ఆర్పీ సింగ్(రుద్రప్రతాప్ సింగ్) అరంగేట్రం చేశాడు. ఇతనికి కూడా ఉత్తర్‌ప్రదేశ్ కావడంతో.. సీనియర్ ఆర్పీ సింగ్‌కు బంధువు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీనియర్ ఆర్పీ సింగ్‌తో.. జూనియర్ ఆర్పీ సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జూనియర్ ఆర్పీ సింగ్ టీమిండియా తరపున 2005-2011 వరకు బౌలింగ్‌లో ఆర్పీ సింగ్ కీలకపాత్ర పోషించాడు. టీమిండియా గెలిచిన 2007 టి20 వరల్డ్‌కప్ జట్టులో ఆర్పీ సింగ్ సభ్యుడు. అంతేకాదు ఆ టోర్నీలో రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. 2018లో ఆర్పీ సింగ్ అన్ని ఫార్మాట్లు సహా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: Asia Cup 2022: టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! -
కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
క్రికెట్లో అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తర్వాత ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్), టి10 లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక వీటి జాబితాలోకి సౌతాఫ్రికా కూడా చేరనుంది. క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సౌతాఫ్రికా టి20 లీగ్ పేరిట కొత్త టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీ వెనుక పరోక్షంగా ఐపీఎల్ ప్రాంచైజీలు ఉండడం విశేషం. మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ పేర్లతో ఉన్న ప్రాంచైజీలను ముంబై ఇండియన్స్, సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేశాయి. ఈ కొత్త టి20 లీగ్‌కు ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు గ్రేమీ స్మిత్‌ను కమిషనర్‌గా ఎంపిక చేసింది. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, కామెంటేటర్‌గా, అంబాసిడర్‌గా, కన్సల్టెంట్‌గా ఎన్నో ఘనతలు సాధించిన స్మిత్.. తాజాగా సీఎస్ఏలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్(డీఓసీ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సౌతాఫ్రికాలో క్రికెట్‌ను జాతీయంగా మరింత పటిష్టంగా తయారు చేయాలని.. కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడానికే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు సీఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా టి20 లీగ్ కమిషనర్‌గా ఎంపికైన స్మిత్ స్పందించాడు. ''కొత్త తరహా టోర్నీకి కమిషనర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా. సౌతాఫ్రికా క్రికెట్‌కు పనిచేయడానికి ఎంత సమయమైనా సంతోషంగా కేటాయిస్తా. ఇలాంటి పోటీతత్వం ఉన్న కొత్త టి20 లీగ్‌ను నడిపించేందుకు దైర్యం కావాలి. అది ఉందనే నమ్ముతున్నా. దేశవాలీ క్రికెట్లో మనకు తెలియని అద్బుత ఆటగాళ్లను వెలికి తీయాలనేదే సీఎస్ఏ ప్రధాన ఉద్దేశం. అందుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌ను ప్రారంభించనుంది. ఆరంభ దశలో సక్సెస్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోలెట్సీ మోసికీ కొత్త బాధ్యతలు తీసుకున్న గ్రేమీ స్మి్త్‌కు శుభాకాంక్షలు తెలపగా.. దక్షిణాఫ్రికాకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు స్మిత్‌ను అభినందనల్లో ముంచెత్తారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ రెండు నెలల విండో క్రికెట్‌కు అనుమతించాలని బీసీసీఐ ఐసీసీని కోరగా.. అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐపీఎల్‌కు ఆటంకం లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించాలని సీఎస్ఏ భావిస్తోంది. ఇక గ్రేమి స్మిత్ దక్షిణాఫ్రికా తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అంతేగాక ఆల్‌టైమ్ టెస్టు కెప్టెన్లలో స్మిత్ పేరు కూడా ఉంటుంది. సౌతాఫ్రికాకు 54 టెస్టుల్లో విజయాలు అందించి.. అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా స్మిత్ రికార్డు సృష్టించాడు. 2003లో షాన్ పొలాక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న స్మిత్.. 2014లో తాను రిటైర్ అయ్యే వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగడం విశేషం. ఇక బ్యాటింగ్‌లోనూ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్స్ జాబితాలో స్మిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. 2002-2014 వరకు సౌతాఫ్రికా తరపున స్మిత్ 117 టెస్టుల్లో 9265 పరుగులు, 197 వన్డేల్లో 6989 పరుగులు, 33 టి20ల్లో 982 పరుగులు సాధించాడు. స్మిత్ ఖాతా 27 టెస్టు సెంచరీలు, 10 వన్డే సెంచరీలు ఉన్నాయి. చదవండి: యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
ఐసీయూలో పాక్ దిగ్గజ క్రికెటర్
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిసింది. నెల కిత్రం పని నిమిత్తం దుబాయ్ నుంచి లండన్‌కు వచ్చిన జహీర్ అబ్బాస్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి కోలుకున్న ఆయన మూడు రోజుల క్రితం చాతిలో నొప్పి ఉందని చెప్పడంతో లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియాతో బాధపడుతున్న అబ్బాస్‌కు వైద్యులు డయాగ్నసిస్ నిర్వహించారు. ''ప్రస్తుతం జహీర్ అబ్బాస్ పరిస్థితి బాగానే ఉందని.. అయితే ఊపిరి తీసుకోవడంలో కాస్త ఇబ్బంది ఉండడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచామని.. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తునట్లు'' వైద్యులు తెలిపారు. కాగా పాక్ దిగ్గజ క్రికెటర్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మహ్మద్ హఫీజ్, అలన్ విల్కిన్స్ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు జహీర్ అబ్బాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్లో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన జహీర్ అబ్బాస్ 1969లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ స్టార్ బ్యాటర్‌గా పేరు పొందిన జహీర్ అబ్బాస్ 72 టెస్టుల్లో 5062 పరుగులు, 62 వన్డేల్లో 2752 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 459 మ్యాచ్‌లాడిన జహీర్ అబ్బాస్ 34, 843 పరుగులు చేశాడు. ఇందులో 108 సెంచరీలు, 158 అర్థసెంచరీలు ఉండడం విశేషం. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఒక టెస్టు, మూడు వన్డేలకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. 2020లో జాక్వెస్ కలిస్, లిసా సాత్లేకర్లతో సంయుక్తంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. Get well soon Zed Bhai. You are an asset of our country. All the Duaas and Prayers for your health🤲🏻 #GetWellSoon pic.twitter.com/6EDn1SFmy2 — Waqar Younis (@waqyounis99) June 22, 2022 Wishing speedy recovery & complete health to Zaheer Abbas sb. Get well soon. Aameen 🤲🏼 https://t.co/ld5VH2nj7f — Mohammad Hafeez (@MHafeez22) June 21, 2022 చదవండి: Ben Stokes: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. కెప్టెన్‌కు అస్వస్థత 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! -
పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని
బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి ఈ ఏడాది రంజీ ట్రోపీలో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో.. ఆపై మధ్య ప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తివారి సెంచరీలతో కథం తొక్కాడు. అయితే బెంగాల్ ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.మనోజ్ తివారి టీమిండియా తరపున 12 వన్డేల్లో 287 పరుగులు, 3 టి20ల్లో 15 పరుగులు చేశాడు. ఇక 23 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన మధ్య ప్రదేశ్.. ముంబైతో అమితుమీ తేల్చుకోనుంది. రంజీల్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవలే మనోజ్ తివారిని ఒక చానెల్ ఇంటర్య్వూ చేసింది. మంత్రిగా ఉంటూనే ఆటను ఎలా బ్యాలెన్స్ చేశారని ప్రశ్నించగా.. తన డ్యుయల్ రోల్‌పై మనోజ్ తివారి ఆసక్తికరంగా స్పందించాడు. ''ఒక రాష్ట్రానికి మంత్రిని కావొచ్చు.. కానీ టైంను మేనేజ్ చేసుకుంటే రెండు పనులు ఒకసారి చేయొచ్చనేది నా మాట. రంజీలో అడుగుపెట్టడానికి ముందే నా నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేసుకున్నా. వారితో నా ప్రజల సమస్యలకు సంబంధించిన పేపర్ వర్క్‌ను నేను ఉంటున్న హోటల్ రూంకు తెప్పించుకునేవాడిని. ఇలా పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గ పనులు పూర్తి చేసి తిరిగి పేపర్ వర్క్‌ను కొరియర్ ద్వారా పంపించేవాడిని. ఇక క్రీడాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నాకు అదనంగా మరొక మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. రంజీ క్రికెట్ ఆడినన్ని రోజులు ఆయన.. నేను చేయాల్సిన పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక బెంగాల్ క్రికెట్ కూడా నాకు అండగా నిలబడింది. జట్టు ఆటగాళ్లు కూడా ఒక మంత్రిగా కాకుండా తమలో ఒక ఆటగాడిగా చూస్తూ చక్కగా సహకరించారు. కొన్నిసార్లు రాత్రిళ్లు ఎమర్జెన్సీ ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న తోటి క్రికెటర్లు పరిస్థితిని అర్థం చేసుకునేవారు. వ్యక్తిగత జీవితంలో నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంది. నాలుగేళ్ల నా బిడ్డను.. ఇంటికి సంబంధించిన పనులను స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. ఆమె చేసేది చిన్న పనే కావొచ్చు.. కానీ నా దృష్టిలో అది చాలా గొప్పది. ఇక బెంగాల్‌కు రంజీ ట్రోపీ అందించాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగాను. సెమీ ఫైనల్ వరకు ఈసారి కప్ మాదే అనే ధీమా కలిగింది. కానీ అనూహ్యంగా మా ప్రదర్శన సెమీస్‌తోనే ముగిసింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్‌కు హక్కు ఉంటుందా? -
దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని
టీమిండియా క్రికెట్ మనకు ఎందరో ఫాస్ట్ బౌలర్లను పరిచయం చేసింది. 1970, 80వ దశకంలో కపిల్ దేవ్, బిషన్‌సింగ్ బేడీ లాంటి వాళ్లు.. 90వ దశకంలో జల్ జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అజిత్ అగార్కర్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేలు ఉంటారు. ఇక 20వ దశకంలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్.. ఈ తరంలో బుమ్రా, భువనేశ్వర్, మహ్మద్ షమీ ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో క్రికెటర్లు వస్తారు. అయితే మనం పైన చెప్పుకున్న వాళ్లంతా క్రికెట్లో ఒక్కో దశలో వెలిగారు.. వెలుగుతున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్యలో మనకు తెలియకుండానే చాలా మంది బౌలర్లు వచ్చారు.. కనుమరుగయ్యారు. అలాంటి కోవకే చెందిన వాడే.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా. సలీల్ అంకోలా.. ముంబై నుంచి వచ్చిన టాప్ పేస్ బౌలర్. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేసిన 1989వ సంవత్సరంలోనే సలీల్ అంకోలా కూడా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే ఎంత వేగంగా వచ్చాడో.. అంతే వేగంగా కనుమరుగయ్యాడు. టీమిండియా తరపున ఒక టెస్టు, 20 వన్డేలు మాత్రమే ఆడిన సలీల్ అంకోలా 1997లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సలీల్ అంకోలా క్రికెట్‌పై తనకు అసూయ ఎలా ఏర్పడిందన్నది వివరించాడు. ''1989లోనే దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటే అరంగేట్రం చేసినప్పటికి పెద్దగా అవకాశాలు రాలేదు. బహుశా నా బౌలింగ్ నచ్చకనో మరేంటో తెలియదు. అయితే నాకు వచ్చిన అవకాశాలను కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాను. ఆ తర్వాత ఎనిమిదేళ్ల కెరీర్లో ఎన్నోసార్లు జట్టులోకి రావడం వెళ్లడం జరిగింది. టీమిండియాలో చోటు దక్కకపోతే.. టీమిండియా-ఏకి ఎంపికయ్యేవాడిని. ఎక్కడికి వెళ్లినా నా పని మాత్రం ఒకటే ఉండేది. మైదానంలో కంటే డ్రింక్స్ బాయ్‌గానే ఎక్కువగా సేవలందించాను. ఒక దశలో క్రికెట్‌పై విపరీతమైన అసూయ పుట్టుకొచ్చింది. అందుకే ఉన్నపళంగా క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించాను. 2001 తర్వాత క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాను. ఆటకు మాత్రమే దూరమవ్వాలనుకున్న నేను.. తెలియకుండానే చేసిన తప్పు వల్ల కొన్నేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటానని అప్పుడనుకోలేదు. అప్పట్లో మ్యాచ్‌లను టెలికాస్ట్ చేసిన సోనీ చానెల్ నుంచి కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించాలంటూ నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే దానిని నేను తిరస్కరించాను. కానీ ఎందుకు చేశానో తెలియదు. ఇప్పుడు అది తలుచుకుంటే ఎంత మూర్కత్వమైన నిర్ణయం తీసుకున్నానా అని బాధపడాల్సి వచ్చింది. ''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2010లో అంకోలా వ్యక్తిగత జీవితం తలకిందులైంది. మొదటి భార్యతో విడాకుల అనంతరం సలీల్ అంకోలా మద్యానికి బానిసయ్యాడు. మనుషులను మరిచిపోయేంతగా తాగుతుండేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన రెండో భార్య సలీల్‌ను రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించింది. దాదాపు 10 ఏళ్ల పాటు రీహాబిలిటేషన్‌లో ఉన్న సలీల్ అంకోలా మళ్లీ మాములు మనిషిగా తిరిగొచ్చాడు. కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు. ఈ మధ్యనే ఏ క్రికెట్‌పై అసూయపడ్డాడో దానిలోనే మళ్లీ అడుగుపెట్టాడు. గతేడాది ముంబై క్రికెట్‌కు చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యి తన సేవలందిస్తున్నాడు. చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు' Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై -
తెగ బాధపడిపోతున్నాడు.. ఎవరీ క్రికెటర్?
ఒక ఫోటో మీ ముందు ఉంచి అందులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పమంటే.. తెలిసిన వ్యక్తి అయితే టక్కున చెప్పేస్తారు. కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి మొహం స్పష్టంగా కనిపించకపోయినా.. మొహానికి చేతులు అడ్డుపెట్టినా చెప్పడం కాస్త కష్టతరమే. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని అంతా కోల్పోయినట్లుగా తెగ ఎమోషనల్ అవుతున్న ఒక క్రికెటర్ కనిపిస్తున్నాడు కదా. ఆ క్రికెటర్ పేరేంటో చెప్పండి. అయితే ఫోటోలో ఉన్న క్రికెటర్ బాధపడుతున్నాడని భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఫోటోలో ఉన్న వ్యక్తి విజయం సాధించామన్న ఆనందంలో.. అలా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఒంటరిగా కూర్చొని తన సంతోషాన్ని కనిపించకుండా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్. ఫోటో వెనుక కథ తెలియాలంటే 22 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. 2000 సంవత్సరంలో ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. నిర్ణయాత్మకమైన మూడో టెస్టు కరాచీ స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఇంజమామ్ ఉల్ హక్(142), మహ్మద్ యూసఫ్(117) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 388 పరుగులకు ఆలౌట్ అయింది. మైకెల్ ఆర్థర్టన్ 125 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ నాసర్ హుస్సేన్ 51 పరుగులు చేశాడు. దీంతో పాక్‌కు 17 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాక్ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలడంతో ఇంగ్లండ్ ముందు 176 పరుగుల టార్గెట్ ఖరారు అయింది. తొలి రెండు టెస్టులు డ్రా కావడంతో మూడో టెస్టులో కచ్చితంగా ఫలితం రానుంది. అలా ఇంగ్లండ్ ఎన్న ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధించింది. గ్రహమ్ థోర్ప్ 64 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నంత సేపు పెద్ద హైడ్రామా నడిచింది. అప్పటి పాక్ కెప్టెన్ మొయిన్ ఖాన్ బ్యాడ్ లైట్ అంటూ అంపైర్లకు పదేపదే అప్పీల్ చేశాడు. అయితే అంపైర్లు మాత్రం మొయిన్ అభ్యర్థనను ఏ మాత్రం పట్టించుకోకుండా మ్యాచ్‌ను కంటిన్యూ చేశారు. అలా ఇంగ్లండ్ మూడో టెస్టులో గెలడంతో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు కరాచీ అంతర్జాతీయ స్టేడియంలో పాక్‌కు దిగ్విజయమైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో అప్పటివరకు పాక్‌కు ఓటమనేదే లేదు. పాక్ 34 మ్యాచ్‌ల విజయాల జైత్రయాత్రకు ఇంగ్లండ్ ఒక రకంగా చెక్ పెట్టింది. కెప్టెన్‌గా సిరీస్ గెలవడంతో నాసర్ హుస్సేన్ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. అందుకే డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాకా ఒక్కడే కూర్చొని అంత ఎమోషనల్ అయ్యాడు. ఈ ఫోటో అప్పట్లోనే బాగా వైరల్ అయింది. ఇది అసలు విషయం. చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్ To date, this picture is the most viewed on the feed ... Nasser Hussain may look dejected but he is just emotional after steering England to a dramatic series victory in the Stygian gloom at Karachi in 2000. It was Pakistan's first loss at the ground pic.twitter.com/BNW3stgmQJ — Historic Cricket Pictures (@PictureSporting) October 9, 2021 -
మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం?
భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న మిథాలీరాజ్ 39 ఏళ్ల వయసుకు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఆమె ఆటకు రిటైర్మెంట్ ఇవ్వడంతో.. మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. వాస్తవానికి మిథాలీ 22 ఏళ్లు వయసులోనే ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. క్రికెట్లో బిజీగా ఉన్న మిథాలీ ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్లింది. 27-30 ఏళ్లు వచ్చిన తర్వాత మిథాలీరాజ్ పెళ్లి గురించి ఆలోచించింది. అప్పుడు వచ్చిన సంబంధాల్లో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో.. అలాంటి వారు తనకు అవసరం లేదని ఇంట్లోవాళ్లతో చెప్పేసింది. అలా మిథాలీ క్రికెట్ కెరీర్ కోసం తన పర్సనల్ లైఫ్‌ని.. పెళ్లిని త్యాగం చేసింది. అయితే పెళ్లి చేసుకోనందుకు తానేం బాధపడడం లేదని.. సింగిల్ లైఫ్ చాలా సంతోషంగా ఉందని ఒక సందర్భంలో మిథాలీ చెప్పుకొచ్చింది. 'కొన్నాళ్ల క్రిందట నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే పెళ్లైన వాళ్లను చూసిన తర్వాత సింగిల్‌గా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తోంది.' అంటూ పేర్కొన్న మిథాలీ ఇప్పటికి సింగిల్‌గానే బతికేస్తుంది. మరి రిటైర్మెంట్ తర్వాత ఒక తోడు కోసం పెళ్లి గురించి ఆలోచిస్తుందేమో చూడాలి. ఇక డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్, హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్ తరుపున కూడా ప్రాతినిథ్యం వహించింది.అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసింది. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది. చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు.. శెభాష్ మిథూ: 23 ఏళ్ల కెరీర్.. అరుదైన రికార్డులు! హ్యాట్సాఫ్! -
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం.. అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జిమ్ పార్క్స్(90) బుధవారం కన్నుమూశాడు. అతను మృతి చెందే నాటికి ఇంగ్లండ్ తరపున అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. జిమ్ పార్క్స్ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గత వారం ఇంగ్లండ్‌లోని వార్తింగ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కాగా ఇవాళ ఉదయం చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. జిమ్ పార్క్స్ మృతి విషయాన్ని ససెక్స్ వెల్లడించింది. 'జిమ్ పార్క్స్ మరణ వార్త మమ్మల్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కెరీర్లో కౌంటీల్లో ససెక్స్ తరపున ఎక్కువకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అతను అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ మృతి పట్ల ప్రగాడ సానభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.' అంటూ తెలిపింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా జిమ్ పార్క్స్ మృతిపై సంతాపం తెలిపింది. ''నిజంగా చాలా విషాదకరమైన వార్త. అతనో గుర్తుంచుకోదగ్గ ఆటగాడు. ససెక్స్, సోమర్సెట్, ఇంగ్లండ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. జిమ్ పార్క్స్ కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానభూతి'' ఇక జిమ్ పార్క్స్ 1954 నుంచి 1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 46 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్ అయినప్పటికి లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే జిమ్ పార్క్ తాను చేసిన రెండు సెంచరీలు 8వ స్థానంలో రావడం విశేషం. 1959/60 ఏడాదిలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 101 నాటౌట్, అలాగే అదే ఏడాది డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 108 పరుగులు నాటౌట్‌తో జిమ్ పార్క్స్ గుర్తింపు పొందాడు. ఇక 1931లో జన్మించిన జిమ్ పార్క్స్ 18 ఏళ్ల వయసులో ససెక్స్ తరపున కౌంటీల్లో అరంగేట్రం చేసిన పార్క్స్.. ససెక్స్, సోమర్సెట్ తరపున 739 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 132 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికి అప్పటి కోచ్‌ల ప్రోత్సాహంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవతారంలోకి మారాడు. అయితే వికెట్ కీపర్ కంటే బ్యాట్స్‌మన్‌గానే తాను ఎక్కువగా ఇష్టపడతానని జిమ్ పార్క్స్ చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్ హెల్త్ ఆస్పత్రికి తరలింపు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్‌ను మెంటల్ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేనందున అతనిపై ఉన్న గృహహింస కేసును కొట్టేస్తున్నట్లు సిడ్నీ లోకల్ కోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 52 ఏళ్ల మైకెల్ స్లేటర్‌పై గతేడాది అక్టోబర్‌లో న్యూసౌత్ వేల్స్ పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక తన మాజీ భార్యకు ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో గత డిసెంబర్లో అధికారులు అతనిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసికస్థితి సరిగా లేనందునే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిబ్రవరిలో అతని తరపు లాయర్ కోర్టుకు తెలిపాడు. తాజాగా మరోసారి మైకెల్ స్లేటర్ కేసు వాదనకు వచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ అతని పరిస్థితిపై స్పందించాడు. ''మైకెల్ స్లేటర్ మానసిక పరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం జైలు కంటే రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించాల్సిన అవసరం ఉంది. మూడు వారాల పాటు మెంటల్ హెల్త్ యూనిట్లో స్లేటర్ చికిత్స తీసుకోనున్నాడు. తక్షణమే అతన్ని మెంటల్ హెల్త్ యూనిట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా మైకెల్ స్లేటర్ అంతకముందే దాదాపు వంద రోజులపాటు ఆల్కహాల్, మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతూ రీహాబిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నట్లు తేలింది. ఇక 1993-2001 కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైకెల్ స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. కాగా 74 టెస్టుల్లో 5312 పరుగులు, 42 వన్డేల్లో 987 పరుగులు సాధించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మైకెల్ స్లేటర్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. చదవండి: Yuvraj Singh: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..! IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్? -
'జరగాలంటే రాసి ఉండాలి.. ఇంగ్లండ్ ఆటగాడికి మాత్రమే సాధ్యమైంది'
ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలెక్ స్టీవార్ట్ (ఏప్రిల్ 8) శుక్రవారం 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అందరి క్రికెటర్లలాగే స్టీవార్ట్ పుట్టినరోజు ఉంటుంది.. దీనిలో వింతేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అలెక్ స్టీవార్ట్ 14 ఏళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్లో కీలకపాత్ర పోషించాడు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా సేవలందించిన అలెక్ స్టీవార్ట్ మధ్యలో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ పనిచేశాడు. స్టీవార్ట్ 133 టెస్టుల్లో 8463 పరుగులు.. 170 వన్డేల్లో 4,677 పరుగులు చేశాడు. కాగా స్టీవార్ట్ పుట్టినరోజు ఏప్రిల్ 8,1963. ఒక్క విషయంలో మాత్రం స్టీవార్ట్ క్రికెటర్స్ ఎవరు సాధించలేని ఫీట్ అందుకున్నాడు. టెస్టుల్లో 8463 పరుగులు చేసిన స్టీవార్ట్.. బర్త్డేలోనూ అదే సంఖ్యలు కనిపించడం విశేషం. పరిశీలించి చూస్తే..( 8,4,63).. తారీఖు 8.. నెల నాలుగు.. పుట్టిన సంవత్సరం 63.. వీటన్నింటిని కలిపి చూస్తే స్టీవార్ట్ టెస్టుల్లో చేసిన పరుగులు మ్యాచ్ అయ్యాయి. ఇదే విషయాన్ని ఐసీసీ షేర్ చేస్తూ అలెక్ స్టీవార్ట్‌కు విషెస్ చెప్పింది. ఇక ఇంగ్లండ్ తరపున స్టీవార్ట్ రిటైర్ అయ్యే టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు వికెట్ కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్ చేసిన మూడో ఆటగాడిగా స్టీవార్ట్ ఉన్నాడు. స్టీవార్ట్ కంటే అలెన్ నాట్, మాట్ ప్రియర్లు ఉన్నారు. ఇక స్టీవార్ట్ ఇంగ్లండ్‌కు 15 టెస్టుల్లో నాయకత్వం వహించగా.. అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్ నాలుగు గెలిచి.. ఎనిమిది ఓడి.. మిగిలిన మూడు టెస్టులు డ్రా చేసుకుంది. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఫైనల్ చేరడంలో స్టీవార్ట్ కీలకపాత్ర పోషించాడు. చదవండి: Nari Contractor: టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు! Happy birthday to Alec Stewart – one of England’s most successful wicket-keepers of all time 🎂 pic.twitter.com/uVZQObevsv — ICC (@ICC) April 8, 2022 -
ఆసుపత్రిలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్.. పరిస్థితి విషమం
Rod Marsh Heart Attack: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రాడ్ మార్ష్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం బుండాబెర్గ్లోని బుల్స్ మాస్టర్స్ చారిటీ గ్రూఫ్ నిర్వహించనున్న ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి కారులో బయలుదేరారు. కాగా మార్గమధ్యంలో కారులోనే గుండెపోటుకు గురయ్యారు. ఈ సమయంలో అతని పక్కనే ఉన్న బుల్స్ మాస్టర్స్ నిర్వాహకులు జాన్ గ్లాన్విల్లీ, డేవిడ్ హిల్లీర్లు మార్ష్‌ను క్వీన్స్‌ల్యాండ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మార్ష్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మార్ష్ పరిస్థితి ఏంటనేది 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమని తెలిపారు. కాగా రాడ్ మార్ష్ 1970-84 మధ్య కాలంలో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించారు. మంచి వికెట్ కీపర్‌గా పేరు పొందిన మార్ష్ 96 టెస్టుల్లో 3633 పరుగులు, 92 వన్డేల్లో 1225 పరుగులు చేశాడు. కీపర్‌గా 355 స్టంప్స్ చేశాడు. చదవండి: 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు -
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం
Former Indian Cricketer Suresh Raina Father Passed Away.. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాధం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఘజియాబాద్‌లోని తన ఇంట్లో మృతి చెందారు. కాగా రైనా తండ్రి మిలటరీలో సేవలందించారు. బాంబులు తయారు చేయడంలో త్రిలోక్‌చంద్ రైనా దిట్ట. రైనా పూర్వీకులు జమ్మూ కశ్మీర్‌లోని రైనావారీ గ్రామానికి చెందినవారు. రైనా చిన్నతనంలోనే అతని కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఇక సురేశ్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాలో ఒక దశాబ్ధం పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషించాడు. టీమిండియా తరపున 226 వన్డేలు, 78 టి20లు, 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా రైనా పేరు సంపాధించాడు. రైనా ఐపీఎల్లో ఎక్కువకాలం సీఎస్కేకు ఆడాడు. ఈసారి రైనాను సీఎస్కే రిలీజ్ చేయడంతో ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలంలో ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి. వేలంలో రైనాను లక్నో సూపర్‌జెయింట్స్ సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: Under-19 World Cup Final: మనోడు ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఒకే ఒక్కడిగా రికార్డు! Under-19 World Cup Final: 'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం' -
కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..!
Kohli Could Be Removed From RCB Captaincy: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు తారాస్థాయికి చేరాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమైన కోహ్లిపై పేరు చెప్పడినికి ఇష్టపడని ఓ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరో రెండు, మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి చెత్త ప్రదర్శన ఇలాగే కొనసాగితే.. అతను తప్పుకోవడం కాదు.. జట్టు యాజమాన్యమే అతన్ని తప్పించే ఆస్కారముందంటూ వ్యాఖ్యానించాడు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దినేశ్ కార్తీక్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. కోహ్లి ప్రదర్శన ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభానికి ముందు కోహ్లి ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ ఐపీఎల్ సీజనే ఆర్సీబీ కెప్టెన్‌గా తనకు ఆఖరిదని వెల్లడించాడు. అంతకు కొద్దిరోజుల ముందే టీమిండియా టీ20 బాధ్యతల(టీ20 ప్రపంచకప్ తర్వాత) నుంచి కూడా తప్పుకోనున్నట్లు కోహ్లి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నటరాజన్‌కు కరోనా.. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఓ గుడ్ న్యూస్ -
Virat Kohli: ఐదో టెస్టు రద్దు.. కోహ్లిపై సంచలన ఆరోపణలు
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదో టెస్టు రద్దు విషయమై కోహ్లి మ్యాచ్ ముందురోజు అర్థరాత్రే బీసీసీకి లేఖలు రాశాడంటూ ఆరోపణలు చేశాడు. ఈ విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. క్రికెట్ డాట్‌కామ్‌తో జరిగిన ఇంటర్య్వూలో గోవర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''ఐదో టెస్టు రద్దు చేయాలంటూ కోహ్లి బీసీసీఐకి లేఖలు రాసిన మాట వాస్తవం. కరోనా కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాలన్నది అవాస్తవం. సాధారణంగా మ్యాచ్‌కు ముందు కఠిన పరిస్థితులు ఉంటే తప్ప రద్దు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఐదో టెస్టుకు ముందు ఆటగాళ్లందరికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చిందన్న విషయం కోహ్లి మర్చిపోయాడు. కేవలం ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకొనే కోహ్లి ఈ విధంగా వ్యవహరించాడు. ఒకవేళ మ్యాచ్ రద్దుకు ఐపీఎల్ అనే సాకుతో కోహ్లి ఇలా చేశాడంటే మాత్రం అది పెద్ద తప్పే అవుతుంది. ఎందుకంటే ఇదే కోహ్లి గతంలో ఇంగ్లండ్ పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు క్రికెట్ అంటే తనకు ఎంతో ప్రాణమని.. నా మొదటి ప్రాధాన్యత టెస్టులకే ఇస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' అంటూ తెలిపాడు. చదవండి: Ind Vs Eng: అదనంగా రెండు టీ20లు, టెస్టు ఆడేందుకు రెడీ: జై షా అంతకముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో టెస్టు రద్దుపై ఆర్సీబీ నిర్వహించిన బోల్డ్ డైరీస్ ఇంటర్య్వూలో స్పందించాడు. ''ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆగిపోవడం కొంచెం బాధ కలిగించింది. కరోనా కారణంగానే ఐదో టెస్టును రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంతేగాక తక్కువ వ్యవధిలోనే మేం రెండు పెద్ద టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంది. మొదట ఐపీఎల్ 14వ సీజన్ సెకండ్ ఫేజ్ పోటీలు.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్. ఒకవేళ ఐదో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత ఎవరైన ఆటగాళ్లు కరోనా బారిన పడితే అది మా జట్టుకే నష్టం. తక్కువ వ్యవధిలో క్వారంటైన్ గడపడం కూడా కష్టమే. అందుకే ముందే అప్రమత్తమైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కెప్టెన్‌గా ఆర్సీబీని గెలిపించడం.. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా జట్టును నడిపించడం ముఖ్యమని భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్ నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టెస్టు మ్యాచ్ నిర్వహించే సమయం లేకపోవడంతో ఈసీబీ దానిని ఐకైక టెస్టు మ్యాచ్‌గా వచ్చే ఏడాది నిర్వహిస్తామని తెలిపింది. దీనికి బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. సౌరవ్ గంగూలీ మాత్రం ఇదే టెస్టు సిరీస్ కిందనే ఐదో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తామని.. అలాగే ఆడదామని ప్రతిపాదించాడు. దీంతో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం ఐసీసీ వరకు చేరింది. చదవండి: కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ.. 22న యూకేకు గంగూలీ! -
మహేశ్ బాబు పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన మాజీ క్రికెటర్.. వైరల్
ఇటీవల క్రికెటర్లు తమ కిష్టమైన నటుడిని అనుకరిస్తూ డైలాగ్స్ చెప్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డేవిడ్ వార్నర్ ముందు వరుసలో ఉంటాడని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో టాలీవుడ్ తారల డైలాగులు, డాన్సులతో నెట్టింట రచ్చ మామూలుగా చేయలేదు వార్నర్. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ కూడా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలోని డైలాగ్స్ చెప్పగా అవి వైరల్‌గా మారాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఇటీవల కైఫ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పాపులర్ డైలాగ్ చెప్పి వావ్ అనిపించాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటనుకుంటున్నారా? మహేశ్ బ్లాక్ బస్టర్ సినిమా దూకుడులోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పాడు. ‘మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అని అప్పట్లో మన ప్రిన్స్ తన మేనరిజంతో చెప్పి ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేశాడు కదా ! దాన్నే ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ తన స్టైల్లో ఆ డైలాగ్‌ను చెప్పాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా ప్రిన్స్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో నచ్చడంతో తెగ షేర్లు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది రచ్చ చేస్తోంది. కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu 🔥🌟 "MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA "⚡💥 pic.twitter.com/TCLx62N3kb — ꓷ A Я K 🦇💊 (@GothamHero_) September 8, 2021 చదవండి: T20 World Cup: అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్ -
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్‌కు అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెయిన్స్ ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. గుండె లోపల నీరు చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. అతని కుటుంబసభ్యులు రెండురోజుల క్రితం సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరిశీలించి ఆపరేషన్లు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. -
తండ్రి మాజీ క్రికెటర్; కొడుకు ఇవాళ ఒలింపిక్ చాంపియన్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్స్టన్ బెంజమిన్ కుమారుడు రాయ్ బెంజమిన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాడు. విషయంలోకి వెళితే.. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్స్‌లో రాయ్ బెంజమిన్ 46.17 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని రజతం అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో 400 మీటర్ల హార్డిల్స్‌ను వేగంగా పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రాయ్ బెంజమిన్ నిలిచాడు. ఇప్పుడు బెంజమిన్ ఒలింపిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఇక రాయ్ బెంజమిన్ తండ్రి విన్స్టన్ బెంజమిన్ తన తొమ్మిదేళ్ల కెరీర్లో వెస్టిండీస్ తరపున 21 టెస్టులు, 85 వన్డేలు ఆడాడు. ఇక ఇదే హార్డిల్స్‌లో స్వర్ణం అందుకున్న నార్వే అథ్లెట్ కార్స్టెన్ వార్లోమ్ ప్రపంచరికార్డు సాధించాడు. 400 మీ హార్డిల్స్‌ను 45.94 సెకన్లలో చేరుకొని చరిత్ర సృష్టించాడు. బ్రెజిల్‌కు చెందిన అలిసన్ దాస్ సాంటోస్ 46.72 సెకండ్లతో కాంస్యం దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ మెన్స్ హై జంప్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నా ఆరో స్థానంలో నిలిచాడు. WORLD RECORD‼️ Norway's Karsten Warholm breaks his OWN world record to win gold in the men's 400m hurdles and @TeamUSA's Rai Benjamin wins the silver. #TokyoOlympics 📺 NBC 💻 https://t.co/ZOFdXC4e4u 📱 NBC Sports App pic.twitter.com/lPSNrv2Qoo — #TokyoOlympics (@NBCOlympics) August 3, 2021 -
ఒక్కసారి కూడా డకౌట్ కాని ఏకైక భారత ఆటగాడు..
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో డకౌట్ కాకుండా కెరీర్‌ను ముగించిన ఆటగాళ్లను క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం. ఈ అరుదైన జాబితాలో భారత్ మాజీ క్రికెటర్, 1983 వన్డే ప్రపంచకప్‌లో కపిల్ డెవిల్స్ జట్టు సభ్యుడు దివంగత యశ్పాల్ శర్మ ఉండటం విశేషం. భారత్ తరఫున 42 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన యశ్పాల్.. 28.48 సగటుతో 4 అర్ధశతకాల సాయంతో 883 పరుగులు చేశాడు. అయితే ఈ క్రమంలో ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. తన కెరీర్లో పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్న యశ్పాల్ ఒక్కసారి కూడా సున్నా పరుగులకు వెనుదిరగలేదు. ఇలా డకౌట్ కాకుండా కనీసం 40కిపైగా వన్డే మ్యాచ్‌లు ఆడి కెరీర్‌ను ముగించిన క్రికెటర్లు వన్డే క్రికెట్ చరిత్రలో మరో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా, ఆసీస్ మాజీ ఆటగాడు కెప్లెర్ వెసెల్స్ 109 మ్యాచ్‌ల్లో ఒక్క డకౌట్ కూడా లేకుండా కెరీర్ ముగించగా, అతని తర్వాతి స్థానంలో స్కాట్లాండ్ ప్లేయర్ మాథ్యూ స్కాట్(54), ఆసీస్ ఆటగాడు నాథన్ హౌరిట్జ్(58 మ్యాచ్‌లు), పాక్ ఆటగాడు వసీం బారి(51), దక్షిణాఫ్రికాకు చెందిన జాక్ రుడాల్ఫ్(45), దక్షిణాఫ్రికా క్రిస్ మోరిస్(42), శ్రీలంక ప్లేయర్ డి డిసిల్వా(41), సౌతాఫ్రికా పీటర్ కిర్‌స్టెన్(40), ఇంగ్లండ్ రసెల్(40) వరుసగా ఉన్నారు. కాగా, ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడు కేవలం యశ్పాల్ శర్మనే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో యశ్పాల్ శర్మ ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యశ్పాల్.. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో ముఖ్యుడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆయన 61 పరగులు చేసి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. యశ్పాల్ టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా కీలకపాత్ర పోషించాడు. అయితే, 1985లో తలకు గాయం కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. -
భారత మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ కన్నుమూత
ఢిల్లీ: భారత క్రికెట్ ప్రస్థానాన్ని మలుపు తిప్పిన 1983 వరల్డ్ కప్ విజయంలో తనదైన భూమిక పోషించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యశ్పాల్ శర్మ మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగొచ్చిన అనంతరం యశ్పాల్ తీవ్ర గుండె నొప్పితో కుప్పకూలినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 1978లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన యశ్పాల్ 1985లో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఫస్ట్‌క్లాస్ కెరీర్ రెండు దశాబ్దాల పాటు సాగింది. యశ్పాల్ 37 టెస్టుల్లో 33.45 సగటుతో 1,606 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 42 వన్డేల్లో 28.48 సగటుతో 4 అర్ధసెంచరీలు సహా 883 పరుగులు సాధించారు. తన 40 వన్డే ఇన్నింగ్స్‌లలో ఆయన ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం. కోచ్‌గా... సెలక్టర్‌గా... ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా, కామెంటేటర్‌గా, క్రికెట్ పరిపాలకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. దేశవాళీ క్రికెట్లో యశ్పాల్ అంపైర్‌గా, మ్యాచ్ రిఫరీగా కూడా పని చేశారు. యశ్పాల్ రెండు పర్యాయాలు సెలక్టర్‌గా వ్యవహరించారు. 2004 నుంచి 2005 మధ్య కాలంలో పని చేసినప్పుడు ధోనిని ఆటగాడిగా ఎంపిక చేసిన బృందంలో ఉన్న ఆయన... 2008 నుంచి 2011 వరకు సెలక్టర్‌గా ఉన్నారు. ధోని సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టును ఎంపిక చేసిన కమిటీలోనూ యశ్పాల్ సభ్యుడు కావడం విశేషం. కపిల్ కన్నీళ్లపర్యంతం... మాజీ సహచరుడు యశ్పాల్ మరణవార్త విన్న వెంటనే 1983 వరల్డ్‌కప్ టీమ్ సభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల జూన్ 25న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరంతా కలుసుకున్నారు. యశ్పాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. యశ్పాల్ మృతి గురించి విన్న కపిల్‌దేవ్ కన్నీళ్లపర్యంతమయ్యారు. స్పందన కోరగా ‘నాకు మాటలు రావడం లేదు’ అని జవాబి చ్చారు. ‘మా సహచరుల్లో అత్యంత ఫిట్‌గా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి యశ్పాల్. ఇలా జరగడం బాధాకరం’ అని వెంగ్‌సర్కార్ వ్యాఖ్యా నించగా... తమ ‘83’ కుటుంబంలో ఒకరిని కోల్పోయామని బల్వీందర్ సంధూ అన్నారు. పరిమిత ‘యశస్సు’ మార్షల్, హోల్డింగ్, రాబర్ట్స్, గార్నర్... ఇలాంటి భీకర పేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 1983 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై యశ్పాల్ 89 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన భారత్‌ను గెలిపించగా, విండీస్‌కు వరల్డ్ కప్ చరిత్రలోనే అది తొలి ఓటమి. కపిల్, గావస్కర్, వెంగ్‌సర్కార్, శ్రీకాంత్, అమర్నాథ్వంటి సహచరులతో పోలిస్తే యశ్‌పాల్‌కు వరల్డ్ కప్ విజయం ద్వారా తగినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను చేసిన 61 పరుగులు ఇన్నింగ్స్ అద్భుతం. ఈ మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో నాటి అభిమానులు దీనిని ఎప్పటికీ మరచిపోలేరు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలచిన తీరు అద్భుతం. అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు, సగటు చూస్తే అతను ఒక సాధారణ ఆటగాడిగానే కనిపించవచ్చుగానీ యశ్పాల్లాంటి ఆటగాళ్ల ప్రత్యే కతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలు పనికి రావు. భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన విశిష్ట ఆటగాడిగా యశ్పాల్ ఎప్పటికీ నిలిచిపోతారు. యశ్పాల్ శర్మ కెరీర్లో ముఖ్య విషయాలు: ►1954 ఆగస్టు 11న పంజాబ్‌లోని లుధియానాలో జననం ►1978 అక్టోబర్ 13న పాకిస్తాన్‌తో వన్డే ద్వారా అరంగేట్రం.. మరుసటి ఏడాది 1979లో డిసెంబర్ 2న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లో ఎంట్రీ ►1970,80ల కాలంలో భారత మిడిలార్డర్ క్రికెట్లో ముఖ్యపాత్ర ►1980-81లో అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణింపు ►యశ్పాల్ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు. ► విండీస్ దిగ్గజం మాల్కమ్ మార్షల్ వేసిన బంతి యశ్పాల్ శర్మ తలకు బలంగా తగలడంతో 1985లోనే అర్థంతరంగా ఆటకు వీడ్కోలు Very Very Sad News to Share…World Cup Winner @cricyashpal Sh Yashpal Sharma ji had a major Cardiac Arrest in the morning today…Rest In Peace Champion player @indiatvnews — Samip Rajguru (@samiprajguru) July 13, 2021 -
మాజీ రంజీ క్రికెటర్ కన్నుమూత
బనశంకరి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కర్ణాటక మాజీ క్రికెటర్ బి.విజయకృష్ణ (71) నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఉదయం మృతిచెందారు. 1949 అక్టోబరు 12 న జన్మించిన విజయకృష్ణ 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎడమచేతి స్పిన్నర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా 80 మ్యాచ్‌లు ఆడారు. 2,000 పరుగులు చేసి 194 వికెట్లు తీశారు. కర్ణాటక రెండుసార్లు రంజీట్రోఫీ గెలవడంలో విజయకృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన మృతికి సీఎం యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: పీఎస్ఎల్: ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు -
అవసరమా.. ఇలాంటి ప్లేయర్స్ మనకు!
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ శుక్రవారం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన పనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢాకా ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో భాగంగా అంపైర్‌తో వాదనకు దిగి స్వల్ప వ్యవధిలో రెండుసార్లు అసహనంతో స్టంప్స్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో షకీబ్ చర్యను తప్పుబడుతూ ఆసీస్ మాజీ మహిళ క్రికెటర్ లిసా స్టాలేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''బంగ్లాదేశ్ యువ క్రికెటర్స్ ఇలాంటివి ఫాలో అవ్వరు అనుకుంటున్నా. షకీబ్ ఒక సీనియర్ క్రికెటర్ అయి ఉండి సహనం కోల్పోయి ఇలాంటి పనులు చేయడం దారుణం. అవుట్ ఇవ్వనంత మాత్రానా అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టంప్స్‌ను పడేయడం క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఇలాంటి ప్లేయర్స్ మనకు అవసరమా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే షకీబుల్ హసన్ తాను చేసిన పనిపై ట్విటర్ వేదికగా అభిమానులను క్షమాపణ కోరాడు. '' డియర్ ఫ్యాన్స్... నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. నా సహనం కోల్పోయి అంపైర్‌పై దురుసుగా ప్రవర్తించాను. ఒక సీనియర్ ఆటగాడిగా ఇలాంటి పనులు చేయకూడదు. కానీ ఆ క్షణంలో ఏం చేస్తున్నానో అర్థమయ్యేలోపే తప్పు జరిగిపోయింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. విషయంలోకి వెళితే.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మొహమ్మదాన్, అబహాని జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను బౌలింగ్ చేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి ముష్ఫికర్ రహీమ్ ఎల్బీడబ్ల్యూ కోసం షకీబ్ అప్పీల్ చేయగా, అంపైర్ దానిని తిరస్కరించాడు. దాంతో వెనక్కి తిరిగి కాలితో స్టంప్స్‌ను తన్ని పడగొట్టిన షకీబ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. తర్వాతి ఓవర్ ఐదో బంతి తర్వాత చినుకులు ప్రారంభం కావడంతో అంపైర్ ఆటను నిలిపేసి కవర్లు తీసుకురమ్మని సైగ చేశాడు. తన ఫీల్డింగ్ స్థానం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన షకీబ్ మూడు స్టంప్స్‌ను కూడా ఊడబీకి కిందకు విసిరికొట్టాడు. ఆట ఆపేంత వర్షం రావడం లేదు కదా అని అసహనం ప్రదర్శించిన అతను ఆ తర్వాత కింద నుంచి స్టంప్స్‌ను తీసుకొని మళ్లీ అంపైర్ కాళ్ల దగ్గర పడేశాడు. షకీబ్ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ అనంతరం అతను ఒక ప్రకటన చేస్తూ బహిరంగ క్షమాపణ కోరాడు. అయితే మన్నింపు కోరినా సరే... అతనిపై బంగ్లాదేశ్ బోర్డు చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన మొహమ్మదాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహని వర్షం అంతరాయం కలిగించే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మొహమ్మదాన్ 31 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. చదవండి: అంపైర్ ఔటివ్వలేదని వికెట్లు పీకి పాడేసిన స్టార్ క్రికెటర్.. I hope young cricketers especially in Bangladesh 🇧🇩 don’t follow this terrible example! First a ban from all cricket (2 years, with one year suspended), now this poor behaviour. Do we really need players like this in our game? Love to know your thoughts. https://t.co/Md1Qm96zN0 — Lisa Sthalekar (@sthalekar93) June 11, 2021 -
క్రీడా శాఖ మంత్రిగా మనోజ్ తివారి
మాజీ క్రికెటర్ మనోజ్ తివారికి కొత్తగా ఏర్పడిన బెంగాల్ కేబినెట్లో చోటు దక్కింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతను ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశాడు. తివారి శివ్పూర్ నియోజకవర్గంనుంచి విజయం సాధించాడు. భారత్ తరఫున 12 వన్డేలు, 3 టి20లు ఆడిన తివారి... 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో మనోజ్ తివారి కూడా సభ్యుడు. -
Nuwan Zoysa: మ్యాచ్ ఫిక్సింగ్.. మాజీ క్రికెటర్‌పై ఆరేళ్ల నిషేధం
దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్ నువాన్ జోయ్సాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నువాన్ జోయ్సా తప్పు చేసినట్లు నిర్ధారించింది. ఏడాదిన్నర కాలం నుంచి అతడిపై ఆరోపణలు ఉన్నాయి. టీ10 లీగ్‌లో చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకుగానూ జోయ్సాపై నిషేధం విధించినట్లు తెలిపింది. శ్రీలంక తరపున1997-2007 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన జోయ్సా 30 టెస్టుల్లో 64 వికెట్లు.. 95 వన్డేల్లో 108 వికెట్లు తీశాడు కాగా జోయ్సాపై విధించిన ఆరేళ్ల నిషేధం 31 అక్టోబర్ 2018 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ ప్రకటన చేసింది. ఆర్టికల్ 2.1.1 నిబందన ప్రకారం.. ఎవరైనా ఫిక్సింగ్ చేయడానికి యత్నించడం, ఇతరులను ఫిక్సింగ్ చేసేందుకు ప్రోత్సహించడం, మ్యాచ్ ఫలితాలు మార్చేందుకు యత్నించడం... ఆర్టికల్ 2.1.4 ప్రకారం, ఇతరులకు సూచనలు చేయడం, తప్పిదాలు చేసేందుకు ప్రోత్సహించడం, నేరుగా ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాలు మార్చివేసేందుకు యత్నించడం లాంటి యత్నాలు ఆర్టికల్ 2.1 కిందకి వస్తాయి. కాగా జోయ్సా ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: యూఏఈ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం -
భారత మాజీ క్రికెటర్ చంద్రశేఖర్‌కు అస్వస్థత
సాక్షి, బెంగళూరు: భారత మాజీ క్రికెటర్, విఖ్యాత లెగ్ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భార్య సంధ్య వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 75 ఏళ్ల చంద్రశేఖర్ గత శుక్రవారం తీవ్రమైన అలసటకు గురయ్యారు. దాంతో పాటు మాట తడబడటంతో ఆయన్ని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలోని వైద్యనిపుణులు ఆయనను పరీక్షించి... స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్‌గా నిర్ధారించి చికిత్స చేశారు. మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్‌లు ఏర్పడ్డాయని అందువల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. అనంతరం సాధారణ వార్డ్‌కు మార్చారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం, సమస్యా లేదని సంధ్య తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం పది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన చంద్రశేఖర్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 58 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. అప్పటి సహచర స్పిన్నర్లు బిషన్‌సింగ్ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్లతో కలిసి 1960, 70 దశకాలను శాసించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘పద్మశ్రీ’ పురస్కారాలతో గౌరవించింది. -
భారత మాజీ క్రికెటర్ మృతి
కొల్హాపూర్ : భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావ్జీ (ఎస్ఆర్) పాటిల్ మృతి చెందారు. ఆయనకు 86 ఏళ్లు. మంగళవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కొల్హాపూర్ జిల్లా క్రికెట్ సంఘం మాజీ అధికారి రమేశ్ కదమ్ తెలిపారు. మీడియం పేసర్ అయిన పాటిల్... 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 79వ ఆటగాడిగా నిలిచిన ఆయన... కేవలం ఒకే ఒక టెస్టు మ్యాచ్‌కు పరిమితం అయ్యారు. పాటిల్ మృతిపై స్పందించిన బీసీసీఐ ‘న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిల్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్లను రాబట్టిన ఆయన... మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 27 పరుగులతో గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.’అని పేర్కొంది. అనంతరం లాంక్షైర్ లీగ్‌లో 1959 నుంచి 1961 వరకు రెండు సీజన్‌ల్లో 52 మ్యాచ్‌ల్లో ఆడి... 111 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1952–64 మధ్య మహారాష్ట్ర తరఫున 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 866 పరుగులు చేసిన పాటిల్... 83 వికెట్లను నేలకూల్చాడు. రంజీల్లో మహారాష్ట్రకు సారథ్యం కూడా వహించాడు. పాటిల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
విషమంగా మాజీ క్రికెటర్ ఆరోగ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. కిడ్ని సమస్యతో పోరాడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చేతన్ చౌహాన్ జూలైలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో మెదంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ చికిత్స పొందుతున్న ఆయనకి కిడ్నీ, బీపీ సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఆత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. (కోవిడ్ లెక్కలు చెప్పే అగర్వాల్‌కు కరోనా) రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన చేతన్ చౌహాన్ కరోనా బారిన పడిన అంతర్జాతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుల్లో ఒకరు. చేతన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కుటుంబసభ్యులు జూలైలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, హోం క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ప్రస్తుతం చౌహాన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. 1969-1978 మధ్య కాలంలో ఆయన 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు. 97 పరుగుల అత్యధిక స్కోరు కలిగి ఉన్నారు. ఏడు వన్డేలు ఆడిన చౌహాన్ 153 పరుగులు చేశారు. (దేశ భద్రతలో మరో కీలక ఆవిష్కరణ) -
ఐపీఎల్.. మానసిక స్థితిని మార్చుతుంది: గంభీర్
ముంబై: ఐపీఎల్–13వ సీజన్ మొదలైతే దేశం మానసికస్థితి కాస్త మారుతుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కరోనా విలయతాండవంతో దేశంలో ఒక విధమైన భయానక, ఆందోళనకర వాతావరణం నెలకొందని... ఇలాంటి సమయంలో లీగ్ జరిగితే దేశ ప్రజలకు క్రికెట్ ద్వారా సాంత్వన లభిస్తుందని చెప్పాడు. ఆటతో జాతి మానసిక స్థితి మారుతుందని కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ సారథి గంభీర్ అన్నాడు. ‘13వ సీజన్ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతం. ముందు జరగడమే ముఖ్యం. మన ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థితి మారుతుంది. క్రికెట్ నుంచి లభించే ఊరట జాతి మోమునే మార్చేస్తుంది. ఏ ఫ్రాంచైజీ గెలుస్తారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరెక్కువ వికెట్లు తీస్తున్నారు అనే పట్టింపుల కన్నా... దేశ మానసిక స్థితి మారుతుంది. ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్ గతంలో జరిగిన లీగ్‌లకంటే గొప్పదవుతుంది. దేశానికి సాంత్వన చేకూరుస్తుంది’ అని అన్నాడు. యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఈ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుంది. -
'ఇంగ్లండ్‌కు ఆడితే కాల్చేస్తామన్నారు'
లండన్ : అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్ హత్య అనంతరం వర్ణ వివక్షపై మరోసారి దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికి అతని మృతి పట్ల ప్రపంచంలో ఏనదో ఒక మూల వర్ణ వివక్షపై నిరసనజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్ణ వివక్ష అనేది ప్రతీ అంశంలోనూ సామాన్యంగా మారిపోయింది. ఇక క్రీడా ప్రపంచంలోనూ వర్ణ వివక్షకు చోటు ఉందనడంలో సందేహం లేదు. మొన్నటికి మొన్న ఐపీఎల్ సందర్భంగా తాను వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నానంటూ విండీస్ క్రికెటర్ డారెన్ సామి పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫిలిప్ డీఫ్రెటిస్ తాను క్రికెట్ ఆడిన రోజుల్లో వివక్షను ఎదుర్కొన్నానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.('కోహ్లి అత్యుత్తమ ఆటగాడనేది అందుకే') 'జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో రెండు, మూడు సార్లు బెదిరింపులు వచ్చాయి. ఇంగ్లండ్ జట్టుకు ఆడితే.. కాల్చి చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏకంగా సొంత కారు మీద ఉన్న నా పేరును తీసేసుకునేలా చేశారంటే ఏ స్థాయిలో వివక్ష ఎదుర్కొన్నానో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటపై దృష్టి పెట్టడం కష్టం. అయినా నా ప్రతిభతో అలాంటి వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ఇంగ్లండ్‌కు ఆడుతున్న రోజుల్లో నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏం జరుగుతుందో అనే భయంతోనే ఆడేవాడిని' అంటూ చెప్పుకొచ్చాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిలిప్ డీఫ్రెటిస్ 1986-97 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 44 టెస్టులు, 103 వన్డేలు ఆడాడు. -
50 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు
ఇంగ్లండ్‌కు చెందిన 82 ఏళ్ల మాజీ క్రికెటర్ అలాన్ జోన్స్ కోరికను ఈసీబీ 50 ఏళ్ల తర్వాత తీర్చింది. 1970లో జోన్స్ తన కెరీర్లో ఏకైక టెస్టును ఇంగ్లండ్ తరఫున రెస్టాఫ్ ది వరల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఐసీసీ ఆ మ్యాచ్‌కు టెస్టు హోదాను తీసేసింది. దాంతో ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్‌ను అనిపించుకోలేకపోయాననే బాధ అతడిని వెంటాడింది. ఆ మ్యాచ్ జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా జోన్స్‌ను టెస్టు ఆటగాడిగా గుర్తిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వరుస ప్రకారం అతనికి ‘696’ నంబర్ క్యాప్‌ను అందించడంతో జోన్స్ సంబరపడిపోయాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో చక్కటి రికార్డు ఉన్న జోన్స్ 645 మ్యాచ్‌లలో 56 సెంచరీలు సహా 36,049 పరుగులు చేశాడు. -
మాజీ క్రికెటర్ హత్య.. కొడుకే హంతకుడు
సాక్షి, తిరువనంతపురం: కేరళ మాజీ రంజీ క్రికెటర్ కె.జయమోహన్ తంపి(64) హత్య కేసు మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఆయన కుమారుడు అశ్వినే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. ఈ మాజీ క్రికెటర్ సోమవారం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిపించిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి ఆయన కొడుకు అశ్విన్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. (ఆస్పత్రి నుంచి పారిపోయి.. శవమై తేలాడు) ‘జయంత్ ఆయన కుమారుడు అశ్విన్‌లు ప్రతిరోజు ఇంట్లోనే మద్యం తాగే అలవాటు ఉంది. జయమోహన్ హత్యకు గురైన రోజు(శనివారం) కూడా వారు మద్యం సేవించారు. మరింత మద్యం కోసం తండ్రి డెబిట్ కార్డును ఉపయోగించడానికి అశ్విన్ ప్రయత్నించాడు. అయితే దీనికి జయమోహన్ అంగీకరించలేదు. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్దగొడవకు దారితీసింది. ఈ క్రమంలో జయమోహన్‌ను అశ్విన్ బలంగా తోసేయడంతో కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం అయింది. ఆ తర్వాత తండ్రి శవాన్ని పక్కకు పడేసి అక్కడే మరింత మద్యం సేవించి పడుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు. ఇక జయమోహన్ 1979-82 సమయంలో కేరళ తరుపున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. (మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్) -
కరోనాతో పోరాడాల్సిందే: భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తితో పాటు ఆశావహ దృక్పథం ఉండాలని బెంగాల్ క్రికెట్ కోచ్, భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అన్నారు. నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించిన అరుణ్ లాల్ ప్రతీ ఒక్కరూ గట్టి నమ్మకంతోనే కష్టాన్ని ఎదుర్కోగలరని పేర్కొన్నారు. ‘కరోనా ఒక వ్యాధి మాత్రమే. దీన్ని ఎదుర్కోగలమని మనమంతా నమ్మాలి. విపత్కర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. ఆశాభావాన్ని పెంపొందించుకోవాలి. మంచి ఆహారం, తగినంత నిద్ర, రోగనిరోధకతను పెంచుకోవడం ద్వారా దీని నుంచి బయటపడొచ్చు. మన చుట్టూ ఉన్న వారి క్షేమం కోసం మనం స్వీయ నిర్బంధాన్ని పాటించాలి’ అని 13 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది బెంగాల్‌ను రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చిన అరుణ్ లాల్ వివరించారు. -
నా కుటుంబాన్ని కలవాలి... ఆర్థిక సహాయం చేయండి!
క్రైస్ట్‌చర్చ్: ‘యూకే వెళ్లేందుకు విమాన టికెట్లకు కొంత డబ్బు కావాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. స్కైప్/ వీడియో కాల్ ద్వారా నాతో ఎవరైనా 20 నిమిషాలు మాట్లాడవచ్చు. క్రికెట్, రాజకీయాలు, వంటలు, మానసిక ఒత్తిడి, సచిన్ టెండూల్కర్ ఏదైనా సరే...మీకు నచ్చితే కొన్ని డాలర్లు/పౌండ్లు నాకు పంపండి’... ఒక మాజీ క్రికెటర్ ఆవేదన ఇది. న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ ఇయాన్ ఓబ్రైన్ జాతీయ జట్టు తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అతని స్వదేశం న్యూజిలాండే అయినా భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్లలో అతను బుకింగ్ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. ఇప్పుడు ఎంత ఎక్కువ మొత్తమైనా ఇచ్చి వెళ్లాలనుకుంటున్నానని, దాంతో ఇలా చేయక తప్పడం లేదని అతను వాపోయాడు (2009 హామిల్టన్ టెస్టులో అతను సచిన్‌ను అవుట్ చేశాడు. అందుకే దాని గురించి కూడా ఎవరైనా అడగవచ్చని సచిన్ పేరు కూడా జత చేశాడు). ఇంగ్లండ్‌లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్‌ఫెక్షన్‌లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్ బాధపడుతున్నాడు. -
ఒక్క ఓవర్లో 77 పరుగులా !
వెల్లింగ్టన్ : క్రికెట్లో ఏదైనా సాధ్యమే. ఎవరూ ఊహించని రికార్డులు బద్దలవడం, బౌలింగ్‌లో రికార్డు గణాంకాలు నమోదవడం వంటివి చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఒక బౌలర్ ఒక ఓవర్లో 6 నుంచి 10 పరుగులు ఇస్తుంటాడు. ఒకవేళ మరీ దారుణంగా బౌలింగ్ వేస్తే 30 పరుగులు ఇస్తుంటారు. అయితే ఒకే ఓవర్లో ఒక బౌలర్ 77 పరుగులు ఇవ్వడం ఎపప్పుడైనా విన్నారా ! అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఈ విచిత్ర ఘటన ఫిబ్రవరి 20, 1990 న చోటుచేసుకుంది. అయితే ఈ ఫేలవ రికార్డు అంతర్జాతీయ మ్యాచ్‌లో కాకుండా ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజున(ఫిబ్రవరి 20) వెల్లింగ్టన్, కాంటర్బరీ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో కాంటర్బరీకి వెల్లింగ్టన్ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భాగంగా కాంటర్బరీ 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయింది. ఆ సమయంలో క్రీజులో ఎల్కే జర్మన్ (160 నాటౌట్), రోజర్ ఫోర్డ్ (14 నాటౌట్) ఉన్నారు. ఇక కాంటర్బరీ గెలవడానికి 2 ఓవర్లలో 95 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం కాబట్టి ఉన్న రెండు వికెట్లను కాపాడుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని కాంటర్బరీ, మరోవైపు రెండు వికెట్లు తీస్తే.. విజయాన్ని సాధించవచ్చని వెల్లింగ్టన్ భావించాయి. దీంతో మ్యాచ్‌ను గెలవాలని వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్ అయిన రాబర్ట్ వాన్స్‌కు ఇచ్చాడు. (‘రిషభ్.. నీ రోల్ ఏమిటో తెలుసుకో’) అయితే రాబర్ట్ వాన్స్ ఆ ఓవర్లో ఏకంగా 22 బంతులు వేశాడు.. అందులో 17 నోబాల్స్ ఉండడం విశేషం. ఇక కాంటర్బరీ బ్యాట్స్‌మెన్ జర్మన్ ఎనిమిది సిక్సులు, ఐదు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్ సెంచరీ కూడా చేయడం విశేషం. ఈ ఓవర్ దెబ్బకు కాంటర్బరీ చివరి ఓవర్లో 18 పరుగులు చేస్తే విజయం దక్కించుకునేది. అప్పటికే సెంచరీతో జోరుమీదున్న జర్మన్ ఊపుచూస్తే.. కాంటర్బరీ సునాయాసంగా గెలిచేలాగా కనిపించింది. ఇవాన్ గ్రే వేసిన చివరి ఓవర్లో కాంటర్బరీ జట్టు 5 బంతుల్లో 17 పరుగులు చేసింది. కాగా ఇన్నింగ్స్ చివరి బంతిని ఎదుర్కొన్న రోజర్ ఫోర్డ్ సింగిల్ తీయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో జర్మన్ వీరోచిత ఇన్నింగ్స్ వృధాగా మిగిలిపోయింది. రాబర్ట్ వాన్స్ మాత్రం ఒక ఓవర్లో 77 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. అయితే ఈ చెత్త రికార్డు మాత్రం క్రికెట్ చరిత్ర రికార్డుల్లోకి ఎక్కలేదు. బహుశా భవిష్యత్తులో ఏ బౌలర్ కూడా ఒకే ఓవర్లో ఇన్ని పరుగులు ఇవ్వడేమో!. ఇప్పటికి క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 77 పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు మాత్రం రాబర్ట్ వాన్స్‌పైనే ఉంది. కాగా రాబర్ట్ వాన్స్ 135 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్ తరపున 4 టెస్టులు, 8వన్డేలు ఆడాడు.(అతనేమీ సెహ్వాగ్ కాదు.. కానీ) -
కనేరియా.. మతం మార్చుకో
న్యూఢిల్లీ: మతం మార్చుకోవాలని సలహా ఇచ్చిన నెటిజన్‌కు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. తాను మతం మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ‘ఇస్లాం మతాన్ని స్వీకరించండి. ఇస్లాం బంగారం లాంటిది. ఇస్లాం లేకపోతే జీవితం లేదని నాకు తెలుసు. దయచేసి ఈ బంగారాన్ని అంగీకరించండి’ అంటూ ఓ నెటిజన్ ట్విటర్లో కనేరియాను కోరాడు. ‘మీలాంటి చాలా మంది నన్ను వేరే మతంలోకి మార్చాలని ప్రయత్నించారు. కానీ వారెవరూ విజయవంతం కాలేద’ని కనేరియా సమాధానం ఇచ్చాడు. కాగా, హిందువైన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో వివక్ష ఎదుర్కొన్నానని అంగీకరించి గతేడాది కనేరియా వివాదాలపాలయ్యాడు. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వెల్లడించడంతో వివాదం రేగింది. ‘షోయబ్ అక్తర్ ఒక లెజెండ్. నాకు ఎప్పుడూ అక్తర్ మద్దతుగానే ఉండేవాడు. కానీ ఆ సమయంలో నాపై వివక్ష చూపెట్టేవారిని ఎదురించే సాహసం చేయలేకపోయాను. అక్తర్‌తో పాటు ఇంజమాముల్ హక్, మహ్మద్ యూసఫ్, యూనస్ ఖాన్లు నాకు అండగా ఉండేవార’ని కనేరియా పేర్కొన్నాడు. -
పురుషుల వన్డేకు మహిళా మ్యాచ్ రిఫరీ
దుబాయ్: ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్ రిఫరీల ప్యానల్లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారత మాజీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వ (జీఎస్) లక్ష్మి ఖాతాలో మరో ఘనత చేరనుంది. అంతర్జాతీయ పురుషుల వన్డే మ్యాచ్‌కు రిఫరీగా పనిచేయనున్న మొట్టమొదటి మహిళా మ్యాచ్ రిఫరీగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్–2 టోర్నీలో భాగంగా యూఏఈ వేదికగా ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఈ అరుదైన అవకాశం తనకు రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది. ‘చాలా గొప్పగా అనిపిస్తుంది. గర్వంగా ఉంది. ఏదైనా మనతోనే మొదలైంది అని చెప్పుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. ఐసీసీ టోరీ్నలకు పనిచేయడం గొప్పగా ఉంటుంది’ అని 51 ఏళ్ల లక్ష్మి పేర్కొన్నారు. 2008–09 సీజన్లో మొదటిసారి దేశవాళీ మహిళా క్రికెట్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన ఆమె... అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 3 మహిళల వన్డేలకు, 7 టి20 మ్యాచ్‌లకు పనిచేశారు. 20 అంతర్జాతీయ పురుషుల టి20 మ్యాచ్‌లకు కూడా ఆమె రిఫరీగా వ్యవహరించారు. -
బాబ్ విల్లీస్ కన్నుమూత
ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ (70) బుధవారం కన్నుమూశారు. 90 టెస్టుల్లో 25.20 సగటుతో 325 వికెట్లు తీసిన విల్లీస్ 70వ దశకంలో ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచారు. 64 వన్డేల్లో ఆయన 80 వికెట్లు పడగొట్టారు. 1981లో హెడింగ్లీలో జరిగిన యాషెస్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే 8 వికెట్లు తీసిన బాబ్ సంచలన ప్రదర్శన ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. 18 టెస్టుల్లో ఆయన ఇంగ్లండ్‌కు కెప్టెన్ గా వ్యవహరించారు. -
గవర్నర్‌గా ముత్తయ్య మురళీధరన్!
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ త్వరలో కొత్త పాత్రలోకి ప్రవేశించబోతున్నాడు. తమిళుల ప్రాబల్యం అధికంగా ఉన్న నార్తర్న్ ప్రావిన్స్‌కు మురళీధరన్‌ను గవర్నర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ పదవిని స్వీకరించాలంటూ లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడి 800 వికెట్లు తీసిన 47 ఏళ్ల మురళీధరన్ 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు. -
భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత
ముంబై: భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1952–53 మధ్య కాలంలో ఓపెనర్‌గా 7 టెస్టులు ఆడిన ఆప్టే 49.27 సగటుతో 542 పరుగులు చేశారు. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 163 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి తప్పించడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన. ఈ సిరీస్‌లో విశేషంగా రాణించినా ఆ తర్వాత ఆప్టే మరో టెస్టు ఆడలేకపోయారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 67 మ్యాచ్‌లలో ఆయన 38.79 సగటుతో 3336 పరుగులు సాధించారు. 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ముంబైలోని ప్రఖ్యాత ‘కంగా లీగ్’ పోటీల్లో మాధవ్ ఆప్టే ఆడటం విశేషం! ‘క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షుడిగా పని చేసిన ఆప్టే... 14 ఏళ్ల వయస్సులోనే సచిన్ టెండూల్కర్ ప్రతిభను గుర్తించి పట్టుబట్టి మరీ తమ క్లబ్ తరఫున ఆడే అవకాశం కల్పించారు. త్వరలోనే ఇతను భారత్‌కు ఆడతాడంటూ భవిష్యత్తును చెప్పారు. ఆప్టే మృతి సందర్భంగా దీనిని గుర్తు చేసుకున్న సచిన్... ఆయనకు తన తరఫు నుంచి నివాళులు అర్పించాడు. -
భారత మాజీ క్రికెటర్ ఆకస్మిక మృతి
సాక్షి, చెన్నై : భారత మాజీ క్రికెటర్, తమిళనాడు క్రికెట్‌కు సుదీర్ఘ కాలం మూలస్తంభంలా నిలిచిన వక్కడై బిశ్వేశ్వరన్ (వీబీ) చంద్రశేఖర్ గుండెపోటుతో గురు వారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. 1988–90 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్ మొత్తం 88 పరుగులే చేయడంతో స్థానం కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. అతడి 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్ మాత్రం బాగా సాగింది. తమిళనాడు ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వీబీ 81 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. దూకుడైన ఆటకు గుర్తింపు పొందిన చంద్రశేఖర్ 1988–89 ఇరానీ కప్ మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పట్లో భారత్ తరఫున అదే ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ సెంచరీ. రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్‌గా, భారత సెలక్టర్‌గా పనిచేసిన ఆయన... ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ధోనిని తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కామెంటేటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. -
పాకిస్తాన్‌కు కశ్మీర్ అక్కర్లేదు: అఫ్రిది
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు కశ్మీర్ అక్కర్లేదనీ, ఇప్పుడున్న 4 ప్రావిన్సులనే పాక్ సరిగ్గా పాలించుకోలేకపోతోందని అన్నారు. బ్రిటన్ పార్లమెంటులో విద్యార్థులతో జరిగిన సమావేశంలో అఫ్రిది ఇలా మాట్లాడారు. ‘పాక్‌కు అసలు కశ్మీర్ అక్కర్లేదు. దాన్ని భారత్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. కశ్మీర్‌ను స్వతంత్రంగా ఉండనిద్దాం. అప్పుడైనా కనీసం మానవత్వం బతికుంటుంది. ఏ మతానికి చెందిన ప్రజలైనా చనిపోవడమన్నది బాధాకరం’ అని అఫ్రిది మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
'నేనేమన్నా ఇండియాకు అమ్మేశానా?'
ఇస్లామాబాద్ : తన మూడో పెళ్లి విషయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మీడియాపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆయన మూడో పెళ్లి చేసుకున్నారంటూ అటు పాక్ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంపై నిప్పులు చెరిగారు. ఈ దేశ(పాక్) రహస్యాలను తానేమన్నా భారత్‌కు అమ్మేశానా లేకుంటే.. ఈ దేశ (పాక్) సొమ్మునేమైనా దోచుకున్నానా. ఎందుకింతలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు' అంటూ మీడియాపై మండిపడ్డారు. తన ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను వివాహం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు దుమ్ములేచేలా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ కుటుంబీకులు ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఆ ప్రతిపాదన మాత్రం వచ్చిందని, ఇమ్రాన్ దానికి ఇంకా అంగీకారం తెలపలేదని, కుటుంబ సభ్యులతో, పిల్లలతో చర్చిస్తున్నారని కూడా తెలిపారు. అయినప్పటికీ ఆయన పెళ్లి విషయంపై మీడియా పదేపదే ఆయనను వెంటాడుతుండటంతో ఇమ్రాన్ చిర్రెత్తిపోయారు. ఇదంతా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రైవేట్ మీడియా చేస్తున్న కుట్ర అని అన్నారు. గత కొన్నాళ్లుగా వారు ఇదే పనిపెట్టుకున్నారని దుయ్యబట్టారు. అయినా తానేం భయపడబోనని చెప్పారు. 'షరీఫ్ నాకు 40 ఏళ్లుగా తెలుసు. వారి నీచమైన జీవితాలేమిటో కూడా నాకు బాగా తెలుసు. కానీ, అలాంటివేవి కూడా వారిలాగా నేను దిగజారి ఆరోపించను.. ప్రచారం చేయను' అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. -
ఆ విషయం చెప్పింది వినూమన్కడే: గవాస్కర్
ముంబై: తాను భారత క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యానని చెప్పింది మాజీ భారత కెప్టెన్ ఆల్ రౌండర్ వినుమన్కడేనని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తుచేసుకున్నాడు. గత రాత్రి దిగ్గజ క్రికెటర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూమన్కడ్ 100వ జయంతి వేడుకలకు హాజరైన సన్నీ ఆయనతో గడిపిన జ్ఞాపకలను నెమరువేసుకున్నాడు. 1917 ఏప్రిల్ 12న జన్మించిన వినూమన్కడ్ భారత్ తరుపున 44 టెస్టులు ఆడి 2,109 పరుగులతో 162 వికెట్లు పడగొట్టాడు. 4 దశాబ్దల క్రితం మా ఇంట్లోకి వెళ్తుండగా నాకు తియ్యని వార్తని మా గురువు వినుమన్కడ్ ఫోన్లో వినిపించారని సన్నీ తెలిపాడు. ‘వినూ భాయ్ ఫోన్లో బెటా నువ్వు భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యావు, ఫ్రీగా బ్యాటింగ్ చేయి’ అన్న మాటలను సన్నీ ఈ వేడుకలో గుర్తు చేసుకున్నాడు. ఈ మాటలు నాకెంతో సంతోషం కల్గించాయని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ 1971లో వెస్టిండీస్ పర్యటనకు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ సైతం వినుమన్కడ్ గురించి గొప్పగా చెప్పాడని భారత్ తరుపున 125 టెస్టులు ఆడి 10,122 పరుగులు చేసిన గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వేడుకలకు భారత మాజీ క్రికెటర్లు అజిత్ వాడెకర్, వాసు, మాధవ్ ఆప్టే, సలీం దురాణీలు పాల్గొన్నారు. -
మూడో పెళ్లి చేసుకోవాలనుంది: మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: 'నాకు తెలిసి ఎవరి జీవితంలోనైనా విడాకులు తీసుకోవడం అత్యంత దురదృష్టకర సంఘటన. ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్న అనుభవంతో ఈ మాట చెబుతున్నా. అయితే నేను రాజీ పడే రకాన్ని కాదు. అందుకే మూడో పెళ్లి చేసుకుని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా' అని లేటు వయసులో ఘాటు కోరికను వెల్లడించారు మాజీ క్రికెటర్, పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం తాను ఒంటరినని, బ్యాచిలర్ లైఫ్ బోర్ కొడుతున్నదని ఆయన చెప్పారు. 40 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యతో విడిపోవడం, గతేడాది జనవరిలో రెండో పెళ్లి.. అది కూడా పెటాకులైన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారాయన. గత వారం ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితంపై పెదవి విప్పారు. 'క్రికెట్ లో మంచి ఊపు మీదున్నప్పుడే మా వాళ్లు పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేశారు. కానీ ఒక పని అనుకుంటే నా లక్ష్యమంతా దానిమీదే ఉంటుంది. అప్పట్లో క్రికెటే నా ప్రాణం. అందుకే క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యాకే జెమీనాను పెళ్లాడా. పదకొండేళ్ల మా అనుబంధానికి తీపి గుర్తులు ఇద్దరు పిల్లలు. ఎప్పుడైతే నా లక్ష్యం దేశంపైకి.. అంటే రాజకీయాలవైపు మళ్లిందో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. జెమీనా పాకిస్థాన్ లో ఉండలేని.. నేనేమో పాకిస్థాన్ తప్ప మరో చోట ఉడలేని పరిస్థితి. దీంతో క్రమంగా ఇద్దరి మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడింది. విడిపోక తప్పలేదు. మొదటి వివాహం రద్దయిన తర్వాత దాదాపు 10 ఏళ్లు నేను ఒంటరిగానే ఉన్నా. అందుకు బలమైన కారణం ఉంది. (చదవండి: ఇమ్రాన్ హత్యకు రెండో భార్య కుట్ర?) విడాకులు.. పిల్లలపై తీవ్ర ప్రభావాలు.. నేనూ, జెమీనా విడిపోయినప్పుడు మా పిల్లలకు 9, 11 ఏళ్లు. తల్లిదండ్రులు విడిపోయారనే దానికంటే వాళ్లు వేరొకిరిని పెళ్లి చేసుకున్నారనే భావన పిల్లలల్లో కలిగితే కుంగిపోతారని నా స్నేహితుడైన మానసిక వైద్యుడొకరు చెప్పారు. అందుకే ఆమెతో విడిపోయిన 10 ఏళ్ల వరకూ నేను రెండో పెళ్లి చేసుకోలేదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఒంటరిగా ఉంటూ నేను పడే బాధను అర్థం చేసుకుంటారనే ఉద్దేశం కలగగానే.. గతేడాది(2015లో) రెహమ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నా. మనం ఒకటి తలిస్తే అల్లా ఒకటి చేస్తాడు. రేహమ్ నేను 10 నెలలకే విడిపోయాం. మళ్లీ నా వ్యక్తిగత జీవితాన్ని ఒంటితనం ఆవహించింది. (చదవండి: చపాతీలు చెయ్యమన్నాడని..) ఎన్ని కష్టాలు ఎదురైనా, నిలబడి పోరాడాలనే నేను కోరుకుంటా. రాజకీయాల్లోనూ అంతే. పార్టీ పెట్టిన మొదట్లో ఎన్నెన్నో సందేహాలు, సవాళ్లు. ఇప్పుడు నా పార్టీ నిలబడింది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామనే నమ్మకం ఉంది. అలాగే పర్సనల్ లైఫ్ లో సంతోషంగా ఉండేందుకు మూడో పెళ్లి చేసుకోవాలనుకుటున్నా. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. అన్ని విధాలా తగిన మహిళ దొరుకుతుందన్న ఆశ లేదు. కానీ నేను దేవుణ్ని అమితంగా నమ్ముతా. ఆయన ప్రణాలిక ఎలా ఉందోమరి!' అంటూ కోరికను వెల్లడించారు ఇమ్రాన్ ఖాన్. -
క్యాబ్ డ్రైవర్‌గా మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే చాలు కోటీశ్వరుడు అయిపోవచ్చు. జీతాలే గాక వాణిజ్య ప్రకటనలు, ఐపీఎల్ వంటి అవకాశాల ద్వారా బోలెడు డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇదంతా పార్శ్యంలో ఓ కోణం మాత్రమే. ప్రపంచంలో పేదరికం అనుభవిస్తున్న మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇందుకు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ అర్షద్ ఖాన్ మరో ఉదాహరణ. అర్షద్ సిడ్నీలో ఉబెర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్థాన్ తరపున అర్షద్ 9 టెస్టులు, 58 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 32, వన్డేల్లో 56 వికెట్లు తీశాడు. 1997-98 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అర్షద్ 2001 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్లో భారత దిగ్గజాలు సచిన్, ద్రావిడ్‌ల వికెట్లను తీశాడు. భారత్‌లో నిషేధిత ఇండియన్ క్రికెట్ లీగ్‌లో కూడా ఆడాడు. ఇంతటి కెరీర్ ఉన్నా అర్షద్ నేడు ఉపాధి కోసం టాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ఊహించని విషయం. అర్షద్ ఉదంతాన్ని ఓ భారతీయ నెటిజెన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 'సిడ్నీకి వెళ్లినపుడు అర్షద్ కలిశాడు. తొలుత నేను అతణ్నిగుర్తించలేదు. పాకిస్తానీగా పరిచయం చేసుకున్నాడు. కొంతకాలంగా సిడ్నీలో నివసిస్తున్నానని చెప్పాడు. అతని పూర్తి పేరు అడిగాను. ఆ తర్వాత అతని ముఖం చూసి షాకయ్యాను. అతను పాకిస్థాన్ క్రికెటరని గుర్తించాను. అతని క్యాబ్‌లో ప్రయాణించినపుడు నీళ్లు, ఆహారపదార్థాలు ఇచ్చాడు. హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు' అని నెటిజన్ వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్ 'అజహర్' షూటింగ్ ప్రారంభం
ముంబై: పేదరికంలో పుట్టాడు.. రోజూ సైకిల్ మీద వెళ్లి క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. జాతీయ జట్టులో స్థానం పొందాడు. విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కుని జీవితకాల నిషేధానికి గురయ్యాడు..కోర్టు తీర్పుతో విముక్తుడయ్యాడు. ఇలా ట్విస్టుల మీద ట్వీస్టులతో డ్రామాకు ఏమాత్రం తగ్గని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితగాధ 'అజహర్' టైటిల్ తో వెండితెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైనట్లు అజహర్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీ ట్విట్ చేశాడు. 'అజహర్ జర్నీని ప్రారంభించాం.. మాకు విజయం చేకూరాలని విష్ చేయండి' అంటూ నెటిజన్లను అభ్యర్థించాడు. మే 13, 2016న విడుదల కానున్న ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకుడు. ఏక్తాకపూర్ నిర్మాత. -
మాజీ క్రికెటర్ పై ఛీటింగ్ కేసు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్‌పై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. వివరాలు... శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అర్షద్ అయూబ్ మరికొందరితో కలిసి స్కైటీ పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టి వాటిని పలువురికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2007లో ప్రారంభించిన ఈ వెంచర్ ఇప్పటికీ పూర్తి కాకపోవటంతో పీజీకే నాయర్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మియాపూర్ పోలీ సులు అర్షద్ అయూబ్‌పై ఐపీసీ 406,409,415, 420,464,468,470,471,506 రీడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 20 నెలల్లో పూర్తి చేస్తామని కొనుగోలుదార్ల నుండి డబ్బులు తీసుకున్న అయూబ్ ఐదేళ్లైనా పని పూర్తి చేయలేదని, 6,7 అంతస్తులకు అనుమతులు లేకుండానే విక్రయించాడని, ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించాడని నాయర్ ఫిర్యాదు చేశారు. నాయర్ తరహాలోనే మరో ఏడుగురు అయూబ్ చేతిలో మోస పోయామని మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. -
నర్గిస్ పంట పండినట్టే...
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోయె.. కృతీ సనన్ వచ్చె.. కృతీ పోయె కరీనా కపూర్ వచ్చె.. ఇప్పుడు కరీనా కూడా పోయె.. అని బాలీవుడ్లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆంటోనీ డిసౌజా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అజారుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ చేయనున్నారు. ఆయన మొదటి భార్య పాత్రకు ప్రాచీ దేశాయ్‌ని తీసుకున్నారు. రెండో భార్య సంగీతా బిజ్లానీ పాత్రకు పైన చెప్పిన తారలను అనుకున్నారు. చిత్రనిర్మాత ఏక్తా కపూర్ అయితే ఆ పాత్రను సంగీతా బిజ్లానీతోనే చేయించాలని భావిస్తున్నారట. సంగీత సినిమాలు చేసి, దాదాపు 20 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ చిత్రం ఒప్పుకుంటారా? అనే సందేహం కూడా ఆమెకు లేకపోలేదు. దాంతో రెండో భార్య పాత్రను నర్గిస్ ఫక్రితో చేయించాలని డిసైడ్ అయిపోయారట. అదే జరిగితే నర్గిస్ పంట పండినట్టే. -
నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తా!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తానని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఇమ్రాన్ తెలిపాడు. త్వరలోనే పార్లమెంట్ ను మోసం చేస్తున్న నవాజ్ ను సుప్రీంకోర్టు బహిష్కరిస్తుందన్నాడు. షరీఫ్ ప్రభుత్వంతో చర్చల్లో భాగంగా డైలాగ్ కమిటీ ఇచ్చిన ఐదు హామీలను తమ పార్టీ అంగీకరించినా.. అందుకు సంబంధించి రాత పూర్వంగా ఎటువంటి నివేదిక ఇవ్వకపోవడాన్ని ఇమ్రాన్ తప్పుబట్టారు. 'షరీఫ్ ను ప్రధాని పదవి నుంచి దింపడానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. పీటీఐపై ఆయన పార్లమెంట్ లో అసత్యాలు వల్లిస్తున్నారు. దీనిపై అతన్ని కోర్టుకు లాగుతాం ' అని ఇమ్రాన్ హెచ్చరించాడు. గత కొంతకాలంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వెంటనే గద్దె దిగిపోవాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో రిగ్గింగ్ కేసు విచారణ జరుగుతున్నందున్న పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్ నిరసన బాటపట్టారు. -
పాక్ విపక్షాల నిరసన హింసాత్మకం
ప్రధాని ఇంటి ముట్టడికి ఆందోళనకారుల యత్నం లాఠిచార్జీ, రబ్బరు బుల్లెట్లు ముగ్గురి మృతి...500 వుందికి గాయూలు ఇస్లావూబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దెదిగాలనే డిమాండ్‌తో దేశంలో గత 18 రోజులుగా జరుగుతున్న విపక్షాల నిరసనలు శనివారం రాత్రి హింసాత్మకంగా మారాయి. మాజీ క్రికెటర్, తెహ్రికే ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్, కెనడాకు చెందిన మత పెద్ద, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ చీఫ్ తహిరుల్ ఖాద్రీ నాయకత్వంలో మద్దతుదారులు కర్రలు చేతబూని ఇస్లామాబాద్‌లోని ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. లాఠిచార్జీ చేయడంతోపాటు బాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఇరుపక్షాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా 500 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు జర్నలిస్టులున్నారు. అయితే భద్రతా దళాల దాడిలో తమ పార్టీకి చెందిన ఏడుగురు మృతి చెందినట్టు ఖాద్రీ ఆరోపించారు. కాగా, పోలీసుల ఉక్కుపాదంపై మండిపడ్డ ఇమ్రాన్.. నిరంకుశ ప్రభుత్వం బారి నుంచి ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకు పోరాడే క్రమంలో మరణించేందుకైనా సిద్ధమన్నారు. ఈ ఆందోళనలు ఇమ్రాన్ పార్టీలో చిచ్చురేపాయి. ప్రధాని ఇంటి ముట్టడిని విమర్శించినందుకు ఏకంగా పార్టీ చీఫ్ హష్మీతోపాటు ముగ్గురు ఎంపీలను ఇమ్రాన్ బహిష్కరించారు. మరోపక్క.. ప్రభుత్వం, సైన్యం వేర్వేరుగా అత్యవసర సమావేశం నిర్వహించాయి. -
సినిమా వేడుకకు రావడం ఇదే తొలిసారి! - కపిల్ దేవ్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ బుధవారం హైదరాబాద్‌లో ఓ తెలుగు సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నారు. ఆ సినిమా పేరు ‘దిల్ దివానా’. శేఖర్ కమ్ముల శిష్యుడు తుమ్మా కిరణ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, రాజారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కపిల్ దేవ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ యంగ్‌స్టర్సే. వీళ్లందర్నీ ప్రోత్సహించడానికే ఈ సమావేశంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ నేను ఏ సినిమా వేడుకకూ హాజరు కాలేదు. నా కెరీర్లో ఇదే తొలిసారి... ఇలాంటి వేడుకలకు రావడం. ఈ మధ్యకాలంలో దక్షిణాది చిత్రాలు దాదాపు హిందీలోకి అనువాదమవుతున్నాయి. ఈ సినిమా కూడా హిందీలోకి అనువాదమైతే తప్పకుండా చూస్తా’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కపిల్‌దేవ్ విచ్చేయడం స్వీట్ షాక్‌లా ఉందని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని దర్శకుడు కిరణ్ తెలిపారు. ఈ చిత్రంలో నటించిన రోహిత్‌రెడ్డి, రాజ్‌అర్జున్, కృతికా సింఘాల్, నేహా దేశ్‌పాండే తదితరులు కపిల్‌దేవ్‌కి కృతజ్ఞతలు తెలియజేయడంతోపాటు చిత్రవిజయం పట్ల తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు: నారాయణబాబు, సంగీతం: రామ్నారా యణ్, కెమెరా: జైపాల్‌రెడ్డి, ఎడిటింగ్: కార్తీక్ శ్రీని వాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికృష్ణ. ‘భారతరత్న’కి సచిన్ అర్హుడు ‘‘క్రీడారంగం నుంచి భారతరత్న అందుకున్న మొట్టమొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. అందులోనూ ఆ ఆటలో నేనూ ఓ భాగం కావడం ఆనందంగా ఉంది. సచిన్‌కి ఈ అరుదైన గౌరవం దక్కినందుకు గర్వంగా ఉంది. తను దీనికి అర్హుడు’’ అని కపిల్‌దేవ్ ప్రత్యేకంగా చెప్పారు.