
అరుణ్ లాల్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తితో పాటు ఆశావహ దృక్పథం ఉండాలని బెంగాల్ క్రికెట్ కోచ్, భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అన్నారు. నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించిన అరుణ్ లాల్ ప్రతీ ఒక్కరూ గట్టి నమ్మకంతోనే కష్టాన్ని ఎదుర్కోగలరని పేర్కొన్నారు. ‘కరోనా ఒక వ్యాధి మాత్రమే. దీన్ని ఎదుర్కోగలమని మనమంతా నమ్మాలి. విపత్కర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. ఆశాభావాన్ని పెంపొందించుకోవాలి. మంచి ఆహారం, తగినంత నిద్ర, రోగనిరోధకతను పెంచుకోవడం ద్వారా దీని నుంచి బయటపడొచ్చు. మన చుట్టూ ఉన్న వారి క్షేమం కోసం మనం స్వీయ నిర్బంధాన్ని పాటించాలి’ అని 13 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది బెంగాల్‌ను రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చిన అరుణ్ లాల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment