Arun Lal
-
బెంగాల్ జట్టు కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
బెంగాల్ జట్టు కొత్త కోచ్ ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లాను బెంగాల్ జట్టు కోచ్‌గా ఎంపిక చేస్తూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్( క్యాబ్) మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.బెంగాల్ జట్టు కోచ్ అరుణ్ లాల్ కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 41 ఏళ్ల లక్ష్మీ రతన్ శుక్లా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా వి రామన్‌ను నియమించారు. బెంగాల్ క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా అరుణ్ లాల్ గుర్తింపు పొందాడు. అతని పదవీకాలంలో, జట్టు 2019-20 రంజీ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టు ఓడిపోయింది. అయితే గత నెల వరకు అరుణ్ లాల్ జట్టు కోచ్‌గా కొనసాగాడు. అయితే తాజాగా రెండో పెళ్లి చేసుకుని కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కొత్త కోచ్ కోసం వెతుకుతోంది. అయితే కొత్తగా ఎంపికైన లక్ష్మీరతన్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ రావాల్సింది. కానీ ఆయన బంగ్లాదేశ్ అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత అభిషేక్ నాయర్‌ను నియమించడంపై చర్చ జరిగింది. ఎట్టకేలకు బెంగాల్ క్రికెట్ జట్టు కోచ్‌గా లక్ష్మీ రతన్ శుక్లా నియమితులయ్యారు. లక్ష్మీ రతన్ శుక్లా భారత్ తరఫున 3 వన్డేలు ఆడి ఈసారి 18 పరుగులు చేశాడు. అలాగే 137 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. శుక్లా బెంగాల్ అండర్-23 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 47 మ్యాచ్‌లాడిన శుక్లా 405 పరుగులు చేశాడు. -
'రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే'
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్.. వన్డే సిరీస్‌లో కూడా తన దూకుడును కొనసాగించిన సంగతి తెలిసిందే. సిరీస్‌ను నిర్ణయించే అఖరి వన్డేలో పంత్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 125 పరుగులతో ఆజేయంగా నిలిచిన పంత్.. భారత్ సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా అఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన పంత్‌పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను రిషబ్ పంత్ చేపట్టాలని అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. కాగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ రేసులో చాలా మంది పోటీదారులు ఉన్నారు. వారిలో పంత్ ఒకడు. కేఎల్ రాహుల్ గాయపడడంతో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు భారత కెప్టెన్‌గా పంత్ బాధ్యతలు నిర్వహించాడు. ఈ సిరీస్‌ను 2-2తో పంత్ ముగించాడు. "రోహిత్ శర్మ తర్వాత భారత జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరని అని నన్ను అడిగితే నేను మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పుతాను. జట్టులో టాప్ త్రీ లో ఉన్న ఆటగాళ్లే కెప్టెన్ పదవికు అర్హులని నేను ఎప్పుడూ భావిస్తాను. పంత్ ఎటువంటి భయం లేకుండా ఆడుతాడు. అతడు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా తన పని తను చేసుకుపోతాడు. కఠినమైన పరిస్థితులలో కూడా జట్టును ముందుండి నడిపించగలడు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆటగాడికి నాయకుడిగా ఉండే ఆర్హత ఉంది. పంత్ లాంటి దూకుడు ఉన్న ఆటగాడు కెప్టెన్‌గా ఉంటే భారత క్రికెట్‌కు మంచి జరుగుతోంది. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్లో టీమిండియా డ్రా కోసం ప్రయత్నించేది. కానీ ఈ ఆలోచన ఇప్పుడు మారిపోయింది. దీనికి కారణం విరాట్ కోహ్లి. కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. జట్టు డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ఆడేలా ప్రేరేపించేవాడు. టెస్టుల్లో కూడా దూకుడుగా ఆడే విధానాన్ని విరాట్ తీసుకువచ్చాడు. ఇప్పుడు అదే పంథాలో రిషబ్ కొనసాగుతున్నాడు. పంత్ ఇదే దూకుడును కొనసాగిస్తే ఖచ్చింతగా భారత జట్టుకు హీరో అవుతాడు" అని అరుణ్ లాల్ పేర్కొన్నాడు. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. -
66 ఏళ్ల వయస్సులో భారత మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్..!
భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, బుల్బుల్ సాహా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మే 2 (సోమవారం) కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరిగింది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 66 ఏళ్ల వయస్సులో అరుణ్ లాల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. లాల్ తన మొదటి భార్య రీనా అంగీకారంతోనే బుల్బుల్ సాహాను పెళ్లి చెసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె లాల్ కంటే 28 ఏళ్ల చిన్నది. ఇక అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 156 మ్యాచ్‌లు ఆడిన లాల్.. 30 సెంచరీలతో సహా 10421 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన కేకేఆర్.. రాజస్తాన్‌పై ఘన విజయం -
భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ రంజీ జట్టు హెడ్ కోచ్ అరుణ్ లాల్ 66 ఏళ్ల లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అనారోగ్యంగా ఉన్న మొదటి భార్యను ఒప్పించి మరీ ఆయన ఈ కార్యానికి రెడీ అయ్యాడు. అరుణ్ లాల్.. తనకు చాలాకాలంగా పరిచయమున్న బుల్ బుల్ సాహ (బెంగాల్) అనే మహిళ (38)ను మే 2న మనువాడబోతున్నాడు. కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు అరుణ్ లాల్ ఇప్పటికే తనకు కావాల్సి వారికి ఆహ్వానం పంపాడు. Arun Lal shared the invitation for his second marriage with his long-time friend Bul Bul Saha on May 2nd, 2022 Congratulations Arun Lal #Cricket pic.twitter.com/CEybHsJDN1 — All About Cricket (@AllAboutCricke8) April 24, 2022 అరుణ్ లాల్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన మొదటి భార్య రీనాకు చాలాకాలం క్రితమే విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకున్నా మంచానికే పరిమితం కావడంతో ఆమె అరుణ్ లాల్‌తోనే జీవిస్తుంది. రీనాకు అరుణ్ లాల్ మనువాడబోయే బుల్ బుల్‌తో కూడా సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అరుణ్ లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా అరుణ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచ్‌ల్లో 30 శతకాల సాయంతో 10421 పరుగులు సాధించాడు. చదవండి: PBKS VS CSK: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన శిఖర్ ధవన్ -
కరోనాతో పోరాడాల్సిందే: భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తితో పాటు ఆశావహ దృక్పథం ఉండాలని బెంగాల్ క్రికెట్ కోచ్, భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అన్నారు. నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించిన అరుణ్ లాల్ ప్రతీ ఒక్కరూ గట్టి నమ్మకంతోనే కష్టాన్ని ఎదుర్కోగలరని పేర్కొన్నారు. ‘కరోనా ఒక వ్యాధి మాత్రమే. దీన్ని ఎదుర్కోగలమని మనమంతా నమ్మాలి. విపత్కర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. ఆశాభావాన్ని పెంపొందించుకోవాలి. మంచి ఆహారం, తగినంత నిద్ర, రోగనిరోధకతను పెంచుకోవడం ద్వారా దీని నుంచి బయటపడొచ్చు. మన చుట్టూ ఉన్న వారి క్షేమం కోసం మనం స్వీయ నిర్బంధాన్ని పాటించాలి’ అని 13 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది బెంగాల్‌ను రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చిన అరుణ్ లాల్ వివరించారు. -
రషీద్‌కు అంత ఈజీ కాదు
ముంబై : పొట్టి ఫార్మాట్లో చెలరేగుతున్న అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్‌కు అదే మాదిరి టెస్టు ఫార్మాట్లో రాణించడం అంత సులవైన విషయం కాదని భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. ‘రషీద్‌ఖాన్ గొప్ప బౌలరే. కానీ, అతను పొట్టి ఫార్మాట్లోనే అద్భుతాలు చేయగలడు. టెస్టు ఫార్మాట్ వంటి పెద్ద టోర్నీల్లో మాత్రం ఇది సాధ్యపడదు. అతనితో పాటు జట్టులో ముజీబ్ లాంటి మెరుగైన బౌలర్లు ఉన్నా.. ఆ జట్టుకు కొత్త ఫార్మాట్లో కుదురుకోవడం కష్టమే.’ అని అరుణ్‌లాల్ పేర్కొన్నాడు. ఇక అరుణ్‌లాల్ భారత్ తరుపున 13 వన్డేలు, 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 2017లో ఐసీసీ సభ్యత్వం పొందిన అఫ్గాన్.. ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో టైటిల్ నెగ్గి 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇటీవలే టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గాన్ జూన్ 14 న భారత్‌తో అరంగేట్ర టెస్ట్ ఆడనుంది. ఈ చారిత్రాత్మక టెస్టుకోసం అఫ్గాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా తొలి టెస్టులోను గెలిచి చరిత్రసృష్టించాలని భావిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరితో భారత్ జట్టు ఈ మ్యాచ్‌కు అజింక్యా రహానే సారథ్యంలో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. -
క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న అరుణ్ లాల్
కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అరుణ్‌లాల్ దవడ క్యాన్సర్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. జనవరిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వైద్యులు... అరుదైన ప్రమాదకరమైన దవడ క్యాన్సర్‌గా తేల్చారు. అప్పటినుంచి చికిత్సను కొనసాగిస్తోన్న అరుణ్, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. 60 ఏళ్ల అరుణ్ లాల్ 1982 నుంచి 1989 మధ్యకాలంలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 16 టెస్టులు, 13 వన్డేలు ఆడారు. -
అరుణ్ లాల్ దవడ క్యాన్సర్‌కు చికిత్స
కోల్‌కతా: ఇటీవల దవడ క్యాన్సర్ బారిన పడ్డ భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత అరుణ్ లాల్ కు శనివారం కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో సర్జరీ చేశారు. అరుణ్ లాల్‌కు 14 గంటల పాటు సర్జరీ చేసిన అనంతరం దవడ మార్పిడి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతున్నట్లు అరుణ్ లాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నెలలో ఆయన దవడకు క్యాన్సర్ సోకడంతో అప్పట్నుంచి చికిత్స తీసుకుంటూ కామెంటరీ తదితర వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు అరుణ్ లాల్ కు చికిత్స అనంతరం ఆయన ప్రముఖ జాతీయ వార్తా పత్రికతో మాట్లాడారు. ఇది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ అని, సరైన సమయంలో గుర్తించడం వల్లే చికిత్స సాధ్యపడిందన్నాడు. ఈ సందర్భంగా కొత్త జీవితం ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. తాను తిరిగి యథాస్థితికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చికిత్స అత్యంత క్లిష్టమైనదని, డాక్టర్లు తమ కర్తవ్యాన్ని అమోఘంగా నిర్వహించి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. -
ఆగస్టు 1న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: తాప్సీ (నటి), అరుణ్‌లాల్ (క్రికెటర్) ఈ రోజు పుట్టిన వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఇది శనైశ్చరునికి సంబంధించినది. శని స్థిరత్వానికి, ఆయుష్షుకు, వృత్తికీ కారకుడు. అందువల్ల వీరికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. వీరి పుట్టిన తేదీ 1. ఇది సూర్యునికి సంబంధించినది కాబట్టి కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. లక్కీనంబర్లు: 1,4,6,8 లక్కీ కలర్స్: బ్లాక్, వయొలెట్, బ్లూ, ఎల్లో, రెడ్. లక్కీడేస్: ఆది, బుధ, శనివారాలు. సూచనలు: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేయడం, - డాక్టర్ మహమ్మద్ దావూద్