రషీద్ ఖాన్ (ఫైల్ ఫొటో)
ముంబై : పొట్టి ఫార్మాట్‌లో చెలరేగుతున్న అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్‌కు అదే మాదిరి టెస్టు ఫార్మాట్‌లో రాణించడం అంత సులవైన విషయం కాదని భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. ‘రషీద్‌ఖాన్ గొప్ప బౌలరే. కానీ, అతను పొట్టి ఫార్మాట్‌లోనే అద్భుతాలు చేయగలడు. టెస్టు ఫార్మాట్ వంటి పెద్ద టోర్నీల్లో మాత్రం ఇది సాధ్యపడదు. అతనితో పాటు జట్టులో ముజీబ్ లాంటి మెరుగైన బౌలర్లు ఉన్నా.. ఆ జట్టుకు కొత్త ఫార్మాట్‌లో కుదురుకోవడం కష్టమే.’ అని అరుణ్‌లాల్ పేర్కొన్నాడు. ఇక అరుణ్‌లాల్ భారత్ తరుపున 13 వన్డేలు, 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
2017లో ఐసీసీ సభ్యత్వం పొందిన అఫ్గాన్.. ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో టైటిల్ నెగ్గి 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇటీవలే టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గాన్ జూన్ 14 న భారత్‌తో అరంగేట్ర టెస్ట్ ఆడనుంది. ఈ చారిత్రాత్మక టెస్టుకోసం అఫ్గాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా తొలి టెస్టులోను గెలిచి చరిత్రసృష్టించాలని భావిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరితో భారత్ జట్టు ఈ మ్యాచ్‌కు అజింక్యా రహానే సారథ్యంలో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment