inaugural test
-
మా ఆట తీవ్రంగా నిరాశ పరిచింది : అఫ్గాన్ కోచ్
బెంగళూరు : ఓటమి కన్నా తమ ఆటగాళ్ల ఆట తీరే తీవ్రంగా నిరాశపరిచిందని అఫ్గానిస్తాన్ కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డాడు. భారత్-అఫ్గాన్ చారిత్రక టెస్ట్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఓడినందుకు బాధపడటం లేదు కానీ.. శుక్రవారం మేం ఆడిన విధానం తీవ్ర నిరాశకు గురిచేసింది. తొలి రోజు ఓ రెండు గంటలు మా ఆటతీరు బాగుంది. కానీ ఈ రోజు, మా ప్రదర్శపట్ల ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఓ 30 శాతం ఈ సందర్భాన్ని నిందించవచ్చు.. మిగతాది టెస్టు క్రికెట్ గురించి తమ ఆటగాళ్లకు అంతగా తెలియకపోవడం అని చెప్పొచ్చు. తాము టెస్టు క్రికెట్లో రాణించాలంటే ఎంత మెరుగవ్వాలో ఈ మ్యాచ్ ద్వారా అర్ధమైంది. తమ జట్టు చాలా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పెద్ద జట్లైనా భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వంటి ఏ జట్లతో చాలా మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే మేం టెస్టు మ్యాచ్‌ల్లో రాణించగలుగుతాం.’ అని సిమన్స్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఏర్పాటు చేయాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని సిమన్స్ స్వాగతించాడు. అలాగే తమ జట్టు తక్కువ టెస్టు ర్యాంకుల గల జింబాంబ్వే, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో ఆడాలని అప్పుడే ఆ జట్టకు గట్టిపోటీనివ్వగలుగుతుందని అభిప్రాయపడ్డాడు. త్వరలోనే తమ జట్టు టెస్టు క్రికెట్లో మంచి ఫలితాలు రాబడుతోందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
అఫ్గాన్ నెట్స్‌లో భారత దివ్యాంగ క్రికెటర్!
బెంగళూరు : భారత్-అఫ్గానిస్తాన్‌ల చారిత్రాత్మక టెస్ట్ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు భారత ఓపెనర్ల సెంచరీలు.. మిడిలార్డర్ విఫలం.. ఆటముగిసే సమయానికి 347 పరుగులు.. ఇదంతా ఒకవైపు. కానీ అఫ్గాన్ నెట్స్‌లో ఓ భారత దివ్యాంగ క్రికెటర్ బౌలింగ్ చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రెండు చేతులు సరిగ్గా లేని బిజాపుర్కు చెందిన శంకర్ సజ్జాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రికెటర్‌ను ఇంటర్వ్యూ చేసిన ఓ సోర్ట్స్ వెబ్సైట్.. ఆ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శంకర్ బౌలింగ్ చూసిన నెటిజన్లు స్పూర్తిదాయకంగా నిలిచావు బ్రదర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. శంకర్ పట్టుదలకు..కష్టపడేతత్వానికి వారంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం అనిల్ కుంబ్లే క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శంకర్.. భారత్‌కు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యమని తెలిపాడు. రషీద్, కుంబ్లేలే నాకు స్పూర్తి.. అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్, టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లేలే తనకు స్పూర్తి అని ఈ శంకర్ భాయ్ చెప్పుకొచ్చాడు. ‘నాలుగో తరగతి నుంచి రోజుకు కనీసం 5-6 గంటలు క్రికెట్ ఆడేవాడిని. నాకు రోజు పేపర్లు చదివే అలవాటు ఉంది. అలా ఓ రోజు కన్నడ పత్రికలో అనిల్ కుంబ్లే స్పిన్నర్స్ క్యాంప్ గురించి వచ్చిన యాడ్ చూశాను. అక్కడున్న మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నాను. సానుకూల స్పందన రావడంతో బెంగళూరు వచ్చి అకాడమీలో చేరాను.’ అని శంకర్ తెలిపాడు. ఇక తానెప్పుడు దివ్యాంగ క్రికెటర్లతో కాకుండా రెగ్యులర్ క్రికెటర్లతోనే ఆడుతానని శంకర్ తెలిపాడు. తన ఆట చూసిన తర్వాత ఇతరులు ఏమనకుంటారని అడగగా.. ‘నేనేవరో నేనేంటో నాకు తెలుసు.. కాబట్టి ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అని నేను ఫీలవ్వను’ అని సమాధానమిచ్చాడు. తమ అకాడమికీ అఫ్గాన్ ఆటగాళ్లు వస్తున్నారని, వారికి బౌలింగ్ చేయాలని అకాడమీ అధికారి తెలిపారని, అలా వారికి బౌలింగ్ చేసే అవకాశం వచ్చిందని ఈ దివ్యాంగ క్రికెటర్ మురిసిపోయాడు. తన బౌలింగ్ ఎదుర్కొన్నఅఫ్గాన్ ఆటగాళ్లు తనకు మంచి భవిష్యత్తు ఉందని, ఆటను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అని చెప్పారని శంకర్ పేర్కొన్నాడు. -
రషీద్, కుంబ్లేలే నాకు స్పూర్తి..
-
రషీద్‌కు అంత ఈజీ కాదు
ముంబై : పొట్టి ఫార్మాట్లో చెలరేగుతున్న అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్‌కు అదే మాదిరి టెస్టు ఫార్మాట్లో రాణించడం అంత సులవైన విషయం కాదని భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. ‘రషీద్‌ఖాన్ గొప్ప బౌలరే. కానీ, అతను పొట్టి ఫార్మాట్లోనే అద్భుతాలు చేయగలడు. టెస్టు ఫార్మాట్ వంటి పెద్ద టోర్నీల్లో మాత్రం ఇది సాధ్యపడదు. అతనితో పాటు జట్టులో ముజీబ్ లాంటి మెరుగైన బౌలర్లు ఉన్నా.. ఆ జట్టుకు కొత్త ఫార్మాట్లో కుదురుకోవడం కష్టమే.’ అని అరుణ్‌లాల్ పేర్కొన్నాడు. ఇక అరుణ్‌లాల్ భారత్ తరుపున 13 వన్డేలు, 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 2017లో ఐసీసీ సభ్యత్వం పొందిన అఫ్గాన్.. ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో టైటిల్ నెగ్గి 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇటీవలే టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గాన్ జూన్ 14 న భారత్‌తో అరంగేట్ర టెస్ట్ ఆడనుంది. ఈ చారిత్రాత్మక టెస్టుకోసం అఫ్గాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా తొలి టెస్టులోను గెలిచి చరిత్రసృష్టించాలని భావిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరితో భారత్ జట్టు ఈ మ్యాచ్‌కు అజింక్యా రహానే సారథ్యంలో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. -
అఫ్గాన్ టెస్ట్‌కు ఇషాంత్ డౌటే.!
హైదరాబాద్ : అఫ్గానిస్తాన్‌తో చారిత్రాత్మక టెస్టుకు ముందు టీమిండియాను గాయల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా బొటన వేలి గాయంతో దూరం కాగా అతని స్థానంలో మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశారు. తాజాగా పేసర్ ఇషాంత్ శర్మ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇషాంత్ ఇంగ్లండ్‌లో సస్సెక్స్ జట్టు తరుపున కౌంటీ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇషాంత్ గాయపడ్డాడని వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతోంది. ఆ ట్వీట్లో ఇషాంత్ గాయపడ్డాడని, అతని స్థానంలో వేరే ఆటగాడిని తీసుకున్నట్లు ఆ జట్టు పేర్కొంది. అయితే అది చిన్న గాయమా, పెద్దదా అని తెలియాల్సి ఉంది. దీంతో అఫ్గాన్‌తో బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు ఇషాంత్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది జరిగితే భారత్‌కు కష్టాలు తప్పవు. మరోవైపు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ ఫామ్ భారత్‌ను కలవరపెడుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లతో చెలరేగిన రషీద్ తమ జట్టుకు విజయాన్నందించాడు. ఇషాంత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. 4 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా 6 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో సైతం 8 వికెట్లు పడగొట్టాడు. 🦈 One change for us today here at The Saffrons. @ollierobinson25 returns, replacing the injured @ImIshant. Your Sussex Sharks XI: Wells, Wright, Finch, Brown*+, Evans, Burgess, Wiese, Archer, Jordan, Robinson, Briggs 🎥 A word from the skipper... #gosbts #SharkAttack pic.twitter.com/H56vhlsw8x — Sussex Cricket (@SussexCCC) June 3, 2018 -
యోయో టెస్ట్‌కు హాజరు కావాల్సిందే
ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు ముందు భారత ఆటగాళ్లంతా యో-యో టెస్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సూచించింది. అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ బెంగళూరులో జూన్ 8న నిర్వహించే యో-యో టెస్టుకు హాజరుకావాలని తెలిపింది. ‘ఈ టెస్టు మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసినప్పటికీ, ప్రతి ఆటగాడు ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. వచ్చే కొన్ని వారాల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న ఆటగాళ్లు కూడా పరీక్షను ఎదుర్కోవాల్సి ఉందని’ బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతేకాదు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ఇండియా-ఏ జట్లు కూడా ఈ పరీక్షకు హాజరుకావాలని బీసీసీఐ ఆదేశించింది. రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న ఆటగాళ్లకు పదిరోజుల పాటు విశ్రాంతి లభించింది. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో త్వరలో నిర్వహించనున్న క్యాంపులో ఆటగాళ్లు పాల్గొని సాధన చేయనున్నారు. యో-యో టెస్టులో ఆటగాళ్లు నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. ఇందులో కచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. గతేడాదే బీసీసీఐ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఆటగాళ్ల ఫిట్నెస్ తెలుస్తోంది. ఈ విధానాన్ని ఐపీఎల్లో కొన్ని ఫ్రాంచైజీలు సైతం అనుసరించాయి. -
సాహా ఔట్.. దినేశ్ ఇన్
ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు భారత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా స్థానంలో మరో కీపర్ దినేశ్ కార్తీక్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన క్యాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సాహా కుడి బొటనవేలికి గాయమైంది. దీంతో అఫ్గాన్‌తో జరిగే టెస్టుకు తాను సిద్దంగా లేనట్లు సాహా ఇటీవల ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ట్వీట్ చేసింది. ‘ అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌కు వృద్దిమాన్ సాహా దూరమయ్యాడు. అతని స్థానంలో సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశారు’ అని ట్వీట్లో పేర్కొంది. UPDATE: Wriddhiman Saha ruled out of the @paytm Afghanistan Test. The All-India Senior Selection Committee has named @DineshKarthik as the replacement. #INDvAFG #TeamIndia Details - https://t.co/drNqHvsFu0 pic.twitter.com/hqquMTpqDP — BCCI (@BCCI) 2 June 2018 బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టెస్టుల్లో అఫ్గాన్‌కు అరంగేట్ర మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కోహ్లి గైర్హాజరితో భారత జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు. చదవండి : ఏకైక టెస్టుకు భారత జట్టు ప్రకటన -
అలా ఎదురుచూసే స్థితిలో లేను: రోహిత్
ముంబై : జట్టులో అవకాశం వస్తుందా లేదా అని ఎదురు చూసే స్థితిలో లేనని, ఇప్పుడు కేవలం క్రికెట్ ఆస్వాదించడమే తన పని అని టీమిండియా లిమిటెడ్ ఫార్మట్ వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ అభిప్రాయపడ్డాడు. లిమిటెడ్ ఫార్మట్‌లో చెలరేగే రోహిత్ టెస్టుల్లో తడబాటుకు గురవుతున్న విషయం తెలిసిందే. గత దక్షిణాఫ్రికా సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు సైతం సెలక్టర్లు రోహిత్‌కు విశ్రాంతి కల్పించారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం సెలక్షన్ గురించే ఆలోచించే స్థితిలో లేను. ఇప్పటికే సగం కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. మిగతా కెరీర్‌ను ఆస్వాదించాలనుకుంటున్నా. కెరీర్ ప్రారంభంలో జట్టులో చోటు కోసం ఆరాటపడేవాడిని. జట్టులో చోటు దక్కిందా? మ్యాచ్‌లో ఆడుతానా లేదా అని ఎదురుచూసే వాడిని. ఆ సమయంలో దిగ్గజాలు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లు ఉండేవారని దీంతో చోటుకోసం ఎదురుచూడాల్సి వచ్చేది. సెలక్షన్ గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని గ్రహించాను.’ అని అభిప్రాయపడ్డాడు. అఫ్గాన్ టెస్టుకు ఎంపికాకపోవడంతో ఎలాంటి ఆశ్చర్యానికి గురికాలేదని, భవిష్యత్తు టోర్నీల కోసమే విశ్రాంతి కల్పించుంటారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. -
అఫ్గానే కదా అని తేలికగా తీసుకోం: రహానే
ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టును తేలికగా తీసుకోబోమని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే మాట్లాడుతూ.. ‘ప్రతి టెస్టుకు ఒకే ప్రాధాన్యత ఇస్తాం, అఫ్గాన్‌కు టెస్టు హోదా లభించడం మంచి విషయం. ప్రత్యర్థి ఎవరైనా మైదానంలో దిగామంటే మా ఆలోచనా విధానం ఓకేలా ఉంటుంది. మా బలాలపై దృష్టిసారించడమే మాకు ముఖ్యం. అఫ్గాన్ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. వారంతా లిమిటెడ్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. టెస్టులకు కొత్త కదా అని తేలికగా తీసుకోం. మైదానంలో అడుగుపెట్టామంటే బ్రాండ్ క్రికెట్ ఆడటానికే ప్రయత్నిస్తాం’ అని రహానే తెలిపాడు. రషీద్, ముజీబ్‌లపై స్పందిస్తూ.. ఐపీఎల్లో అద్భుతంగా రాణించారని, ఎరుపు బంతికి కొత్త కావచ్చు కానీ నాణ్యమైన స్పిన్నర్లని అభిప్రాయపడ్డాడు. అలాగని పేస్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేమన్నాడు. ఇక తన భవిష్యత్ క్రికెట్ పట్ల సానుకూలా దృక్పథంతో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు సారథ్యం వహించడం తనకు మరింత ధైర్యాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ అవకాశలపై మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ టోర్నీలో ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరు ఆశయంగా పెట్టుకుంటారు. ఇంకో ఏడాది సమయం ఉంది. వన్డే జట్టులోకి తిరిగి రావడం నాకెంతో అవసరం’ అని పేర్కొన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ కోహ్లి గాయంతో సిరీస్ నిర్ణయాత్మక ధర్మశాల టెస్టుకు దూరమయ్యాడు. దీంతో రహానేకు తొలి సారి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించిన రహానే భారత్‌కు విజయాన్నందించాడు. తాజా అఫ్గాన్ టెస్టుకు కోహ్లికి విశ్రాంతి కల్పించడంతో రహానేకు మరోసారి కెప్టెన్సీ అవకాశం వచ్చింది. జూలై 14న ఈ చారిత్రాత్మక టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: భారత్‌ను ఢీకొట్టే అఫ్గాన్ జట్టు ఇదే -
భారత్‌ను ఢీకొట్టే అఫ్గాన్ జట్టు ఇదే
కాబుల్ : టీమిండియాతో జరిగే ఎకైక చారిత్రాత్మక టెస్టుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు 16 సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. నలుగురు స్పిన్నర్లకు తుది జట్టులో అవకాశం కల్పించింది. ఈ జట్టుకు అస్గార్ స్టానిక్‌జై సారథ్యం వహించనున్నాడు. బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టెస్టుల్లో అఫ్గాన్‌కు అరంగేట్ర మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. మణికట్టు స్పిన్నర్లు రషీద్ ఖాన్, జహీర్‌ఖాన్‌లతో పాటు ముజీబ్‌ఉర్ రెహ్మాన్, అమీర్ హమ్జాలకు చోటు దక్కింది. తాజా ఐపీఎల్ సీజన్లో రషీద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మణికట్టు స్పిన్నరైన జహీర్ ఖన్ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసినప్పటికి వేలి గాయంతో అతను టోర్నీకి దూరమయ్యాడు. ఇక జహీర్ ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సన్‌రైజర్స్ తరపున అద్బుతంగా రాణించిన రషీద్ ఖాన్ భారత బ్యాట్స్‌మన్‌కు ఇబ్బంది కానున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ను లైట్ తీసుకున్న బీసీసీఐ కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చింది. భారత జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు. అఫ్గానిస్తాన్: అస్గార్ స్టానిక్ జై (కెప్టెన్), జావెద్ అహ్మద్, ఇషానుల్లా, మహ్మద్ షాహజాద్ (వికెట్ కీపర్), ముజీబ్ ఉర్ రెహ్మాన్, నాసిర్ జమాల్, రహమత్ షా, హస్మతుల్లా షాహిదీ, అఫ్సార్ జాజై, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అమీర్ హమ్జా, సయ్యద్ షిర్జాద్, యామిన్ అహ్మద్‌జై, వాఫదార్, జహీర్‌ఖాన్ చదవండి : ఏకైక టెస్టుకు భారత జట్టు ప్రకటన -
సౌరశక్తితో నడిచే విమానం వచ్చేసిందోచ్
విమానయాన రంగంలో ఇదో సరికొత్త ఆవిష్కరణ. సౌరశక్తితో నడిచే విమానాన్ని విజయవంతంగా ప్రయోగించారు. స్విట్జర్లాండ్‌లో సోమవారం ఈ ప్రయోగం నిర్వహించారు. సోలార్ పవర్డ్ విమానం రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టి సురక్షితంగా ల్యాండ్ అయింది. వచ్చే ఏడాది ఈ విమానం ద్వారా ప్రపంచమంతా చుట్టి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఇంధనం లేకుండా కేవలం సౌరశక్తితోనే ఈ విమానం ప్రయాణించడం విశేషం. కాగా ఇందులో ఒక్కరు ప్రయాణించేందుకే వీలవుతుంది. ఫైలట్ మార్కస్ ష్కెర్డెల్ రెండు గంటలా 17 నిమిషాల పాటు విమానం నడిపారు. ఈ ప్రయోగం స్ఫూర్థితో రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు తయారు చేయవచ్చని భావిస్తున్నారు. 'ఈ విమానం ఆవిష్కరణ ముఖ్యమైన దశ. ప్రపంచమంతటా తిరిగి రావడానికి మరో అడుగు ముందుకేశాం. మా భాగస్వాములు ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు' సోలార్ ఇంపల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, పైలట్ బోర్స్బర్గ్ చెప్పారు.