ఫిల్ సిమన్స్ (ఫైల్ ఫొటో)
బెంగళూరు : ఓటమి కన్నా తమ ఆటగాళ్ల ఆట తీరే తీవ్రంగా నిరాశపరిచిందని అఫ్గానిస్తాన్ కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డాడు. భారత్-అఫ్గాన్ చారిత్రక టెస్ట్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఓడినందుకు బాధపడటం లేదు కానీ.. శుక్రవారం మేం ఆడిన విధానం తీవ్ర నిరాశకు గురిచేసింది. తొలి రోజు ఓ రెండు గంటలు మా ఆటతీరు బాగుంది. కానీ ఈ రోజు, మా ప్రదర్శపట్ల ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదు. ఓ 30 శాతం ఈ సందర్భాన్ని నిందించవచ్చు.. మిగతాది టెస్టు క్రికెట్ గురించి తమ ఆటగాళ్లకు అంతగా తెలియకపోవడం అని చెప్పొచ్చు. తాము టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే ఎంత మెరుగవ్వాలో ఈ మ్యాచ్ ద్వారా అర్ధమైంది. తమ జట్టు చాలా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పెద్ద జట్లైనా భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వంటి ఏ జట్లతో చాలా మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే మేం టెస్టు మ్యాచ్‌ల్లో రాణించగలుగుతాం.’ అని సిమన్స్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఏర్పాటు చేయాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని సిమన్స్ స్వాగతించాడు. అలాగే తమ జట్టు తక్కువ టెస్టు ర్యాంకుల గల జింబాంబ్వే, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో ఆడాలని అప్పుడే ఆ జట్టకు గట్టిపోటీనివ్వగలుగుతుందని అభిప్రాయపడ్డాడు. త్వరలోనే తమ జట్టు టెస్టు క్రికెట్‌లో మంచి ఫలితాలు రాబడుతోందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment