యోయో టెస్ట్‌కు హాజరు కావాల్సిందే | Indian Team Face Compulsory Yo Yo Test  | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 7:51 PM | Last Updated on Sat, Jun 2 2018 7:51 PM

Indian Team Face Compulsory Yo Yo Test  - Sakshi

టీమిండియా ఆటగాళ్లు( ఫైల్‌ ఫొటో)

ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు ముందు భారత ఆటగాళ్లంతా యో-యో టెస్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సూచించింది. అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ బెంగళూరులో జూన్ 8న నిర్వహించే యో-యో టెస్టుకు హాజరుకావాలని తెలిపింది. 

‘ఈ టెస్టు మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసినప్పటికీ, ప్రతి ఆటగాడు ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. వచ్చే కొన్ని వారాల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న ఆటగాళ్లు కూడా పరీక్షను ఎదుర్కోవాల్సి ఉందని’ బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతేకాదు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ఇండియా-ఏ జట్లు కూడా ఈ పరీక్షకు హాజరుకావాలని బీసీసీఐ ఆదేశించింది. 

రెండు నెలల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న ఆటగాళ్లకు పదిరోజుల పాటు విశ్రాంతి లభించింది. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో త్వరలో నిర్వహించనున్న క్యాంపులో ఆటగాళ్లు పాల్గొని సాధన చేయనున్నారు. యో-యో టెస్టులో ఆటగాళ్లు నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. ఇందులో కచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. గతేడాదే బీసీసీఐ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ తెలుస్తోంది. ఈ విధానాన్ని ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంచైజీలు సైతం అనుసరించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement