
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృంద అధిపతి నితిన్ పటేల్ రాజీనామా చేశాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ, గతంలో ఎన్‌సీఏ)లో మూడేళ్లుగా స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్‌కు అధిపతిగా ఉన్న నితిన్ పటేల్ వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీనిపై నితిన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా... బోర్డు వర్గాలు రాజీనామాను ధ్రువీకరించాయి.
‘నితిన్ రాజీనామా చేశాడు. బోర్డుతో అతడికి చక్కటి అనుబంధం ఉంది. గత మూడేళ్లలో టీమిండియా కోసం నితిన్ ఎంతో చేశాడు. సీఓఈలో వైద్య విధానాలను రూపొందించడంలో అతడి పాత్ర కీలకం. ఆటగాళ్లెవరైనా గాయపడి ఎన్‌సీఏకు వెళ్తే... వారు పూర్తిగా కోలుకోవడమే కాకుండా రెట్టించిన ఉత్సాహంతో కోలుకునే విధంగా తీర్చిదిద్దాడు. నితిన్ కుటుంబం విదేశాల్లో స్థిరపడింది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ వంటి ఎందరో ఆటగాళ్లు గాయపడి ఎన్‌సీఏకు వెళ్లగా... నితిన్ పర్యవేక్షణలో తిరిగి కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment